శాస్త్రీయ నామము: కారిక పపాయ
కుటుంబము: కారికేసి
మన రాష్ట్రంలో బొప్పాయి సాగు వీస్తీర్ణం 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో వుంది.
బొప్పాయి అధికంగా అత్యధిక పోషక విలువలను కల్లింటుంది. దీనిలో విటమిన్ A అధికంగాను, విటమిన్ C ఒక మోస్తాదులో ఉండును. వీటితో పాటు Ca, Fe మరియు మొదలైన ఖనిజాలు అధికంగా వుంటాయి. దీనిని అనేక ఔషదాలలో కూడా వాడతారు. ముఖ్యంగా కడుపులోని అనేక వ్యాదులు బొప్పాయి వలన నివారించబడతాయి. బొప్పాయి పాల నుండి తీయబడిన పపయిన్ అనే ఎంజైమ్ను అనేక పరిశ్రమలలో మరియు మందుల తయారీలో వాడుతున్నారు.
బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. మనదేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్షా ఎనభైవేల ఎకరాలు, ఉత్పత్తి సుమారు 25 లక్షల టన్నులు. భారతదేశము బొప్పాయి విస్తీర్ణంలోను, దిగుబడిలోను ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి సుమారుగా 30 వేల ఎకరాలలో సాగు చేయబడుతూ ఎకరాకు 50 టన్నుల చొప్పన సగటు దిగుబడినిస్తోంది. అనంతపురం, కడప, మెదక్, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను, కోస్తా జిల్లాల్లో తక్కువ విస్తీర్ణంలోను సాగులో ఉంది.
బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 32" నుండి 38" సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12-14" సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకొనలేదు.
నీరు నిలవని సారవంతమైన ఎర్రగరపనేలలు, తేలికపాటి నల్లభూములు అనుకూలము. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7.0 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్లభూములు పనికిరావు.
బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ, మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు (ఏకలింగాశ్రయ జాతి), అదే విధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు (ద్విలింగాశ్రయ జాతి) ముఖ్యమైనవి. వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసాడ్వార్స్, పూసాజెయింట్, పూసానన్హ, హనిడ్యూ రకాలు ఏక లింగాశ్రయ జాతికి చెందినవి. కూర్ట్హనీడ్యూ, సోలో, కో-3, కో-7. పూసామెజిస్టీ, పూసా డెలీషియస్, తైవాన్ రెడ్ లేడి, సన్రైజ్సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవి.
బొప్పాయిని విత్తనం ద్వారానే వ్యాప్తి చేస్తారు. పండు నుండి తీసిన విత్తనాలను 45 రోజుల్లో విత్తుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వఉంచినట్లయితే విత్తనం మొలక సరిగా రాదు. పండు నుండి తీసిన విత్తనాలను వేరుచేసి శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి తరువాత నారుపోయాలి. నారు పోసుకొనుటకు ఎత్తైన నారుమడిని తయాచేసుకోవాలి. (2మీ x మీ x 20 సెం.మీ) తరువాత విత్తనాన్ని వరుసలలో 10-15 సెం.మీటర్ల ఎడంతో 2-3 సెం.మీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తనాలను మార్చి-ఏప్రిల్ నెలల్లో విత్తటం వలన జూన్-జూలై నెలల్లో నాటుటకు వీలుపడును. ఒక హెక్టారు భూమి నాటుటకు సుమారు 200-250 గ్రాముల విత్తనపు నారు సరిపోవును.గ్రెనోడైయిషియస్ రకాలకు 60-70 గ్రాముల విత్తనం అవసరం. నారు 15-20 సెం.మీటర్ల ఎత్తు పెరగగానే అంటే 2 నెలల్లో నాటడానికి తయారగును.
ఎకరాకు డైయిషియస్ రకాలకు 200 గ్రాములు, గైనోడైయిషియస్ రకాలకు 20 గ్రాముల విత్తనం కావాలి. విత్తనంను 22.5X15 సెం.మీ. - 150 గేజ్ మందం గల పాలిధిన్ సంచుల్లో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి.
భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్నాలి. దీని వలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వరాలకు గొర్రుతో 3-4సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటుచూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 X 40 X 40 సెం.మీ. గుంతలు తీసుకోవాలి. గుంతపై మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20గ్రా, అజోస్పిరిల్లమ్, 20గ్రా. ఫాస్ఫోబాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి.
45-60 రోజుల వయసున్న 15 సెం. మీ. పొడవున్న మొక్కలని గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడయిూషియన్ రకాలలో గుంతకు ఒక్క మొక్క డైయిూషియస్ రకాలలో మూడు మొక్కల చొప్పన నాటుకోవాలి. డైయిూషియస్ రకాలలో 4-5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 20 ఆడ మొక్కలకు ఒక మొక్క చొప్పన వదిలేసి, మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి.
బొప్పాయి మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 850గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. రెండు నెలలకొకసారి సంవత్సరంలో ఆరుసార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతులోప నివారణకు 5గ్రా. జింకుసల్ఫేటు+ 1గ్రా. బొరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5గ్రా. యూరియా, 10.5గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాలి.
తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా బోరాక్స్ మరియు 2 గ్రా జింకు సల్ఫేట్ కలిపి పిచికారి చేసుకోవాలి. అంతేకాక వైరస్ తెగుళ్ళు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారి చేసినచో ఆకులు విప్పారి దిగుబడులు పెరుగును.
హెక్టారుకు 20 కిలోల పశువుల ఎరువును భూమిలో వేసి బాగా దున్నాలి. ప్రతి మొక్కకు 250 గ్రాముల యూరియా, 250 గ్రాముల SSP, 500 గ్రాముల MOP, ఎరువులను ప్రతి 2 నెలలకు ఒకసారి చొప్పున మొక్కలు నాటిన 2 నెలల తర్వాత నుంచి ప్రారంభించి మొత్తం 6 మోతాదులుగా వేయవలెను.
సిఫారసు చేయబడిన ఎరువులను కరగబెట్టి, వడగట్టిన తరువాత ఫెర్టిగేషన్ ట్యాంకు లేదా పుట్ స్పేయర్ ద్వారా గాని, డ్రిప్ మొయిన్ పైపులోకి ప్రవేశ పెట్టాలి. భాస్వరపు ఎరువుని సూపర్ ఫాస్పేట్ రూపంలో ప్రతి రెండు నెలలకొకసారి 260గ్రా. చెట్టుపాదిలో కలపాలి.
పంట దశ |
యూరియా (గ్రా./మొక్కకు) |
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (గ్రా./మొక్కకు) |
నాటినప్పుడు |
20 |
20 |
నాటిన 5-8 వారంల మధ్య |
30 |
30 |
9-13 వారంల మధ్య |
40 |
30 |
13-16 వారంల మధ్య |
50 |
30 |
17-20 వారంల మధ్య మరియు ఆ పైన ప్రతి నెలకు |
50 |
90 |
మొక్క మొదళ్ళ దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిలవ ఉండకుండా పిల్లపాదులు(డబుల్రింగ్ పద్ధతి) తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చును. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజుల కొకమారు 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20-25 లీటర్ల నీటిని అందునట్లు డ్రిప్పర్లను అమర్చుకోవాలి. వరా కాలంలో అవసరంను బట్టి నీరు అందించాలి.
మొక్కలు నాటిన 4-5 నెలల నుంచి పూత కాత ప్రారంభమగును. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పండు కొద్దిగా పసుపు రంగుకు మారినపుడు బొప్పాయిని కోయవలెను. పండ్లు సంవత్సరం పొడవునా వచ్చును. కాయలను ಮುಟ್ತಿಲ మీద మాగనివ్వరాదు. నాటిన 9 వ నెల నుండి 21/2 సంవత్సరాల వరకు పండునిస్తుంది. దిగుబడి ఎకరంకు 21-30 టన్నుల వరకు వుంటుంది.
వీటి నివారణకు అంతర్వాహిక క్రిమిసంహారిక మందులైన డైమిధోయేట్ లేదా మిధైల్ డెమటాన్ లేదా ఫిప్లోనిల్ లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
వైరస్ తెగుళ్ళను రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పెనుబంకలు వ్యాప్తి చేయును. అంతర్వాహిక కీటక నాశనులు ఉపయోగించి వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని ఆరికట్ట వచ్చును.
నివారణ : తోటలను శుభ్రంగా వుంచుకోవాలి. చెట్లక్రింద పడిపోయిన, చెట్లపైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిథైల్ యూజినాల్ ఎరను ఉపయోగించి ఆకర్షింపబడిన మగ పురుగులను నాశనం చేయాలి. 1 మి.లీ. మిథైల్యూజినాల్, 2 గ్రా కార్బోప్యూరన్ ఒక లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. ఒక లీటరు మందు ద్రావణాన్ని ఐదు సమానభాగాలుగా చేసి, ఒక్కొక్క ప్లాస్టిక్ పల్లెంలో 200 మి.లీ. మందు ద్రావణాన్ని పోసి పొలంలో అక్కడక్కడ వుంచాలి.
మంచి సైజు వచ్చిన కాయలను మొక్కమీద మాగనీయరాదు. వాటిని కోసి, న్యూస్ పేపర్తో చుట్టి రవాణా చేసుకోవాలి. నాటిన 9 వ నెల నుండి రెండున్నర సంవత్సరంల వరకు పంటనిస్తుంది. ద్విలింగ పుష్పాల నుండి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా వుంటాయి. అదే ఆడ పుష్పముల నుండి ఎదిగే కాయలు పొడవుగా, కోలగా ఉంటాయి. దిగుబడి ఎకరాకు 25 నుండి 30 టన్నుల వరకు ఉంటుంది.
70 నుండి 90 రోజుల వయసున్న కాయకు పొడువునా 4 వైపుల 3 మి. మీ. లోతు వుండేలాగా పదునైన వెదురు పుల్లతో గాటు పెట్టాలి. ఉదయం 8-9 గంటలలోపు చేయాలి. కొబ్బరి చిప్పలలోగాని, అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో ఈ కారే పాలను సేకరించాలి. ఒక కాయనుండి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి, లీటరు పాలకు 0.5 శాతము పొటాషియం మెటాబైసల్ఫేట్ను కలిపి 38o సెల్సియస్ కన్నా తక్కువ వున్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి. పాలని పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తని పొడిగా చెయ్యాలి. దీనిని పాలిథీన్ సంచుల్లో నిల్వచేసుకోవచ్చు. జూలై-ఆగష్టు నెలల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. క్రో-2, క్రో-5 రకాలు 'పపెయిన్ తీయటానికి అనువైనవి. ఒక మొక్కనుండి సంవత్సరానికి 500-700 గ్రా. ఎండు పపెయిన్ లభ్యమవుతుంది.
బొప్పాయి నుండి పపయిన్ సేకరణ వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యమయినది. బొప్పాయి నుండి వచ్చే తెల్లని జిగురు (పాలు) ను ఎండనిచ్చి పొడిచేస్తే వచ్చేదే పపయిన్ దీనిని చూయింగ్ గమ్ తయారుచేయుటకు పండ్ల రసాలను శుద్ధి చేయుటకు మరియు మాంసాన్ని మృదువు పర్చడానికి ఉపయోగిస్తారు.
మొక్కలు నాటిన 4-5 నెలల నుంచి పూత కాత ప్రారంభమగును. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పండు కొద్దిగా పసుపు రంగుకు మారినపుడు బొప్పాయిని కోయవలెను. పండ్లు సంవత్సరం పొడవునా వచ్చును. కాయలనమీద మాగనివ్వరాదు. నాటిన 9 వ నెల నుండి 21/2 సంవత్సరాల వరకు పండునిస్తుంది. దిగుబడి ఎకరంకు 21-30 టన్నుల వరకు వుంటుంది.
బొప్పాయి సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : "సీనియర్ సైంటిస్ట్ (హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతరాజుపేట - 516 105, కడప జిల్లా", ఫోన్ నెం. 08566-200218
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/29/2023