Accessibility options
Accessibility options
Government of India
Contributor : P.Akhila Yadav02/01/2024
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
ఆంధ్రప్రదేశ్ లో రాగి 1.13 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ 49 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు 4.35 క్వింటాళ్ళ వస్తుంది.
రాగిని ఖరీఫ్ లో జూలై-ఆగష్టు మాసాల్లో, రబీలో నవంబరు-డిసెంబరు మాసాల్లో వేసవిలో జనవరి-ఫిబ్రవరి మాసాల్లో విత్తుకోవచ్చు.
రాగిని తేలిక రకం ఇసుక నేలలయందు మరియు బరువు నేలల్లో పండించవచ్చు. నీరు నిల్వఉండే భూములు అనువైనవికావు.
రకం |
ఋతువు |
పంటకాలం (రోజుల్లో) |
దిగుబడి (క్వి/ఎ) |
గుణగణాలు |
గోదావరి |
ఖరీఫ్, రబీ |
120 – 125 |
12 - 16 |
అన్ని ఋతువుల్లో పండించవచ్చు, పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క పచ్చగా ఉండి, వెన్నులు పెద్దగా, ముద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగు కలిగి, మధ్యస్థ మైన లావుంటాయి. |
రత్నగిరి |
ఖరీఫ్, వేసవి |
110 – 115 |
12 - 16 |
పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క ఆకుపచ్చగా వేసవి ఉండి 90 సెం.మీ. ఎత్తువరకు ఎదుగుతుంది. వెన్నులు పెద్దగా మద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగులోఉండి, మధ్యస్థమైన లావుగా ఉంటాయి. |
సప్తగిరి |
ఖరీఫ్, రబీ |
110 – 115 |
12 - 16 |
పైరు ఎత్తుగా పెరిగి, పిలకలు ఎక్కువగా వేస్తుంది. చిత్తూరు జిల్లాకు అనుకూలం. |
మారుతి |
ఖరీఫ్, వేసవి |
85 - 90 |
10 - 12 |
బెట్టను, అగ్గి తెగులును అన్ని దశల్లోను తట్టుకొంటుంది. |
చంపావతి |
అన్ని కాలలకు |
50 – 85 |
10 - 12 |
రాగి పండించే అన్ని ప్రాంతాలకు అనువైనది. బెట్టను తటు కొంటుంది. అంతర పంటగా కందితో పండించేందుకు అనువైనది. |
భారతి |
అన్ని కాలలకు |
105 – 110 |
14 – 16 |
అన్ని ఋతువులలో పండించవచ్చు. వెన్నులు పెద్దగా ముద్దగా ఉంటాయి. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకోగలదు. |
శ్రీ చైతన్య |
ఖరీఫ్ |
110 - 115 |
12 - 16 |
పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది. ఖరీఫ్లో .అన్ని ప్రాంతాలకు అనువైనది. |
2.5 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం కావాలి.
కిలో విత్తనాన్ని 2 గ్రా, కార్బండైజిమ్ లేదా 3 గ్రా, మాంకోజెబ్తో కలిపి విత్తనశుద్ధి చేయాలి.
తేలిక పాటి దుక్కిచేసి విత్తనం చల్లి, పట్టె తోలాలి. నారుపోసి నాటుకోవాలి. మరుగు నీటిపారుదల సౌకర్యంగల నేలల్లో నారుపోసుకోవాలి.
85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసుకల్గిన మొక్కలను, 105-125 రోజుల దీర్ఘ కాలిక రకాలకు 30 రోజుల వయసు కల్గిన మొక్కలను నాటుకోవాలి. ఎకరాకు దీర్ఘకాలిక రకాలకు లక్ష ముప్పె మూడు వేల మొక్కలు, స్వల్పకాలిక రకాలకు రెండు లక్షల అరవై ఆరువేల మొక్కలు ఉంచాలి.
స్వల్పకాలిక రకాలకు వరుసల మధ్య 15 సెం.మీ. వరుసలో 10 సెం.మీ., దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం.మీ. వరుసలో 15 సెం.మీ. దూరం పాటించి విత్తుకోవాలి.
బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతోగాని, చెట్టుకొమ్మతోగాని, నేలను చదును చేయాలి. లేనిచో విత్తనానికి తగినంత తేమ లబించక మొలక శాతం తగ్గుతుంది.
విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తనం వేసేదానికి మరియు నారు నాటటానికి ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మి.లీ. వేసేదానికి చొప్పన 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారించవచ్చు. నాటిన 25, 30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా. 24 డి సోడియం సాల్ట్ 80% పొడి మందు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజులు నీరు పెట్టరాదు. పూత, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.
రాగితో కందిని 8:2 నిష్పత్తిలో సాగుచేయవచ్చు. దీనిలో రాగి వరసల మధ్య దూరం 30 సెం.మీ., మొక్కల మధ్యదూరం 10 సెం.మీ. కంది వరసల మధ్యదూరం 60 సెం.మీ., మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి. రాగితో చిక్కుడును 8:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. వరుసల మధ్యదూరం 30 సెం.మీ. వరసల్లో మొక్కల మధ్యదూరం 10 సెం.మీ. మరియు చిక్కుడు మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి.
దీని నివారణకు ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఏరివేయాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయడం ద్వారా వీటివల్ల కలిగే నష్టం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి ఒకటి, రెండు శాతం మొక్కల్లో పురుగు ఆశించినప్పడు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
సస్యరక్షణతో మంచి ఫలితాలు పొందాలంటే, ఒక ఎకరకు 200 లీటర్ల నీటితో సిషార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక/ శిలీంద్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయవలసి వుంటుంది.
రాగి పంటను సరైన సమయంలో కోతను ప్రారంభించాలి. గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పడు, వెన్నుకు దగ్గరి ఆకులు పండినట్లుగా ఉన్నప్పడు పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పను కోసి 2-3 రోజులు ఆరిన తరువాత వెన్నులను విడదీయవచ్చు లేదా నేరుగా చొప్పను కోయకుండ వెన్నులనే కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగాని, ట్రాక్టరు నడపడం ద్వారా గాని గింజలను సేకరించాలి. అలా సేకరించిన గింజలను గాలికి తూర్పారబెట్టి నాణ్యమైన గింజలను పొందవచ్చు.
రాగి పంటసాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రిన్సిపల్ సైంటిస్ట్ (చిరుధాన్యాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్ల పల్లె - 517 505, ఫోన్ నెం. (077)-2276240, సేల్ నెం. 9989625227. (లేదా) ప్రిన్సిపల్ సైంటిస్ట్ (బ్రీడింగ్) & హెడ్, వ్యవసాయ పరిశోధనాస్థానం, విజయనగరం - 535 001, ఫోన్ నెం. 08922-225983
సుస్థిర దిగుబడులు సాధించడంలో భూసార పరీక్షా ఆవశ్యకత
రాగి సాగులో మెళకువలు
వరి మాగాణుల్లో నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.
చిరుధాన్యాలయిన రాగి, జొన్న, కొర్ర, గంటి, సామలు, అరికెలు, వొదలు గురించి
మిరప సాగు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.
Contributor : P.Akhila Yadav02/01/2024
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
724
సుస్థిర దిగుబడులు సాధించడంలో భూసార పరీక్షా ఆవశ్యకత
రాగి సాగులో మెళకువలు
వరి మాగాణుల్లో నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.
చిరుధాన్యాలయిన రాగి, జొన్న, కొర్ర, గంటి, సామలు, అరికెలు, వొదలు గురించి
మిరప సాగు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.