অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వంగ

ఆంధ్రప్రదేశ్లో వంగ 26,564 హెక్షార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ, 5,31,280 టన్నుల దిగుబడినిస్తుంది.

వితే సమయం (నారుకోసం)

వర్షాకాలపు పంట : జూన్-జూలైలో, శీతాకాలపు పంటను అక్టోబర్-నవంబరులో, వేసవి కాలపు పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నారు కోసం విత్తవచ్చు.

నారునాటుకునే సమయం

30-35 రోజుల నారును నాటుకోవాలి. వర్షాకాలం నారును జూలై-ఆగష్టులో చలికాలం నారును నవంబర్–డిసెంబరులో, వేసవికాలం నారును ఫిబ్రవరి-మార్చి మొదటివారంలో నాటవచ్చు.

నేలలు

బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు.

విత్తనం

ఎకరాకు సూటి రకాలకు 260 గ్రా., సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాలి.

రకాలు

ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసాపర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబి రకాలు, తెలంగాణా ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు, రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారల వంగ (రాయదుర్గ) రకాలు అనుకూలం.

సంకరజాతి రకాలు:

ఊదారంగు గుండ్రటి రకాలు : అర్మనవనీత్, పూసా హైబ్రిడ్-6, మహికో హైబ్రిడ్ నెం. 2, నెం. 54 ఉత్కర మోహిని, అగోరా, మంజు,  సంజు, మ్యూ-మ్యూ.

ఊదారంగు గుత్తి రకాలు : మహికో-రవయ్య, మహికో హైబ్రిడ్ నెం. 3

ఊదారంగు పొడవ రకం : పూసా హైబ్రిడ్-5

పచ్చటి పొడవు రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 9, గ్రీన్ లాంగ్, హరిత, హరిత్ర, బి.హెచ్. —0028,-1311, -1444

పచ్చటి గుండ్రటి రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 56, గ్రీన్ బంచ్

ఊదారంగు చారల రకాలు : కల్పతరు, మహికో హైబ్రిడ్ నెం. 11, 16

రకాల వివరాలు

రకం

పంటకాలం (రోజుల్లో)

గుణగణాలు

దిగుబడి (ట/ఎ)

భాగ్యమతి

150 – 165

నీటి ఎద్దడిని, కాయ తొలుచు పురుగు మరియు వెర్రితల వైరస్ తెగులును బాగా తట్టుకొంటుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి అనుకూలం.

12 - 14

శ్యామల

130 – 150

మసాలా వంటకాలకు ప్రశస్త్రి. తెలంగాణా ప్రాంతానికి అనువైనది.

6.5 – 8.0

గులాబి

140 – 160

కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి, 3-4 కాయలు గుత్తులుగా so ఆకర్పనీయంగా లేత గులాబి రంగులో నిగనిగలాడుతుంటాయి. తెలంగాణా, కోస్తా ఆంధ్రలకు అనుకూలం.

13 - 14

పూసాపర్పుల్ క్లస్టర్

135 – 140

కాయలు ఊదారంగులో వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎండుతెగులును బాగా తట్టుకొంటుంది.

12 - 16

పూసాపర్పుల్ లాంగ్

134 - 140

కాయలు పొడవుగా (25-30 సెం.మీ.) ఊదారంగులో నవనవలాడుతూ ఉంటాయి.

12 - 16

పూసాక్రాంతి

135 - 150

కాయలు కొంచెం లావుగా మధ్యస్థ పొడవుతో వుండి ఊదారంగులో ఆకర్షణీయమైన ఆకుపచ్చ తొడిమకల్లి ఉంటాయి.

14 - 16

నేల తయారి

నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం మరియు వేసవి పంటకు 4X5 చమీ. మళ్ళను తయారు చేసుకోవాలి.

నారుమడి పెంపకం

6 అంగుళాలు ఎత్తు ఉండే 1X4 మీ. సైజుగల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకు 10-12 నారుమళ్ళ నారు సరిపోతుంది. 260 గ్రా, విత్తనాన్ని 10 సెం.మీ. వరుసల్లో విత్తుకోవాలి. అయితే వితే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పన ధైరామ్ లేదా మాంకోజెబ్ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రా. ల చొప్పున టైకోడెర్మా విరిడి కల్బర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తరువాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే (మాగుడు తెగులు వరాలు ఎక్కువగా ఉ న్నపుడు నీరు మళ్ళలో నిలిచనపుడు ఆశిస్తుంది. మొక్కల మొదళ్ళ వద్ద కుళ్ళి నారు చనిపోతుంది. నారు ఏ దశలోనయినా ఈ తెగులు ఆశిస్తుంది. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పన కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాలి. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి.

నాటే దూరం

పొడవుగా, నిటారుగా పెరిగే రకాలకు (పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండు, భాగ్యమతి, శ్యామల) 60x60 సెం.మీ. గుబురుగా పెరిగే రకాలకు (పూసా క్రాంతి, అర్క కుసుమాకర్, గులాబి) 75x50 సెం.మీ. దూరం పాటించి నాటాలి.

ఎకరాకు 200 కిలోల చొuన వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొuన బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పన కార్బోప్యరాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి.

ఎరువులు

ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్ఫేట్), 24 కిలోల పొటాష్లనిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా), 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ, 60వ మరియు 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సివుంటుంది.

కలుపు నివారణ, అంతరకృషి

విత్తిన లేదా నాటిన 24-48 గంటలలో అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.5 లీటర్లు చొప్పన (బరువు నేలలకు) ఎకరాకు పిచికారి చేయాలి. నాటిన 25, 30 రోజులప్పడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి గొప్పత్రవ్వి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.

నీటి యాజమాన్యం

నాటేముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకొకసారి, వేసవిలో 4-5 రోజులకొకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మరుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.

సస్యరక్షణ

పురుగులు

 1. మొవ్వ మరియు కాయతొలుచు పరుగు : నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వను, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లు త్రుంచి వేసి నాశనం చేసి కార్బరిల్ 50% డబ్ల్యు.పి. 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా సైపర్ మెత్రిన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారి చేయాలి.
 2. రసం పీల్చే పరుగులు (దీపపు పరుగులు, పేనుబంక, తెల్లదోమ) : ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయటం వలన ఆకులు పసుపురంగుకు మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిధోయేట్ లేదా మిధైల్డెమెటాన్ లేదా ఫిప్రానిల్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పన కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్న ఎడల ఎసిఫేట్ 1.5 గ్రా, చొన లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 3. ఎర్రనల్లి : ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలె గూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటిలో కరిగే గంధకం 8 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పెరోమెసిఫెరాన్ 3 మి.లీ. లేదా ప్రాపర్గైట్ 3 మి.లీ. చొప్పన కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
 4. నుటి పరుగులు (రూట్నాట్ నెమటోడ్స్) : ఈ పురుగులు ఆశించిన పంట వేర్లపై వేరు బుడిపెలుకనబడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా, తక్కువ కాయలు కాస్తాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో వంగను ఆశిస్తాయి. వీటిని తట్టుకొనే రకాలైన బ్లాక్ బ్యూటీ, విజయ (హైబ్రిడ్), బనారస్ జెయింట్, టి-2లను సాగుచేయాలి. పొలంలో నులి పరుగుల సంతతిని తగ్గించటానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో ఒక ఏడాదిపాటు బంతిపూల పంటతో పంటమార్పిడి చేయాలి.

తెగుళ్ళు

 1. ఆకుమాడు తెగులు : నారును పొలంలో నాటిన తర్వాత షుమారుగా 30 రోజులకు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినపుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపురంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బండైజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
 2. ఆకుమాడు మరియు కాయకుళ్ళ తెగులు : ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపురంగుకు మారి, కుళ్ళిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తేముందు 50" సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో విత్తనాలను 30 ని. పాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రా, చొప్పన కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంకాల సమయంలో పిచికారి చేయాలి.
 3. వెర్రితెగులు (లిటిల్ లీఫ్) : ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కల్లి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనపడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. ఈ వైరస్ని పచ్చదోమ వ్యాపింపచేస్తుంది. తెగుళ్ళను వ్యాపింప చేసే పచ్చదోమల్ని మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలి. తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి నాశనం చేయాలి. నారుమడి దశలో నాటటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత 2వ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పన ఇవే గుళికల మందును వేయాలి నాటేముందు నారువేళ్ళను 1000 పి.పి.యమ్. టెట్రాసైక్లిన్ ద్రావణంలో మంచి నాటుకొని, నాటిన 4-5 వారాల తర్వాత 7-10 రోజుల వ్యవధిలో రోగార్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి 3 సార్లు పిచికారి చేయాలి. పొలంలో వెర్రి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి జిబ్బరిల్లిక్ ఆమ్లం 50 మి.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసిన కొంత వరకు తెగులు ఉధృతి తగ్గుతుంది.
 4. ఎండు తెగులు (బాక్టీరియల్ విల్డ్) : ఈ తెగులుకు తగిన నివారణ చర్యలు లేవు. ఈ తెగులును తట్టుకొనే పూసాపర్పుల్ క్లస్టర్ లేదా పూసా క్రాంతి రకాలను ఎన్నుకొని తప్పని సరిగా పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి. కాలీష్టవర్ పంటతో పంట మార్పిడి చేసుకోవాలి.

వంగలో సమగ్ర సస్యరక్షణ

 • పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
 • అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి.
 • లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 4 చొప్పన పెట్టాలి.
 • తలనత్త ఆశించిన కొమ్మలను పరుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం క్రిందికి తుంచి నాశనం చేయాలి.
 • అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొuన పంట పెరిగే దశలో విడుదల చేయాలి.
 • టైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొuన విడుదల చేయాలి.
 • బి.టి. మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పన కలిపి పూతదశలో పిచికారి చేయాలి.
 • ఎకరాకు 200 కిలోల చొuన వేపపిండిని దుక్కిలో వేయాలి.
 • బాక్టీరియా ఎండుతెగులు వున్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొuన బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి.
 • టైకోడెర్మా విరిడి కల్బర్ను ఎకరాకు 2-3 కిలోల చొuన దుక్కిలో వాడాలి. అయితే ఒక కిలో టైకోడెర్మా విరిడి కల్చర్ను 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10-15 రోజుల నీడలో ఉంచి అప్పడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంధ్రం దానిలో బాగా అభివృద్ధి చెందుతుంది. దీని వాడకం వలన భూమి నుండి ఆశించే ఎండు, కుళ్ళు తెగుళ్ళను నివారించవచ్చు.
 • రసం పీల్చు పరుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పన కార్బోఫ్యురాన్ గుళికలను వేసుకోవాలి.
 • 2 మి.లీ. ఎండోసల్ఫాన్ లేదా 0.5 మి.లీ. సైపర్మెత్రిన్ లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా థయోడికార్చ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి కాయతొలుచు పరుగులను నివారించుకోవాలి.
 • పంట పూత, కాత దశలో 2, 4-డి (10 మి.గ్రా. లీటరు నీటికి) లేదా నాప్టలీన్ అసిటికామ్లం 1 మి.లీ. 5 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేస్తే 15-20% అధికోత్పత్తి పొందవచ్చు.

వంగ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : "సీనియర్ సైంటిస్ట్ (హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతరాజుపేట - 516 105, కడప జిల్లా", ఫోన్ నెం. 08566-200218

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/21/2023© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate