অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ద్రాక్షసాగు యూజమాన్య పద్దతులు

ద్రాక్షసమశీతోష్ణపు మండలపు పంట కాని ఉష్ణమండలంలో పెంచుటకు కూడా అనుకూలమైంది. ప్రపంచంలో 50% ఫల ఉత్పత్తి ద్రాక్షనుండి కలదు. మన రాష్ట్రంలో సుమారు 8000 వేల ఎకరాల్లో సాగు చేయబడుతూ 96 వేల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. మన రాష్ట్రంలో  అనంతపూర్,  చితూర్, కర్నూల్ జిల్లాలో ద్రాక్ష విస్తారంగా సాగు చేయబడుచున్నది. అనంతపూర్ ప్రాంతంలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు సంవత్సరమునకు 2 పంటలు వేయుచున్నారు. మొదటి పంట నవంబర్–డిసెంబర్ మాసాలలో రెండవ పంట మే మాసంలో కోతకు వచ్చును. అనంతపూర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ద్రాక్షపంట పిబ్రవరి-ఏప్రిల్ మాసాలలో కోతకు వచ్చును. మన దేశంలో ద్రాక్షను ఎక్కువగా పండుగా తినడానికి ఇష్టపడతారు. పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా పానీయాలు తయారుచేయుటకు ఉపయోగిస్తారు. ద్రాక్షతో జామ్, రెసిన్స్, ఎండు ద్రాక్షలను కూడా తయారు చేయవచ్చు. దీనిలో ca.p.fe లవణాలు విటమిన్ B మరియు B(2) లు లభిస్తాయి.

వాతావరణం

వేడిమితో కూడిన పొడి వాతావరణము ద్రాక్ష సాగుకు మిక్కిలి అనువైనది. దేశంలో 15-40సెం.గ్రే ఉష్ణోగ్రత 50-55 సెం.మీల వర్షపాతం గల ప్రాంతాలలో సాగు చేయబడుతుంది. పూత మరియు కాయ ఏర్పడునపుడు మబ్బుతో కూడిన వాతావరణం గాలిలో ఎక్కువ తేమ ఉన్న యెడల సాగుకు అనుకూలం కాదు. ఈ పరిస్థితులు తెగుళ్ళ వ్యాప్తికి దోహదం చేస్తాయి.

నేలలు (soils)

తేలికపాటి నీటి పారుదల సౌకర్యం మరియు లోతైన నేలలు శ్రేష్టం. నేల pH 6.5-7.5 వరకు గల నేలల్లో చాలా పెరుగును. బంకతో కూడిన నల్లరేగడి నేలలు పనికి రావు. తెలంగాణ ప్రాంతంలోని చల్మానేలలు, ఎర్రనేలలు, ఒండ్రునేలలు పంట సాగుకు అనువైనవి.

రకాలు

ధాంసాన్ సిడ్లెస్ (Thompson seedless): ఈ రకం దృడంగా కొంచెం ఏపుగా పెరుగును. ద్రాక్ష గుత్తిలో కాయలు దగ్గరగా చిన్నవిగా ఉండును. పండులో గింజలుండవు. మంచి నాణ్యత కల్లి Total soluble sugars 22% ఉండును.

అనాబ్-ఇ-షాహి (Anas-e-shahi) : ఈ రకం ఎక్కువ ఏపుగా పెరిగి అధిక దిగుబడినిచ్చును. ద్రాక్ష గుత్తి చాలా పెద్దగా ఉండును. పండ్లు బాగా కండతో నిండి ఉండును. కాయలలో 2-3 విత్తనాలుండును. T.S.S 10-17% ఉండును. పండ్లు ఆలస్యంగా పక్వానికి వచ్చును.

ఇతర రకాలు

కాలిసాహెబ్ గులాబి(మస్కట్) banglore blue, దిల్ ఖుష్ బోబ్రి. (నాసిక్ గ్రీన్), ఇవియే గాక క్రిస్మిస్ చెర్ని స్మిస్భేల, అనునవి ఎండు ద్రాక్ష రకాలు కూడా సాగులో ఉన్నవి.

గింజ ఉన్న రకాలు: అన బీ పాహి, దిల్ కుష్, బ్యాంగ్ లూర్ బ్లూ.

ప్రవర్ధనం: ద్రాక్షను కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. హెచ్చు దిగుబదినిచ్చు చెట్లను ఎంపిక చేసుకొని వాటిలో బాగా ముదిరిన కొమ్మలను సుమారు 25-30 సెం. మీల పొడవు మరియు 4-5 మొగ్గలు గల కొమ్మలను అక్టోబర్ నేలలో సేకరించాలి. ఈ మొగ్గలను బాగా చదును చేసిన మళ్లలో కాండము పై గల రెండు మొగ్గలు భూమి ఉపరితలం పై ఉండేటట్లు నాటాలి. నారుమడిలో చెదలు ఆశించకుండా లిండెన్ డస్ట్ ను చల్లాలి. ఇలా నాటిన కొమ్మలకు వేర్లు ఏర్పడి 2-3 నేలల్లో తోటలో నాటుటకు సిద్ధమగును.

నాటు విధానం: నాటవలసిన భూమిని బాగా చదును చేయవలెను. కొమ్మలు నాటుటకు ముందు, రాతి స్తంభాలను పాతి గాల్వినైజ్ ఇనుప తీగను ఉపయోగించి పందిరి వేయవలెను. ద్రాక్ష రకాన్ని బట్టి నేలను బట్టి మరియు ద్రాక్ష తీగను ప్రకించే విధానంను అనుసరించి మొక్కల మధ్యదూరం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనబి – ఇ షాహి రకానికి 4-5*4.5 మీటర్ల ఎడం మరియు Thompson seedless రకానికి 3*3 మీటర్లు ఎడంలో నాటుటకు నెలరోజుల ము, దు 60-90 సెం.మీ (ఘ.సెం.మీ) గోతులను త్రవ్వి గాలికి ఆరనివ్వాలి. తదుపరి గోతిలో పై మట్టి + 20 కేజీల చివికిన ఎరువు 500 గ్రముల సూపర్ ఫాస్ఫేట్ 1 కేజీ Neemcake

వేసి గుంతను నింపవలెను. తర్వాత వేర్లు ఏర్పడిన కొమ్మలకు దెబ్బ తగలకుండా గోతిలో నతవలెను. వీటిని నటుటకు అక్టోబర్ – నవంబర్ మాసాలు మిక్కిలి అనువైనవి.

మొక్కలు పెంచే పద్దతులు

నాటిన తర్వాత ఎదిగే మొక్కలను క్రమపద్దతిలో పెంచుత చాలా ముఖ్యం దీని వల్ల మొక్క బాగా ఎదుగుటయే గాక తీగ కూడా పాకుటకు వీలగును. ఈ మొక్క పెంచే పద్ధతులు Training వలన ద్రాక్ష మొక్కలను కత్తిరించుటకు మందులను పిచికారీ చేయుటకు మరియు పండ్లు కోయుటకు అనువుగా వుండును. ద్రాక్ష యొక్క రసం దాని దృఢత్వంను బట్టి ఈ పద్ధతిని అవలంభించవల్సి ఉంటుంది.

మొక్కలను పెంచు పద్దతులలో చాలా పద్ధతులు కలవు.

  • బోవర్ పధ్ధతి/పెండాల్/అర్బోరో (system)
  • నిప్ఫీన్ (Kniffin system)
  • టేలిఫోనే పద్ధతి (Telephone method)
  • హెడ్ పద్ధతి (head system)
  • V-కార్డన్ V-cardon.

భారతదేశంలో ఉష్ణ ప్రాంతంలన్నిం టిలోద్రక్షలోని వాణిజ్య రకాలను పెంచుటకు బోవర్ పద్ధతినే అనుసరిస్తునారు. ఎందువలన అనగా దీనివల్ల తీగలు దృడంగా మరియు ఎక్కువ పెరుగును. దీని వల్ల తీగ అన్ని వైపులకు బాగ్ విస్తరించి అడ్డంగా కూడా కొమ్మలను వేయును. ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నది. ఈ బోవర్ లను 2.1 మీటర్ల ఎత్తులో ఉండునట్లు గ్రానైట్ రాతి సంభాలను మరియు G.I తీగలను ఉపయోగించి నిర్మించవలెను.

బాగా దృఢంగా ఏపుగా పెరిగే ఒక తీగను ఎన్నుకొని దానికి ఒక బొంగును ఊతంగా యిచ్చి బోవర్ మీదిక్రి ఎక్కించవలెను. ఆకు మొదలలో వచ్చే పిలకలను అన్నింటిని త్రుంచి వేయాలి. ముఖ్యంగా పాకించే తీగను పెండాల్కు 15-20 సెం.మీల దగ్గరలో ఉన్నపుడు కాండపు కొనను గిల్లి వేయాలి. దీనివల్ల 2 పిలకలు వచ్చినచో వాటిని ఎదురెదురుగా ఉండునట్లు పెండాల్ యొక్క తీగల మీదకు పాకించవలెను. ఈ 2 పిలకలు ప్రధాన కొమ్మలుగా తయారగును. వాటి నుండి మరలా పక్కపిలకలు 45 సెం.మీల దూరంలో ఉండునట్లు పెంచవలెను. బాగా ఎదిగిన పిలకల నుండి (ముదిరిన కొమ్మలు) ద్రాక్ష పిలకలు పట్టను. ద్రాక్ష కొమ్మలు వాటి నుండి వచ్చే పిలకలు అన్ని కల్పి ఒక నిర్ణీతమైన ఆధారంగా తయారగును.

కొమ్మ కత్తిరించుట

ద్రాక్షలో కొమ్మలు కత్తిరించుట ముఖ్యమైన కార్యక్రమం. దీని వల్ల ద్రాక్ష త్వరగా పండ్లను యిచ్చును. తీగను సరిగా ప్రాకించకపోయినా మరియు సరిగా కత్తిరించకపోయినా ద్రాక్ష పంటనుయివ్వదు. మన రాష్ట్రంలో సంవత్సరంకు 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో (పిబ్రవరి-ఏప్రిల్) 2 వ సారి శీతాకాలంలో (సెప్టెంబర్-అక్టోబర్న్ కొమ్మలు కత్తిరించవలెను. వేసవిలో కొమ్మలు కత్తిరించుట వలన ఎక్కువ కొత్తకొమ్మలు కత్తిరించుట వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడును. దీనినే (Backward pruning (or) foundation pruning) అందురు. సెప్టెంబర్-అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించుట వలన పూత ఏర్పడి కాపు నిచ్చును. 2వ సారి కొమ్మ కత్తిరింపులలో కొమ్మపై ఉండే మొగ్గలు ద్రాక్షరకంపై ఆధారపడి ఉండును. సాధారణంగా అనబీ-ఇ-షాహి రకానికి 5-7 core) Thompson seedless రకానికి 12 మొగ్గలు వుంచి కత్తిరించవలెను. ఈ మాసాల్లో కత్తిరింపులు కాపు కొరకు చేస్తారు. కాబట్టి దీనిని ఫార్వర్డ్ లేదా (ఫ్రూట్ బడ్ ఫ్రూనింగ్) అంటారు.

ఎరువులు

ద్రాక్షకు ఎరువులను కత్తిరింపులకు ముందుగా వేసుకుంటారు. కత్తిరింపులు చేయుటకు ముందు ద్రాక్ష మొక్క చుటట్టా 15-20 సెం.మీల లోతు మట్టిని తీసి మొదలుకు ఎగదోయాలి. మొదట పశువుల ఎరువును సమపాళ్ళలో ప్రతి చెట్టుకు సుమారు 100 గ్రాములు మరియు చెటూ చుటూ బోదెలు 75-100 సెం.మీల దూరంలో చేయాలి.

ఎరువుల మోతాదు : (మొక్కకు/గ్రాములలో)

ఎరువు

మొదటి సం.

2వ సంవత్సరం

3వ సంవత్సరం/ఆ తర్వాత

వేసవి

శీతా

వేసవి

శీతా

యూరియా

100

500

 

500

750

750

సూపర్ ఫాస్ఫేట్

200

1500

1500

2000

2000

M.O.P

500

500

500

1000

1000

ఆముదపు చెక్క

5000

5000

5000

6000

6000

సూక్ష్మపోషకాల లోపాలున్నప్పుడు Zns0, 2 గ్రాముల, Mgs0, 2 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బోరాన్ లోపమున్నటైతే 15-30 గ్రాముల బోరాక్స్ భూమిలో వేయాలి.

నీరు కట్టుట

బాగా ఎదిగిన ద్రాక్ష తోటలకు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎర్రనేలల్లో సంవత్సరానికి 30-40 తడులు అవసరం. ద్రాక్ష తోటలకు శీతాకాలంలో 1000 లీటర్ల నీరు వేసవి కాలంలో 2000 లీటర్ల నీరు ఒక మొక్కకు అవసరం.

ద్రాక్ష కత్తిరింపుల నుంచి ఎరువులు వేసి వెంటనే 2-3 తడులు వెంట వెంటనే 3-4 రోజుల వ్యవధిలో యివ్వాలి. పండ్లు తయారయ్యే సమయంలో 8–10 రోజుల ముందుగా నీరు కట్టుట ఆపివేయాలి. ఇలా చేసినచో పండు నాణ్యత వృద్ధి చెందును.

ద్రాక్ష గుత్తుల యొక్క పరిమాణం, నాణ్యత పెంచటం

థాంప్సన్ సీడ్లెస్లో పండు పరిమాణం, నాణ్యత పెంచవలసినచో, జిబ్బరిలిక్ యాసిడ్ అనే హార్మోనును పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 60 పి.పి.యమ్ జిబ్బరిలిక్ యాసిడ్ ద్రావణంలో ముంచాలి. దీని వలన 40-50 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది.

కాండంపై 0.5 నుండి 1 సెం.మీ వెడల్పు బెరడు తీయడం వలన పండ్ల పరిమాణం మరియు గుత్తి నాణ్యత కూడా వృద్ధి అవుతుంది. ఈ పద్దతినే గర్జిలింగ్ అంటారు.

కోత మరియు ప్యాకింగ్

ద్రాక్ష గుత్తుల పరిమాణం మరియు నాణ్యత పెంచుటకై జిబ్బరిల్లిక్ ఆసిడ్ (GA) అను హార్మోన్ను పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 50-60 ppm GA ద్రావణంలో ఉంచుట వలన 30-50% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది.

ద్రాక్ష పండ్లు తీగపైనే పక్వమునకు వచ్చిన పిదప కోయుదురు. పండ్లు కోసిన పిదప దాని పక్వ దశలో ఏమార్పు రాదు. సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్నచో గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోనికి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లు కనబడుతుంది. బాగా తయారైన పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్లలో మొత్తం కరిగే ఘనపదార్ధాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిస్తాయి.బ్రిక్స్రీడింగ్ అనాబ్-ఇ-షాహి 15-16 డిగ్రీలు, మరియు థాంప్సన్సీడ్లెస్ 21-22 డిగ్రీలు/రాగానే కోయవచ్చు.

దిగుబడి

దిగుబడి సాగు చేయవల్సిన రకం నేల, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో అనబి-ఇ-షాహి 10-15 టన్నులు/ఎకరానికి మరియు థామ్సన్ Sac5 6-8 టన్నులు/ఎకరానికి దిగుబడి నిచ్చును.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate