অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అముదము

ప్రపంచంలో ఆముదం సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మనదేశం ప్రథమ స్థానంలో వుంది. మన రాష్టం గుజరాత్ తర్వాత ద్వితీయ స్థానంలో ఈ పంటను పండిస్తున్నది. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 1.57 లక్షల హెక్టార్లలో పండింపబడుతూ, 0.80 లక్షల టన్నుల ఉత్పత్తితో హెక్టారుకు 511 కిలోల దిగుబడి మాత్రమే ఇస్తున్నది(2008-09). ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఆముదం విస్తీర్ణంలో 2వ స్థానం, ఉత్పత్తిలో 3వ స్థానం మరియు ఉత్పాదకతలో 7వ స్థానంలో ఉది. ఈ పంటను మహబూబ్నగర్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తారంగానూ, కర్నూలు, రంగారెడ్డి, కరీంనగర్ మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా పండిస్తున్నప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకించి రబీలో ఈ పంటను ఆరుతడి పంటగా పండించటానికి చాలా అవకాశముంది. రబీలో ఆరుతడి క్రింద వేసే వేరుశనగ మరియు మొక్కజొన్న పంటలతో పోలిస్తే, ఆముదం పంటకు అడవి పందుల బెడద లేకపోవటం విశేషం.

ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్ మరియు రాకెట్ పరిశ్రమలలో లూబ్రికెంట్గాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు మరియు మందుల తయారీల్లోను, డీజిల్ పంపుసెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగాను, సబ్బులు మరియు డిటర్జెంట్లు తయారు చేసే పరిశ్రమల్లో రంగులు మరియు ముద్రణ కొరకు ఉపయోగించే సిరా తయారీలో, లినోలియం, నైలాన్ దారాలు మరియు ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే పరిశ్రమల్లోను వాడుచున్నారు. ఆముదపు లేత ఆకులను ఏరి పట్టు పరుగులకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.

ఆముదపు పంట విస్తీర్ణము,ఉత్పట్టులో భారత దేశము ప్రపంచంలోనే మొదటి స్థానము కలిగి యున్నది.ఆముదము ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 650 కోట్ల రూపాయిలు సాలిన విదేశీమారక ద్రవ్యము నార్జించుచున్నది.ఆముదము నూనెను నైలాన్ దారముల తయారి,జెట్ యంత్రాలలో ఇంధనంగా,హైడ్రాలిక్ ద్రవంగా,ఔషధాల తయారీ మొదలగు 200 పరిశ్రమలలో వాడుతున్నారు.పరిశ్రమలకూ,ఎగుమతులకూ ఆముదపు పంట చాలా ముఖ్యమే కాబట్టి మరియు దర కూడా ఎక్కువగానూ,నిలకడగాను ఉండటం వలన యిూ పంటను ఎక్కువగాను పండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మేలైన వంగడాలను అధిక దిగుబడి నిచ్చు సంకర రకాలను వాడి,ముంచి యాజమాన్య పద్దతులు,సమగ్ర సస్య రక్షణను పాటించి అధిక దిగుబడిని సాధించవచ్చు.

నేలలు

ఆముదము పంటను అన్ని రకాల నేలలందు సాగుచేయవచ్చును.నీరు బాగా ఇంకిపోయే తేలిక నేలలు అనుకూలమైనవి.నీరు నిలిచె నేలలు,చవుడు నేలలు ఈ పంటకు అనువైనవి కావు.

నేల తయారి

వేసవిలో రెండు,మూడుసార్లు దున్ని గుంటకతో చదును చేయాలి.

విత్తేదూరం మరియు విత్తన మోతాదు

పరిస్థితులు

రకాలు/సంకర రకాలు

విత్తన మోతాదు (క్వి/ఎ)

విత్తేదూరం (సెం.మీ.)

ఖరీఫ్

బరువైన నేలలు, అధిక వర్షపాతం

అధిక దిగుబడినిచ్చే రకాలు

2 – 2.5

90 x 60

సంకర రకాలు

2.0

90 x 90

తేలిక నేలలు, తక్కువ వర్షపాతం

అధిక దిగుబడినిచ్చే రకాలు

4

90 x 45

సంకర రకాలు

2 – 2.5

90 x 60

నీటి పారుదల క్రింద సాగుకు

సంకర రకాలు

2

90 x 90

రబీ(నీటి పారుదల క్రింద)

 

 

 

సారవంతమైన నేలలు

సంకర రకాలు

2

120 x 90

తేలిక నేలలు

సంకర రకాలు

2

90 x 90

విత్తనశుద్ధి

కిలో విత్తనానిరి 3 గ్రా. ధైరమ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి.విత్తన శుద్ధి చేయటం ద్వారా మొలకకుళ్ళు తెగులు,ఆల్టర్నేరియా ఆకు మచ్చ తగులు కొంత వరకు వడలు తగులును అరికట్టవచ్చును.

విత్తే సమయం

ఖరీఫ్ లో జూన్ 15నుండి జూలై 31 వరకు రబీ లో సెప్టెంబర్ 15 నుండిబ అక్టోబర్ 15 వరకు విత్తుకో వచ్చు.తొలకరి వర్గాలకు విత్తాలి. వర్ణాధార పంటను ఆగుష్టు 15తర్వాత విత్తరాదు.

ఆముదము రకాలు

క్రాంతి(పి.సి.యస్.-4)

ఇది అరుణ కన్నా ఎక్కువ దిగుబదినిస్తుంది.గింజ పెద్దది.నీటి ఎద్దడిని తట్టుకోనును.ఈ రకము రబీ కూడా సాగు చేసుకొనవచ్చును.దిగుబడి ఎకరాకు 5.5 - 6.5క్వింటాళ్ళు

జ్యోతి(డి.సి.జ.యస్-9)

ఈ రకం కూడా అరుణ కన్నా ఎక్కువ దిగుబదినిస్తుంది.తొందరగా పూతకు వచ్చి ఎందు తెగులను తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 5.0–6.0క్వింటాళ్ళు.

జ్వాల(48-1)

కాయల మీద ముళ్ళు వుండవు,ఎండు తెగులును, బూజు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 4.0-5.0క్వింటాంళ్ళు.

జె.సి.హెచ్.-4

ఇది సంకర రకం.చెట్టు గుబురుగా పెరుగుతుంది.కొమ్మలు లేత ఎరుపు రంగు,కాయల మీద ముళ్ళు తక్కువ. ఎండు తెగులును,వేరుకుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకోగలదు.దిగుబడి ఎకరాకు 5.5 - 7.0క్వింటాళ్ళు.

డి.సి.హెచ్.-32

ఇది త్వరగా కోతకు వస్తుంది.దిగుబడి ఎకరాకు 5.5 - 7.0క్వింటాళ్ళు.

డి.సి.హెచ్.-177

ఇది బెట్టను తట్టుకుంటుంది.ఎండు తెగులును బాగా తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 6.0 - 7.5 క్వింటాళ్ళు.

పూరిత(పి.సి.యస్.-124)

ఇది ఎండు తుగులను బాగా తట్టుకుంటుంది.దిగుబడి ఎకర్రకు 5.5 - 6.5 క్వింటాళ్ళు.

కిరణ్(పి.సి.యస్.-136)

ఇది బెట్టను తట్టుకుంటుంది.బోడి కాయల వల్ల బూజు తెగులు తాకిడి తక్కువగా ఉంటుంది.దిగుబడి ఎకరాకు 5.0 - 6.0క్వింటాళ్ళు

పి.సి.హెచ్-1

ఇది బెట్టను తట్టుకుంటుంది.మొదటి గెల త్వరగా కోతకు వస్తుంది.దిగుబడి ఎకరాకు 5.5-7.0 క్వింటాళ్ళు.

హరిత

పంటకాలం 90 – 180 రోజులు, 5.5 – 6.5 దిగుబడినిస్తుంది. ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది.

డి.సి.హెచ్.519

పంటకాలం 90-180 రోజులు, 6.0 – 7.5 దిగుబడినిస్తుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది.

పై రకాలన్నీ ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలం. అయినప్పటికీ రబీ కాలంలో నీటి పారుదల క్రింద సాగు చేసేటప్పడు హైబ్రిడు రకాలను వేసుకొని అధిక దిగుబడి సాధించవచ్చు. క్రాంతి, హరిత, కిరణ్ రకాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం నుండి జ్యోతి, జ్వాల, డి.సి.హెచ్ 177, డి.సి.హెచ్ 519 విత్తనాలను నూనెగింజల పరిశోధనా సంచలనాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుండి పొందవచ్చు.

ఎరువుల యాజమాన్యం

ప్రతి సంవత్సరం విధిగా హెక్టారుకు 5-10టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియు దున్నాలి.ఇలా చేయడం వలన తెగులు కొంతవరకు నివారించుకొనవచ్చును. ఎరువులను భూసార పరికా ఫలితాలననుసరించి నిర్ణయించిన మోతాదులో వాడాలి.

హెక్టారుకు నత్రజని 90కిలోలు,భాస్వరము 50కిలోలు ,పోటాష్ 30కిలోలు వేసుకోవాలి.నత్రజని మాత్రము 30కిలోలు మొదటి దఫా ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుకోవాలి.మిగిలిన 60కిలోల్లో ఒక పర్యాయం 30కిలోలు మొదటి గెల పూత దశలో అనగా 40 నుండి 50 రోజులలో,మిగిలిన 30కిలోలు రెండవ గెల పూత దశలో అనగా 70 నుండి 80 రోజులలో వేసుకొని నీరు కట్టుకోవాలి.

నీటి యాజమాన్యం

రబీ మరియు వేసవిలో విత్తునప్పుడు పొడిదుక్కిలో విత్తనం వేసి నీరు పెట్టాలి. ఇలా చేసిన యెడల మొక్కలు సమంగా మొలకెత్తి బాగా ఎదుగుతాయి. తరువాత నెల స్వభావాన్ని బట్టి 10నుండి 15రోజుల కొకసారి తడి పెట్టాలి.

అంతర పంటలు

ఆముదములోనేలలో తేమను సంరక్షించుటకు తరుచుగా గుంటకలను నడుపుతారు.కాబట్టి రైతులు అంతర పంటలను వెయ్యరు.ఒక వరుస కంది గాని, అలసందగానీ అంతరాపంటగా వెయ్యవచ్చు.స్వల్పకాలిక కంది రకములైన దుర్గ లాంటి రకాలను 1:2 నిష్పత్తిలో విత్తవచ్చు.

  • ఆముదము, కంది 1:2 లేక 1:2
  • ఆముదము, అలసందలు 12
  • ఆముదము, పెసర 1:2
  • ఆముదము, వేరుశనగ 1:5 లేక 1:7

పోగుంతలు మరియు ఒత్తు మొక్కలు పీకివేయుట

విత్తిన 7–10 రోజులలో మొలక వస్తుంది. విత్తిన 15-20 రోజులకు కుదురుకు ఒకే మొక్క ఉండే విధంగా ఒత్తు మొక్కలను పీకివేయాలి. అదే సమయంలో విత్తనం మొలవని చోట పోగుంతలు పెట్టుకోవాలి.

కలుపు నివారణ, అంతర కృషి

విత్తిన 40, 60రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.విత్తిన 15, 20 రోజులకు కుదురుకు ఒక మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.విత్త ముందు పుక్లోరలిన్ 45 ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమి లో కలియ దున్నాలి లేదా పెండిమిధాలిన్ 30, 1.3నుండి 1.6 లీ లేదా తేలిక నెలల్లో 800 మి.లీ బరువు నెలల్లో 1 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.కలుపు మందులు వాడితే 40రోజులప్పుడు ఒక సారి, వాడనప్పుడు 20రోజులకు 40రోజులకు గుంటక లేదా గోర్రుతో అంతరకృషి చేసి కలుపు నివారించవచ్చు.

తెగుళ్ళు

మొలక కుళ్ళు తెగులు లేకా ఫైటాప్తోరా బ్లైట్

విత్తనము మొలకెత్తిన తర్వాత బీజ దళాలపై గుండ్రని ఆకుపచ్చ రంగుమచ్చాలు తెగులు సోకిన ఆకులు వాడి కుళ్లిపోయి మొక్కకు ప్రేలాడును.ముదురు ఆకులపైన పెద్ద పెద్ద మచ్చలు ఆకు చివరి నుండి తొడిమ వైపుకు వ్యాపించును.ఈ తెగులు కాండానికి కూడా వ్యాపించి మొక్కలు చనిపోవును.

నివారణ

  • నీరు నిలువ ఉండే భూములలో ఆముదము పండించ రాదు.
  • వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు

పంట విత్తిన తర్వాత తెగులు మొదటి లక్షణాలు బీజ దళాలపై కనపడతాయి.ఆకులపై వలయాకారపు మచ్చలు ఏర్పడి మొక్కల పెరుగుదల తగ్గును. అనుకూలపు వాతావరణ పరిస్థితుల్లో ఈ తెగులు పూవు,గెల మరియు కాయలకు కూడా వ్యాపిస్తుంది.

నివారణ

  • ముందరి పంట అవశేషాలను ఎరి నాశనం చేయాలి.
  • వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

ఆకుల రెండు వైపుల చిన్న చిన్న నల్లని లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడి పెద్దవై లేత గోధుమ రంగులోకి మారును.మచ్చ అంచులు ముదురు గోధుమ రంగుతో ఉండి మధ్య భాగాన బూడిద రంగుతో ఉండును.

వడలు తెగులు

తెగులు సోకిన మొక్కలు లేత దశలో వున్నటైతే మొక్కలు వడలిపోయి బీజదళ పత్రాలు రంగును కోల్పోయి పాలిపోయి తర్వాత మొక్క చనిపోతుంది.కాండము మీద ఊదారంగు మచ్చలు ఏర్పడి తర్వాత కాండముపై పొరపై చీలికలు ఏర్పడతాయి.కాండమును చీల్చిచూచినటైతే లోపల తెల్లని బూజలాంటి శిలింద్రపు పెరుగుదలను గమనించవచ్చును.

నివారణ

  • నీరు నిలిచే నేలలు మరియు పల్లపు ప్రాంతాలలో ఆముదు సాగు చేయరాదు.
  • వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి.
  • తెగులును తట్టుకునే రకాలైన జ్యోతి,జి.హెచ్.సి.4, 48-1వంటి రకాలను విత్తుకోవాలి.
  • పొలంలో వీలైనంత ఎక్కువ పశువుల ఎరువును వేయాలి.
  • పొలంలో వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి.
  • తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.
  • అంతర పంటగా కంది వేయాలి.
  • మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.

వేరు కుళ్ళు మరియు కాండము,కొమ్మ ఎండు తెగులు

ఈ దశలో తెగులు సోకిన మొక్కలు ముదురు పసుపు పచ్చ రంగుకు మారి మొక్క పెరుగుదల ఆగిపోవును.మొక్క చివరి నుండి 1 లేక 2ఆకులు మినహా మిగతా ఆకులన్ని ఎండిపొయి మొక్కనుండి క్రిందకు ప్రేలాడును.ఈ దశలో మొక్కల మొదళ్ళ వద్ద నల్లగా మారును.అకస్మాతుగా మొక్కలు ఎండిపోవడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం.

కాండము, కొమ్మ ఎండు దశ

కాండం కణువుల దగ్గర గోధుమ రంగు చారలు ఏర్పడి,పెద్దవై లOPకారంగా మారుచు తెగులు సోకిన కాండపు భాగం కృశించు విరిగి పోవును.కొమ్మ యొక్క చివర పెరిగే భాగము నల్లగా మారును.తెగులు సోకిన కొమ్మ పై నుండి క్రిందకి ఎందుకంటు వచ్చును.

నివారణ

  • నీరు నిలిచే నేలలు మరియు పల్లపు ప్రాంతాలలో ఆముదు సాగు చేయరాదు.
  • వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి.
  • తెగులను తట్టుకునే రకాలైన జ్యోతి,జి.హెచ్.సి.4, 48-1 వంటి రకాలను విత్తుకోవాలి.
  • పొలంలో వీలైనంత ఎక్కువ పశువుల ఎరువును వేయాలి.
  • పొలంలో వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి.
  • తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.
  • అంతర పంటగా కంది వేయాలి.
  • మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.

కాయకుళ్ళు బూజు తెగులు

ఈ తెగులు ముఖ్యంగా గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, తర్వాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది.తెగులు సోకిన భాగాల పైన దూది పింజలాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది.తెగులు సోకిన కాయలు మొత్తబడి, కుళ్ళి రాలిపోతాయి.గెల కాడ పైశాఖలపై కూడా ఈ తెగులు ఆశించడం వలన వ్యాధి సోకిన భాగాలు విరిగి పడిపోతాయి.

నివారణ

  • పొలంతో మొక్కలను మరీ దగ్గరగా నాటరాదు.
  • సకాలంలో పంటను విత్తుకోవాలి.
  • తెగులు సోకిన కాయలను,గెలలనుకోసి పొలానికి దూరంగా వేసి తగల బెట్టి దీని వ్యాప్తిని అరికాట్టాలి.
  • మరిన్ని వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు శిలీంధ్రం వలన వస్తుంది. ఆకులకు రెండువైపుల చిన్న చిన్న నల్లని లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత పెద్దవై లేత గోధుమ రంగులోకి మారతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే మాంకోజెబ్ 3 గ్రా. లేదా క్లోరోధలోనిల్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి రెండుసార్లు, వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

పురుగులు

ఎర్ర గొంగళి పురుగు

ఈ పురుగు ఉధృతిని జూన్-జూలై మాసాలో అధికంగా ఉంటుంది.తొలకరి వర్ణాలు పడి,భూమి 10 - 20 సెం.మీ లోతు తదిచినప్పుడు దీని రెక్కల పురుగులు భూమి నుండి వెలువడుతాయి.అదే రోజు మగ ఆడ పురుగులు కలిసి,అందుబాటులో ఉన్న మొక్కల యొక్క ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా (600 - 700)గ్రుడ్లను పెడుతాయి.తర్వాత 2-3రోజులలో గొంగళి పురుగులు వెలువడి ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పత్ర హరితాన్ని గోకి తింటాయి.పురుగు పెరిగేకొల, ఆకులపై రంద్రాలేర్పరిచి ఆకుల కాడలను ఈనెలను, లేత కోమ్మలను మాత్రమే మిగుల్చుతాయి.ఎదిగిన గొంగళి పురుగులు ఒక పొలంలోకి గుంపులుగా వలాస పోయి పంటను ఆశించి నష్టపరుచును.పెరిగిన లద్దె పురుగులు భూమిలోకి ప్రవేశించి మళ్ళి తొలకరి వర్ణాల వరకు కోశస్థ దశలోనే ఉంటాయి.

నివారణ

  • వేసవిలో భూమిని లోతుగా(15 – 30 సెం.మీ) దున్నుకోవాలి.
  • తొలకరి వర్ణాలు కురిసిన తరువాత 2-3రోజులు రాత్రి 7 – 10 గం మధ్య సమయంలో పొలంలో అక్కడక్కడ సామూహికంగా మంటలు పెట్టినటైతే వాటికి రెక్కల పురుగు ఆకర్షింపబడి చనిపోతాయి.
  • దీపపు ఎరలను పెట్టాలి.
  • పైరు విత్తటానికి వారం రోజుల ముందు,పొలం గట్లపైన దోస నాటినట్టితే గొంగళి పురుగులు ఆకర్పించబడుతాయి. వాటిని ఏరి నాశనం చేయాలి.
  • గ్రుడ్లను ఏరి నాశనం చేయాలి.
  • ఎదిగిన గొంగళి పురుగులను జిల్లెడు,లోట్టపీచు మరియు అడవి ఆముదము ఆకులకు బాగా ఆకర్పించబడుతాయి.కాబట్టి ఈ ఆకులను పొలంలో ఎరగా పెట్టి పురుగులను ఏరి చంపాలి.
  • పురుగు తీవ్రత బట్టి మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.

దాసరి పురుగు

లద్దె పురుగులు తొలి దశలో ఆకులను గోకి,తర్వాత దశలో రంద్రాలేర్పరిచి ఆకులను తింటాయి.పురుగు ఉధృతిని ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను,కాడలను,పువ్వులను మరియు పెరిగే కాయలను తిని తీవ్ర నష్టాన్నికలుగజేస్తుంది.

నివారణ

  • కార్బరిల్ 3గ్రా.లేదా మోనోక్రోటోఫాస్ 1.5మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం తడిసేలా పిచికారి చేసుకోవాలి.
  • ఎకరానికి 10పంగ కర్రలను పక్షులు వాలుతకు వీలుగా నాతుకోన్నట్టితే పోలంలోక్ పక్షులు వచ్చి పురుగులను ఏరి తింటాయి.
  • పొలంలో క్రింద పడినటువంటి ఎండు ఆకులను తీసి కాల్చివేయాలి.

పొగాకు లద్ది పురుగు

తొలి దశలో గుంపులుగా ఆకుల క్రింద భాగాన్ని పత్ర హరితాన్ని *é తింటాయి, ఆకులు పలుచాటి కాగితాలవలె కనిపిస్తాయి.పురుగులు పెరిగే కొలది ఆకులపై రంద్రాలేర్పరిచి జల్లెడాకులుగా మారుస్తాయి.లద్దె పురుగులు పగటి వేళల్లో మట్టిపెడల క్రింద లేదా పగుళ్ళలో దాగుకుని రాత్రి వేళ్ళల్లో పైరును ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి.

నివారణ

  • వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి.
  • గ్రుడ్లు మరియు పిల్ల లద్ది పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని ఆకులతో సహా ఏరి నాశనము చేయాలి.
  • ఎకరాకు 4-5 లింగాకర్షక ఎరలను అమర్చి పురుగుల ఉధృతిని గమనిస్తూ అవసరమైనప్పుడు నివారణ చర్యను చేపట్టాలి.
  • తొలి దశలో వేపనూనె 5మి.లీ లేదా క్లార్ పైరిఫాన్ 2.5మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 2మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • పొలం చుట్టు లోతైన నాగటి సాలును తీసి అందులో మిధైల్ పెరాధియాన్ 2 లేదా ఎండోసల్పాన్ 4పొడి మందును చల్లి పురుగులను నివారించవచ్చును.

కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు

తొలి దశలోని పురుగు కొమ్మలపై మరియు కాయలపైన ఉన్నటు వంటి పత్రహరితాన్ని గోకి తింటుంది.పుష్పించే దశలో కొమ్మలోకి పోయి నష్టపరుస్తుంది.తర్వాత దశలో పురుగు కాయలలోకి పోయి తింటుంది.

నివారణ

పుష్పించే దశలో ఒకసారి మరియు 20 రోజులకు మరొకసారి డైమిదోయేట్ 2.0 మి.లీ లేదా మొటాసిస్టాక్స్ 2.0 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 2 మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బిహారి గొంగళి పురుగు

ఈ పురుగు గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులలో నే పొలంలోని ఆకులన్ని తిని తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది.మొక్కలపై ఆకులు లేనప్పుడు గెల తిని నష్టపరుస్తుంది.

నివారణ

వేప నూనె 5 మి.లీ లేదా క్షోర్ పరిపాస్ 2.0 మి.లీ లేదా దైక్లోరోవాస్ 1 మి.లీ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పచ్చ దీపపు పురుగులు

ఈ పురుగు ఆకుల నుండి రసం పీల్చి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయి.ఆకులు పసుపు రంగులోకి మారి మాడిపోతాయి.

నివారణ

  • వేప నూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగాలు బాగా తడిచేల పిచికారి చేయాలి.
  • ఉధృతిని ఎక్కువగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ 2మి.లీ లేదా డైమిధోయేట్ 2మి.లీ మందును ఒక లీటరు నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం తదిచేల పిచికారి చేయాలి.

ఆకు తొలిచే పురుగు

తొలి దశలలో పిల్ల పురుగులు ఆకు పోరలలోనికి పోయి సోరంగాలుగా తొలచి ఆకులను తింటుంది.దీనినే పాము పొడ తెగులు అంటారు.ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా రాలిపోతాయి.

నివారణ

వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఉత్పత్తులు

ఆముదాన్ని దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు.ఎందుకంటే మొక్కలో ప్రతీ భాగం మానవుడికి ఉపయోగపడుతుంది. అతి ప్రాచీన కాలం నుండి ఆముదాన్ని మందుల తయారితో వాడుతున్నారు. శుశ్రుత ఆయుర్వేదంలో కూడ ఆముదాన్ని గురంచి వివరించారు.ఆముదముతో దాదాపు 200 రకాల పదార్థాలు తయారు చేస్తున్నారు.ముఖ్యంగా మందుల తయారీలో,రంగుల తయారీలో విమానాలకు, జెట్ యంత్రాలకు ఇంధనంగా హైడ్రాలిక్ ద్రవంగా, నైలాన్ దారాల తయారిలో సబ్బుల తయారీలో, ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు.

పంటకోత-నిల్వ

ఆముదపు పంట అంతా ఒకేసారి కోతకురాదు. 3-4 సార్లు కాయల కోయవలసి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. ఒక గెలలో 80 శాతం వరకు కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను బాగా ఎండబెట్టి, తేలికైన కర్రలతో కొట్టి విత్తనాలను నూర్చుకోవాలి. గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి గోనె సంచుల్లో నిలువ ఉంచుకోవాలి.

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు

  1. నాణ్యత గల విత్తనాన్ని వాడాలి.
  2. విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి.
  3. ఎరువులను తగు మోతాదులో సరైన సమయంలో వేయాలి.
  4. కీలక దశలో వీలైతే నీరు పెట్టాలి. వరాధార పంటకు ఎకరానికి రెండు వేల రూపాయల ఖర్చుతో నాలుగు వేల నికరాదాయం వస్తే, నీటి పారుదల వుంటే ఎకరానికి ఐదువేల రూపాయల ఖర్చుతో పదివేల నికరాదాయం పొందవచ్చు.
  5. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.
  6. సరైన సమయంలో కోయడం మరియు నూర్చుట చాలా ముఖ్యం.

ఆముదం పంట సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త (నూనెగింజలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం-509 215 మహబూబ్నగర్ జిల్లా, ఫోన్ నెం.: 08540-228646, సెల్ : 9441210514

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/27/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate