অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రొద్దుతిరుగుడు

ప్రొద్దుతిరుగుడు

శాస్త్రీయనామం : హీలియాంతస్ ఏన్యూయస్

కుటుంబం : కాంపోజిటే

వేరుశనగ నూనె, నువ్వులనూనె కంటె కూడ ప్రొద్దు తిరుగుడు నూనె శ్రేష్టమైనది. దీని నుండి వనస్పతి కూడ తయారు చేస్తారు. వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో కూడ ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. సువాసన కలిగిన లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, లినోలినిక్ ఆమ్లం లేక పోవటం వలన ప్రొద్దుతిరుగుడు పంట చాలా ఆదరణలోకి వచ్చింది. దీని నూనె గుండెపోటుగల వారికి మంచిది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.18 లక్షల ఎకరాల్లో పండిస్తూ 3.32 లక్షల టన్నుల దిగుబడి సాదిస్తున్నాం. సగటు ఉత్పాదకత హెక్టారుకు 794 కిలోలు (2008-09).

సూరజ్ ముఖి అనే సూర్యకాంతం భారతదేశంలో బాగా తెలిసిన మొక్క చాలా కాలం నుండి అలంకరణ కోసం దీనిని పెంచుతున్నారు. నూనెగింజల పంటగా వాణిజ్యసాగుకోసందీన్ని భారతదేశంలో 1969లో ప్రవేశ పెట్టారు. అనతి ਤ੦੦੬5 దీని సాగు విస్తీర్ణం దేశ వ్యాప్తంగా పెరిగింది.

దీనికి కారణాలు

ఈ పంటలో వున్న అనుకూల విషయాలు (అంశాలు)

 • తక్కువ కాల పరిమితి, కాంతి సూక్ష్మ గ్రాహ్యత లేకపోవడం వంటి లక్షణాలు వల్ల దీన్ని ఏ ఋతువులోనైనా సాగు చేయవచ్చు.
 • ఇది అనేక రకాల నేలల్లో బాగా పెరుగుతుంది. ఎరుపు, నల్లరేగడి నేలలు అనువైనవి.
 • దీనికి లవణ నిరోధకత కూడావుంది అందువల్ల లవణ ప్రదేశాల్లో కూడా పెంచవచ్చు.
 • ఇది ప్రమాణ విస్తీర్ణానికి, ప్రమాణ కాలానికి, ఎక్కువ నూనె ఉత్పత్తి చేస్తుంది.
 • జలాభావ నిరోధకం లేక జలభావాన్ని తప్పించుకునే శక్తి వుంది.
 • దీన్ని నూనె తీయడానికి గానుగ పట్టడం సులువు
 • దీన్ని అధిక నాణ్యతగల ఖాద్య తైలంగా భావిస్తారు, ఎందుకంటే దీనికి కొలెస్తాల్ నిరోధక ధర్మాలున్నాయి.
 • విత్తనం రేటు తక్కువ, అందువల్ల విత్తన వృద్ధి అధికం (1:100) కావున విస్తీర్ణాన్ని త్వరితంగా పెంచవచ్చు.
 • దీన్ని అనేక రకాల శీతోష్ణ పరిస్థితులలో సాగు చేయవచ్చును, ఎందుకంటే దీనికి అధిక అనుకూలత వుంది.
 • ఇది పరపరాగసంపర్కం జరుపుకునే మొక్క కావున సంకరాలను, కాంపోజిట్లను, సంశ్లేషకాలను తయారు చేయడానికి అవకాశం ఎక్కువ వుంటుంది.

అననుకూల విషయాలు

 • గింజలు సరిగ్గా నిండక పోవడం.
 • పక్షులవల్ల హాని.

ఉపయోగాలు

వేరుశెనగ, నువ్వుల నూనె కంటే ఇది శ్రేష్టం. దీని నుండి వనస్పతిని తయారుచేస్తారు. వార్నిష్, సబ్బులు, కలప పరిశ్రమల్లో కూడా ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. సువాసన కలిగిన అసంతృప్త క్రొవ్వు ఆమ్లం లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి లినోలినిక్ ఆమ్లం తక్కువగా వుండటం వల్ల ప్రొద్దుతిరుగుడు పంటకు చాలా ఆదరణ వచ్చింది. నూనె తీసిన తర్వాత పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. ఈ పంట గింజల పప్పును వేయించుకునితినవచ్చు.

విస్తీర్ణం, ఉత్పత్తి

 • ప్రపంచంలో సూర్యకాంతంను రష్యా అమెరికా, అర్జెంటైనా రుమేనియా, స్పైయిన్లో పండిస్తున్నారు.
 • భారతదేశంలో ఈ పంటను ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ కొంతమేరకు గుజరాత్ తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్లలో కూడా పండిస్తున్నారు.
 • 2007-08 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పంటను 426 లక్షల ఎకరాల్లో పండిస్తూ 4.37 టన్నుల ఉత్పత్తిని హెక్టారుకు 1028 టన్నుల సగటు దిగుబడిని ఇస్తుంది.

శీతోష్ణస్థితి అవసరాలు

 • మొలకెత్తే సమయంలో, నారుమొక్క పెరుగుదల దశలో ఈ పంటకు తీవ్రముగాని చలి వాతావరణం కావాలి.
 • నారు మొక్క దశ నుంచి పుష్పించే దశ వరకు దీనికి వెచ్చని ఎండగాని పగటి కాలం కావాలి.
 • పుష్పించే సమయంలో అధిక ఆర్ధతతో పాటు మేఘావృతమైన వాతావరణం లేక వరాలు వుంటే గింజలు సరిగ్గా ఏర్పడవు.
 • పక్వదశ వద్ద ఉష్ణోగ్రత పెరగడంతో పాటు లినోలినిక్ ఆమ్ల శాతం తగ్గుతుంది.
 • సూక్ష్మ గ్రాహ్యత లేని పంట కాబట్టి దీన్ని సంవత్సరం అంతా పెంచవచ్చు.అయితే కాల పరిమితిలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది.
 • ఖరీఫ్లో 80–90 రోజులు, రబీలో 105-110 రోజులు, వసంతకాలం 100-110 రోజులు కొద్ది వ్యత్యాసం పంటకాలంలో వుంటుంది.

ఋతువులు లేక విత్తే సమయం

నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా పండించవచ్చు. ప్రొద్దు తిరుగుడు విత్తేటప్పుడు ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయం, పూత దశ మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వరాలతో కాని లేక పగటి ఉష్ణోగ్రత 38"c So33 ఎక్కువ కాని వుండకుండా చూసుకోవాలి. రబీ, వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లోజూన్ రెండవ పక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు, బరువు నేలలో ఆగష్టు 2వ పక్షం, రబీలో వర్బాధారంగా సెప్టెంబర్లో,నీటి పారుదల క్రింద అక్టోబర్ 2వ పక్షం - జనవరి మొదటి పక్షం వరకు సత్రకో నీటిపారుదల క్రిందజనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. ఎర్ర, నల్లరేగడి నేలల్లో వరి తర్వాత ప్రొద్దు తిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవాలి.

విత్తే సమయం కూడా ప్రొద్దు తిరుగుడు నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు గట్టిపడే సమయంలో సూర్యరశ్మి ఎక్కువ పగలు వుంటే నూనె శాతం పెరుగుతుంది. నూనె నిల్వ సామర్థం ఖరీఫ్ కంటే వేసవిలో ఎక్కువగా ఉంటుంది.

నేలలు

 • నీరు నిల్వ వుండని తటస్థ భూములైన ఎర్ర, చల్కా ఇసుక, ఒండ్రు, రేగడి నేలలు దీని సాగుకు శ్రేష్టం.
 • ఉదజని సూచిక 6.5-8 వున్న నేలలు, ఈ పంటకు అనుకూలం.
 • ఆమ్ల లక్షణాలు కల్గిన నేలలు కంటే కొద్ది క్లార లక్షణాలు కలిగిన నేలలు అనుకూలం. ఆమ్ల లక్షణాలు మొలకెత్తే స్వభావాన్ని మొక్క పెరుగుదలను మొక్క పటుత్వంను తగ్గించి, దిగుబడి తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
 • ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కావున లోతట్టు మరియు సముద్ర తీరప్రాంతాల్లో సాగు చేయరాదు.
 • తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంచుగోగల నల్లరేగడి నేలల్లో రబీ వేసవి మరియు వసంతకాలంలో ఈ పంటను వేసుకోవచ్చు.

నేల తయారీ

భూమిని 4,5 సార్లు దున్ని మెత్తని దుక్కిచేయాలి. మధ్యస్థ మరియు బరువు భూములైతే బ్లేడుతో 1.2 సార్లు కలియదున్ని ఆ తరువాత బోదెలు వేసి విత్తనం వేసుకోవచ్చు. ఇలా బోదెలు వేయడం వల్ల విత్తనాలు నాటుటకు మరియు 30-35 రోజులు తర్వాత మొగ్గ తొడిగే దశలో ఎరువులు పైపాటుగా వేయడానికి వీలుంటుంది.

విత్తన మోతాదు

ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది.

వితే దూరం

నేలలు

అంతరం (సెం.మీ)

మొక్కల సాంద్రత (ఎకరాకు)

1. తేలిక నేలలు

మధ్యస్ధ నేలలు (పొట్టి పంగడాలు తక్కువ కాలపరిమితి గల రకాలు)

45*30

29,600

2. బరువు నేలలు (పొడవుగా పెరిగే రకాలు, దిర్గకాల పరిమితి రకాలు, సంకరాలు)

60*30

22,000

విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ లోతులో నాటవలసి వుంటుంది. మొక్కలు మొలకెత్తిన 7 నుంచి 10 రోజుల తర్వాత విధిగా కుదురుకు 1 మొక్క వుండేట్లు పైరును పలుచన చేయాలి.

విత్తన శుద్ధి

విత్తనాలను విత్తే ముందు 14 గం! నీటిలో నానబెట్టినీడలో ఆరబెట్టివితే ముందు 2-3 గ్రాI ధైరమ్/కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి. నెక్రోసిస్ తీవ్రంగా వున్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాII ఇమిడాక్టోఫ్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.

ఎరువులు

ఎరువులు (ఎకరాకు కిలోల్లో)

ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును వితే 2-3 వారాల ముందు వేయాలి.

పంటపరిస్థితి / నేలలు

నత్రజని

భాస్వరం

పొటాష్

రకాలు

హైబ్రిడ్స్

రకాలు

హైబ్రిడ్స్

రకాలు/ హైబ్రిడ్స్

వర్బాధారపు పంట

24 (12+12)

24

12

నీటిపారుదల పంట

నల్లరేగడి నేలలు

24 (8+8+8)

30 (10+10+10)

24

36

ఎర్రనేలలు

12 (6+6)

24 (8+8+8)

గమనిక : నత్రజనిని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, రెండవ దఫా విత్తిన 30 రోజులకు మొగ్గతొడిగే దశలో 25%, మూడవ దఫా విత్తిన 55-60 రోజులకు పూవు వికసించే దశలో 25% వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ మాత్రం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి.చొప్పన కలిపి పైరు పూతదశలో ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. దీని వలన గింజలు ఎక్కువగా తయారవుతాయి. మొదట బోరాక్స్ను వేడినీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేయాలి లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల చొప్పన బోరిక్ ఆమాన్ని వేస్తే అధిక దిగుబడిని పొందవచ్చు.

గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేసే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు 2-3 వారాల ముందు వేయాలి. (ఎకరాకు కిలోల్లో)

సస్యరక్షణ

పురుగులు

 1. రసం పీల్చు పురుగులు : పచ్చ దీపపు పురుగులు, తెల్ల దోమలు, తామర పురుగులు
  • దీపపు పురుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, క్రమేపి ఆకు అంతా ఎర్రబడి, చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2.0 మి.లీ. లేదా మిధైల్ డెమెటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి.
  • తెల్లదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు టైజోఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో, చీలిన రెక్కలతో ఉంటాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులను, పువ్వులను రసాన్ని పీలుస్తాయి. ముఖ్యంగా ఈ పురుగులు లేత భాగాల్ని ఆశ్రయించి పెరగటం వలన ఆకులు పెళుసుగా మారి మొక్క గిడసబారి పోతుంది. ఇవి ఆశించిన ఆకులపై పొడ లాంటి మచ్చలు ఏర్పడి ఆకులు పాలిపోయి మడుచుకొని పోతాయి. పరోక్షంగా ఇది నెక్రోసిస్ వైరస్ తెగులును వ్యాప్తి చేసి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారి చేయడం కంటే కిలో విత్తనానికి 5 గ్రా, ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేస్తే మంచిది. తద్వారా సహజంగా అదుపుచేసే మిత్రపరుగులు పైరులో వృద్ధి చెందుతాయి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయాలి.
 2. ఆకుల్ని తినేపురుగులు : పొగాకు లద్దె పురుగు, బీహారి గొంగళి పురుగు, ఆకుపచ్చని పురుగు.
  • పొగాకు లదైపురుగు : లద్దె పురుగులు తొలిదశలో గుంపులుగా ఆకులపై పత్రహరితాన్ని గీకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరను (10 కిలోల తవుడు, కిలో బెల్లం మరియు ఒక లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బరిల్ 50% పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారు చేసుకొని మొక్కల మొదళ్ళ దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి లేదా 0.25 మి.లీ. (Spinosad) స్పెనోసాడ్ను లేదా 1 మి.లీ. నొహాల్యురాన్, లేదా 1 గ్రాము థయోడికార్చ్ లేదా ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట పూత దశలో వున్నప్పడు మిత్రపరుగులకు హానికలుగ చేయకుండా నొవాల్యురాన్ పిచికారి చేసుకోవాలి.
  • పచ్చ రబ్బరు పురుగు : ఈ పురుగులు పంట తొలిదశలో ఎక్కువగా ఆశించి, ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు థయోడికార్చ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • బీహార్ గొంగళి పురుగు : రెక్కల పరుగు శరీరం గోధుమ, ఎరుపు రంగులో ఉండి నల్లటి మచ్చలను కల్లి ఉంటాయి. రెక్కలు గులాబి రంగులో ఉండి నల్లటి మచ్చలు ఉంటాయి. తల్లి పురుగు ఆకులపై గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది. లార్వాల శరీరం లేత పసుపు రంగులో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి వుంటుంది. ఈ లార్వాలు ఆకులను తిని తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారి పోతాయి.
  • గ్రుడ్లను తొలిదశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నప్పుడు ఏరి నాశనం చేయాలి. తొలిదశ గొంగళి పురుగులను నివారించేందుకు వేప గింజల ద్రావణాన్ని (5 శాతం) పిచికారి చేయాలి. పెద్ద లార్వాలు ఉన్నఎడల ఎండోసల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లేదా డైక్లోర్వాస్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 3. తలను ఆశించే పురుగు/శనగపచ్చ పురుగు/తలను తొలిచే పురుగు : ప్రొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఆశిస్తుంది. దీని రెక్కల పురుగుల ముందు రెక్కలు మసక గోధుమ రంగులో ఉంటాయి. లేత ఆకుల మీద, విచ్చుకునే పూవుల మీద గ్రుడు పెడతాయి. గ్రుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో, పెరిగిన లార్వాలు ముదురు ఆకుపచ్చ రంగు నుండి, గోధుమ రంగు, ఊదారంగు, లేదా నల్లరంగులో ఉంటాయి. కోశస్థ దశ భూమిలో గడుపుతుంది. ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించాలి.
 4. దీని లార్వాలు పువ్వుల, గింజల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా తయోడికార్చ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. హెచ్.యన్.పి.వి. అనే వైరస్ను ఎకరాకు 200 ఎల్.ఇ. పిచికారి చేసి కూడా ఈ పురుగును నివారించవచ్చు.

తెగుళ్ళు

 1. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు ప్రొద్దు తిరుగుడు పండిస్తున్న అన్ని ప్రాంతాల్లో ఆశించి విపరీత నష్టం కలుగజేస్తుంది. ఇది వర్షాకాలం, చలి కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. వాతావరణం అనుకూలించినట్లయితే పంటవేసిన 50-60 రోజుల వరకు ఈ తెగులాశిస్తుంది. ముదురు గోధుమ రంగు లేదా నల్లటి గుండ్రని లేదా అండాకారపు మచ్చలు మొదట ఆకులపై ఏర్పడతాయి. ఈ మచ్చల చుటూ పసుపుపచ్చని వలయాలు ఏర్పడి, మచ్చల మధ్యభాగం బూడిదరంగులో వుంటుంది. తేమ ఎక్కువగా ఉన్నపుడు కలిసిపోయి ఆకులు మాడిపోవటమే గాక పువ్వు కుళ్ళిపోయే అవకాశం ఉంది. దీనివల్ల గింజ నాణ్యత తగ్గి మొలక శాతం తగ్గిపోతుంది. ఈ తెగులు లక్షణాలు ఆకులపైనేకాక ఆకు కాడలు, కాండం, పువ్వు వెనకటి పచ్చని భాగాలు, పూరేకుల పై కనిపిస్తాయి. కాండం మీద మచ్చలేర్పడినపుడు వాటి మధ్య భాగం చీలిగిపోయివుంటుంది..
 2. తుప్పుతెగులు : చలికాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉండి అధిక నష్టం కలుగజేస్తుంది. మొదట తెగులు లక్షణాలు క్రింది ఆకులపై చిన్న ఇటుక వర్ణపు పొక్కులుగా ఏర్పడి, తర్వాత పై ఆకులకు, పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపించి ఎరుపురంగుకు మారి ఎండిపోతాయి.
 3. పై తెగుళ్ళ నివారణకు పంట అవశేషాలు మరియు శిలీంధ్రానికి ఆశ్రయ మిచ్చే ఇతర కలుపు మొక్కల నిర్మూలన, ధైరమ్ లేక కాష్ట్రాన్ 3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి మరియు మాంకోజెబ్ 3 గ్రా. లేక జినెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 4. బూడిద తెగులు : ఆకులపైన మరియు అడుగుభాగాన బూదిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడివాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు తీవ్రత ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం పొడిగాని లేక 1 మి.లీ. డినోక్యాప్ So) కలిపి పిచికారి చెయ్యాలి.
 5. పువ్వు (తల) కుళ్లు : ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వరాలు పడినపుడు ఆశిస్తుంది. మొదట మొక్క చివరిభాగంలో మరియు పువ్వు కింద ఉన్న ఆకులు శిలీంధ్రం ఆశించటం వలన ఎండిపోతాయి. పువ్వు క్రింది భాగాలు నీటిలో తడిచినట్లుండి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. దీని నివారణకు ఫెన్థియాన్ 1 మి.లీ. మరియు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పువ్వు దశలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
 6. నెక్రోసిస్ తెగులు : ఈ తెగులు పైరును అన్ని కాలాల్లో, ఏ దశలోనైనా ఆశించవచ్చు. ఇది వైరస్ వల్ల వచ్చే తెగులు. తామర పురుగుల (త్రిప్స్) ద్వారా ఈ తెగులు పొలమంతా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకినపుడు ఆకుల మధ్య ఈనె దగ్గరగా ఉండే భాగం ఎండిపోయి మొదట బూడిదరంగులోను, తర్వాత నల్లగా మారి వంకరలు తిరుగుతుంది. తర్వాత ఆకు కాడకు, కాండానికి, పువ్వుకు వ్యాపించి నల్లగా మాడి ఎండిపోతాయి. లేత మొక్కలలో ఈ తెగులు వస్తే మొక్కలు సరిగా పెరగక గిడసబారి ఎండిపోతాయి. పూత దశలో వస్తే, పువ్వు పూర్తిగా విచ్చుకోక, మెలిక తిరిగి, వంకర టింకరగా మారిపోతుంది. పుష్పభాగాలు దెబ్బతిని విత్తనవృద్ధి జరగదు.
 7. నివారణ : వేసవి దుక్కలు చేయాలి. పంట చుటూ నాలుగు సాళ్లు జొన్న,సజ్ఞమొక్కజొన్న పంట వేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తనశుద్ధి చేసి తొలిదశలో తామరపురుగులు ఆశించకుండా జాగ్రత్త పడవచ్చు. గట్ల మీద ఉండే పార్టీనియం (వయ్యారి భామ) మొక్కలను, ఈ తెగులు సోకిన పంట మొక్కలను పూదశ రాకముందే పీకి వేసి నాశనం చేయాలి. మెటాసిస్టాక్స్ 2 మి.లీ. లీటరు నీటిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ. 10 లీ. నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు, నాలుగు సార్లు పిచికారి చేసి ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.

వేసే సమయం

మొత్తం భాస్వరం, పొటాష్ను ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. నత్రజని మొదటి దఫా విత్తే ముందు 50%, రెండవ దఫా విత్తిన తర్వాత 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో 25%, 3వ దఫా విత్తిన 50-60 రోజుల తర్వాత పువ్వువికసించే దశలో 25% వేసుకోవాలి.

2 గ్రా. బోరాల్స్ లీటరు నీటికి చొప్పున కలిపి పైరుపూత దశలో ఆకర్షక్రపత్రాలు వికసించే దశలో ఎకరాకు 200లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. దీని వల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి.

మొదట బోరాక్స్ను వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం చేసుకోవాలి. లేదా ఆఖరి దుక్కిలో 8 కిలోల బోరిక్ ఆమ్లం వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

గంధకం తక్కువగా వున్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సమ్ రూపంలో వేస్తే నూనెశాతం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు.

తాలుగింజలు ఏర్పడటానికి గల కారణాలు, నివారణ మార్గాలు

వాతావరణ పరిస్థితులు

పంటపూత దశలో అధిక వర్షపాతం, అధిక చలి, మంచు మరియు అధిక ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెంటిగ్రేడు కంటే ఎక్కువ) వున్నపుడు గింజ కట్టడానికి సరిపోయినంత పుప్పొడి ఏర్పడక తాలు గింజలు ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి పంటను సరైన సమయంలో విత్తుకోవాలి.

పూవులోని గింజల మధ్య ఆహారానికి పోటీ • పూవులో ముందుగా ఏర్పడిన బయటవైపు గింజలు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన పూవు మధ్యభాగంలో గింజలు ఏర్పడవు. దీనినే "సెంట్రల్ స్టెరిలిటి" అని అంటారు. పెద్ద వూపులున్న రాకల్లో ఈ విధంగా గింజకట్టకపోవడం 20 నుండి 40 శాతం దాకా వుంటుంది. అందువలన పఉ్వ సైజు మధ్యస్థంగా వుండే రకాలను ఎంపిక చేసుకోవాలి.

అధిక మొక్కల సాంద్రత

మొక్కల సాంద్రత అధికంగా వున్నపుడు అతి చిన్న పూలు ఏర్పడడం, ఏర్పడిన పూలలో తాలు గింజలు రావడం జరగుతుంది. నీటి పారుదల క్రింద ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. విత్తే దూరము 45X30 సెం.మీ, తేలిక నేలల్లో 45 సెం.మీ, నల్లరేగడి నేలల్లో 60x80 సెం.మీ.(ఎకరానికి 22,000) మొక్కలు వుండేలా విత్తుకోవాలి.

పోషకాల లోపం

గింజలు ఏర్పడినా గింజల్లో పప్పు అభివృద్ధి సరిగా జరుగక తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు భూసార పరీక్ష ఫలితాలను బట్టి పోషకాలను సరైన మోతాదులో అందించాలి. గింజలో నూనె శాతం మరియు గింజల బరువు పెరగటానికి తప్పనిసరిగా ఎకరానికి 10-20 కేజీల గంధకం వాడాలి. అలాగే బోరాన్ సూక్ష్మపోషక లోపం వలన గింజ కట్టడం తగ్గి తాలు గింజలు రావడానికి ఆస్కారం వుంటుంది. అందుకుగాను, 2 గ్రాముల బోరాక్స్ బోరాక్స్ పొడిని లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకున్నపుడు ఎకరానికి 200 లీటర్ల మోతాదులో మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీనివల్ల పుప్పొడి ఎక్కువగా ఉత్పత్తి తఅయి. ఎక్కువ సమయం సజీవంగా వుండి పరపరాగ సంపర్కం బాగా జరుగుట వలన గింజ బాగా కడుతుంది.

నీటిఎద్దడి

ప్రొద్దు తిరుగుడులో మొగ్గతొడిగే దశ, పూవు వికసించేదశ మరియు గింజకట్టేదశలను కీలకదశలుగా పరిగణిస్తాము. ప్రధానంగా ఈ దశల్లో నీటి ఎద్దడి ఏర్పడటంవల్ల తాలు గింజలు ఏర్పడతాయి. కాబట్టి ఈ కీలక దశల్లో తప్పక నీటి తదులివ్వాలి. అదే సమయంలో పొలంలో నీరు నిల్వవుండకుండా చూడాలి.

కలుపు సమస్య

కలుపు మొక్కలు వలన మొక్కలు దృఢంగా ఎదగక, గింజలుసరిగా తోడుకోకపోవటం వలన కూడా తాలు సమస్య వస్తుంది. అందువలన విత్తిన మొదటి 45 రోజుల వరకు పొలంలో కలుపులేకుండా చూడాలి.

చీడపీడల ఉధృతి

చీడ పీడల వలన కిరణజన్యసంయోగక్రియ జరగడానికి అవసరమైన పరిమాణంలో పత్రహరితం లేక గింజ సరిగా కట్టకపోవడం, తాలు గిజంలు ఏర్పడటం జరుగుతుంది. అందువలన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టి చీడపీడల ఉధృతిని నియంత్రించాలి.

పరపరాగసంపర్కలక్షణం

ప్రొద్దుతిరుగుడు పంటలో గింజకట్టడం పరపరాగసంపర్కం వలన జరగుతుంది. ఈ పనిని తేనెటీగల వంటి కీటకాలు సమర్థవంతంగా నిర్వహిస్తాయి. పుష్పించే దశలో తేనెటీగల సంఖ్య తక్కువగా వున్నపుడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మొత్తటి గుడ్డతో పూలను సున్నితంగా రుదుట వలన పరపరాగ సంపర్కం బాగా జరిగి గింజ బాగా కడుతుంది.

నీటి యాజమాన్యం

ఎర్ర నేలల్లో 6-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల్లో నీటి తడులు పెట్టాలి. వివిధ నేలల్లో నీటి తడుల సంఖ్య క్రింది విధంగా పాటించాలి.

వర్షాకాలం

 • తేలిక నేలలు: 3-4
 • మధ్యస్థ నేలలు 2-3
 • బరువు నేలలు 1-2

శీతాకాలం

 • తేలిక నేలలు 4-6
 • మధ్యస్థ నేలలు 3-4
 • బరువు నేలలు 2-3

వేసవి కాలం

 • తేలిక నేలలు 6-8
 • మధ్యస్థ నేలలు 4-5
 • బరువు నేలలు 3-4

నీటితడులకు కీలక దశలు

మొగ్గతొడుగు దశ, పువ్వు వికసించే దశ, గింజకట్టు దశ,

తేమకు సున్నిత దశలు

మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టదశ

కలుపు నివారణ మరియు అంతర కృషి

విత్తిన 30-40 రోజులలో కలుపు లేకుండా చూడాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. పెండిమిధాలిన్ 30% 1 లీటరు నటికి అలక్లోర్ 50% 1.5 లీటర్లు చొప్పున ఏదోఒక దానిని విత్తిన వెంటనే కాని తర్వాత రోజునకాని పిచికారీ చేయాలి.

విత్తిన 20-25 రోజులకు గోర్రుతో అంతరక్రుషి చేయాలి.

పక్వ దశ, పక్వ లక్షణాలు మరియు పైరు కోత

ప్రొద్దు తిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మ పసుపు పచ్చ రంగుకు మారిన తర్వాత కోసి 2-3 రోజ్లులు ఆరనివ్వాలి. కర్రలతో కొట్టిగాని, ఒలచిగాని గింజలను వేరుచేయాలి. విద్యుత్ ద్వారా నడిచే నూర్పిడి యంత్రం ఉపయోగంచి విత్తనాలను వేరుచేయవచ్చు. గింజల్లో 9-10% వచ్చేవరకు ఎండబెట్టాలి.

పక్షులు బెడద

ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ కావున ఎక్కువ కమతాలలో వేయాలి. మెరుపు రిబ్బీన్లను పైరు పైన అడుగు ఎత్తున సూర్యరశ్మి పడేటట్లు దక్షణ, ఉత్తరం దిశగా కట్టాలి. శబ్దం చేయడం ద్వారా కాని, దిష్టిబొమ్మలు పెట్టడం ద్వారా పక్షలను పారద్రోలాలి.

దిగుబడి

ఎకరాకు సుమారుగా వర్షాధారంగా 400 కిలోలు, నిశ్చత వర్షపాతం కింద 400-600 కిలోలు, నీటి పారుదల క్రింద దిగుబడికి దోహదం చేసే అంశాలు

చ.మీకు మొక్కల సంఖ్య, పుష్పాల సంఖ్య, ఒక్కొక్క పుష్పంలో గింజల సంఖ్య, 1000 గింజల బరువు

చేతి పరాగ సంపర్కం

పుష్చించిన దశలో వున్నప్పుడు ఉదయం సమయంలో 7-11 గం.లకు రోజు పువ్వులను అరచేతితో సున్నితంగాతాకి పుష్పలకు వేరొక దాని పుప్పొడి రాయడం లాభదాయకరం. అరచేతికి మెత్తటి గుడ్డకట్టుకుని కూడా చేయవచ్చు. ఈ పని సుమారు 10 రోజుల పాటు చేయాలి. పుష్చించే సమయంలో 5-6 సార్లు చేతి పరాగ సంపర్కంవల్ల ప్రొద్దు తిరుగుడు దిగుబడి 20-25% పెంచుతుందని కనుకొన్నారు. అసమాన వాతావరణ పరిస్దితుల్లో, తుమ్మెదల చర్యతక్కువగా వుండే పరిస్దితుల్లో చేతి పరాగ సంపర్కం తప్పనిసరి.

పంట మార్పిడి

 • ఏక పంటగాననూ,
 • వేరుశెనగ + ప్రొద్దు తిరుగుడు 4:2
 • కంది + ప్రొద్దుతిరుగుడు 1:2

చిరుధాన్యాలు (కొర్ర, జొన్న, సజ్జ), అపరాలు (కంది, శనగ, మినుము), వేరుశనగ మొదలగు పంటలతో పంటమార్పిడి చేయవచ్చు.

పైరులను అంతర పంటలుగా పండించవచ్చు.

ప్రొద్దు తిరుగుడునువేరుశెనగ, కందితో వేసినపుడు 36% మరియు 24% అదనపు ఆదాయం వస్తుంది. ప్రొద్దు తిరుగుడును కందితో 4:2 నిష్చత్తిలో వేసినట్లయితే 2:4 కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని కనుగొన్నారు.

ప్రొద్దుతిరుగుడు రకాల గునగుణాలు

రకం

పంటకాలం

(రోజుల్లో)

దిగుబడి

(కి/ఎకరాకు)

వర్షాధారంగా

గుణగణాలు

రకాలు

మోర్డన్

 

 

 

 

 

డి. ఆర్. యస్.ఎఫ్-108

80-85

 

 

 

 

 

90-95

400

 

 

 

 

 

500

మొక్కలు 90-120 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 35-38 దేశంలోని అన్ని రాష్ట్రాలో పండించుకోతగిన తక్కువ కాలపరిమితి గల రకం. మిశ్రమ పంటగా వివిధ పంటల సరళిలో పండించేందుకు అనుకూలం.

 

నునేశాతం 40.

సంకరాలు

కె.బి.యస్. హెచ్-1

 

యస్.డి.యస్.హెచ్-1

90

 

80-85

600

 

600

మొక్కలు 130-150 సెం.మి ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 41-43.

నూనె శాతం 40-42 మిగిలిన అన్ని సంకరరకాల కన్నా ముందుగ కోత కొస్తుంది.

అధిక నూనె శాతం, అధిక దిగుబడి నిచ్చేరకం.

డి.ఆర్.ఎస్.హెచ్-1

95

650

అధిక నూనె శాతం, అధిక దిగుబడి నిచ్చేరకం.

ఇతరసంకరాలు: టిఎన్.వి.యు.యస్. యు.ఎఫ్-7

ఇతరసంకరాలు – ఏ.వి.యస్. హెచ్-11 బి.యస్.కాచ్-1 యస్.ఎఫ్.హెచ్-8,17

పైరుకోత

ప్రొద్దుతిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మపచ్చరంగుకి మారిన తర్వాత పువ్వులను కోసి వాటిని 2-3 రోజులపాటు ఆరనివ్వాలి. కర్రలతో కొట్టి కాని, నలిచిగాని విత్తనాన్ని వేరుచేయాలి. విద్యుత్ ద్వారా నడిచే నూర్పిడి యంత్రాలనుపయోగించి విత్తనాన్ని వేరుచేసుకోవచ్చు. గింజలో తేమ 9-10% వచ్చే వరకు ఎండబెట్టాలి.

ప్రొద్దుతిరుగుడు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త (నూనె గింజలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం-509215, మహాబూబ్ నగర్ జిల్లా. ఫోన్ నెం. : 08540-228646, 94412 10514

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate