ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదునాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ఫాస్ఫేట్) మరియు 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమపాళ్ళగా చేసి, నాటిన 30, 45 మరియు 60వ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటకి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8-12 కిలోల చొ.న బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా వుంటాయి. ఎకరానికి 10 కిలోల చొన జింకు సల్ఫేట్ వేసినట్లయితే జింకు లోపం రాకుండా వుంటుంది. నాటిన తర్వాత 30, 45 రోజులకు లీ. నీటకి 2 గ్రా, జింకు సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసినట్లయితే 20% దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మి.గ్రా. 2,4-డి మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్ 4.0 లీ/నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే పూత, పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.
పంట |
మోతాదు ఎకరాకు |
సుక్ష్మ పోషకాలు |
నాటిన 15వ రోజు నుండి 40 రోజులు వరకు |
19:19:19 1కిలో + యూరియా 1కిలో + 12:61:0 500గ్రా |
బోరాన్- 500 గ్రా. జింక్ చిలమిస్ – 500 గ్రా. మేగ్నిషియం సల్ఫేట్ 2.5 కిలో. |
45 రోజు నుండి 70 రోజులు వరుకు |
13:0:45 250గ్రా + తెల్ల పోటాష్ 1కిలో రిక్సోలిస్ 50 గ్రా |
|
70 నుండి కోత వరకు |
13:0:45 750గ్రా + 0:0:50-500గ్రా+ కాల్షియం నైట్రేట్ 1 కిలో |
ఎరువులు: ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి లేదా పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి. వర్బాధారప పైరుకు 60-40-50 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చు ఎరువులను ఒక హెక్టారుకు వాడాలి. ఆరుతడి పైరుకు 300-60-120 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.
పంట దశ |
మోతాదు/ఎకరాకు |
నాటిన 15వ రోజు నుండి 45 వరుకు |
వైట్ పోటాష్ 0.5 కిలో + యూరియా – 1కిలో+ CN 500 గ్రా. |
45 రోజుల నుండి 90 రోజుల వరుకు |
19:19:19 -1కిలో + 12:61:0 500గ్రా. |
90 రజుల నుండి 150 రోజుల వరుకు |
13:0:45 1కిలో + యూరియా 0.5 కిలో + అమ్మోనియం సల్ఫేట్ 0.5 కిలో |
150 రోజుల నుండి 210 రోజుల వరకు |
యూరియా 1.5లో + 13:0:45-0.5 కిలో + CN 1కిలో @ 10 రోజుల వ్యవధిలో |
ఎరువులు: ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్మిలో వేసి కలియదున్నాలి, 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్) 24 కిలోల పొటాష్లనిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా), 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ, 60వ మరియు 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సివుంటుంది.
పంట దశ |
మోతాదు / ఎకరాకు |
నాటిన 15వ రోజు నుండి 45 వరుకు |
13:19:19 1కిలో + 12:61:0 -500గ్రా. + జింక్ చిలామిన్ 500 గ్రా + మేగ్నిషియం సల్ఫేట్ 2.5 కిలో |
45 రోజుల నుండి 75 రోజుల వరుకు |
19:19:19 1 కిలో + బోరాన్ 500గ్రా |
75 రోజుల నుండి 110 రాజుల వరుకు |
13:0:45 1 కిలో + యూరియా 500గ్రా. 19:19:19 500 గ్రా |
110 రోజుల నుండి 140 రోజుల వరుకు |
13:0:45 1 కిలో + కాల్షియం నైట్రేట్ 1 కిలో |
140 నుండి రోజుల నుండి 200 రోజుల వరుకు |
యూరియా 1 కిలో + వైట్ పోటాష్ 1 కిలో |
ఎరువులు: ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 60-80 కి. నత్రజని, 24-82 కి. భాస్వరం మరియు 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి గొప్పతవ్వి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి నిస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా (నాటినప్పుడు మరియు నాటిన 30 రోజుల తర్వాత) వేసుకోవాలి. నత్రజనితోపాటు, పొటాష్ను రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది.
పంట దశ |
మోతాదు / ఎకరాకు |
సుక్ష్మపోషకాలు/ఎకరా |
నాటిన 15వ. రోజు నుండి 30 వరుకు |
19:19:19 1 కిలో + 12:61:0 1కిలో |
జింక్ సల్ఫేట్ – 10 కిలో మెగ్నిషియం – 10 కిలో బోరాక్స్ – 2.5 కిలో ఫేర్రస్ సల్ఫేట్ – 1 కిలో దుక్కిలో వేయాలీ |
31వ. రోజు నుండి 45 రోజుల వరుకు |
13:0:45 – 500గ్రా. + కాల్షియమ్ నైట్రేట్ -1 కిలో |
|
45వ. రోజు నుండి 90 రోజుల వరుకు |
13:0:45 – 1 కిలో + 19:19:19 -1 కిలో |
|
91వ. రోజు నుండి 110 రోజుల వరుకు |
13:0:45 – 1 కిలో + 0:0:50 – 500 గ్రా. |
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020