অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాషాన బేది సాగు

పాషాన సాగు వవరములు (కోలియస్ ఫోర్స్కోలై)

సాధారణ నామము : కోలియాస్

శాస్త్రియ నామము : కోలియాస్ ఫోర్స్కోలై

కుటుంబము : లామియేసి

ప్రాంతీయ నామము : పాషాణబెేధి

వాణిజ్య నామము : కోలియేసి

ఉపయోగపడు భాగములు : వేర్లు

పరిచయము

కోలియస్ ఫోర్స్కోలై శాస్త్రీయనామం కలిగిన ఈ మొక్క లామియేసి కుటుంబానికి చెందినది. పాషాణ బేధిగా ఈ మెక్క ఎక్కువగా సాగుచేయడం జరుగుతుంది. కోలియస్ 0.5 మీ. వరకు పొడవు పెరిగే ఆకుపచ్చని వార్షిక మొక్క. దీనిలో వేర్లు చాల ముఖ్యమైనవి. దీని వేర్లు శంఖువు ఆకారం లో 20 సెం.మీ. పొడవు వరకు పెరిగి 0.5 నుంచి 2.5 సెం.మీ మందంలో ఉంటాయి. కాండము సన్నని నూగుతో ఉండి కణువు నడిమిలను కలిగి ఉంటుంది. ఆకులు లేత లేదా ముదురు అకుపచ్చ రంగులో ఉండి అల్లం వంటి సువాసనను కలిగి ఉంటాయి. పుష్పాలు నీల రంగు కలిసి లేతగంధపు రంగులో ఉంటాయి.

వ్యాప్తి

ఈ పంటను రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలలో సాగు చేస్తున్నారు.

నేలలు

ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు అనుకూలము ఉదజని సూచిక 5.5 నుంచి 8.0 ఉండాలి. తక్కువ సారంగల భూములలో కూడా సాగు చేయవచ్చును.

వాతావరణం

సాధారణంగా కొండ ప్రాంతాలలో సహజ సిద్దంగా పెరుగుతుంది. అధిక వేడి గల వాతావరనములలోను, తేమ గల వాతావరనములోను కూడ కోలియస్ బాగా పెరుగుతుంది. దీని సాగుకు 27-40 సి. ఉష్ణోగ్రత ఉండి 50-60 % గాలిలో తేమ ఉన్న ప్రాంతాలు అనుకూలము. తక్కువ ఉష్ణోగ్రతలను ఈ పంట తట్టుకోలేదు.

రకాలు

దీనిలో కర్నాటక(K.I) రకమును మంచి రకముగా గుర్తించారు.

పంటకాలం

6 నెలలు జూలై, ఆగష్టు నెలలో నాటుకోవాలి.

మోతాదు

వేరు తొడిగిన కత్తిరింపులు నాటుకోవాలి. ఎకరానికి 15 వేల నుండి 20 వేల వరకు లేత కొమ్మలు అవసరమౌతాయి. ఈ కాండపు మొక్కలు (కొమ్మ కత్తిరింపులు) 10 నుంచి 12 సెం.మీ. పొడవు, 3 – 4 జతల ఆకులు కలిగి ఉండాలి.

విత్తే దూరం

60*40 సెం.మీ. లేదా 60*60 సెం.మీ.

ఎరువులు

ఆఖరి దుక్కిలో, ఎకరానికి 5-6 టన్నుల పశుపుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పోటాష్ వేసుకోవాలి. నాటిన నెల రోజుల తరువాత ఎకరానికి 20 కిలోల నత్రజని వేయాలి.

అంతర కృషి

మొదట రెండు నెలలు, 20-25 రోజులకు ఒకసారి కలుపు తీయాలి, తరువాత పంట గుబురుగా తయ్యారై కరుపును అంతగా పెరగనీయదు. ఈ మధ్య కలుపు నివారణకు మల్చింగ్ ను కూడ ఉపయోగిస్తున్నారు.

సస్యరక్షణ

ఈ పంటకు దుంపకుళ్ళు తెగులు సోకటానికి అవకాశం ఉంది. ఈ తెగులను తొలి దశలోనే గమనించి కార్బండైజం 0.1% లో నేలను తడిపి నివారించుకోవాలి. ట్రైకోడెర్మ లాంటి శిలింద్రములను ఉపయోగించి కూడ ఈ తెగులు నివారించుకోవచ్చు. అలాగే నులి పురుగులు/నిమటోడ్స్ సమస్యగల నేలల్లో కార్బోపురాన్ గుళికలు చల్లాలి.

పంటసేకరణ

నాటిన 160-180 రోజులలో పంట తయారువుతుంది. ఒకసారి నీరు కట్టి మొక్కలను వేర్లతో సహా పీకి, వేర్లను మొక్క నుండి కత్తిరించాలి. వేర్లను కడిగి సుమారు 5 సెం.మీ. పొడపు గల ముక్కలుగా కత్తిరించుకొని ఎండబెట్టాలి.

దిగుబడి

ఖరీఫ్ లో ఎకరానికి సుమారు 500-600 కిలోలు, రబీలో 400 కిలోల ఎండువేర్లు దిగుబడి సాధించవచ్చు. కొన్ని సంస్థలు పచ్చి దుంపలను కూడ కొంటాయి.

గమనిక

నేల స్వభావం, వాసావరణ పరిస్థితులు, మార్కెట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి.

ఉపయోగములు

కోలియస్ వేర్లలో ఫోర్స్కోలిన్ అనే రసాయనం ఉంటుంది. దీని వేర్లను దగ్గు, ఉబ్బసం, రక్తహీనత, గనేరియా, నరాలకు సంభందించిన వ్యాధుల నివారణలో వాడుతారు. అధిక రక్తపోటు, ఊబకాయం, గ్లాకోమా, ఉబ్బసం, గుండె జబ్బులు మొదలైన జబ్బుల వ్యాధుల చికిత్సలో వాడుతారు.

ఆధారం:

తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096 , website : ww.tsmpb.in , E-mail: tsmapb@gmail.com



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate