ఆంధ్రప్రదేశ్ లో జొన్న పంట ఖరీఫ్ లో 3.0 లక్షల ఎకరాల్లోను, రబీలో 4.25 లక్షల ఎకరాల్లోను సాగుచేయబడుతున్నది. ఎకరా సరాసరి దిగుబడి ఖరీఫ్‌లో 638 కిలోలు, రబీలో 610 కిలోలు.
ఖరీఫ్ |
మాఘీ |
రబీ |
లేట్ రబీ |
వేసవి |
జూన్ |
సెప్టెంబర్ |
అక్టోబర్ |
నవంబర్ |
జనవరి |
నల్లరేగడి మరియు తేలికైన ఎర్రనేలలు
హైబ్రిడ్/రకం |
ఋతువు |
పంటకాలం (రోజుల్లో) |
దిగుబడి (క్వి/ఎ) |
గుణగణాలు |
హైబ్రిడ్లు సి.ఎస్.హెచ్ -13/ సి.ఎస్.హెచ్. -13 ఆర్ |
ఖరీఫ్, రబీ |
110-115 |
12-14 |
బెట్టను, నల్ల కాండం కుళ్ళు తెగులును, కుంకువు తెగులును, పేను బంకను తటుకుంటుంది. ఎతుగా పెరుగుతుంది. చొప్ప ఎక్కువగా ఇస్తుంది. |
సి.ఎస్.హెచ్. 16 |
ఖరీఫ్, మాఘీ |
105-110 |
15-17 |
బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను మాఫీు తట్టుకుంటుంది. |
సి.ఎస్.హెచ్. 14 |
ఖరీఫ్ |
95-100 |
12-13 |
బూజు మరియు ఆకువుచ్చ తెగుళ్లని తట్టుకుంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాలకు అనుకూలం. |
సి.ఎస్.హెచ్. 18 |
ఖరీఫ్ |
110-115 |
16-17 |
గింజ పై వచ్చే బూజు తెగులును తట్టుకుంటుంది. |
పి.ఎస్.వి-1 |
ఖరీఫ్, రబీ |
105-110 |
10-12 |
గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది |
పి.ఎస్.వి-15 |
ఖరీఫ్ |
110 |
10-12 |
అన్ని లక్షణాలు షుమారు పి.ఎస్.వి. -1 మాదిరిగానే ఉంటాయి |
నంద్యాల తెల్లజొన్న-1 (ఎన్.టి.జె. -1) |
రబీ, మాఘీ |
105-110 |
10-12 |
బెట్టకు తట్టుకొంటుంది. గింజ రాలుటలో ఇబ్బంది లేక బాగా రాలుతుంది. |
నంద్యాల తెల్లజొన్న-2 (ఎన్.టి.జె. -1) |
రబీ, మాఘీ |
95-100 |
12-14 |
పంట త్వరగా కోతకు వస్తుంది. గింజలు లావుగా, తెల్లగా మెరుసూ వుంటాయి. గింజలు సులభంగా రాలుతాయి. |
నంద్యాల తెల్లజొన్న-2 (ఎన్.టి.జె. -2) |
రబీ, మాఘీ |
100-105 |
12-14 |
చొప్ప ఎక్కువగా ఇస్తుంది. బెట్టకు, ఆకుమచ్చ తెగుళ్ళకు తట్టుకొంటుంది. |
యన్-13 (పచ్చజొన్న) |
రబీ, మాఘీ |
95-100 |
7-8 |
చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా వుంటుంది. జొన్న మల్లెను, బెట్టను తట్టుకొంటుంది. |
యన్-14 (పచ్చజొన్న) |
రబీ, మాఘీ |
100-115 |
10-12 |
యన్-13 కంటె గింజలు మరియు ఎక్కువగా యిస్తుంది. |
సి.యస్.వి. 216 ఆర్ |
రబీ |
110-115 |
12-14 |
గింజ తెలుపు, చొప్ప ఎక్కువగా వచ్చి, నాణ్యంగా ఉంటుంది. |
పాలెం-2 |
ఖరీఫ్ |
105-110 |
11-12 |
గింజ తెలుపు, అధిక చొప్ప దిగుబడి నిస్తుంది. బూజు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. |
ఎన్.టి.జె.-4 |
రబీ, మాఘీ |
90-98 |
13-15 |
నల్లకాండం కుళ్ళ తెగులును కొంత వరకు, మొవ్వచంపు ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతమేర తట్టుకొంటుంది. |
యమ్ 35-1 |
రబీ, మాఘీ |
115-120 |
10-12 |
గింజలు, చొప్ప నాణ్యంగా వుంటాయి. |
సి.ఎస్.వి. 14 ఆర్ |
రబీ |
115-120 |
10-12 |
బెట్టను, నల్లకాండం కుళ్లు తెగులును, మొవ్వు చంపు ఈగను కొంతమేర తట్టుకుంటుంది. |
సి.ఎస్.వి. 15 ఆర్ |
రబీ |
110-115 |
13-14 |
మొవ్వు చంపు ఈగను, కాండం కుళ్ళను తట్టుకుంటుంది. |
కిన్నెర (ఎం.జె-278) |
రబీ, మాఘీ |
110-115 |
12-16 |
బెట్టను తట్టుకుంటుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అనుకూలము. |
ఎకరాకు 3-4 కిలోలు
కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్లాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి.
వరుసల మధ్య 45 సెం.మీ; వరుసలో మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 58,000 - 72,000 మొక్కలు ఉండాలి.
పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్మిలో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు : 32 - 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, వరాధార పంటకు : 24 - 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 క్రిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా వితేప్పడు, మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి.
ఖరీఫ్ లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైతే నీరు కట్టాలి. వేసవి పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
ఖరీఫ్ లో జొన్న : కంది - 2:1
విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 800గ్రా, చొప్పన 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపల తడి నేలపై పిచికారి చేయాలి. జొన్నమల్లె మొలకెత్తిన తర్వాత, లీటరు నీటికి 50 గ్రా, అమ్మోనియం సల్ఫేట్‌ను గాని, 200 గ్రా. యూరియానుగాని కలిపి మల్లెపై పిచికారి చేసి నివారించవచ్చు. లేదా 2,4 - డి సోడియం సాల్డ్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసికూడ మల్లెను నివారించవచ్చు. జొన్న విత్తిన 35 - 40 రోజులకు జొన్నమల్లె మొలకెత్తుతుంది.
కంకి క్రింద వరుసలో వున్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలోనున్న పాలు ఎండిపోయి పిండిగా మారినపుడు, గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి.
సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరాకు 200 లీటర్లు నీటితో సిఫార్పు చేయబడిన మోతాదులో క్రిమినాశక / శిలీంధ్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయవలసివుంటుంది.
జొన్న సజ్జ, రాగి, కొర్ర, వరిగ పంటల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ సైంటిస్ట్ (చిరుధాన్యాలు), వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్లపల్లె-517 502, చితూరు జిల్లా, ఫోన్ నెం.0877-2276240
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/12/2020