మన రాష్ట్రంలో శీతాకాలంలో పండించే సాంప్రదాయేతర కూరగాయలలో ఫ్రెంచి చిక్కుడు ఇప్పడిప్పడు ప్రాచుర్యాన్ని పొందుతోంది. దీని లేతకాయలను కూరగాయగా వాడుతారు. ఉత్తర భారతదేశంలో ఎండిన ఫ్రెంచి చిక్కుడు గింజలను రాజ్మా అంటారు. వీటిని పప్పదినుసుగా వాడతారు. వీటికి ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా డిమాండ్ పెరిగింది.
ఫ్రెంచి చిక్కుడు సాగుకు చల్లని వాతావరణం అనుకూలమైనది. మొక్క పెరుగుదల 15o - 21o సెల్సియస్ వద్ద బాగుంటుంది. అధిక మంచును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. కావున మనరాష్ట్రంలో శీతాకాలం పంటగా సాగుచేసేందుకు అనువుగా వుంటుంది. ఎత్తైన కొంద ప్రాంతాలలో అంటే సముద్ర మట్టం నుండి 700 - 2500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాలలో వేసవి పంటగా సాగుచేయవచ్చు.
ఈ పంట సాగుకు ఉదజని సూచిక 6.0 - 7.0 వరకు వున్న నేలలు ముఖ్యంగా ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు, మరుగు నీటి వసతి గల బరువైన నేలలు అనుకూలం. క్షార నేలలు పనికిరావు.
ఫ్రెంచి చిక్కుడులో ప్రధానంగా తీగ రకాలు, పొద రకాలు వున్నాయి. ఎక్కువగా పొద రకాలు సాగు చేస్తున్నారు.
తీగరకాలు :
పాదరకాలు :
కూరగాయ రకాలలో కొన్నింటిని రాజ్మా కొరకు పండిస్తారు. ఫ్రెంచి చిక్కుడు గింజలు వివిధ రంగులలో వుంటాయి. ప్రధానంగా నలుపు, ముదురు ఎరుపు, గోధుమ రంగు, నలుపు గింజలపై తెలుపు చుక్కలు, గోధుమ రంగుపై నల్లటి మచ్చలు గల రకాలున్నాయి. రాజ్మా కొరకు ప్రత్యేకంగా కొన్ని రకాలు విడుదల చేశారు.
20 - 24 కిలోలు/ఎకరాకు.
ఈ పంటసాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు మనరాష్ట్రంలో శీతాకాలంలో వుంటాయి. కనుక నవంబరు-డిసెంబరులో విత్తుకోవాలి. కొండ ప్రాంతాలలో ఫిబ్రవరి - మార్చి అనుకూలం. ఆలస్యమయితే ఉష్ణోగ్రత పెరిగి పెరుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది.
నేల అదనుకు వచ్చే వరకు బాగా దున్నాలి. బోదెలు తోలి వాటిపై విత్తనాన్ని విత్తుకోవాలి. వరుసల మధ్య 30 - 35 సెం.మీ. వరుసల్లో మొక్కల మధ్య 25-30 సెం.మీ. దూరం వుండాలి.
ఆఖరు దుక్కిలో 8 - 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు ఎకరానికి 10 కిలోల నత్రజని, 24 క్రిలోల భాస్వరం, 20 కిలోల పాటాష్ నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. మొదటిసారి ఈ పంటను వేసేట్లయితే నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. పూత సమయంలో ఎకరాకు 10 కిలోల నత్రజని ఎరువు పైపాటుగా వేయాలి.
కలుపు నివారణకు ఎకరానికి అలాక్లోర్ లేదా బ్యూటాక్లోర్ 800 గ్రా. మూలపదార్థం లేదా పెండిమిథాలి 1.2 లీ. చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి గింజలు విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి. తర్వాత 30-45 రోజులకు ఒకటి రెండుసార్లు గొప్ప త్రవ్వి మట్టి మొక్క మొదళ్ళకు ఎగదోయాలి.
నేల స్వభావాన్ని బట్టి 7 - 10 రోజుల కొకసారి నీటి తడులివ్వాలి. అధిక తేమ ఉండరాదు. పిందె దశలో కనీసం 50 శాతం తేమ వుండేటట్లు చూడాలి. లేనిచో పూత పిందె రాలిపోతుంది.
ఫ్రెంచి చిక్కుడు సాగులో వెర్రి తెగులు ప్రధాన సమస్య. ఈ వైరస్ తెగులు నివారణకు తెగులు వ్యాప్తి చేసే రసం పీల్చే పరుగులు ముఖ్యంగా తెల్లదోమను, పేనుబంకను నివారించాలి. అందుకు విత్తిన వెంటనే ఎకరానికి 6 కిలోల చొప్పన కార్యోప్యూరాన్ గుళికలు వేయాలి. డైమిధోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రానిల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడంతోపాటు వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి. తెగులు తట్టుకునే రకాలను సాగుచేయాలి.
కాయతొలుచు పరుగు నివారణకు ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
చివరగా పరుగులు, తెగుళ్ళ నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. డై ఫోల్టాన్ + 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 2 మి.లీ. మిథైల్ డెమిటాన్ లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి.
కూరగాయ కొరకు లేతకాయలను కోయాలి. గింజల కోసం కాయలు ముదిరి పూర్తిగా ఎండే ముందు మొక్కతో సహా పీకి ఎండబెట్టి గింజలు తీయాలి.
పొదరకాలు : 3, 6 - 40 ట/ఎ. తీగరకాలు : 4.8 - 6.0 ట/ఎ. అధిక దిగుబడినిసూ, పురుగులు మరియు తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపికచేసి, సకాలంలో విత్తుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/17/2020