పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉలవలు

ఉలవలు సాగు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం

మన రాష్ట్రంలో ఖరీఫ్ లో మొదటి పంట తరువాత, వర్శధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్నామ్నాయ పంటగా ఉలవలు సాగుచేయవచ్చు. ఖరిఫ్ లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంటగాను, రాగి, జొన్న పంటల్లో సహా పంటగాను వేయవచ్చు.

పంటకాలం

సెప్టెంబర్ – అక్టోబర్ : నేలలు : చల్కా, ఎర్ర, నల్లరేగడి నేలలు అనుకూలం, మురుగు నీరు నిలువ ఉండే నేలలు పనికి రావు.

రకం

పంటకాలం

దిగుబడి

లక్షణాలు

పి.డి.యం – 1

105

6-6.5

గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి.

పి.జడ్. యం – 1

90-95

6-6.5

గింజలు నలుపు రంగులో ఉంటాయి.

పి.హెచ్.జి. – 62

85

6-6.5

గింజలు నలుపురంగులో ఉంటాయి.

పి.హెచ్.జి – 9

90-100

6

గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి. పల్లాకు తెగులును తట్టుకొంటుంది.

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 1గ్రా. కార్బండజమ్ మందు చొn కలిపి విత్తనశుద్ధి చేయాలి.

నేలతయారి

ఖరీఫ్లో మొదటి పంట కోసిన తరువాత తగినంత తేమ చూసుకొని, భూమిని నాగలితో ఒకసారి, గోర్రుతో రెండు సార్లు మొత్తగా దున్ని తయారు చేసుకోవాలి.

విత్తనం, విత్తేదూరం

గొర్రుతో వరుసలలో విత్తే పద్ధతిలో ఎకరాకు 8-10 కిలోలు, వెదజల్లే పద్ధతిలో 12-15 క్రిలోల విత్తనం సరిసోతుంది. వరుసల మధ్య 80 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం పాటించాలి.

ఎరువులు

ఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 8 క్రిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్మిలో విత్తే ముందు వేసుకోవాలి.

అంతరకృషి

విత్తిన 25-30 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పడు, గొప్ప చేసి కలుపు నివారణ చేసుకోవాలి.

సస్యరక్షణ

కాయతొలుచు పరుగు : పూత మరియు పిందె ఏర్పడే సమయంలో, పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2 మిల్లీ లీటర్ల చొప్పన కలిపి పిచికారి చేయాలి

బూడిద తెగులు

వాతావరణంలో అధిక తేమ ఉండి, రాత్రి, పగటి ఉష్ణోగ్రతలలో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బండజిమ్ చొప్పన కలిపి పిచికారి చేసుకోవాలి. తెగులు ఉధృతంగా ఉన్న ఎడల 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడ పిచికారి చేసుకోవాలి.

ఉలవల సాగు పై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా ? "ప్రిన్సిపల్ సైంటిస్ట్ (బ్రీడింగ్), వ్యవసాయ పరిశోధనా స్థానం, విజయనగరం - 535 001. ఫోన్ నెం. 8 08922-225983

3.00137362637
K.LINGAswamy Oct 19, 2019 07:15 PM

ధన్యవాదాలు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు