অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేరుశనగ

వేరుశనగ

విత్తే సమయం

ప్రాంతం

ఖరీఫ్

రబీ

ఉత్తర కోస్తా

జూన్ – జూలై

నవంబరు 1 నుండి డిసెంబరు 15 వరకు

రాయలసీమ (దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాలు

జూలై – ఆగష్టు 15

నవంబరు నుండి డిసెంబరు 15 వరకు

ఉత్తర తెలంగాణతా

జూన్ – జూలై

సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు

దక్షిణ తెలంగాణతా

జూలై – ఆగష్టు 15

అక్టోబరు 15 నుండి నవంబరు 30 వరకు

నేలలు

ఇసుకతో కూడిన గరపనేలలు శ్రేష్టం. చల్కా మరియు ఎర్ర గరపనేలలు కూడా అనుకూలం. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6.0 - 7.5 మధ్య గల నేలలు శ్రేష్టం. ఎక్కువ బంక మన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయరాదు.

రకాలు

అనుకూలత

రకం

పంటకాలం (రోజుల్లో)

ఖరీఫ్ అత్యల్ప వర్షపాతం, బెట్ట (300-500 మి.మీ.)

కదిరి-5, 6, 9, కదిరి హరితాంధ్ర కదిరి అనంత, నారాయణి, వేమన, అభయ, ఐసిజివి–91114, ధరణి

105-110

కొద్దిపాటి నీటి వసతి

కదిరి-5, 6, 9 నారాయణి, కాళహస్తి, గ్రీష్మ రోహిణి కదిరి హరితాంధ్ర, ధరణి

100-110

అధిక వర్షపాతం (500 మి.మీ. అంతకన్న ఎక్కువ)

అభయ, కాళహస్తి, ధరణి, కదిరి-9, కదిరి హరితాంధ్ర

105-110

టి.ఏ.జి.-24

105-115

ఆకుమచ్చ తెగులు తట్టుకొనుట

అభయ, కదిరి-5, 9, కదిరి అనంత, ధరణి

105-110

కాళహస్తి తెగులు తట్టుకొనుట (చిట్టికాయ తెగులు)

కాళహస్తి, ప్రసూన, ధరణి, కదిరి హరితాంధ్ర, కదిరి-9

100-105

110-115

వర్షం ఆలస్యమైనప్పుడు

కదిరి-4, 5, 6, 9, నారాయణి, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత

90-100

రబీ - నీటివసతి క్రింద

కాళహస్తి, జి.జి.-2, కదిరి-5, 6, 9, గ్రీష్మ

105-110

నారాయణి, ధరణి

100-105

కదిరి-4, టి.ఎ.జి.-24. రోహిణి

95-105

కదిరి -9, కదిరి హరితాంధ్ర

120-105

వరికోత తర్వాత

కదిరి–4, 5, 6, 9, టి.ఎ.జి-24, ధరణి

96-100

లావుగింజ రకాలు

(ఖరీఫ్, రబీ నీటివసతి క్రింద)

కదిరి-7 బోల్డు, కదిరి-8 బోల్డు,

భీమ

120-135

110-115

నేల తయారి

వేసవిలో లోతు దుక్కలు చేయడం వలన పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. వితే ముందు నేలను మొత్తగా దుక్కిచేసి చదును చేయాలి.

విత్తన మోతాదు

గింజ బరువు మరియు వితే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది.

రకం

వొలిచిన గింజలు (కిలోలు/ఎకరాకు)

ఖరీఫ్

రబీ

కాయలు

గింజలు

కాయలు

గింజలు

కదిరి 4,6,7,8, నారుమడి, ఇ.సి.జి.యస్-44, కాళహస్తి, అభయ, ప్రసూన, గ్రీష్మ, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత

90

60

110

75

కదిరి-5,9, ఐ.సి.జి.యస్-11, టి.వి.జి-24

75

50

90

60

విత్తన శుద్ధి

కిలో విత్తనానికి ఒక గ్రా, టెబుకొనజోల్ 2 డి.యస్. లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేక 2 గ్రాముల కార్బండజి మ్ పొడి మందును పట్టించాలి. కాండము కుళ్ళ వైరస్ తెగులు (పిఎస్ఎన్డి) ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. వేరుపరుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడా —క్లోప్రిడ్ చొప్పన కలిపి శుద్ధి చేయాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చ రుని పట్టించాలి. మొదలు కుళ్ళు, వేరుకుళ్ళ, కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 4 గ్రా ముల టైకోడెర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత శిలీంధ్రనాశని తో శుద్ధి చేయాలి. అవసరమైతే రైజోబియం కల్చరును కూడ విత్తనాలకు పట్టించవచ్చు.

నిద్రావస్థను తొలగించటం

నిద్రావస్థగల రకాల (కదిరి-7, 8, 9) విత్తనాన్ని 5 మి.లీ. ఇథరిల్ (100%) ను 10 లీటర్ల నీ టిలో కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి లేదా మార్కెట్లో దొరికే ఎల్లోపాన్ (39 %), 125 మి.లీ. మూడు లీటర్ల నీటిలో కలిపి 100 కిలోల విత్తనంపై పిచికారీ చేసి గాలి దూరని సంచులలో ఒక రాత్రి (12 గంl) వుంచి, మరుసటి రోజు ఉదయమే నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

విత్తే దూరం

రకం

వర్షాధారపు పంట ఖరీఫ్

నీటిపారుదల క్రింద రబీ పంట

గుత్తి రకాలు : కదిరి - 4, 5, 6, 9, అభయ, ప్రసూన, గ్రీష్మ

30 X 10 సెం.మీ.

22.5 X 10 సెం.మీ.

గ్రీష్మ తీగ/పెద్ద గుత్తిరకాలు : ఐ.సి.జి.యస్. 11, 44 కదిరి-7 బోల్డ్, కదిరి-8 బోల్డ్

30 X 15 సెం.మీ.

22.5 X 15 సెం.మీ.

విత్తటం

విత్తనాన్ని గొర్రుతోగాని లేక నాగలి చాళ్ళలోగాని లేక ట్రాక్టరుతో నడిచే విత్తు యంత్రముతో గాని విత్తాలి. విత్తే సమయంలో నేలలే తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టరు డ్రిల్ను వాడినటైతే త క్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణములో విత్తుకోవడమేకాక, ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చును.

రకాల గుణగణాలు

జె.సి.జి – 88

రకం

గుణగణాలు

గింజ శాతం

నూనె శాతం

దిగుబడి (కి/ఎ)

కదిరి-4

మొక్కలు పొట్టిగా ఉండి కాయలన్నీ తల్లి వేరుచుటూ ఉంటాయి. నిద్రావస్థ లేదు. రబీకి బాగా అనుకూలం. తక్కువ పంటకాల పరిమితి 90 రోజులు కలిగినది. ఆకుమచ్చ, వేరుకుళ్ళ తెగుళ్ళను తట్టుకోలేదు. వరాలు ఆలస్య మైనప్పడు వేసుకొనడానికి మంచి రకం.

70.0

48.0

రబీ- 1400-1600

కదిరి-5

చిన్న గుత్తిరకం. తక్కువ పంటకాలం (100 రోజులు) కలిగినది. ఊడలు గట్టిగా వుండి బెట్టను తట్టుకొంటుంది. రబీకి అనుకూలమైనది.

72.0

48.0

ఖరీఫ్- 720-820

రబీ – 1400-1600

కదిరి-6

చిన్న గుత్తిరకం. పంటకాలం 100 రోజులు. గింజ పరిమాణం జె.యల్. —24 కంటే 5% పెద్దదిగా ఉంటుంది.

72.0

48.0

ఖరీఫ్- 820-880

రబీ – 1600-1700

కదిరి-7 బోల్డు

పెద్ద గుత్తి రకం. ఆకుమచ్చ తామర పురుగులను తట్టుకొంటుంది. లావు గింజల రకం. వంద గింజల బరువు 65-70 గ్రా. నీటి వసతి ఉన్న సారవంతమైన ప్రాంతాలకు అనువైన రకం. 40 రోజుల వరకు నిద్రావస్థ కలదు. పంటకాలం - ఖరీఫ్లో 120-125 రోజులో రబీలో 130-135 రోజులు.

70.0

49.0

ఖరీఫ్- 820-880

రబీ – 1600-1700

కదిరి-8 బోల్డు

పెద్ద గుత్తిరకం. తామర పురుగులను తట్టుకుంటుంది. లావు గింజల రకం. వంద గింజల బరువు 70-75 గ్రా. సారవంతమైన నేలలు, నీటివసతి ఉన్న ప్రాంతాలకు అనువైన రకం. 40 రోజుల నిద్రావస్థ కలదు. పంటకాలం ఖరీఫ్ లో 115-120 రోజులు, రబీలో 125–130 రోజులు.

70.0

49.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1800-2000

కదిరి-9

చిన్న గుత్తి రకం. వరాభావ పరిస్థితులను, బెట్టను బాగా తట్టుకొంటుంది. అకుమచ్చ, వేరుకుళ్ళు తెగుళ్ళను, రసం పీల్చే పచ్చదోమ, తామర పురుగులు, నులిపురుగు, ఎర్రనల్లిని తట్టుకొంటుంది. నిద్రావస్థ 30 రోజులు. పంటకాలంఖరీఫ్ 105-110 రోజులు, రబీ 115-120.

80.0

52.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1600

కదిరి హరితాంధ్ర

బెట్టను, ఆకుమచ్చ తెగులును, తామర పురుగులను తట్టుకుంటుంది. పక్వదశ వరకూ ఆకుపచ్చగా ఉండి, ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది.

70.0

48.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1600

అనంత

చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను, ఆకుమచ్చ తెగులును, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. పంటకాలం : ఖరీఫ్ 105-110 రోజులు, రబీ : 1400-1800, రబీలో 110-120 రోజులు.

75.0

 

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1800

తిరుపతి-4

గింజలు టి.యం.వి.-2 మరియు తిరుపతి-1 కన్నా పెద్దవిగా ఉండి రబీకి అనువైనది.

75.0

49.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1800

నారాయణి

చిన్న గుత్తిరకం. ఆకుమచ్చ తెగులును తట్టుకొంటుంది. రబీకి కూడ అనువైనది. మొక్కలో అన్ని కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజలు లేత ఎరుపు రంగులో ఉంటాయి.

76.0

49.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1800

కాళహస్తి

కాళహస్తి కాళహస్తి తెగులును తట్టుకోలేని గుత్తి రకాలకు బదులుగా సాగు చేయవచ్చు. పొట్టి రకము.

76.0

52.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1400-1800

అభయ (టిసిజియసే-25)

చిన్న గుత్తిరకం. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. తిక్కా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. 105-110 రోజులు పంటకాలం.

76.0-77.0

52.0

ఖరీఫ్- 900-1000

రబీ – 1400-1600

ప్రసూస

చిన్న గుత్తిరకం. 105-110 రోజులలో కోతకు వస్తుంది. కాళహస్తి (చిట్టికాయ) తెగులును తట్టుకొంటుంది.

76.0

50.0

రబీ – 1350-1400

గ్రీష్మ

గ్రీష్మ చిన్న గుత్తి రకం. బెట్టను తట్టుకొంటుంది. 100 రోజుల స్వల్పకాలిక రకం. నీటి వినియోగ సామర్థ్యము ఎక్కువ.

76.0

52.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1600-1800

రోహిణి

చిన్న గుత్తి రకం. నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ, బెట్టను తట్టుకొంటుంది. తక్కువ కాలపు రకం. ఖరీఫ్ 90-95 రోజులు, రబీ 100 రోజులు

78.0

50.0

ఖరీఫ్- 800-1000

రబీ – 1000-1800

భీమ

భీము చిన్న గుత్తిరకం, లావు గింజలు కలిగి యుంటుంది. పంటకాలం : 110- 115 రోజులు. నీటి వసతి గల ప్రాంతాలకు అనువైన రకం

72.0

45.0

1000-1200

భరణి

చిన్న గుత్తిరకం. బెట్టను తట్టుకొంటుంది. 100-105 రోజుల పంటకాలం. మొక్కలు మధ్యస్థముగా ఉంటాయి.

75.79

49.0

ఖరీఫ్- 600-1000

రబీ – 1500-1700

ఐ.సి.జి.యస్-11

పెద్ద గుత్తిరకం. మొవ్వకుళ్ళు తెగులును తట్టుకొంటుంది.

70.0

48.0

ఖరీఫ్- 800

రబీ – 1200

టి.ఎ.జి. 24

చిన్న గుత్తిరకం. రబీకి అనువైన రకం. మొక్కలు పొట్టిగా ఉంటాయి. 95-100 రోజులు పంటాలము.

74.0

48.0

రబీ – 1600-1800

ఐ.సి.జి.ఐ. 91114

తొందరగా పంటకు వస్తుంది. పంట మధ్యకాలము, ఆఖరి దశలో వచ్చే బెట్టను తట్టుకొంటుంది. 100 రోజులు పంటకాలము.

75.0

48.0

ఖరీఫ్- 800-900

రబీ – 1400-1600

వేమన

చిన్న గుత్తిరకం. వర్షాధార పరిస్థితులను, ఆకుమచ్చ తెగులును తట్టుకొంటుంది. నిద్రావస్థ కలదు. భూమిలోకి పోయే ఉడలు గట్టిగా వుండి కాయలు తెగిపోకుండా వుంటాయి. కోత వరకు ముదురాకుపచ్చగా వుంటాయి. ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది.

77.0

49.0

ఖరీఫ్ : 720 – 1040

రబీ : 1400 - 1600

జె.సి.జి – 88

చిన్న గుత్తి రకం. ఆకుమచ్చ తెగులుకు నిరోధక శక్తి కలిగి ఉన్నది.

74.0

48.0

ఖరీఫ్ :600

రబీ : 1000 – 1200

జె.ఎల్ – 24

మంచి వర్షపాతం మరియు నీటి వసతి వున్న ప్రాంతాలకు అనువైనది. గింజలు పెద్దవిగా ఉండి ఒకేసారి కాయ పక్వత వుంటుంది. విద్రావస్థ వుండదు. అత్యల్ప వర్షపాత ప్రాంతానికి అనువైనది కాదు. ఆకుమచ్చ తెగులుకు తట్టుకోలేదు.

75.0

47.0

ఖరీఫ్ : 600 - 720

రబీ : 1400 - 1520

టి.ఎం.వి – 2

అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా అత్యల్ప వర్షపాత ప్రాంతాలకు అనువైనది. నిద్రావస్థ ఉండదు. ఆకుమచ్చ తెగులును తట్టుకోలేదు.

76.0

49.0

ఖరీఫ్ : 480 - 600

రబీ : 1200 - 1400

ఎరువులు (ఎకరాకు కిలోల్లో)

భూసార పరీక్షననుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా వేరుశనగకు ఈ క్రింది మోతాదు ఎరువులు అవసరం.

ఎరువు

వర్షాధారపు పంటకు (కి.గ్రా)

నీటిపారుదల పంటకు (కి.గ్రా)

నత్రజని (యూరియా రూపంలో)

8

12

భాస్వరం (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో)

16

16

పొటాష్ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో)

20

20

జిప్పం

200

200

జింక్ సల్ఫేట్ (లోపమున్న నేలలకు ప్రతి మూడు పంటలకు ఒకసారి)

10

20

ఆఖరు దుక్మిలో ఎకరాకు 4-5 టన్నుల సేంద్రీయ ఎరువు వేయాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే లే,కోవాలి. వర్బాధారప పంటకు ఎకరానికి 100 క్రిలోల సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరి యు 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. నీటిపారుదల పంటకు ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్మిలో వేయాలి. అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలో, 9 కి లోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో వేసుకోవాలి.

నీటిపారుదల క్రింద ఎకరానికి 200 కిలోల జిప్సంను తొలి పూత సమయంలో మొక్కల మొదళ్ళ దగ్గర చాళ్ళలో వేసి క లుపుతీసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. వరాభావ పరిస్థితుల్లో జిప్సంను వూడలు దిగే సమయం (విత్తిన 45 రోజులు ) లో అనగా రెండవ కలుపు తీసే సమయంలోనే వేయాలి. విత్తిన 45 రోజుల తరువాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు. విత్తుకునే సమయంలో ఎరువులు నేరుగా నేలలో పడేటట్లు విత్తనం మరియు ఎరువు గొర్రుతో గాని వేసుకున్నట్లయితే ఎరువులను విత్తనం కంటే 2.5 సెం.మీ లోతుగా వేసుకోవాలి.

సూక్ష్మపోషక పదార్థ లోపాలు - సవరణ

జింకు లోపించిన పైరు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారతాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రా, ల చొప్పన జింక్సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇనుముధాతు లోపం న ల్లరేగటి నేలల్లో అధిక తేమ ఉన్నప్పడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపుపచ్చగాను తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 1 కిలో అన్నభేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. నీటి పారుదల క్రింద సాగుచేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ను విత్తేటప్పడు వేయాలి. బోరాన్ గింజల అభివృద్ధికి అవసరం.

కలుపు నివారణ, అంతర కృషి

కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశినులైన అలాక్లోర్ 50% ఎకరాకు ఒక లీటరు లేదా పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 - 1.6 లీ. లేదా బుటాక్లోర్ 50% 1.25 - 1.5 లీ. చొప్పన ఏదో ఒ కదానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనేగాని లేదా 2-3 రోజుల లోపల నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20, 25 రో జలప్పడు గొర్రుతో అంతరకృషి చేయాలి మరియు మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. విత్తన 45 రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏవిధమైన అంతరకృషి చేయరాదు లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది.

విత్తిన వెంటనే కలుపనాశినిని వాడలేకపోయిన లేదా 20 రోజులప్పడు కలుపు తీయడానికి కూలీలు దొరకని పరిస్థితుల గ్లో పైరులో మొలిచిన కలుపును కలుపు నాశినులతో నిర్మూలించుకోవచ్చు. విత్తిన 21 రోజులలోపు కలుపు 2-3 ఆకుల దశలో వున్నప్పడు ఇమాజెతఫిర్ 10% మందును ఎకరాకు 300 మి.లీ. లేదా క్విజలోఫాప్ ఇథైల్ 5% మందును 300 మి.లీ. చొప్ప న 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్ళ మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి కలుపును నశింపచేయవచ్చు. దీనివల్ల పైరుకు ఎటువంటి నష్టం కలగకుండా కలుపు నాశనం అవుతుంది.

నీటి యాజమాన్యం

వర్షాధార పంటకు పైరు మొలచిన 15-20 రోజులలోపు ఎకరాకు 5 టన్నుల వేరుశనగ పొట్టును పొల ంపై పరచాలి. బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నం లీటరు నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారి చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్టనుండి పైరు త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పిచికారీ చేయాలి.

వేరుశనగకు 400-450 మి.మీ. నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 8-9 తడులు పెడితే సరిపోతుంది. విత్తేమం దు నేల బాగా తడిసేటట్లు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పడు విత్తనం వేయాలి. రెండవ తడిని విత్తిన 20-25 రోజులకు (వె మొదటి పూతదశలో) ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7-10 రోజుల వ్యవధితో పెట్టాలి. ఆఖరి తడి, పంటకోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశనుండి కాయలు ఊరే దశవరకు (విత్తిన 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు) సున్నితమైనది, కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని తుంపర్లు (స్ప్రింకర్లు) ద్వారా ఇచ్చినటైతే 25 శాతం సాగు నీటి ఆదాతోపాటు దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో సాగు చేయున ప్పడు 90X90 సెం.మీ దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని, కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి 10 మి. మీ నీరు ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి రెండు రోజులకు ఒక తడి 10 మి.మీ చొప్పన ఇవ్వాలి.

పంటల సరళీ

కంది, ఆముదం, సజ్జ మరియు జొన్న పంటలను వేరుశగనతో పంటమార్పిడి చేయవచ్చు. వర్షాధార వేరుశన గ పంటలో ప్రతి 7 వేరుశనగ సాళ్ళకు ఒక కంది లేక ఒక ఆముదం సాలు వేసినచో నికరాదాయం అధికంగా ఉంటుంది. ప్రతి ఆరుసాళ్ళ వేరుశనగకు రెండు సాళ్ళ సజ్ఞను కూడ వేసుకోవచ్చు. సజ్జ, జొన్న అంతర పంటగా వేసుకోవడం వలన వేరుశనగలో తామర పురుగుల ఉధృతి తగ్గి వైరస్ వ్యాప్తి కొంతవరకు తగ్గును. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ వే రుశనగ తర్వాత పెసలు లేదా ఉలవలు వేసుకోవచ్చు. వేరుశనగను వరితో పంట మార్పిడి చేయడం వలన వేరుశనగకు నులిపు రుగుల బెడద తగ్గించుకోవచ్చు.

సస్యరక్షణ

పురుగులు

ఎర్రగొంగళి పురుగు

జూలై మాసంలో పడే వరాలకు భూమిలోని కోశస్థ దశలోవున్న పురుగుల నుంచి, వర్షం పడిన రెండ వ రోజున తల్లి రెక్కల పురుగులు బయటకి వస్తాయి. తల్లి పురుగు తెలుపుతోకూడిన లేత గోధుమరంగులో ఉండి పై రెక్కల అం చున ఎర్రటి చార కలిగి, ఒక్కొక్కటి దాదాపు 1000 పైగా తెల్లని గ్రుడ్లని గుంపులు, గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన మరియు రాళ్ళపైన పెడతాయి. వీటినుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేక పొలంలో ఉన్న గడ్డి మొక్కలపై మరియు వేరుశనగ ఆకులనాశించి వాటిపైనున్న పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకులను తినివేసి రెమ్మలను, మొదళ్ళను మిగులుస్తాయి. కొన్ని సందర్భాలలో పువ్వులను కూడా తింటాయి.

దీని నివారణకు ఏప్రిల్, మే మాసంలో పడిన వరాలకు లోతు దుక్కి చేయడం వలన పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేక పక్షుల బారినపడి చనిపోతాయి. తొలకరి వరాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8-11 గంటల సమ యంలో సామూహిక మంటలు వేసి లేదా కాంతి ఎరలు ఏర్పాటుచేసి ఎర్రగొంగళి రెక్కల పురుగులను ఆకర్షించి అరికట్టవచ్చు. గుడ్ల సముదాయాలను, పిల్లపురుగులను గమనించి ఏరివేయాలి. మిధైల్ పారాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడిమందుని ఎకరాక ు 10 కిలోల చొప్పన చల్లాలి. పొలం చుటూ లోతు సాలు వేసి మీటరు పొడవు సాలుకు 250 గ్రా, ఫాలిడాల్ పొడిమందు చల గ్లాలి. అలసంద, ఆముదం పైర్లను ఎరపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మలను పొలంలో అక్కడక్కడ ఎరగా వేసి, పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటినన్నిటిని గుట్టగా వేసి తగులబెట్టాలి. తల్లి లేదా గ్రుడు లేదా నుసి పరుగు దశను గ మనించగానే 5 శాతం (ఎకరానికి 1000 మి.లీ.) వేప కషాయం పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు డైవిుధోయేట్ 400 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వి షపు ఎరను (వరి తవుడు 10 కిలోలు + బెల్లం 1 కిలో + తగినంత నీరు + 1 లీటరు క్వినాల్ ఫాస్ లేక 350 మి.లీ. మిథోమి ల్) చిన్న ఉండలుగా తయారుచేసి, ఎకరా పొలంలో సమానంగా చల్లితే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

వేరుపురుగు

వేరు పురుగు యొక్క తల్లి పురుగులు (పెంకు పురుగులు) తొలకరి వరాలు పడిన వెంటనే భూమిలోనుంచి బయటకు వచ్చి చుట్టుప్రక్కల వున్న వేప / రేగు చెట్లను ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గ్రుడు పెడతాయి. గొంగళిపురుగు తెల్ల గా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపరుగు "C" ఆకారంలో వుండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. వేరుపరుగు ఆశించిన మొక్కలు వాడి, ఎండి చనిపోతాయి. మొక్కలను పీకితే సు లువుగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.

నివారణ : లోతు దుక్కి చేయడం వలన వేరుపరుగు కోశస్థదశలు బయటపడి పక్షులబారిన పడతాయి, లేక ఎండ వేడిమికి చనిపోతాయి. ఫోరేటు 10% గుళికలు ఎకరాకు 6 కిలోలు గింజ విత్తేటప్పడు వేయాలి. ఒక కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లో ప్రిడ్ లేదా 6.0 మి.లీ. క్లోర్ పైరిఫాస్ మందును కలిపి విత్తుకోవాలి.

ఆకుమడత

ఆకుమడత విత్తిన 15 రోజుల నుండి ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలిదశలో ఆ కులపై గోధుమ రంగు మచ్చలు వుంటాయి. వాటిలోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్లపురుగులు వుంటాయి. ఇవి 2, 3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలో వుండి, పచ్చదనాన్ని తినివేయడం వలన ఆకులన్నీ ఎండి, దూరం నుండి చూస్తే కాలినట్లు కనపడతాయి. దీనినే రైతులు అగ్గితెగులు అని కూడా అంటారు.

దీని నివారణకు అంతర పంటలుగా జొన్న లేక సజ్జ 7 : 1 నిష్పత్తిలో వేయాలి. సోయాచిక్కుడు తర్వాత వేరుశనగ వేయ రాదు. ఎకరాకు 4 లింగాకర్షణ (డెల్లా జిగట ఎర) బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నపుడు క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరం లేదు. క్వినాల్ఫాస్ 400 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. లేక క్లోర్ పైరిఫాస్ 500 మి.లీ. లేక లేక పూబెండమైడ్-40 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దెపురుగు

తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుపైన మరియు అడుగు భాగాన గుంపుగా గ్రుడ్లు పె డతాయి. పిల్లపరుగులు గుంపులుగా వుండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి, జల్లెడాకుగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినివేస్యాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగుభాగాన లేక మట్టి పెళ్ళలు లేక రాళ్ళు క్రింద దాగి ఉండి రాU తిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి.

దీని నివారణకు వేసవిలో లోతు దుక్కి చేయాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడరాదు. ఎక్కువ నీటి తడులు పెట్టరా దు. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగరెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం , ప్రొద్దు తిరుగుడు మొక్కలు ఎర పంటలుగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల సముదాయాన్ని పిల్ల పురుగులను ఏరి వేయాలి. లింn కాకర్షణ బుట్టలద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెలినోమస్ రీమస్ అనే గ్రుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరాకు 7 -10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పరుగుల ద్వారా వచ్చిన ఎన్.పి.వి. ద్రావణాన్ని ఒక ఎకరాకు సాయంకాలం పిచికారీ చేయాలి. 5 శాతం వేపగింజల కషాయం గ్రుడు మరియు పురుగులు చిన్నవిగా ఉన్నప్పడు పిచికారీ చేయాలి . క్వినాల్ఫాస్ 400 మి.లీ. లేక వేపనూనె 1000 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి చొప్పన కలుపుకొని ఎకరానికి పిచికారీ చేయాలి. ఎకరాకు 10 పక్షిస్థావరాలు ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు థయోడికార్చ్ 200 గ్రా. లేదా నొవల్యూరాన్ 20 0 మి.లీ. లేదా క్లోరోఫెనాపైర్ 400 మి.లీ. రైనాక్సిపైర్ 50 మి.లీ. లేక ఫూబెండమైడ్ 40 మి.లీ. మందును 200 లీటర్ల నీటి కి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి లేదా విషపు ఎర ఉండలను చిన్నవిగా తయారు చేసి (వరి తవుడు 5 కిలోలు + బెల్లం 1/ 2 కిలో + మోనోక్రోటోఫాస్ లేదా క్లోర్ పైరిఫాస్ 500 మి.లీ. లేదా మిథోమిల్ 350 మి.లీ.) ఎకరా పొలంలో సాయంత్రం పూ ట సమానంగా చల్లాలి.

రసం పీల్చే పురుగులు

తామర పురుగులు

పిల్ల, పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని, మొక్కలు గిడసబారి పోతాయి. ఆకుల అడుగు భాగాన గోధుమరంగు వర్ణములో మచ్చలు ఏ ర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో “మొవ్వకుళ్ళు మరియు కాండము కుళ్ళు" వైరస్ తెగుళ్ళను సంక్రమింపజేస్తాయి.

పేనుబంక (జీడ)

తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన, లేత ఆకుల అడుగు భాగాన మరియు కొన్ని సందర్భాలలో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీనివలన మొక్కలు గిడసబారుతాయి. పూతదశలో ఆశించినపుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల దీనిమీద నల్లని బూజు ఏర్పడుతుంది.

పచ్చదోమ (దీపపు పురుగు)

పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. మొదట ఆ కు పైభాగాన మొదటగా "V" ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి, క్రమేపి ఆకులన్ని పసుపు పచ్చగా మారుతాయి.

తామర పురుగుల నివారణకు ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. + వేపనూనె 1 లీ. + ఒక కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్ళకు కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పేనుబంక, పచ్చదోమ నివారణ కు డైమిధోయేట్ 400 మి.లీ. లేక మిధైల్-ఒ-డెమటాన్ 400 మి.లీ. లేక థయోమిథక్సమ్ 40 గ్రా. లేక ఇమిడక్టోప్రిడ్ 60 మి .లీ. లేక థయోక్లోప్రిడ్ 50 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పైరులో అక్షింత ల పరుగులు మొక్క ఒక్కింటికి 2 లేక అంతకంటే ఎక్కువగా ఉన్నప్పడు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలి.

వేరుశనగ కాయ తొలుచు పురుగు

ఇది ఎక్కువగా కాయలు నిల్వయంచినపుడు వస్తుంది. తల్లి పురుగులు గోధుమ రంగులో వుండి, వేరుశనగ కాయలపై తెల్లటి గ్రుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్ళి పొడిగా మారు స్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలు చేసి బయటకు వచ్చి కాయలపై సంచులపై గూళ్ళు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపు 40 రోజుల్లో ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది.

దీని నివారణకు కాయల్లోగాని, విత్తనాల్లో గాని తేమ శాతం 9 కి మించి ఉండరాదు. కిలో కాయలకు 5 మి.లీ. వేపనూ నె లేదా కానుగనూనె కలిపినచో దాదాపు 5 నెలల వరకు కాయతొలుచు పరుగు నుండి వేరుశనగను కాపాడవచ్చు. గోదాము గోడలపైన, కాయ సంచుల మీద మలాథియాన్ మందును 5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పన కలుపుకొని 2-3 వారాలకొకసారి పిచికారీ చేసుకోవాలి. లేదా ఒక టన్ను కాయలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలు ఒకటి లేక రెండు చొప్పన ఉOచి కాపాడుకోవచ్చును.

నులి పురుగులు (కాళహస్తి తెగులు)

నులి పురుగులు కంటికి కనిపించనటువంటి అతిసూక్ష్మ పురుగులు. వీటిని మైక్రోస్కోప్ లో మాత్రమే చూడగలము. ఇవి వేరుశనగ పంటపై పిందె మరియు కాయ పెరిగే దశలో, కాయలపై ఆశించడం వలన నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ పరుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పడు పిందెలు మరియు కాయలు నల్లగా మారి లోపలి గింజలు బాగా అభివృద్ధి చెందక ముడతలు పడతాయి.

నివారణ

  • వేసవిలో లోతు దుక్కులు చేయాలి.
  • చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలి.
  • ఈ పురుగు గమనించిన వెంటనే తడిపెట్టిన తరువాత అంతర్వాహిక గుళికల మందు (కార్బోపురాన్ 3జి) 10-12 కిలోల ఎకరాకు చొప్పన వేయాలి.

తెగుళ్ళు

తిక్కా ఆకుమచ్చ తెగులు

త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు, పంట వేసిన 30 రోజుల నుండి కనిపిస్తుంది. ఈ మచ్చలు కొం చెం గుండ్రంగా వుండి, ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్లి ఉంటీయి.. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి, ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్లి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడలమీద, ఊడలమీద కూడ మచ్చలు ఏర్పడతాయి.

దీని నివారణకు తెగులును తట్టుకొనే రకాలను (కదిరి హరితాంధ్ర, కదిరి-9, అభయ) సాగు చేసుకోవాలి. తెగులు క నిపించిన వెంటనే ఎకరాకు మాంకోజెబ్ 400 గ్రా, మరియు కార్బెండజిమ్ 200 గ్రా, లేదా క్లోరోధాలోనిల్ 400 గ్రా, లేదా హె క్సాకొనజోల్ 400 మి.లీ. లేదా టెబుకొనజోల్ 200 మి.లీ. చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి తరువాత 15 రోజు లకు మరొకసారి పిచికారీ చేయాలి. వేరుశనగలో సజ్ఞ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.

త్రుప్ప లేక కుంకుమ తెగులు

ఆకుల అడుగు భాగంలో ఎరుపు లేక ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభా గంలో పసుపు రంగు మచ్చలు కన్పిస్తాయి.తెగులు ఉధృతి ఎక్కువైనపుడు 53 పొక్కులు పూల మీద తప్ప మొక్క మిగతా అన్నిభా గాల మీద కన్పిస్తాయి.

దీని నివారణకు ఎకరాకు 400 గ్రాముల క్లోరోథలోనిల్ లేక 200 గ్రా. ల బ్రెడిమార్చ్ లేదా 400 గ్రా,ల మాంకోజెబ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయాలి.

మొదలు కుళ్ళు తెగులు

ఈ తెగులు ఆశించడం వలన విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళి పోతుంది. రెండవ దశలో మొలకెత్తిన తర్వాత కాండంపైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. తెగులు యొక్క మచ్చలు మొదట నేల మట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా పై కొమ్మలకు వ్యాపిస్తాయి. కాయలపై కూడ శిలీంధ్రం ఆశించి నల్లని మచ్చల్నిక లుగజేస్తుంది. ఎదిగిన మొక్కలకు తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి, ఎండిపోతాయి.

దీని నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రామ టెబుకొనజోల్ 2 డి.యస్ లేక 3 గ్రాముల మాంకోజెబ్ చొప్ప న కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తనాన్ని 5 సెం.మీ.ల కంటే లోతుగా వేయకూడదు. శనగ పంటతో పంట మార్పిడి చేయాలి. తెగులు ఆశించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల మాంకోజెబ్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కాండం కుళ్ళు తెగులు

ఈ తెగులును బూజు తెగులు లేక బుడిమ తెగులు అని కూడ అంటారు. ఈ తెగులును కలుగజేసే శిలీంధ్రం భూమిద్వారా, విత్తనం ద్వార్వా వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తర్వాత సుమారు 70 వ రోజు నుండి పంట చి వరి వరకు అగుపిస్తుంది. తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదళ్ళో వున్న శాఖలు పసుపు వర్గానికి మారి ఎండిపోతాయి. తరువాత భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు, తెరలుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర  సిద్ధ బీజాలు ఏర్పడుతాయి. ఊడలు, కాయలు కూడ ఈ తెగులుకు లోనవుతాయి. కాయలోని గింజలపై నీలి, బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న మొక్క భాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు, కాయలు నేలలోనే ఉండిపోతాయి.

దీని నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఆకుమచ్చ తెగుళ్ళను అదుపులో ఉంచినచో కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతి తగ్గుతుంది.  సజ్జ, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. సేంద్రియ ఎరువులను పొలంలో వేసికలియ దున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేక 1 గ్రాము టెబుకొనజోల్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. రెండు కిలోల టైకోడెర్మా విరిడి ఫార్మలేషన్ను 90 కిలోలు పశువుల ఎరువు మరియు 10 కిలోలల వేపగింజల పిండితో కలిపి, పాలిథీన్ కాగితంతో కప్పి 3 రోజుల కొకసారి నీరుచల్లుతూ, 15 రోజుల తర్వాత ఒక ఎకరా భూమిలో విత్తే ముందు వేసుకోవాలి. ఎకరా కు 200 కిలోల జిప్సం ఎరువును పూత సమయంలో వేయటం వలన తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు పొలంలో తెగులు సోకిన మొక్కల చుటూ గల నేలను 2 మి.లీ. హెక్సాకొనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి తడిచేటట్ల పిచికారీ చేయాలి.

వేరు కుళ్ళు తెగులు

ఈ తెగులు రైజోక్టోనియా బెటాటికోలా అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఈ తెగులు సుమారు 30 రోజుల తర్వాత వరాభావ పరిస్థితుల వలన ఎక్కువగా ఆశిస్తుంది. మొదట కాండం మీద గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడుతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు వర్గానికి మారి కాండం పైభాగానికి మరియు వేరుకు కూడా వ్యాపిస్తాయి. ఈ తెగులు వలన తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగుకి మారి నుజ్ఞ నుజుగా తయారవుతుంది.

ఈ తెగులు నివారణకు తెగులు లేని పొలం నుండి విత్తనాలను సేకరించి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. కాండం కు ళ్ళ నివారణకు తెలిపిన విధంగా టైకోడెర్మా విరిడి ఫార్మలేషన్ను (2 కిలోలు), పశువుల ఎరువు (90 కిలోలు), మరియు వేపపి ండి (10 కిలోలు) ని కలుపుకొని 15 రోజుల తరువాత విత్తేముందు పొలంలో వేసుకోవాలి. పొలంలో తెగులు ఆశించిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్కల చుటూ గల నేలను 0.1% కార్బెండజిమ్ లేదా 0.3% మాంకోజెబ్ మందులతా లో తడిచేటట్లు పిచికారీ చేయాలి.

మొవ్వ కుళు వైరస్ తెగులు (పి.బి.ఎన్.డి.)

ఇది పీనట్ బడ్ వైరస్ వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు యొక్క లక్ష ణాలు మొదటగా లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కన్పిస్తాయి. మొవ్వు ఎండిపోతుంది. లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురచబడి, ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చని మచ్చలు కలిగి పాలిపోయి ఉంటాయి. లేత దశలో ఆశించిన మొక్కలలో కాయలు ఏర్పడవు. ముదిరిన మొక్కలలో తెగులు లక్షణాలు కొన్ని కొమ్మలలో మాత్రమే కన్పిస్తాయి. తెగులు సోకిన మొక్కల నుండి వచ్చిన వేరుశనగ కాయ మరియు విత్తనాలు చిన్నవిగా ఉండి, ముడుచుకొని ఉంటాయి.

ఈ తెగులు నివారణకు తెగులును కొంతవరకు తట్టుకొనే ఆర్-8808, వేమన, ఐ.సి.జి.యస్-11, ఐ.సి.జి.యస్-44 వంటి రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తనశుద్ధి చేసిన తర్వాత 1 గ్రాము టె బుకొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ అనే పొడి మందుతో కూడా శుద్ధి చేసి తరువాత విత్తుకోవాలి. మొక్కల సాంద్రత చదరపు మీటరుకు ఖరీఫ్లో 33 మొక్కలు, రబీలో 44 మొక్కలు ఉండాలి. వేరుశనగతో సజ్ఞ పంటను 7:1 నిష్పత్తితో అంతరపంటగా వేయాలి. విత్తిన 20 రోజుల తరువాత తామర పురుగులను (త్రిప్స్) వ్యాప్తిని అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. లేక డైమిధోయేట్ 400 మి.లీ. లేక 80 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి.

కాండం కుళ్ళు వైరస్ తెగులు (పి.యస్.ఎన్.డి)

ఈ తెగులును "టొబాకో ఫ్రీక్ వైరస్" కలుగజేస్తుంది. లేత ఆకులపై మ రియు ఆకు ఈనెలపై నల్లటి మాడు పట్టిన మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చలు ఆకు తొడిమ నుండి కాండం పైకి వి స్తరిస్తాయి. మొవ్వ ఎండిపోతుంది. 15 రోజుల లోపు వయస్సు ఉన్న మొక్కలకు తెగులు ఆశించిన యెడల మొక్కలు చనిపోతాయి. 15-30 రోజుల పైన వయస్సు ఉన్న మొక్కలకు తెగులు ఆశిస్తే మొక్కలు గిడసబారి, చిన్న చిన్న ఆకులతో ఉండి మొక్క పొద వలె అగుపిస్తుంది. ఊడలు నల్లగా మారుతాయి. కాయలపై మచ్చలు ఏర్పడతాయి. గింజలు కూడ రంగు మారుతాయి.

ఈ వైరస్, వేరుశనగ లేని సమయంలో గట్లపై ఉన్న కలుపు మొక్కల పప్పొడిలో జీవిస్తుంది. కలుపు మొక్కలలో ముఖ్యం గా వయ్యారిభామ, ఉత్తరేణి, ఎన్నెద్దులాకు, కుక్కముళు, గడ్డి చేమంతి, గరిటికమ్మ పువ్వుల్లోని పుప్పొడి రేణువులలో ఉంటుంది. అందువలన ఈ కలుపు మొక్కలను పూత దశకు రాక ముందే నిర్మూలించాలి. పొలం చుటూ దట్టంగా మేర సాళ్లు (4-6)  సజ్జ/జొన్న/మొక్కజొన్న వేసుకోవాలి. దీనివలన గాలి మరియు తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పొడి రేణువుల వ్యాప్తిని నిరోధిం చవచ్చు. పొలంలో అంతరపంటగా 7:1 లేదా 11:1 నిష్పత్తిలో సజ్ఞ/జొన్న/మొక్కజొన్న వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తనశుద్ధి చేసిన తర్వాత పైన తెలిపిన ఏదైన ఒక శిలీంధ్రనాశిని మందులో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 400 మి.లీ. డైమిధోయేట్ లేదా 80 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందు ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి.

వేరుశనగ వైరస్ లో వాడే కలుపు నివారణ మరియు సస్యరక్షణ మందులు

సంఖ్య

కలుపు/నివారణ మందులు

తెగులు/పురుగు/కలుపు

మోతాదు

1.

కలుపు నివారణ మందులు

1)పెండిమిధాలిన్ 30% ఇసి

కలుపు

ఎకరానికి 1.3-1.6 లీ. మందు

విత్తిన వెంటనే లేదా 1-3 రోజుల లోపు

2)బూటాక్లోర్ 50% ఇసి

కలుపు

ఎకరానికి 1.25-1.5 లీ, మందు

విత్తిన 21 రోజుల లోపు

3)ఇమాజితాఫిర్ 10% యస్.యల్

కలుపు

ఎకరానికి 400 మి.లీ.

4)క్విబలోపాప్ ఇధైల్ 5% ఇసి

కలుపు

ఎకరానికి 400 మి.లీ.

విత్తిన 21 రోజులలోపు

2.

విత్తనశుద్ధి మందులు

1) ఇమిడాక్టోప్రిడ్

తామర పరుగులు/ పి.యస్.ఎన్.డి.

2 మి.లీ/క్రిలో విత్తనానికి

2)టెబుకొనోజోల్

మొదలు కుళ్ళు, కాండం కుళ్ళుతెగులు

1 గ్రాము/క్రిలో విత్తనానికి

3)మాంకోజెబ్

మొదలు కుళ్ళు, కాండం కుళ్ళుతెగులు

3 గ్రాము/క్రిలో విత్తనానికి

4)క్లోరిఫైరిఫాస్

వేరుపురుగు

6.0 మి.లీ./క్రిలో విత్తనానికి

3.

పురుగు మందులు

1)మిధైల్ పారాధియాన్/క్వినాల్ఫాస్

ఎర్రగొంగళి పురుగు

ఎకరానికి 10 కిలోల పొడి మందు 2 మి.లీ. 1 లీటరు నీటికి (ఎకరానికి 400 మి.లీ. 200 లీ. నీటికి)

2)ఫోరేట్ గుళికలు 10 జి.

వేరుపురుగు

ఎకరానికి 6 క్రిలోలు

3) క్వినాల్ ఫాస్/నొవల్యురాన్/క్లోర్ ఫెనాపైర్/థయోడికార్స్/పూబెండియామైడ్

పొగాకు లద్దెపురుగు

 

2 మి.లీ./లీటరు నీటికి (ఎకరానికి 400 మి.లీ./200 మి.లీ./400 మి.లీ./ 200 గ్రా./40 మి.లీ. 200 లీటర్ల నీటికి)

4) మోనోక్రోటోఫాస్ + వేపనూనె

తామర పురుగులు

1.6 మి.లీ. + 5 మి.లీ. ఒక లీటరు నీటికి (ఎకరానికి 320 మి.లీ./1000 మి.లీ. 200 లీ. నీటికి)

5) డైమిధోయేట్/మిథైల్-ఒ- డెమటాన్, మోనోక్రోటోఫాస్

పచ్చదోమ, పేనుబంక

2.0 మి.లీ. లీటరు నీటికి/ఎకరానికి 400 మి.లీ. 200 లీటర్ల నీటికి)

2.0 మి.లీ. లీటరు నీటికి/ఎకరానికి 400 మి.లీ. 200 లీటర్ల నీటికి)

1.6 మి.లీ. లీటరు నీటికి/ఎకరానికి 320 మి.లీ. 200 లీటర్ల నీటికి)

6)క్వినాల్ఫాస్/క్లోరిపైరిఫాస్

ఆకుముడత

2.0 మి.లీ. లీటరు నీటికి/ఎకరానికి 400 మి.లీ. 200 లీటర్ల నీటికి)

7) అల్యూమినియం ఫాస్పైడ్

కాయతొలుచు పురుగు

3 గ్రా. బిళ్ళలు ఒకటి/రెండు ఒక టన్ను కాయలకు

4.

తెగుళ్ళు మందులు

1) మాంకోజెబ్+కార్బెండిజిమ్

తిక్కా ఆకుమచ్చ తెగులు

2 గ్రా. + 1 గ్రా. లీ. నీటికి (400 గ్రా. +200గ్రా. ఎకరానికి 200 లీ నీటికి)

2)క్లోరిథలోనిల్

తిక్కా ఆకుమచ్చ తెగులు/కుంకుమ తెగులు

2 గ్రా. లీ. నీటికి/(400 గ్రా. ఎకరానికి 200 లీటర్ల నీటికి)

3) హెక్సాక్రానాజోల్

తిక్కా ఆకుమచ్చ తెగులు/కుంకుం తెగులు

2 మి.లీ. లీటరు నీటికి/(400 గ్రా. ఎకరానికి 200 లీటర్ల నీటికి)

4)క్లోరోథలోనిల్

త్రుప్పు/కుంకుమ తెగులు

2 గ్రా. లీటరు నీటికి (ఎకరానికి 400 గ్రా)

5)ట్రైడిమార్ఫ్/మాంకొజెబ్

త్రుప్పు/కుంకుమ తెగులు

1 గ్రా. /లీటరు నీటికి ఎకరానికి 200 గ్రా.)

6) టైకోడెర్మా విరిడి+పశువుల ఎరువు+వేపపిండి

కాండము కుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు

2 కిలోలు+90 క్రిలోలు+10 కిలోలు

పంటకోత - నిల్వ

70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి, కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినపుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. భూమినుండి మొక్కలను తీయడానికి ట్రాక్టరుతో న డిచే ఎ.యన్.జి. ఆర్.ఎ.యు బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గర్ను వాడుకోవాలి. చెట్ల నుండి కాయలను వేరు చేయడానికి పచ్చి లేక ఎండు కాయలను వేరుచేయు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. విత్తనం కొరకు కావలసిన కాయలను నేరుగా ఎం డలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి. కాయల్లో తేమ శాతం 9కి లోపు ఉండేటట్లు ఆరబెట్టి గోనె లేక పాలిథిన్ సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వలో కాయతొలచు పరుగు మరియు ఇతర కీటకాల నుండి రక్షణకు 2-3 వారాల కొకసారి మలాథియాన్ ద్రా వణాన్ని 150 మి.లీ. పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎగుమతికి కావలసిన ప్రమాణాలు

అప్లాటాక్సిన్ 30 పిపిబి కంటే తక్కువగా ఉండే విధంగా ఈ విష పదార్ధానికి కారణమైన ఆస్పర్టిల్లస్ శిలీంధ్రాలను తట్టుకొనే రకాలను సాగుచేసుకోవాలి. లావు గింజలు కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలి. వేరుశనగ బట్టర్, వేరుశనగ పాలు, వేరుశనగ బిస్కట్ల మొదలైన వేరుశనగ వాల్యూయాడెడ్ పదార్థాలను తయారు చేసి ఎగుమతిని పెంచుకోవాలి.

వేరుశనగ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రధాన శాస్రవేత్త (వేరుశనగ), వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి-515 591, అనంతపురము జిల్లా, ఫోన్ నెం. 08494 - 221180, సెల్:9989625217

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate