অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పెసర

మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 3.85 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.80 లక్షల టన్నుల ఉత్ప త్తిని మరియు ఎకరాకు 241 కిలోల దిగుబడి నిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్ర లో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా, గోదావరి డెల్లా ప్రాంతం లో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెస రను పండించవచ్చు. ప్రత్తిలో అంతర పంటగా కూడ పండించవచ్చు.

విత్తే సమయం

ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం మరియు ఉ త్తరకోస్తా మండలాల్లో జూన్-జులైలోను విత్తుకోవచ్చు.

రబీలో కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబరులో విత్తుకోవచ్చు. కృష్ణా-గోదా వరి మండలంలో వరి మాగాణుల్లో నవంబరు-డిశంబరు మొదటి వారంలో, వేసవికాలంలో ఫిబ్రవరి-మార్చిలో విత్తుకోవచ్చు.

నేలలు

పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.

నేల తయారి

ఒకసారి నాగలితోను, రెండుసార్లు గొట్ట తోను మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసి న పొలాల్లో దుక్కిదున్నవలసిన అవసరం లేదు.

విత్తనం

ఎకరాకు 6-7 కిలోలు (తొలకరిలో), మాగాణిలో వరి కోతల తర్వాత, రబీలో మరియు వేసవిలోని వరి మాగాణుల్లో 10-12 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6-7 కిలోలు.

విత్తనశుద్ధి

ఒక కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రా. థయామెథాక్సమ్ కలిపి విత్తనశుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసంపీల్చు పరుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు, రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.

రకాలు

రకం

పంటకాలం

దిగుబడి(క్వి/)

గుణగణాలు

ఎల్.జి.జి – 407

65-70

ఖరీఫ్, రబీ, వేస

5-6

మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పైభాగాన కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్ధ లావుగా వుంటాయి.

ఎల్లో మొజాయిక్, నల్ల అకుమచ్చ తెగుళ్ళన తట్టు కొంటుంది.

బెట్టను కూడ కొంతవరుకు తట్టుకొంటుంది.

ఎల్.జి.జి – 460

65-70

ఖరీఫ్, రబీ, వేసవి

5-6

కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలోవుండి కోయడానికి సులువుగా వుంటుంది. ఒకేసారి కోత కొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. మోవ్వుకుళ్ళు తెగులును.

కొంతవరకు తట్టుకొంటుంది. వరి మాగాణులకు అనువైనది.

ఎల్.జి.జి – 450

(పుష్కర)

65-70

ఖరీఫ్, రబీ, వేసవి

5-6

మొక్కలు మధ్యస్ధ ఎత్తులో ఉండి గుబురుగా కన్పిస్తాయి. మొక్క పోంతకోచ్చే సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా వుంటాయి.

 

ఎల్.జి.జి – 410

65-70

ఖరీఫ్, రబీ, వేసవి,

మాగాణిలో వరి తర్వాత

5-6

మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తూ వుంటాయి. ఒకే సారి కోతకొస్తుంది. కాపు పైభాగంలో ఉంటుంది. వరిమాగాణులకు అనువైనది.

టి.ఎమ్-96-2

60-65

ఖరీఫ్, రబీ, వేసవి

మెట్ట మరియు మాగాణి

4-6

అధిక తేమను మరియు బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి వరిమాగాణులకు చాలా అనువైనది.

విత్తటం

సాళ్లలో గొర్రుతో వెదబెట్టాలి. మాగాణిలో వరి కోయడానికి 2-3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లాలి.

విత్తే దూరం

వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

ఎరువులు

ఎరువు

మోతాదు(కిలోలు/ఎకరాకు)

వేయవలసిన దశలు

పశువుల ఎరువు

2000

దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి

నత్రజని

8

విత్తనం చల్లే ముందు

భాస్వరం

20

విత్తనం చల్లే ముందు

నీటి యాజమాన్యం

పెసర వర్షాధారప పంట. కాని వరాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు, రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి.

కలుపు నివారణ, అంతరకృషి

పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.8-16 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాప్ ఇథైల్ 9% ఎకరాకు 250 మి.లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి విత్తిన 20, 25 రోజులప్పుడు పిచికారి చేయాలి.

తొలకరిలో పెసర సాగుకు ఒకేసారి కోతకువచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసినాగాని గింజలు మొలకెత్తని రకాన్ని ( యల్.జి.జి 450) ఎన్నుకోవాలి. పెసరను వరాలు తగ్గిన తర్వాత గాని, రబీలోగాని లేక వేసవిలో గాని పండించాలి.

అంతర పంటలు

పెసరను అంతరపంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. పెసర : పత్తి/రబీ కంది - 3:1, పెసర : తొలకరి కం ది-7:1, అంతరపంటకు అనువైన పెసర రకాలు : యల్.జి.జి 460, 450, 410.

పెసరను పత్తి లేదా రబీ కందితో అంతరపంటగా వేసినపుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజిని, 15 కిల కాశీల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతరపంటగా వేసినపుడు 6 కిలోల విత్తనం, 7 క్రిలోల నత్రజిని, 17.5 క్రిలోల భాస్వ రం వేయాలి.

సస్యరక్షణ

పరుగులు

చిత్తపరుగులు

ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నపుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ. క్లోర్పైరిఫా —స్ లేక ఎసిఫేట్ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు

ఈ పరుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వ ల్ల ఆకుమడత అనే వైరస్ వ్యాధి కూడ వ్యాపిస్తుంది. పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది. నివారణకు మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్లదోమ

ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని (పల్లాకు తెగులు) కూ డా వ్యాపింప చేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. మిధైల్ డెమెటాన్ను లేదా టైజోఫాస్ 2. 0 మి.లీ లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు

మొదటి రెండు దశలలోని పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినటం వలన ఆకులు తెల్ల గా జల్లెడాకులుగా మారతాయి. తరువాతి దశలలలోని గొంగళిపురుగులు ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వు లను, పిందెలను కూడా తింటాయి. එයූ పరుగులు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నెర్ర లలోను చేరతాయి.

నివారణకు ఈ క్రింద సూచించిన సమగ్ర సస్యరక్షణ చర్యలను సాటించాలి.

  • గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి.
  • జల్లెడగామారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
  • ఎకరాకు 20,000 టైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని గమనించాలి.
  • ఎకరాకు ఎన్.పి.వి. 200 యల్ఇ ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారి చేయాలి.
  • పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో "విషపు ఎర" ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా కార్బరిల్ 50 శాతం 500 గ్రాI. లేక థయోడికార్చ్ 250 గ్రా, 5 కిలోల తవుడు మ రియు అర కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వెదజల్లాలి.
  • చివరిగా క్లోర్పైరిఫాస్ 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్ 1 మి.లీ. లేక ధయోడికార్చ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికా రి చేయాలి.

మారుకా మచ్చల పురుగు ఆశించినచో, నివారణకు మినుములో తెలిపిన విధంగా నివారణ చర్యలు చేపట్టాలి.

తెగుళ్ళ

బూడిద తెగులు

ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ముదురు ఆకులపై, బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకులపైన, క్రింది భాగాలకు మరియు కొమ్మలు, కాయలకు ఎ -్యపిస్తుంది. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్చెండిజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లీ. కెరాథేన్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ లేదా మైక్టోబూటానిల్ 1.0 గ్రా. లేదా డైఫెన్కొనాజోల్ 1.0 మి.లీ. కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. నిర్దేశించిన కాలంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత సరిపడా వుండాలి. తెగులును తట్టుకునే (టి.యమ్ 96-2) రకాలను విత్తుకోవాలి.

సెర్మోస్పారా ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు సోకిన ఆకులపై గోదుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 గ్రా. క్లోరోథలోనిల్ లేదా 1 గ్రాము కార్చెండిజిమ్ లేదా 1 గ్రా, ధ ਹਕੇਹੇ ਚੰ85 మిథైల్లను కలిపి వాడటం ద్వారా ఆకుమచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును కూడా నివారించవచ్చు.

బాక్టీరియల్ బైట్

ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్నచిన్న మచ్చలు కనిపిస్తాయి. 1 గ్రా. పౌషామైసి న్ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి విత్తాలి. ఈ తెగులు నివారణకు චීඝත ඕඩීපී 3 (QP. కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటోమైసిన్ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

ఆకుమడత తెగులు (మొవ్వకుళ్ళు)

ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోఆ-ూయి. ఆకుల అడుగుభాగంలోని ఈనెలు రక్తవర్గాన్ని పోలి వుంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి త గులబెట్టటం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లే క 2 మి.లీ డైమిధోయేట్ లేక 1.0 మి.లీ. ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి.-295, యల్.జి.జి -460 పెసర రకం ఈ తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.

ఎల్లోమొజాయిక్ (పల్లాకు) తెగులు

ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన వె యొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటో ఫాస్ లేక 2 మి.లీ. డైమిధోయేట్ లేదా టైజోఫాస్ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా ఎసిటామిపైడ్ 0.2 గ్రా. లేదా ఇ మిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. మందును పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు. ఎల్.జి.జి 407, ఎల్.జి.జి 460 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. తెల్లదోమల ఉధృతిని వెంటనే అరికట్టాలి.

బంగారు తీగ (కస్కుటా)

వరి మాగాణుల్లో బంగారు రంగు గల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కల నుండి రసం పీలుస్తుం ది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోతుంది. ఈ తీగ, పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కా ల్చి వేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నచోట పైరు 20 రోజులప్పుడు “ఇమజెతాపిర్" (పర్ష్యూట్) అనే కలుపు మందును ఎక రాకు 200 మి.లీ. చొప్పున పిచికారి చేసి 5–7 రోజుల లోపల పైరుపై 1.0% యూరియాను పిచికారీ చేయాలి. అశ్రద్ద చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును నష్టపరుస్తుంది.

పంట కోత - నిల్వ

తొలకరిలో ఎండిన కాయలను ఒకటి రెండు సార్లుగా కోసి నూర్చుకోవాలి. రబీ కాలంలో కాని, వేసవిలోn కాని, మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తర్వాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టి శుభ్రపరచి నిల్వ ఉంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా :

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate