సాధారణ నామము : వస
శాస్త్రీయ నామము : అకోరస్ కెలామస్
కుటుంబము : అకోరేసీ
ప్రాంతీయ నామము : వస
వాణిజ్య నామము : వచ్
ఉపయోగపడు భాగములు : వేర్లు, కొమ్మలు
అకోరస్ కెలామస్ అనే శాస్తీయ నామం కలిగిన ఈ మొక్క అరేసి కుటుంబానికి చెందిన బహు వార్షిక గుల్మం. ఈ మొక్క 50 నుంచి 60 సెం.మీ. వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు సన్నగా పొడువుగా లేక లేత ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులు 15 నుంచి 75 సెం.మీ. పొడవు 3.2 నుంచి 3.8 సెం.మీ. వెడల్పుతో ఉంటాయి. పుష్పాలు కాడమీద ఎర్పడతాయి. వేర్లు భూమిలోపల 30 నుండి 60 సెం.మీ. వరకు వ్యాప్తి చెంది ఉంటాయి.
భారతదేశము, శ్రీలంక దేశాల్లో వ్యాప్తించి ఉంది. సిక్కిం, హిమాలయ ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు లోని శేలం ప్రాంతం, తెలంగాణలోని నల్గొండ మరియు గద్వాల్ జిల్లాలలో సాగు చేయడం జరుగుతుంది.
తేమగా ఉండే నేలలు, బంక నేలలు, తేలిక పాటి నేలలు, ఎర్రనేలలు అనుకూలం, వరి పంట సాగు చేసే నీరు నిలువ ఉంచిసాగు చేయాలి. ఇది ఎక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పండదగిన పంట.
ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో సాగు చేయవచ్చును. దీనికి 10-38 సెల్సియస్ ఉష్ణోగ్రత, 70-250 సెం.మీ. వర్షపాతం అనుకూలం.
జూన్ – జులై నుంచి మార్చి – ఏప్రిల్ వరకు (10 నెలలు)
వరసకు వరసకు మధ్య దూరం 60 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 30 సెం.మీ. దూరం ఉండాలి.
వరి సాగు చేసే పద్ధతిలాగే భూమిని తయారు చేసి ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పోటాష్ వేసుకోవాలి. నాటిన 3 నెలలకు ఒకసారి, మరియు 6 నెలలకు ఒకసారి 25 కిలోల నత్రజని వేసుకోవాలి.
మొత్తం పంటకాలంలో 4-5 సార్లు కలుపు తీయాలి. ప్రతీసారి మొక్క మొదలు దగ్గర మట్టి గట్టిగా నొక్కాలి.
ముఖ్యంగా పిండి పురుగు మరియు గొంగళి పురుగు ఆశిస్తాయి. తెగుళ్ళలో ఆకుపచ్చ ముఖ్యమైనవి.
1. గొంగళి పురుగు నివారణకు 1 లీటరు నీటికి 4 మి.లీ. వేప నూనే కలిపి ఆకుల మీద పిచికారి చేయాలి. అలాగే కాండం చుట్టు తడపాలి.
2. ఆకుపచ్చ నివారణకు లీటరు నీటికి 1 గ్రా. మాంకోజెబ్ మరియు పిండి పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. తప్పనిసరి పరిస్థితిలోనే రసాయనిక మందులు వాడాలి.
నాటిన 10 నెలల తరువాత పొలం పాక్షికంగా ఎండబెట్టి నాగలితో దున్ని వేరు, కొమ్మలు తీయాలి. వీటిని 5-7 సెం.మీ. పొడవు గల ముక్కలు చేసి, కడిగి పీచు వేర్లు తొలగించి గాలి తగిలే చోట నీడలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత గరుకుగా ఉండే రాయికి రుద్ది పొలుసు తొలగించి పలుచటి గోనెసంచిలో నింపాలి.
ఎకరానికి 1.5-2 టన్నుల వరకు ఎండుకొమ్మలు దిగుబడి వస్తుంది.
నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి.
వస ఎండిన రైజోమ్ లు మత్తు పానీయాలను సుగంధభరితంగా చేయుటకు, బుద్ధి మాంధ్యము, నిస్సత్తువ మతిమరపు, మానసిక ఋగ్మతలు, మాట స్పష్టత కొరకు ఉపయోగిస్తున్నారు. వేర్లలొ అసరోస్ వంటి రసాయనాలు ఉన్నందున గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణలోను, మూత్రపిండ వ్యాధులలోను ల్యూకోడిర్మా నివారణ, ఉబ్బసం, అతిసారం, జీర్ణశక్తి వృద్ది చేయుటకు ఉపయోగిస్తారు.
ఆధారం:
తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోన్: +21 40 66364096 , 24764096 , website : ww.tsmpb.in , E-mail : tsmapb@gmail.com