భారతదేశం ప్రపంచంలోని ప్రత్తి ఉత్పత్తి మరియు నూలు ఎగుమతుల్లో ప్రధానపాత్ర వహిస్తుంది. మన రాష్టం 2013– 2014 భారతదేశంలోనున్న సాగు విస్తీర్ణంలో 19.0 శాతం కలిగి మొత్తం ప్రత్తి ఉత్పత్తిలో 17.46 శాతం మేర ఆక్రమించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రత్తి 5400 లక్షల ఎకరాల్లో సాగు చేయబడి, 65.50 లక్షల బేళ్ళ ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు 571 కిలోలు.
శ్రీశైలము - రాయలసీమ ముంగారీ ప్రాంత ఎర్రనేలలకు అనువైనది. ఇది స్వల్ప కాలిక రకము. కాలపరిమితి 170 రోజులు. హెక్టారుకు 10-12 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. ఇది నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. 24 మి.మీ పింజ పొడవు కలిగి, ప్రత్తిలో 85 శాతము వరకు దూది కలిగి ఉండి, 30వ నెంబరు నూలు వడకటానికి అనువుగా ఉంటుంది.
మహానంది - రాయలసీమ ముంగారీ ప్రాంత ఎర్రనేలలకు అనువైనది. పంటకాలము 180-200 రోజులు. పిం జ పొడవు 22-24 మి.మీ. దూది శాతము 30-32. హెక్టారుకు 9-15 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది. పచ్చదోమను కొంతవరకు తట్టుకుంటుంది.
అరవింద - రాయలసీమ ముంగారీ, హింగారీ ప్రాంతాల్లోని ఎర్ర మరియు నల్లనేలలకు అనువైనది. స్వల్పకాలి క రకము. 160 రోజులు కాలపరిమితి. హెక్షారుకు 15 క్వింటాళ్ళ దిగుబడినిచ్చి 22 మి.మీ పిం జ పొడవు కలిగి ఉంటుంది. ప్రత్తిలో 35 శాతం దూది కలిగి ఉండి 30వ నెంబరు నూలు వడకట గానికి అనువుగా ఉంటుంది.
శ్రీనంది - దీని కాలపరిమితి 160 రోజులు. హెక్టారుకు 20-22 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. రాయలసీమ ముంగారీ, హింగారీ ప్రాంతములకు అనువైనది. పింజ పొడవు 22 మి.మీ. వుండి దూది శాతము 36.5 వరకు వుంటుంది. 20వ నెంబరు నూలు వడకటానికి అనువుగా వుంటుంది.
యాగంటి - ఇది రాయలసీమలోని ముంగారీ, హింగారీ ప్రాంతములకు అనువైనది. ఇది 150 రోజుల కాలపరి మితి గల స్వల్ప కాలిక రకము గింజ పొడవు 22 మి.మీ వుండి 37 వరకు దుది శాతము వుంటుంది. 20వ నెంబరు నూలు వడకటానికి అనువైనది.
జయధర్ : రాయలసీమలోని పశ్చిమ ప్రాంతంకు అనువైనది. బెట్టను తట్టుకొంటుంది. చౌడు భూముల్లో పండించటానికి అనువైనది. 220-230 రోజుల కాలపరిమితి. హెక్టారుకు 6-8 క్వింటాళ్ళ వరకు దిగు బడినిస్తుంది. 22 మి.మీ. పింజ పొడవు కలిగి ఉండి, ప్రత్తిలో 31 శాతము వరకు దూది ఉండి 26వ నెంబరు వరకు నూలు వడకటానికి అనువుగా ఉంటుంది. ఇది ಬಿಲ್ಡಸು 200 తట్టుకుంటుంది.
రాఘవేంద్ర : రాయలసీమలోని పశ్చిమ ప్రాంతానికి (అదోని) అనువైనది. పచ్చదోమను, నల్లమచ్చ తెగుతును త ట్టుకొంటుంది. 180 రోజులు కాలపరిమితి. 22 మి.మీ పింజ పొడవు కలిగి ఉండి 20వ నెంబరు నూలు వడుకుటకు అనువుగా ఉంటుంది. హెక్టారుకు దాదాపుగా 8-10 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. జయధర్ కన్నా మేలైన రకము.
కృష్ణ : మాగాణి భూముల్లో వరి తర్వాత సాగుకు అనుకూలమైనది. 140-145 రోజులు కాలపరిమితి. ది గుబడి 25 క్వి/హె. 26 మి.మీ. పింజ పొడవు ఉండి 33 శాతము వరకు దూది ఇస్తుంది. 40వ నెంబరు నూలు వడకవచ్చును. వరి మాగాణులలోను, వేసవి పంటగా అనుకూలమైనది.
ఎల్.పి.యస్ 141 (కాంచన) : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. పంటకాలము దాదాపు 160-170 రోజులు. హెక్షారుకు 24-25 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. దీని పింజ పొడవు 26 మి.మీ. దూది 34 శాతము ఉంటుంది. 40వ నెంబరు నూలు వడకవచ్చును. ఇది తెల్లదోమను, మైరోతీసియమ్ మరియు ఆల్టర్నేరియా వలన కలిగే తెగుళ్ళను, పండాకు తెగులును తట్టుకోగలదు కానీ పచ్చదోమ ను తట్టుకొనలేదు.
ఎల్.కె. 861 : అన్ని ప్రాంతాలకు అనువైనది. తెల్లదోమను, నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. 160-170 రోజులు పంటకాలము కలిగి హెక్షారుకు సుమారు 25-26 క్వింటాళ్ళ దిగుబడినివ్వగలదు. ఈ రకము 29 మి.మీ. పింజపొడవు కలిగి 34 శాతము దూదినిస్తుంది. 50వ నెంబరు నూలు వడకుటకు వీలు గా వుంటుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పచ్చదోమను తట్టుకొనలేదు. దీని పింజ గట్టిదనం బాగా ఉంటుంది.
యల్ 389 : అన్ని ప్రాంతాలకు అనువైనది. 160-170 రోజులు పంటకాలము. హెక్టారుకు 25 నుండి 30 క్వింటాళ్ళ ప్రత్తి దిగుబడినిస్తుంది. ప్రత్తిలో దూది శాతము 85.5 మరియు పింజ పొడవు 29 మి.మీ. 50వ నెంబరు నూలు వరకు వడకవచ్చును. బ్లాక్ ఆర్మ్ (నల్లమచ్చ) తెగులును పూర్తిగా తట్టుకొన గలదు. తెల్లదోమ వున్న పరిస్థితులలో యం.సి.యు 5 కన్నా ఎక్కువ దిగుబడినస్తుంది.
మితి గల స్వల్ప కాలిక రకము గింజ పొడవు 22 మి.మీ. వుండి 37 వరకు దూది శాతము వం టుంది. 20వ నెంబరు నూలు వడకటానికి అనువైనది.
లాం 603 : అన్ని ప్రాంతాలకు అనువైనది. పంటకాలము 150-160 రోజులు. హెక్షారుకు 25 నుండి 30 క్వింటాళ్ళ దిగుబడి ఉంటుంది. ప్రత్తిలో దూది శాతము 35 మరియు పింజ పొడవు 28 మి.మీ. వం టుంది. 40వ నెంబరు వరకు నూలు వడకవచ్చును. నల్లమచ్చ తెగులును పూర్తిగానూ, పచ్చదోమ ను కొంతవరకు తట్టుకుంటుంది.
లాం 604 : అన్ని ప్రాంతాలకు అనువైనది. పంటకాలము 150-160 రోజులు. హెక్షారుకు 25 నుండి 30 క్వింటాళ్ళ దిగుబడినిసుంది. ప్రత్తిలో దూది శాతము 86 మరియు పింజ పొడవు 27 మి.మీ. వుంటుంది. 40వ నెంబరు నూలు వడకవచ్చును. పచ్చదోమను, నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది.
ఎన్.ఎ.920 (ప్రియ): రాయలసీమ ప్రాంతంకు అనువైనది. కాలపరిమితి 160 రోజులు. హెక్టారుకు 20-25 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. ప్రత్తిలో 38 శాతము దూది, పింజపొడవు 25 మి.మీ. కలిగి, 40వ నెం బరు నూలు వడకవచ్చును.
ఎన్.ఎ.1325 (నరసింహ): అన్ని ప్రాంతాలకు అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. పచ్చదోమను కొంత వరకు తట్టుకొం టుంది. ఈ రకము ఆచార్య ఎన్.జి. రంగా విశ్వ విద్యాలయం, నంద్యాల పరిశోధనా స్థానము నుండి విడుదల చేయబడినది. 160 రోజుల పంటకాలము కలిగి, హెక్టారుకు 25-28 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. పింజ పొడవు 26 మి.మీ. ప్రత్తిలో 36 శాతము దూది కలిగి, 40వ నెంబ రు నూలు వడకవచ్చును.
శివనంది: ఇది 160-170 రోజుల కాలపరిమితి కలిగి, హెక్టారుకు 16 నుండి 17 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. 28–29 మి.మీ. పింజపొడవుండి, 37.5 శాతం దూదినిస్తుంది. 50వ నెంబరు నూలు వడకవ చ్చును.
యం.సి.యు 5 : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. పచ్చదోమను కొంతవరకు తట్టుకొంటుంది. కాలపరిమితి 180 రోజులు హెక్టారుకు 25 క్వింటాళ్ళ ప్రత్తి దిగుబడినిస్తుంది. 30-32 మి.మీ పింజ పొడవు కలిగి, 34 శాతము దూదినిసూ, 50-60వ నెంబరు నూలు వడకటానికి అనువైనది. ఇది వరాధారముగాను, సేద్యపు నీటితోనూ పండించవచ్చును.
ఎల్.ఆర్.ఎ.5166 : అన్ని ప్రాంతాలకు అనువైనది. పచ్చదోమను తట్టుకొంటుంది. దీని కాలపరిమితి 160 రోజులు. పె కాక్షారుకు 26 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఈ రకము 24 మి.మీ. పింజ పొడవు కలిగి 34 శాతవ యి దూదినిస్తుంది. 40వ నెంబరు వరకు నూలు వడకటానికి వీలుగా ఉంటుంది. బాక్టీరియా ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మాగాణి భూములలో వరి తరువాత సాగు చేయుటకు కూడా పనికి వస్తుంది.
లాం హైబ్రిడ్ 1: అన్ని ప్రాంతాలకు అనువైనది. ఇది స్వల్పకాలిక రకము. దిగుబడి సుమారు 30-35 క్వి/హె. ఇస్తుంది. 35 శాతము దూది దిగుబడి, 27 మి.మీ. పింజ పొడవు కలిగి, 40వ నెంబరు నూలు వడక వచ్చును. ఆలస్యముగా విత్తుటకు మరియు వరి మాగాణులలో సాగుకు అనువైనది. పచ్చదోమను తట్టుకుంటుంది.
లాం హైబ్రిడ్ 4: అన్ని ప్రాంతాలకు అనువైనది. దీని కాల పరిమితి 160-170 రోజులు. ప్రత్తి దిగుబడి సుమారు 35 క్వి/హె. ఇస్తుంది. 35 శాతము దూది దిగుబడి, 27 మి.మీ పింజపొడవు కలిగి, 40వ నెంబరు నూలు వడకవచ్చును. పచ్చదోమను కొంత వరకు తట్టుకుంటుంది. తేలిక నేలల్లో వరాధారపు పంటగా వేయడానికి ఇది బాగా అనుకూలమైనది.
ఎన్.యస్.పి.హెచ్.హెచ్ 5 (ఎల్.ఎ.హెచ్.హెచ్.5): అన్ని ప్రాంతాలకు అనువైనది. 35 క్వింటాళ్ళ దిగుబడి సామర్థ్యం కలిగి, 35 శాతము దూది నిస్తుంది. 29మి.మీ. పింజ పొడవు కలిగి నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది.
లాం కాటన్ హైబ్రిడ్ -7 (ఎల్.ఎ.హెచ్.హెచ్.7) : అన్ని ప్రాంతాలకు అనువైనది. 160-180 రోజులు పంటకాలము తట్టుకుంటుంది. 30-35 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. 30-32 మి.మీ. పింజ పొడవు ఉంటుంది. పచ్చదోమ మరియు కొంతవరకు నల్లమచ్చ తెగులును
ఎన్.హెచ్.హెచ్.390: అన్ని ప్రాంతాలకు అనువైన రకం. హెక్టారుకు దాదాపు 20 క్వింటాళ్ళ ప్రత్తి దిగుబడినిస్తుంది. 160-170 రోజుల కాలపరిమితి గల మధ్యకాలిక రకం. పింజ పొడవు 27 మి.మీ. వుండి, దాదా పు 36 శాతము దూదినిస్తుంది. 40వ నెంబరు నూలు వడకటానికి అనువుగా వుంటుంది.
ఎన్.డి.ఎల్.హెచ్.హెచ్.240: అన్ని ప్రాంతాలకు అనువైనది. 160 రోజుల కాలపరిమితి కలిగిన సంకర రకం. హెక్టారుకు 27 నుండి 28 క్వింటాళ్ళ ప్రత్తి దిగుబడినిస్తుంది. పింజ పొడవు 29 నుండి 30 మి.మీ. వుండి 37 శాతము దూదినిస్తుంది. 40వ నెంబరు నూలు వడకవచ్చును.
డబ్యూజి.హెచ్.హెచ్-2 : ప్రత్తి వండించు అన్ని ప్రాంతాలకు అనువైనది. హెక్షారుకు దాదాపు 25-35 (ఓరుగల్ల కృష్ణ) క్వింటాళ్ళ ప్రత్తి దిగుబడినిస్తుంది. పంట కాలము 150-170 రోజులు. పింజ పొడవు 26-28 మి.మీ. కలిగియుండి దాదాపు 36-37 శాతము దూదినిస్తుంది. 40వ నెంబరు నూలు వడకటానికి అనువైనది. పచ్చదోమను మరియు నల్లమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది.
గమనిక
దేశవాళీ మరియు అమెరికన్ రకాలకు పాదుకు 2 మొక్కలు, సంకరజాతి రకాలకు పాదుకు ఒక మొక్క చొప్పన వుంచాలి. విత్తిన 10 రోజుల్లో ఖాళీలు వున్నచోట మరల విత్తాలి. విత్తిన 3 వారాలకు ఒత్తు మొక్కలను పీకి వేయాలి.
ప్రాంతం/రకం |
విత్తే సమయం |
విత్తన మోతాదు (క్వి/ఎకరాకు) |
విత్తే దూరం (సెం.మీ.) |
విత్తే పద్ధతి |
|
వరుసల మధ్య |
మొక్కల మధ్య |
||||
1 |
2 |
3 |
4 |
5 |
6 |
దేశవాళీ రకాలు |
|||||
ముంగారీ (రాయలసీమ) |
మే ఆఖరివారం నుండి జూన్ మొదటివారం |
4-5 |
60 |
22 |
గోర్రుతో విత్తాలి |
హింగారి (రాయలసీమ) |
ఆగష్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్యవరకు |
4-5 |
60 |
22 |
గోర్రుతో విత్తాలి |
రాయలసీమ పశ్చిమప్రాంతం |
సెప్టెంబర్ మధ్య |
4-5 |
60 |
22 |
గోర్రుతో విత్తాలి |
అమెరికన్ రకాలు |
|||||
కోస్తా ప్రాంతం ఎర్రనేలలు |
జూన్ మధ్యలో |
3-4
|
90-150 |
45-60 |
అచ్చుతోలి వేయలి |
కోస్తా ప్రాంతం నల్ల నేలలు |
జూలై – ఆగష్టు |
3-4 |
90-150 |
45-60 |
అచ్చుతోలి వేయలి |
రాయలసీమ హింగారి ప్రాంతం |
ఆగష్టు – సెప్టెంబర్ |
4-5 |
60 |
30 |
గోర్రుతో విత్తాలి |
నెల్లూరు, ప్రకాశం జిల్లాలు |
ఫెబ్రవరి |
3-4 |
60-75 |
45-60 |
బోదెల అంచుల మీద విత్తాలి |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
సంకరజాతి |
|||||
కోస్తా ప్రాంతం ఎర్రనేలలు |
జూన్ - మధ్యవరకు |
0.75-1 |
90-120 |
45-60 |
అచ్చుతోలి వేయలి |
కోస్తా ప్రాంతం నల్లనేలలు |
జూలై - ఆగష్టు |
0.75-1 |
90-120 |
45-60 |
అచ్చుతోలి వేయలి |
రేగడి నేలలు రాయలసీమ |
జూలై –ఆగష్టు |
0.75-1 |
120-150 |
45-60 |
అచ్చుతోలి వేయలి |
ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కనుక నీరు ఎక్కువగా పెట్టరాదు. భూమిలో వున్న తేమను బట్టి 20-25 రోజులకోసారి నీరు పెట్టాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే మరియు పూత సమయంలో, కాయ తయారగు సమయంలో నీరు పెట్టాలి. ఖరీఫ్‌లో 2-3 తడులు, రబీలో ఆరు తడులు అవసరం ఉంటుంది. నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పొడిగించరాదు.
ప్రాంతం |
నత్రజని |
భాస్వరం |
పోటాష్ |
వేసేపద్దతి |
కోస్తా ప్రాంతం |
అన్ని ప్రాంతాలకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అమెరికన్ రకాలకు మరియు పోటాష్ లను మూడు సమ భాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళకు 7-10 సెం.మీ దూరంలో బాదులు తీసి వేయాలి. రాయలసీమలోని వర్షాధార అమెరికన్ రకాలకు సిఫారసు చేసిన నత్రజనిని రెండు సమభాగాలుగా చేసి విత్తిన 30,60 రోజులకు పైన తెప్పినవిధంగా వేయాలి. |
|||
అమెరికన్ |
36 |
18 |
18 |
|
సంకరజాతి |
48 |
24 |
24 |
|
రాయలసీమ |
||||
దేశవాళి రకాలు |
8 |
8 |
- |
|
అమరికన్ రకాలు (వర్షాధారం) |
16 |
8 |
8 |
|
అమరికన్ రకాలు (నిటివసతి) |
36 |
18 |
18 |
|
సంకరజాతి రకాలు |
48 |
24 |
24 |
|
వరి కోసిన తర్వాత వేసే మాగాణి భుముల్లో |
||||
సూటి రకాలు |
54 |
18 |
1 |
|
హైబ్రిడ్స్ (సంకరజాతి రకాలు) |
60 |
24 |
24 |
కలుపు నివారణ, అంతరకృషి : విత్తే ముందు పక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పన పిచికారీ చేసి భూమిలో కలియదిగున్నాలి లేదా పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీ. లేదా అలాక్లోర్ 50% 1.5 నుండి 2.5 లీటర్లు విత్తిన వెంట నే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి.
విత్తిన 25-30 రోజులప్పడు అంతరకృషి చేయడానికి అవకాశం లేనప్పడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరాకు 4 00 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు కలుపు సమస్య ఎక్కువగా వున్న టైతే ఎకరాకు 250 మి.లీ పైరిథయోబ్యాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఖరీఫ్ లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతరకృషి కుదరనప్పడు ఎకరాకు లీటరు పారాక్వాట్ 24% లేదా 2 లీటర్ల గైఫోసేట్ మందును 2 కిలోల యూ రియా / అమ్మోనియం సల్ఫేట్‌తో 200లీ. నీటిలో కలిపి ప్రత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకోవాలి.
మెగ్నీషియం లోపాలు లక్షణాలు : ముదురు ఆకులు, అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారతాయి. ఆకుల ఈ నెలు మాత్రం ఆకుపచ్చగా వుంటాయి. ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతాయి. ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45 మ రియు 75 రోజుల తరువాత రెండుసార్లు పిచికారీ చేయాలి.
జింకు లోప లక్షణాలు : ఈ ధాతువు లోపం మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకుల ఈనెల ఆకుపచ్చగా వుండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపుపచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా వుండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.
జింకు లోపం వున్న నెలల్లో ఎకరాకు కిలోల జింకు సల్ఫేట్ ను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి లేదా 0.2% జింకు సల్ఫేట్ ద్రావణాన్ని మొక్కల మీద లోప లక్షణాలు గమనించినప్పుడు 7-10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
బోరాన్ లోప లక్షణాలు: ఈ సూక్ష్మ పదార్ధ లోపమునున్నప్పుడు పూల స్వరూపం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలకు ముడుచుకుపోతాయి. ఆకులు కాడలు ఒకే రీతిని వుండక కొంత దళసరిగాను, కొంత పలచగాను వుండి అక్కడక్కడ రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఈ లోపం బాగా ఎక్కువగా వున్నప్పుడు పూత దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండం పై పగుళ్ళు కూడా ఏర్పడతాయి.బోరాన్ లోపం మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గమనించబడింది. సున్నం ఎక్కువగానున్న నెలల్లోనూ, వర్షభావ పరిస్దితుల్లో అధిక వర్షపాతం ఉన్న ఎడల కూడ ఈ లోపం కనిపిస్తుంది. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 మరియు 90 రోజుల తరువాత లీటరు నీటికి 1-15 గ్రా. బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పూత పిందే రాలటం : ప్రతికూల పరిస్దితుల్లో మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వలన లేదా కాయ తొలుచు పురుగుల ద్వారా వాటిల్లే నష్టం వలన ప్రతిలో దాదాపు 60 నుండి 70 శాతం వరకు పూత, పిందే రాలటం జతుగుతుంది. ఈ రాలటాన్ని పోషక పదార్ధాలు మరియు హర్మోన్లు పిచికారి చేయటం ద్వారా కాని, యాజమాన్యం వలన గాని కొంత వరకు అరికట్టవచ్చు.
సాగునీటి వసతివున్న పరిస్థితుల్లో అధిక వర్షలతో పాటుగా నత్రజని ఎరువులు అధిక మోతాదులో వేయడం వలన లేదా నూతన యాజమాన్య పద్ధతులను పాటించటం వలన ఎక్కువగా గొడుగు కొమ్మలు మరియు కాయ కొమ్మలు ఏర్పడటం, మొక్కలో తయారయ్యే పిండి పదార్థంలో ఎక్కువ భాగం, ఈ కొమ్మల అభివృద్ధికే ఉపయోగపడి, పూత కాయలు, పిందె రా లటం జరుగుతుంది. సైకోసిల్ 60 పిపిఎమ్ మోతాదులో పిచికారీ చేసినట్లయితే, మొక్కల్లో అదనపు శాఖీయ పెరుగుదల ఆగిపోయి, మొక్కలో తయారైన పిండి పదార్ధాలు, పూత పిందే అభివృద్ధికి ఉప్యగపడి దిగుబడి పెరుగుతుంది.
బెట్టకు లేదా నీటి ముంపునకు ప్రత్తి పొలం గురనప్పుడు తగు యాజమాన్య చర్యలను సకాలంలో చేపట్టడం ద్వారా పూత, పందే రాలటాన్ని అరికట్టవచ్చు. సాధ్యమయినంత వరకు పోషక పదార్ధాలను మరియు హర్మోన్లను పిచికారీ చేసినప్పుడు, మంచి నీటిని ఉపయోగిస్తూ, సాయంత్రం సూర్యరశ్మి అధికంగా లేని సమయంలో పిచికారీ చేసినట్టయితే మొక్కలు వాటిని బాగా గ్రాహిస్తాయి.
పురుగులు
సాధారణంగా ప్రత్తి విత్తిన 50-60 రోజుల వరకు రసం పిల్చే పురుగులైన పెనుబంక, పచ్చదోమ తామర పురుగులు ఆశించేవి. కాని మారిన సాగు పద్ధతులు మరియు వాతావరణ పరిస్దితులు వలన పెనుబంక మరియు పచ్చదోమ దాదాపు పంట చివరి కాలం వరకు ఆశించి నష్టపరుస్తున్నాయి. అలాగే పైరు పూత, పిందే, మీద పొగాకు లద్దేపురుగు, గులాబి రంగు పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి.
రసం పిల్చేపురుగులు: పెనుబంక ఆశించిన మొక్కలు 10-20 శాతం, పచ్చదోమ ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 20, తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు 10 ఉన్న ఎడల ఆయా పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది.
రసం పిల్చే పురుగుల యాజమాన్యం: పచ్చ, తెల్లదోమలను తటుకొనే రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యుయస్ లేక 4గ్రా. ధయోమిధాక్సామ్తో విత్తన శుద్ధి చేసి విత్తితే 30-40 రోజులు వరకు రాసంపిల్చే పురుగులను నివారించవచ్చు. కిలో విత్తనానికి పైవిధంగా 40-50 గ్రా. కార్బోసల్ఫేట్ తో విత్తనశుద్ధి చేసి విత్తితే 30 రోజులు వరకు రసం పిల్చే పురుగుల నుండి రక్షణ వుంటుంది.మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్చత్తిలో లేక ఇమిడాక్లోప్రిడ్ 200 యస్. యల్ మరియు నీరు 1:20 నిష్చత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20,40,60 రోజుల్లో (పురుగు నష్ట పరిమాణం దృష్టలో వుంచుకొని) మొక్క లేత కాండానికి బ్రష్ తో పూస్తే రసం పిల్చే పురుగులను అదుపులో వుంచుతుంది. ఈ పద్ధతి వలన పురుగు మందు ఖర్చు తగ్గటమే కాక వాతావరణ కాలుష్యం కూడ తగ్గుతుంది. చివరగా అవసరాన్ని బట్టి లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 యస్.యల్ 0.4 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ధయోమీదాక్సామ్ 0.2 గ్రా. లేదా ఎస్ఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ లేదా డైఫేన్ ధయురాన్ 1.25 గ్రా. మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి బిటి ప్రత్తిని పిండినల్లీ ఆశించి నష్టం కలుగచేస్తున్నది. ప్రత్తి పంట నాశించే పిండి పురుగు యొక్క తల్లి, పిల్ల పురుగులు, కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు మరియు కాయలనుండి రసాన్ని పిలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి అకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయలను తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయ పక్వానికి రాకుండా పగిలిపొయి దిగుబడులు మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది.
పిండినల్లి ముఖ్యంగా కాలువగట్లు, పనికిరాని భూములలో ఉండే కలుపు ద్వారా వ్యాపిస్తుంది. ఈ పురుగు ప్రత్తి కట్టెలను తీసిన తరువాత పంటలేనప్పుడు ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది. అతేకాకుండా పురుగు సహజంగా గాలి, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుష్యులు ఈ పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఆశించిన ప్రాంతానికి సంచరంచటం ద్వారా సహజంగా వ్యాపిస్తుంది.
1. కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ, తుత్తర బెండ, పాయలాకు లాంటి వాటిని పెరికి తగుల బెట్టాలి.
2. ప్రత్తి తీసిన తరువాత మొడులను పెరికి తగుల బెట్టాలి.
3. ప్రత్తిని కార్మిపంటగా సాగుచేయకూడదు.
4. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్చత్తిలో కలిపిన ద్రావణం పంట విత్తిన 20,35,50 మరియు 65 రోజుల్లో మొక్క లేత కాండానికి బ్రష్ ద్వారా పూయడం వలన పిండి పురుగును సమర్ధవంతంగా అరికట్టుకోవచ్చును.
5. పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి 3.0 మి.లీ లేదా ఎసిఫేట్ 2 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయ వలెను.
6. పురుగు ఎక్కువగా ఆశించి ఎండిపోయిన మొక్కలను పెరికి తగులబెట్టాలి.
7. మందులను పిచికారీ చేసేటప్పుడు ట్యాంక్ కు 10 గ్రాముల డిటర్జంట్ సర్ఫ్ ను కలిపి వాడాలి.
ఈ పురుగు మొదట పంటలో అక్కడక్కడ ఆశించి తరువాత ఎక్కువ మొక్కలకు వ్యాపిస్తాయి. ఈ దశలో సస్యరక్షణ చర్యలను చేపట్టి పొలం అంతా వ్యాపించకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైతే పురుగు ఆశించిన మొక్కలను గమనించినప్పుడు అక్కడే పిచికారీ చేస్తే సరిపోతుంది.
10 శాతం పూతకు నష్టం వాటిల్లినపుడు మొక్కకు ఒక పచ్చపురుగు గ్రుడ్డు లేదా డ\లార్వా వున్నప్పుడు, 10 మొక్కలకు ఒక లద్దె పురుగు గ్రుడ్డు సముదాయం గమనించినపుడు, 10 గులాబి రంగు ఆశించన గడ్డి పూల గుర్తించినపుడు కాయతోలిల్చే పురుగులవలన పంటకు నష్టం అధికంగా వుంటుంది.
కాయాతోలుచు పురుగుల సమగ్ర సస్యరక్షణ
1. పంట మార్పిడి పధ్ధతి అవలంభించాలి
2. వేసవి దుక్కులు లోతుగా దున్నాలి
3. 25% సేంద్రీయ ఎరువులు, 75% రసాయన ఎరువుల వాడాలి.
4. బొబ్బర (అలసంద), కొర్ర, సోయాచిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు 1:2 నిష్చత్తిలో పంటలుగా వేయాలి. చేనుచుట్టూ నాలుగు వరుసల జొన్న లేక మొక్కజొన్న కంచే పంటగా వేయాలి.
5. శనగపచ్చ పురుగును ఆకర్షించటానికి ఎకరాకు 100 పసుపురంగు పూలు పూచే బంతి మొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఎరివేయాలి.
5. శనగపచ్చ పురుగును ఆకర్షించటానికి ఎకరాకు 100 పసుపురంగు పూలు పూచే బంతి మొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఎరివేయాలి.
6. శనగపచ్చ పరుగు, లద్దేపురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్శణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగులు 10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
7. విత్తిన 80-100 రోజుల మధ్యకాలంలో శనగపచ్చ పురుగు సోకిన మొక్కల తలలు త్రుంచాలి.
8. పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను, నివారించటానికి 5 శాతం వేప గింజల ద్రావణాన్ని (10 కిలోల వేప గింజల పొడి 200 లీటర్ల నీళ్ళలో 24 గంటలు నానబెట్టి వడపోసిన ద్రావణం) పిచికారీ చేసుకోవాలి.
9. పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా ‘టి’ ఆకారపు కర్రలను లేక పంగల కర్రలను ఎకరాకు సుమారు 15-20 పెట్టాలి.
10. గులాబి రంగు పురుగు ఉధృతి తగ్గటానికి గడ్డి పూలను ఎరేవేయాలి.
11. పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకొని లీటరు నీటికి క్వినాల్ ఫాస్ 2.5 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 3 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ లేదా ధయోడికార్బ్ 1.5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పచ్చ పురుగు గ్రుడ్లు ఎక్కవగా వుంటే ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లేదా ధయోడికార్బ్ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ లీటరు నీటి మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఒకే మందు ఎక్కువసార్లు పిచికారీ చేయకుండా మందులు మర్చి వాడుకోవాలి.
12. పచ్చ పురుగు ఉధృతి ఎక్కవగా వున్నప్పుడు మూడవ దశ దాటిన పచ్చపురుగును చేతితో ఏరివేసి లీటరు నీటికి ఇండాక్సాకార్బ్ 1 మి.లే లేదా స్పైనోసాడ్ 0.3 మి.లి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 0.3 మి.లీ లేదా క్లోరాన్ట్రైనేలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పిచికారి చేయాలి.
13. పొగాకు లద్దేపురుగును నియంత్రించుటకు సమగ్ర సస్యరక్షణ పాటిస్తూ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 1 మి.లీ నోవాల్యురాన్ లేదా లుఫెన్యురాన్ లేదా 1.5 గ్రా ధయోడికార్బ్ పిచికారీ చేయాలి. మూడవ దశ దాటిన లద్దేపురుగును అడుపుచేయటానికి విషపు ఏరును వాడాలి (ఎకరానికి 10 కిలోల తవుడు 2 కిలోల బెల్లం వీటితోపాటు 750 మి.లీ క్లోరిపైరిఫాస్ లేదా 300 గ్రా ధయోడికార్బ్ జోడించి ఈ మిశ్రమానికి తగినన్ని నీళ్ళు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయంలో పొలమంతా వెదజల్లాలి).
14. గులాబి రంగు పురుగును అదుపు చేయటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పంట చివర కాలంలో లీటరు నీటికి క్వినల్ఫాస్ 2.5 మి.లీ లేదా ధయోడికార్బ్ 1.5 గ్రా. కలిపి అవసరము మేరకు పిచికారీ చేసుకోవాలి.
వేరుకుళ్ళు తెగుళ్ళు : భూమిలో తేమ అధికంగా వున్నప్పుడు ఈ తెగలు పైరు అన్ని దశల్లో కనబడుతుంది. లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టుపై నుండి క్రిందికి వ్రేలాడుతూ వుంటాయి. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బెండిజిం లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి. కాపెర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లేదా కర్బెండిజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేల పై పోయాలి.
ప్యూజేరియం వడలు తెగులు : వడలు లక్షణాలు ఏ దశలోనైన కన్పించవచ్చు. మొలక దశలో ఆశించినపుడు నానుడు తెగులు లక్షణాలు కన్పిస్తాయి. ఎదిగిన మొక్కలలో పుష్చించే దశలో ఈ తెగులు ఎకువగా కన్పిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి మొదట ఈనెల మధ్య పసుపురంగుగా, తదుపరి ఎర్రగా మారి ఆకులు క్రింది నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. కొమ్మలను చీల్చి చూస్తే లోపల నల్లని బూజుతో చారలుగా కన్పిస్తాయి.
వర్టిసిలియం వడలు తెగులు : ఈనెల మధ్య పసుపు రంగుకు మారి, తెగులు తీవ్రమైనపుడు కణాలు చనిపోయి పెద్ద నల్లని మచ్చలు ఏర్పడి ఆకుల పై పులి చారల వలె కాన్పిస్తాయి, కాని కాయలు ఏర్పడవు. మరియు వేరును చీల్చి చూస్తే లోపల గోధువు రంగుకు మారి ఉంటుంది.
వేరుకుళ్ళు తెగులు నివారణకు సూచించిన చర్యలను పాటించాలి. సిఫార్సు మేరకు పోటాష్ ఎరువులను తప్పక వాడాలి.
నల్లమచ్చ తెగులు : ముందుగా ఆకుల పై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వత నల్లగా మారి మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది. తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కొమ్మలకు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. దీనినే బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. పైరు వివిధ దశల్లో కనిపిస్తుంది. వర్షాకాలంలో మబ్బులు పట్టినపుడు ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది. కిలో విత్తనానికి 10 గ్రా సుదోమోనాస్ ప్లోరెసెన్స్ తో విత్తనశుద్ధి చేయాలి. ఉధృతిని బట్టి 3-4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రా. స్ట్రెప్టోసైక్లోన్, పౌషామైసిన్ లేక ప్లోంటోమైసిన్ మరియు రాగి ధాతు సంబంధిత మందులు (కాపెర్ ఆక్సి క్లోరైడ్) 30 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
అకుమచ్చ తెగుళ్ళు : ఆల్టర్నేరియా వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు సుడులుగా, రింగులుగా ఏర్పడతాయి. సేర్కోస్పోరా వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది,. హేల్మింతోస్ఫారియమ్ వలన మీద తేలిక గోధుమ రంగు గుండ్రని మచ్చులు ఏర్పడి మధ్యభాగం బుడిదరంగుతో చుట్టూ ఎర్రటి అంచులు ఏర్పడతాయి. ఆ మూడు తెగుళ్ళు నివారణకు సూడోమోనాస్ తో విత్తన శుద్ధి చేసి నాటాలి. లీటరు నీటికి 2.5 గ్రా. మంకోజేబ్ లేదా రాగిధాతు మందు (కాపెర్ఆక్సి క్లోరిడ్) 3 గ్రా. లేదా క్యూమాన్.ఎల్. 4 మి.లీ లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ లేదా కాప్టాను + హెక్సాకోనజోల్ (తాకత్) 1 గ్రా. 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి.
బూజు తెగులు: ఆకుల మీద కొనాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడి, బూజు తెగులు శిలింధ్ర బీజాలు ఆకుల అడుగుభాగాన ఏర్పడతాయి. ఉధృతినిబట్టి ఆకు పై భాగాన కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండు బారి రాలి లేదా పొడి గంధకం ఎకరాకు 8-10 కిలోలు పవరు డస్టరునుపయోగించి చల్లాలి.
త్రుప్పు తెగులు: త్రుప్పు తెగులు ఎక్కువగా కాయ పక్వ దశలో ఆశిస్తుంది. ముదురు ఆకులు భాగాన త్రుపు మచ్చలు ఏర్పడి క్రమంగా లేత ఆకులకు వ్యాపిస్తాయి. తెగులు ఉధృతి పెరిగే కొద్ది ఆకుల పై భాగాన ఈ త్రుప్పు మచ్చలు గుంటలు ఏర్పడినట్లుగా కాన్పిస్తాయి. నవంబరు – ఫెబ్రవరి మాసాల్లో ఈ తెగులు ఎక్కువగా కాన్పిస్తుంది. అధిక తేమ వుండి వర్షాలు పడుతున్నప్పుడు పికోనజోల్ లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధితో 3-4 సార్లు పిచికారీ చేయాలి.
కాయకుళ్ళు తెగులు : ప్రతి పంట కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడితే అనేక రకాలైన శిలింధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. ఈ శిలింధ్రాలు ఎక్కువగా కాయతొలుచు పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాలు ద్వారా కయలోనికి ప్రవేశిస్తాయి. నివారణకు సాధారణంగా మందులు కలిపి పైన చెప్పిన మోతాదులో పిచికారీ చేయాలి.
టొబాకో స్ట్రిక్ వైరుస్ తెగులు : ఈ వైరుస్ తెగులు తామర పురుగుల ద్వారా ప్రత్తిని ఆశిస్తుంది. వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివరి ఆకులు కొద్దిగా పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయి. కొంత భాగం ఆకులు మాడిపోతాయి. కొత్త చిగురు, పూత ఏర్పడదు. వయ్యారిభామ, గడ్డి చేమంతి, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వ్యపిస్తుంది. కావున ఈమొక్కలను నాశనం చేయాలి. తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేక ధయోమిధాక్సామ్ 0.2 గ్రా. లేక ఇమిడాక్లోప్రిడ్ 0.3. మి.లీ లేక ఎసిటిమిప్రిడ్ 0.2 గ్రా చొప్పున వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి.
పండాకు తెగులు : ప్రత్తిలో ఆకుల ఎర్రబడటాన్ని పండాకు తెగులు అంటారు. ముఖ్యంగా, ఇది మొక్క అడుగు భాగాన ఆకుల మీద కనబడుతుంది. ఆకులు మొదట ముదురు గులాబి రంగుకు మారి, ఆ తరువాత పూర్తి ఎర్రగా మారతాయి. క్రమేపి ఎండిపోయి. రాలి పోతాయి. పండాకు తెగులు మొక్క తొలిదశలో వచ్చినట్లయితే నష్టం అధికంగా వుంటుంది. చివరి దశలో వచ్చిన పుడు కలిగే నష్టం పరిమితంగా వుంటుంది.
ప్రత్తి అధికంగా కాపు వున్న సమయంలో పోషక పదార్ధముల ఆవశ్యకత ఎక్కువగా ఉండటం, అదే సమయంలో మొక్క వివిధ వాతావరణ ఒత్తిడులకు లోనవ్వడం వలన ఈ పండాకు తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది.
పండాకు తెగులు నివారణకు 1% మెగ్నీషియం సల్ఫేటుతో పాటుగా 2% యూరియా లేదా 1% డై అమ్మోనియం ఫాస్ఫేట్ కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
ప్రత్తి పంటలో ఆకులు పక్వానికి రాకముందే వడలిపోయి రాలిపోవడం గమనించడమైనది. దీనిని విశ్లేశించినప్పుడు నేలలో పోటాష్ లభ్యత అధికంగా వున్నప్పుటికి ని మొక్కలో పొటాషియం లోపం వలన ఈ విధంగా జరిగినట్లుగా నీరూపించబడినది. దీనిని అధిగమించుటకు 2% పొటాషియం నైట్రేటు ద్రావణం పిచికారీ ద్వారా అందించాలి.
ఎండిన ఆకులు ఇతర చెత్త కలవ కుండ తీయాలి. తీసిన ప్రత్తిని నీడలో అరబేటి నిల్వచేయాలీ. నిల్వచేసిన ప్రత్తికి గాలి తగిలేటట్టు తేమ తగలకుండా చూడాలి. ప్రత్తి నాణ్యత ముఖ్యంగా పింజ పొడవు, పింజ గట్టితనం, పింజ మృదుత్వం పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్తి నాణ్యత అనేది జన్యు సంబంధమైనది. అయితే దీని మీద పోషక పదార్దాల యాజమాన్యం, వాతావరణ మరియు చిడపిడల ప్రభావం కొంత మేరకు వుంటుంది.
ప్రత్తిలో పూత దఫదఫాలుగా రావటం వల్ల ప్రత్తిని కనీసం నాలగైదు సార్లు తీయవలసి వస్తుంది. బాగా ఎండినటువంటి ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరుచేయాలి. సాధారణంగా ప్రత్తి డిసెంబరు, జనవరి నేలల్లో తీతికు రావడం, అదే కాలంలో మంచు కురియడం వలన ప్రతి తడసి ముద్దగా అవుతుంది కాబట్టి ప్రత్తిని ఉదయం ఎనిమిది గంటలు తరువాత మధ్యాహ్నం ఒంటి గంటలోపోల, మరల సాయంత్రం మూడుగంటలనుంచి ఆరుగంటల లోపల తీసుకోవాలి. వేడి ఎక్కవుగా వున్న సమయంలో ప్రత్తి తీస్తే వాటితోపాటు గుల్లల వద్ద వున్న తొడిమలు, ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై ప్రత్తికి అంటుకుంటాయి.
ప్రత్తి తీయగానే నీడలో మండేలు వేయాలి. ఈ విధంగా చేయటం వలన గింజ బాగా గట్టిపటమేకాకుండా, తేమ తగ్గి ప్రత్తి శుభ్రంగా ఉంటుంది. అలా చేయనట్లయితే దానిలో వున్న తేమ వలన వేడి ఎక్కువై గింజలు ముడుచుకుపొయి ప్రత్తి తూకం తగ్గటమే కాకుండా, ముక్క పురుగు తగిలి నాణ్యత తగ్గుతుంది.
బిటి రకం లేని అదే రకం కన్నా ముందుగా పక్వానికి వస్తుంది . గతంలో తక్కువ స్ధాయిలో నన్నటువంటి పిండినల్లి ఉధృతి పెరిగింది. బిటి రకాలలో ప్రతికూల పరిస్ధితుల తరువాత సాధారణ పరిస్దితులు నేలకోన్నప్పుడు, చిగురించే శక్తి కుదతక్కువగా నున్నది. పై విషయాలన్నింటిని పరిగానలోనికి తీసికొనినట్టితే, బిటి ప్రత్తి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాలి.
పంట తొలిదశ 1-60 రోజుల పంట దశ (రసం పిల్చు పురుగులు ఆశించు దశ)
బిటి ప్రత్తి పంటను తోలిదశోలో ఆశించే రసం పిల్చు పురుగులైనటువంటి పచ్చదోమ, పెనుబంక మరియు తామరపురుగులను ఈ క్రింది పద్దతుల ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు.
ప్రతి పంటలో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గర నుండి కాయతొలుచు పురుగులు ఆశించటం మొదలవుతుంది. కాయతోలచు పురుగులలో ముఖ్యమైనవి తలనత్త, శనగపచ్చ పురుగు మరియు పోగాకులద్దె పురుగు. ఇవి పంట యొక్క వివిధ దశలలో దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ క్రింది యాజమాన్య పాటించడం ద్వారా కాయ తొలుచు పురుగు బారి నుండి పంటను సమర్ధవంతంగా కాపాడవచ్చును.
దశలో సాధారణంగా శనపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుది 90 రోజుల నుండి బిటి ప్రతిలో గూడ, పూత మరియు పిందేలలో ఉండే బిటి ప్రోటిను స్ధాయి క్రమేపి తగ్గుతూ ఉండటం వలన శనగపచ్చ పురుగు నియంత్రణ కూడా క్రమేసితగ్గుతూ ఉంటుంది. కావున ఈ దశలో ఎవైన గొంగళి పురుగుల నష్టపరిమితి స్తాయి గమనించినచొ ఒకటే లేదా రెండు పర్యాయాలు క్రిమిసంహారక మందులు ఉపయోగించడం ద్వారా పురుగును అదుపు చేయవచ్చును.
ఈ దశలో సాధారణంగా గులాబీరంగు పురుగు మరియు పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
తెగుళ్ళు కనపడిన ప్రధమ దశలోనే సిఫారసు చేసిన విధంగా నివారణ చర్యలు చేపట్టాలి.
ప్రతి పంట పై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా :
“ప్రధాన శాస్త్రవేత్త (ప్రత్తి), ప్రాంతీయ వ్యాసాయ పరిశోధనా స్ధానం, లాం ఫారం, గుంటూరు – 522 034” ఫొన్: 08632524169/2524054 ఎక్స్టెన్షన్ 221 సెల్: 9989625207
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020