ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట. వరి విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదక త ఆ ప్రాంతంలోని వర్షపాతం మరియు నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ మరియు ఎ డగారులలో సుమారుగా 22.11 లక్షల హెక్టార్లలో వరిసాగు కాలువలు, చెరువులు, బావుల క్రింద సాగు చేయబడుతూ సు మారుగా 68.64 లక్షల టన్నుల ఉత్పత్తిన్నిస్తూ సరాసరి దిగుబడి ఎకరాకు 12 - 40 కిలోలు వున్నది. మన ఆహార భద్రత వరి పంటపై ఆధారపడి ఉన్నది. కాబట్టి రాబోవు రోజుల్లో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ది గుబడి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుండి పంటకోత వర కు సరైన యాజమాన్య మెళకువలు పాటించిన యెడల సాగు ఖర్చు తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చును.
వరి పంట గురించి పూర్తి వివరాలు క్రింద తెలియజేయడమైనది.
ఇటీవల కాలంలో వరిసాగు ఖర్చు బాగా పెరిగింది. కూలీలపై ఖర్చు పెరగడం, కూలీలు సకాలంలో లభ్యం కావడం కష్టంగా మారింది. తరచుగా వచ్చే వర్షాభావ పరిస్థితుల వలన సకాలంలో వరి నాట్లు వేయలేకపోతున్నారు. కొన్ని పరిస్థితు లలో సకాలంలో నీరందక ముదురు నారు నాటుట లేదా నారు దెబ్బతినడం.
వల్ల నాట్లు సకాలంలో పడక దిగుబడులు తగ్గడం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో సాగు ఖర్చు తగ్గించుకొని, కూలీల సమస్యను అధిగమిస్తూ సాంప్రదాయకంగా నారు పెంచి నాటేదానికి ప్రత్యామ్నాయ పద్ధతిని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలలో ఆచరణలోకి తీసుకువచ్చింది. ఈ సాగు వలన కలుగు ఉప యోగములు క్రింద వివరించడమైనది.
నేరుగా విత్తే పద్ధతిలో మెళకువలు:
డ్రమ్ సీడర్తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు కోనోవీడర్ని నడపాలి. డ్రమ్సీడర్ పద్ధతి వరకు ప్రత్యేకమైన కోనోవీడర్స్ అందుబాటులో వున్నాయి. కోనోవీడర్ నడపడం వలన వరుసల్లో మొలచిన కలుపు భూమిలోకి కలియబడుతుంది. తదుపరి 10 రోజులకొకసారి 2 సార్లు కలుపు ఉన్నా లేకపోయినా కోనోవీడర్ను వరుసల్లో నడపడం వలన భూమి బాగా కదిలి వేరు వ్యవస్థకు గాలి, పోషకాలు బాగా అందుతాయి. ఎక్కువ పీచు వేర్లు వృద్ధి చెంది వేరు వ్యవస్థ బలంగా తయా రవుతుంది. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు పెట్టి మొక్క గుబురుగా తయారవుతుంది. దిగుబటి పెరుగుతుంది. కోనోవీడర్ ను నడపాలనుకున్న ముందురోజు సాయంత్రం పొలంలో పలుచగా నీరు పెట్టాలి. పలుచని నీటి పొర మీద పళ్ళ చక్రా లు మట్టి అంటుకోకుండా బాగా దొర్లుతాయి. పైరు పెరిగే దశలో అక్కడక్కడ మిగిలిన కలుపు మొక్కలను కూలీలచేత తీయించాలి.
విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా వుండే బిస్ ఫైరిబాక్ సోడియం అనే కలుపు మందును 80 నుండి 120 మి.లీ. 200 లీ. నీటికి కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా వున్న పొలానికి సైహలో ఫాప్ బ్యుటైల్ మందుని 300-400 మి.లీ. వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా వుంటే 2, 4డి సోడియం లవణం 400 గ్రా. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి.
యాజమాన్య పద్ధతులు :
‘శ్రీ’ పద్ధతిలో పాటించాల్సిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు:
శ్రీ పద్దతిలో నారుమడి :
శ్రీ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారు నాటటంతో వేర్లు బాగా వృద్ధిచెంది బలంగా ఉండి 30 నుండి 50 పిలక లు వేస్తుంది. శ్రీ సాగులోని 6 యాజమాన్య పద్ధతులను తుచ తప్పకుండా పాటిస్తే ఒక్కో మొక్కకు 50 నుండి 100కి పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (400 వ రకు) బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. ‘శ్రీ’ పద్ధతి భూమిలోని సూక్ష్మజీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావలసిన పోషక పదార్థాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థి ర దిగుబడుల నివ్వగలదు.
తక్కువ నీరు ఉపయోగించి వరి పండించు పద్ధతిలో ఎరోబిక్ సాగు విధానము ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కూడ ప్రాచుర్యం పొందుచున్నది.
ఎరోబిక్ వరి సాగు పద్ధతి 2002 దశకంలో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, ఫిలిప్పిన్స్లో విస్తృత పరిశోధనల ద్వారా ఫిలిప్పిన్స్, చైనా, భారతదేశం వంటి దేశాల్లో ప్రవేశపెట్టడమైనది. మన రాష్ట్రంలో రైతులు అవలంభించే ఆరుతడి వ 8 పద్ధతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎరోబిక్ వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న జొన్న వంటి పంటలవలె ఆరుతడి పరిస్థితులలో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టుట ద్వారా పండించే విధానాన్ని 'ఎరోబిక్ వరి' అని వ్యవహరిస్తారు. ఎరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా వరాధార పంటగా పండించే భూముల్లో అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువులు క్రింద సాగుచేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఆరుతడి వరిని పండించడానికి పొలంలో నీటిని నిలగట్టవలసిన అవసరం లేదు.
ఆరుతడి (ఎరోబిక్) పద్ధతిలో వరిసాగుకి ఈ క్రింది యాజమాన్య పద్ధతులు ఆచరించాలి:
ఏరోబిక్ వరిలో ఇనుపధాతు లోపం ఎక్కువగా వస్తుందని గమనించడమైనది. ఇనుపధాతు లోపించుట వలన ఆకులు తెల్లగా పాలిపోయినట్లు వుండి ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 20 గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్ప కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే వారం రోజులు తరువాత మరొకసారి పిచికారీ చేయాలి.
ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయుట వలన లాభాలు:
ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయుట వలన సమస్యలు:
వరి పంట సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్చిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త (వరి), వ్యవసాయ పరిశోధనా స్థానం, ముత్తుకూరు రోడ్, నెలూరు – 524 003, ఫోన్ నెం. 0861 – 2327803, సెల్ : 9989625214
వ్యవసాయ పరంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ పనిముట్ల లేదా యంత్రాల వాడకంలో మ న రైతాంగం వెనుకబడి ఉన్నారు. వరి సాగులో నీటి వినియోగంతో పాటు, కూలీల అవసరం కూడా చాలా ఎక్కువ. సుమా రు ఒక ఎకరాకు పంటకాలంలో 50-70 రోజుల పని దినాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా వరినాట్లు సకాలంలో వేసినపుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడము, ఇటీవల కాలంలో కూలీరేట్లు అధికమవడము వలన వరినాట్లు యంత్రాలతో వేయవలసిన ఆవశ్యకత ఏర్పడినది. వరిసాగు రైతాంగము వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటడానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరయిన సమయంలో నాట్లు వేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ముఖ్యకారణం వరినాట్లు వేయడం శ్రమతో కూడుకున్న పని మరియు బురదలో చేయవలసిన పని. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరినాట్లు నాటేటటువంటి పనులను చేపట్టడానికి సుముఖత చూపడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరినాటు యంత్రాలు ప్రవేశపెట్టడం జ రిగింది. వీటిని 25 సంవత్సరములు ముందుగనే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదని చె ప్పవచ్చును. కానీ ప్రస్తుత పరిస్థితులలో వరినాటు యంత్రం తప్పనిసరిగా వాడవలసిన అవసరం ఉంది. ఈ వరి నాటు యెంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్రత్యేక ట్రేలలో గానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది.
వరినాటు యంత్రాలు
యాజమాన్య పద్ధతులు
ఎ) చదును చేయడం : పొలం బాగా చదును చేసుకొన్నట్లయితే యాంత్రిక పద్ధతిలో నాట్లు వేసినపుడు కలుపు సమస్యను అధిగమించి నీటిని 15-20 శాతం పొదుపు చేసుకొనడమే కాక దిగుబడులు కూడా 10-20% అ ధికంగా వస్తాయి. వేసవిలో తొలకరి వరాల తర్వాత, పొలాన్ని మెత్తగా దున్నుకొని (రోటావేటర్ సహాయంతో) లే జర్ గాడెడ్ లెవెలర్ అనే పరికరంతో పొడి దుక్కితో పొలాన్ని బాగా చదును చేయాలి.
భి) దమ్మ చేయడం : దున్ని చదును చేసిన పొలాన్ని నీరు పెట్టి బాగా 2-3 సార్లు రోటావేటరు సహాయం దమ్మ చేయాలి. ఈవిధంగా చేయడం వలన 35-40 శాతము సాగునీటిని ఆదా చేయవచ్చును. పొలం స్వభా కావాన్ని బట్టి 2 నుండి 5 రోజులు నాటుటకు ముందుగా దమ్ముచేసి, చదును చేయాలి. దీని వలన మట్టి బాగా తేరుకొని, నాట్లు వేయడానికి అనువుగా ఉంటుంది.
యంత్రాల ద్వారా నాట్లు వేయదలచుకొన్నప్పడు నారును ట్రేలలో పెంచాలి.
ఎ) విత్తన మోతాదు : ఎకరానికి రకాన్ని బట్టి 12-15 కిలోల విత్తనం సరిపోతుంది.
బి) నారు వయస్సు : ట్రేలలో పెంచిన నారును 14 నుండి 17 రోజుల వయస్సులో నాటాలి. 14 రోజుల కంటే తక్కువ వయసు ఉన్నపుడు నారును మిషన్ తీసుకోవడానికి కష్టము మరియు ముదురు నారును నాటాలంటే వ్యవస్థ బాగా అల్లుకొని నాట్లు వేయడం కష్టమవుతుంది. నారు పొడవు కూడా 15 సెం.మీ. మించినపుడు, నాట్లు వేస్తే నారు మడతపడి సరిగా నాటు పడదు.
సి) ట్రేలలో నారు పెంచడము : ముందుగా ఎకరాకు సరిపడే 12-15 కిలోల విత్తనాన్ని 2 కిలోల ఉప్ప నీటిలో వేసి, తర్వాత మంచినీటిలో 4-5 సార్లు బాగా కడిగి, 24 గంటలు నీటిలో నానబెట్టి 12 గంటలు మండె కట్టిన విత్తనాన్ని బ్రెలలో సీడింగ్ మెషిన్" ద్వారా వేయాలి. ట్రేలు 2 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి, ఒక అంగుళం ఎత్తు ఉండి, ఎకరాకు 70–80 ట్రేలు అవసరమవుతాయి. ఒక్కో ట్రేలో 3.5 నుండి 4.0 కిలోల మట్టి అవసరం అవుతుంది. ఒక బ్రేకి విత్తన పరిమాణాన్ని బట్టి 120-160 గ్రాముల సరిపోతుంది. ఈ ట్రేలను నింపడానికి ఆటోమెటిక్ సీడింగ్ మిషన్"ని తయారు చేశారు. వీటిలో పొడి మట్టి అవసరం అవుతుంది. మట్టిని పొడి చేసే యంత్రాన్ని ఉపయోగించి మట్టిని బాగా మెత్తగా చేసుకొని, ఆటోమెటిక్ సీడింగ్ మెషిన్లో వేసినపుడు ట్రేలు కన్వేయర్ బెలు ద్వారా పంపినచో మొదటి రెండు తర్వాత విత్తనం, తర్వాత పలుచగా మట్టిని వేయడం మరి యు నీటిని కూడా పలుచగా చల్లడం జరుగుతుంది. తర్వాత ట్రేలను దమ్మ చేసిన వరి నారు మళ్ళలో పెట్టి, మొ దటి రెండు రోజులు ఉదయం, సాయంత్రం నీటిని రోజ్ క్యాన్ తో గానీ, చేతితో గానీ చిలకరించాలి. ట్రేలపైన వరి గడ్డిని కప్పడం వలన విత్తనాన్ని ఎలుకలు, ఎండ, పక్షులు మరియు ఇతరుల నుండి రక్షించుకొనవచ్చును. విత్తనం మోలిచిన తర్వాత 7 లేక 8వ రోజునుండి, పొలంలో నీటిని పలుచగా పెట్టి, ఆవిధంగా తయారైన ట్రేలను రకాన్నిబట్టి 15 నుండి 20 రోజుల లోపు ప్రధాన పొలంలో నాట్లు వేసే యంత్రం ద్వారా నాటుకోవాలి. పొడిమట్టి అందుబాటులో లేనపుడు, నారు మడిలోనే బురద మట్టితో బ్రేలను నింపి, రాళ్ళను పూర్తిగా ఏరివేసి, మండెకట్టిన విత్తనమును ట్రేలపై చల్లి, వరి గడ్డిని కప్పి, నారును పెంచవచ్చును. ట్రేలలో నారు సరిగా పెరగనపుడు 1% యూ రియాని లేదా 1% DAPని పిచికారి చేయాలి.
ప్రస్తుతము రెడ్ ల్యాండ్స్, కుబోటా, యాన్ మార్ కంపెనీల నాట్లు వేసే యంత్రాలు 18 H.P. - 22 H.P. సామర్థ్యం కలిగి 4, 6, 8 వరుసలలో నాటుటకు వీలుగా తయారుచేయబడి ఉన్నాయి. వీటితో ఒక ఎకరాకు 45 నిమిషాల నుండి ఒక గంటకు నాట్లు వేయడానికి వీలవుతుంది. వీటిద్వారా రోజుకు 6 నుండి 8 ఎకరముల వరకు నాట్లు వేసుకొన వచ్చును. ఇవి డీజిల్ మరియు పెట్రోల్ సహాయంతో 2.5 నుండి 6.0 లీ/గంటకు సామర్థ్యంతో పనిచేయుచున్నవి. మెషిన్ల తో పొలంలో నాటడానికి పొలాన్ని పొలం స్వభావాన్ని బట్టి 4 నుండి 6 రోజులు ముందుగా దమ్మ చేసి, బాగా చదును చేసి, నాటే ముందురోజు పొలంలో నీటిని తీసివేయాలి. యంత్రాల ద్వారా ఎక్కువ లోతైన నల్లరేగడి నేలల్లో కూడా నాట్లు వేయవచ్చును. ఈ యంత్రాలతో నారు నాటవలసిన లోతు, మొక్కల మధ్య దూరము నియంత్రించడానికి వీలుగా ఉన్నందు వలన, రైతులకు ఉపయోగకరంగా ఉంది.
ఈ యంత్రాల ఖరీదు 9.5 లక్షల నుండి 11.00 లక్షలు (ఆరు వరుసలు, పెట్రోల్ తో నడిచేవి, కుబోటా కంపెనీ), 16-18 లక్షలు (8 వరుసలు, డీజలుతో నడిచేవి).
ఈ యంత్రాల ద్వారా నాట్లు వేసినపుడు వరుసల మధ్య దూరము ఒక అడుగు (30 సెం.మీ), ఒక వరుసలోని వె యొక్కల మధ్య దూరము 12 సెం.మీ. నుండి 21 సెం.మీ. వరకు మార్చుకోవడానికి అనువుగా ఉంటుంది. పొలంలో నాట్లు కుదురుకు ఎన్ని మొక్కలు నాటాలి మరియు ఎంత లోతులో నాటాలి అనే నియంత్రణ ఉంటుంది. పొలంలో నాట్లు వేసేటప్పడు నీరు తీసివేయడం వలన మరియు నాటిన 2-3 రోజులు చాలా పలుచగా నీరు ఉండడం వలన కలుపు సమ స్య అధికంగా ఉంటుంది. కాబట్టి నాటిన 3-5 రోజుల లోపల ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందును 500 మి.లీ. /ఎకరాకు గానీ, ఆక్సాడయార్డిల్ అనే కలుపు మందును 35-50 గ్రా/ఎకరాకు లేదా బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రెటిలాక్లోర్ గుళికలను ఎకరాకు 4 కిలోల చొప్పన 20 కిలోల ఇసుకలో కలిపి, పొలంలో నీరు పలుచగా ఉన్నపుడు చల్లాలి.
నాట్లు వేసిన 15 నుండి 20 రోజులపుడు పొలంలో కేవలం గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే సైహలోఫాప్ బ్యుటైల్ అనే కలుపు మందును ఎకరాకు 400 మి.లీ. లేదా గడ్డి మరియు ఆకుజాతి కలుపు ఉన్నట్లయితే బిస్ ఫైరిబాక్ సోడియం అనే కలుపు మందును ఎకరాకు 120 మి.లీ. చొప్పన పొలంలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి.
మోటారుతో నడిచే కలుపుతీత యంత్రముతో సాళ్ళ మధ్యలో ఉన్న కలుపును నాటిన 15 రోజుల తర్వాత ప్రతి 10 రోజుల వ్యవధిలో 3-4 సార్లు కలుపు తీయడం వలన, వేర్లకి గాలి బాగా అందుబాటులో ఉండి, పిలకలు అధిక సంఖ్య లో మరియు ఒకేసారి రావడానికి అనుకూలంగా ఉంటుంది.
ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే మామూలు పద్ధతిలో మాదిరాగానే సిఫారసు చేసిన ఎరువుల మోతాదైనటువంటి 120 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం మరియు 40 కిలోల పొటాష్లను ఒక హెక్టారుకు వేయాలి. లేత నారు నాటడం వలన నత్రజనిని 4 నుండి 5 దఫాలుగా, భాస్వరం మొత్తాన్ని దుక్మిలో మరియు పొటాష్ను దుక్మిలో మరియు కరుకు సమయంలో రెండు దఫాలుగా వేయాలి.
వరి నాటు యంత్రాలతో నాట్లు వేయడం వలన సాంప్రదాయ పద్ధతిలో వరిసాగుకంటే ఖర్చు బాగా తగ్గి 10–25 శాతం అధిక దిగుబడులు వచ్చినట్లు పరిశోధనలలో తెలిసినది.
వరి నాటు యంత్రం వలన దిగుబడులు పెరగడానికి కారణాలు
ప్రాంతం |
మొదటి పంట |
రెండవ పంట |
మూడవ పంట |
కోస్తా ఆంధ్ర |
సార్వా (జూన్-నవంబర్) |
దాళ్వా (నవంబర్-మార్చి) |
వేసవి (మార్చి-జులై) (అపరాలు) |
రాయలసీమ |
వానకారు (జూన్-డిసెంబర్) |
ఎండకాయ (నవంబర్-మార్చి) |
ఎడగారు (మే-ఆగష్టు) |
|
విస్తీర్ణం (మి.హె) |
ఉత్పత్తి (మి.ట) |
ఉత్పాదకత (ట.హె) |
ప్రపంచం |
150.0 |
573.0 |
3.8 |
భారతదేశం |
42.7 |
123.0 |
2.9 |
ఆంధ్రప్రదేశ్ |
3.8 |
11.4 |
2.9 |
పంటకాలం/పరిస్థితి |
కృష్ణా మండలం |
గోదావరి మండలం |
ఉత్తర కోస్తా మండలం |
దక్షిణ మండలం |
ఉత్తర తెలంగాణా మండలం |
మధ్య తెలంగాణా మండలం |
దక్షిణ తెలంగాణా మండలం |
అల్పవర్చ ప్రాంత మండలం |
ఉన్నత శ్రేణి గిరిజన మండలం |
1) ఎర్లీ ఖరీఫ్ ముందుగా నాట్లు వేయటానికి |
- |
- |
పుష్పల కాటన్ దొర సన్నాలు |
ధరణి, నిధి శ్రావణి, సోమశిన |
ఓరుగల్లు సాంబ మషూరి |
ఓరుగల్లు సాంబ మషూరి |
- |
- |
పుష్పల, రాశి, ఐ.ఆర్-64 |
2)సార్వా సాధారణ పరిస్థితుల్లో |
స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, ప్రతిభ, దీప్తి, సూర్య, బాపట్ల సన్నాలు ఇంద్ర, అమర |
స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, ప్రతిభ,సూర్య తొలకరి, గోదావరి, ఇంద్ర, అఏమర |
శ్రీకాకుళం, సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర సోనా మషూరి శ్రీకుర్మ, విజేత |
పెన్నా, సింహపురి, తిక్కన, పినాకిని, సావిత్రి, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్-9674, వేదగిరి పార్థివ |
విజేత, కేశవ, శివ, భద్రకాళి, పోతన, కావ్య, దివ్య, తెల్లహంస, జగిత్యాల సన్నాలు, పొలాస, ప్రభ, వరంగల్ సన్నాలు, జగిత్యాల, సాంబ, మానేప్ సోన |
విజేత, కేశవ శివ, భద్రకాళి, పోతన, కావ్య, దివ్య తెల్లహంస, జగిత్యాల సన్నాలు, పొలాస ప్రభ, వరంగల్ సన్నాలు, రామప్ప
|
సాంబమషూరి, సాగర్ సాంబ, ఎర్లీసాంబ, రాజవడ్లు, చందన్, కావ్య, సలీమ, సత్య, ఎర్ర మల్లెలు, తెల్లహంస, సుమతి, తారామతి |
సాంబ మషూరి, సోనా మషూరి, దీప్తి, నంద్యాల సన్నాలు |
శ్రీకాకుళం సన్నాలు, ఫల్గుణ, వసుంధర, సురక్ష, విజేత |
3)సార్వాలో నారుమడిలో ఆలస్యమై, ముదురు నారు నాటటానికి అనువైన రకాలు |
స్వర్ణ, ఇంద్ర, బాపట్ల సన్నాలు, అమర |
స్వర్ణ, చైతన్య, ఇంద్ర, అమర |
శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ |
సింహపురి, తిక్కన, శ్రీరంగ, స్వర్ణముఖి, పార్థవ |
స్వర్ణ, వరంగల్ సన్నాలు |
స్వర్ణ, వరంగల్ సన్నాలు |
స్వర్ణ, ఫల్గుణ, సురేఖ, కావ్య, ఎర్రమల్లెలు, తెల్లహంస, పోతన, సాంబమషూరి |
సాంబమషూరి, సోనామషూరి |
సోనామషూరి |
4)దోమపోటు ఆశించే ప్రాతాలకు |
చైతన్య, కృష్ణవేణి, దీప్తి, ఇంద్ర, అమర |
చైతన్య, కృష్ణవేణి, దీప్తి, ఇంద్ర, గోదావరి, అమర |
చైతన్య, దీప్తి, విజేత |
దీప్తి, విజేత |
- |
- |
- |
దీప్తి |
దీప్తి, విజేత |
5)ముంపు ప్రాంతానికి |
బాపట్ల సన్నాలు, స్వర్ణ, కృష్ణవేణి, ఇంద్ర |
బాడవ మషూరి, ఇంద్ర, స్వర్ణ |
శ్రీకాకుళం సన్నాలు, బాడవ మషూరి |
బాడవ మషూరి, సావిత్రి |
- |
- |
- |
- |
స్వర్ణ |
6)చౌడుభూములకు |
దీప్తి, వికాస్, వ్పగిరి, సోమశిల |
స్వర్ణ, దీప్తి |
దీప్తి, వికాస్, సోమశిల |
వేపగిరి, స్వర్ణముఖి, సోమశిల |
వికాస్ |
వికాస్ |
వికాస్ |
- |
- |
7)సార్వాలో ఆలస్యంగా నాటటానికి |
స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్దొర సన్నాలు |
స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్దొర సన్నాలు |
వసుంధర, సురక్ష, వంశీ, కాటన్దొర సన్నాలు |
స్వర్ణముఖి, స్వాతి, శ్రావణి, సత్య, అపూర్వ |
కేశవ, సురేఖ, పోతన, దివ్య, భద్రకాళి, ఇందూర్, సాంబ శివ, ఎర్రమల్లెలు |
కేశవ, సురేఖ, ఎర్రమల్లెలు, తెల్లహంస |
కేశవ, సురేఖ, ఎర్రమల్లెలు, తెల్లహంస, సత్య, కృష్ణ హంస, రాజపడ్లు |
సాంబమషూరి, సోనామషూరి, నంద్యాల సన్నాలు, సత్య, స్వాతి, సోమశిల, శ్రావణి |
- |
8)వర్షాధారపు మెట్ల ప్రాంతాలకు |
యంటియు-9993, మారుటేరు సన్నాలు, వరాలు |
యంటియు-9993, మారుటేరు సన్నాలు, వరాలు |
యంటియు-9993, మారుటేరు సన్నాలు, వరాలు, శ్రీసత్య |
- |
యంటియు-9993, రుద్రమ వరాలు |
-- |
- |
- |
పుష్కల, యంటియు-9993, మారుటేరు సన్నాలు, శ్రీసత్య |
9)ఆరుతడి ప్రాంతాలకు |
స్వర్ణ, యంటియు-9993, మారుతేరు సన్నాలు, స్వర్ణముఖి, కాటన్దౌర సన్నాలు, విజేత |
స్వర్ణ, యంటియు-9993, మారుతేరు సన్నాలు, స్వర్ణముఖి, కాటన్దౌర సన్నాలు, విజేత |
స్వర్ణ, సోనామషూరి, కాటన్దొర సన్నాలు, విజేత |
తిక్కన, స్వర్ణముఖి, విజేత |
వరాలు |
వరాలు |
స్వాతి, నంద్యాల సన్నాలు |
- |
- |
పంటకాలం/పరిస్థితి |
కృష్ణా మండలం |
గోదావరి మండలం |
ఉత్తర కోస్తా మండలం |
దక్షీణ మండలం |
ఉత్తర తెలంగాణా మండలం |
మధ్య తెలంగాణా మండలం |
దక్షిణ తెలంగాణా మండలం |
అల్పవర్ష ప్రాంత మండలం |
ఉత్తర శ్రేణి గిరిజన మండలం |
1)సాధారణ పరిస్థితుల్లో |
కాటన్దొర సన్నాలు, విజేత, ఐర్ 64, జగిత్యాల సన్నాలు, నెల్లూరి మషూరి |
కాటన్దొర సన్నాలు, విజేత, ప్రభాత్, ఐర్ 64, జగిత్యాల సన్నాలు, నెల్లూరి మషూరి |
పుష్కల, కాటన్దొర సన్నాలు, విదేత |
స్వర్ణముఖి, స్వాతి, విజేత, అపూర్వ, కాటన్దొర సన్నాలు, జగిత్యాల సన్నాలు, నెల్లూరుమషూరి |
దివ్య, ఎర్రమల్లెలు, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, ఇందూర్ సాంబ |
దివ్య, ఎర్రమల్లెలు, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, ఇందూర్ సాంబ, వరంగల్ సాంబ |
సురేఖ, కావ్య, కేశవ, తెల్లహంస, సత్య |
స్వాతి, సత్య, రాశి, నంద్యాల సన్నాలు, కాటన్దౌర సన్నాలు, నెల్లూరు మషూరి |
పుష్కల, కాటన్దొర సన్నాలు, విజేత |
2)ఆలస్యంగా వేయటానికి |
కాటన్దొర సన్నాలు |
కాటన్దొర సన్నాలు |
పుష్కల, కాటన్దొర సన్నాలు |
స్వాతి, శ్రావణి, సత్య, సోమశిల, విజేత, కాటన్దొర సన్నాలు |
తెల్లహంసత్య, రాశి, కేశవ, వర్ష, పోతన, ఐఆర్ 64 |
తెల్లహెంస, రాశి, కేశవ, వర్ష, పోతన, ఐఆర్ 64 |
ఎర్రమల్లెలు, ప్రసన్న, రాశి, పోతన, ఐఆర్ 64, కృష్ణ హంస |
స్వాతి, శ్రావణి, సత్య, రాశి |
పుష్కల, ఐఆర్ 64, ఆభయ, రాశి |
3)దోమపోటు ఆశించే ప్రాంతాలకు |
విజేత, కాటన్దొర సన్నాలు |
విజేత, కాటన్దొర సన్నాలు |
విజేత, కాటన్దొర సన్నాలు |
దీప్తి, విజేత, కాటన్దొర సన్నాలు |
కాటన్దొర సన్నాలు |
కాటన్దొర సన్నాలు |
కాటన్దొర సన్నాలు |
- |
కాటన్దొర సన్నాలు |
4)చౌడు పొలాలకు |
సామశిల |
- |
సామశిల |
సామశిల |
వికాస్ |
వికాస్ |
వికాస్ |
- |
- |
రకం |
ఋతువు |
పంటకాలం(రోజుల్లో) |
దిగుబడి (ఎకరాకు టన్నుల్లో) |
గింజ నిద్రావస్థ (వారాలు) |
పురుగులు, తెగుళ్ళను తట్టుకునే శక్తి |
గుణగణాలు |
స్వర్ణె (యంటియు-7029) |
ఖరీఫ్ |
150 |
3.0 |
3 |
ఎండాకు తెగులు |
వివిధ రకాల భూముల్లోను, వాతావరణ పరిస్థితుల్లోను, రెండు పంటలు పండించు ప్రాంతాలకు స్థిరమైన దిగుబడి నిచ్చే సన్నని గింజ గల రకం. తక్కువ నత్ర జనితో అధిక దిగుబడి నిస్తుంది. చేను మీద గింజ మొలకెత్తదు. చౌడు భూమిలో కూడా పండించవచ్చు. |
చైతన్య (యంటియు-2067) |
ఖరీఫ్ |
150 |
2.5 |
4 |
సుడిదోమ |
క్రిష్ణా-గోదావరి డెల్లాకు అనుకూలం. చేను పడిపోదు. సన్న బియ్యం. |
కృష్ణవేణి (యంటియు-2077) |
ఖరీఫ్ |
150 |
2.5 |
4 |
సుడిదోమ |
సన్నబియ్యం. గింజ చేను మీద రాలే స్వభావం ఉంది. అందువల్ల కర్ర పచ్చి మీద కోయటం మంచిది. |
వజ్రం (యంటియు-5249) |
ఖరీఫ్ |
150 |
2.5 |
4 |
సుడిదోమ |
సన్నబియ్యం |
ప్రతిభ (యంటియు-5293) |
ఖరీఫ్ |
155-180 |
3.0 |
2 |
సుడిదోమ |
|
దీప్తి (యంటియు-4870) |
ఖరీఫ్ |
150 |
2.5 |
5 |
సుడిదోమ, కాంతమేర ఎండాకు తెగులు, టుంగ్రోవైరస్ |
మిక్కిలి నన్నబియ్యం. అన్నానికి బాగుంటుంది.
|
నంది (యంటియు-5182) |
ఖరీఫ్ |
150-155 |
2.5 |
- |
సుడిదోమ |
గింజ సన్నం. కె.సి. కాల్వ ప్రాంతాలకు అనువైనది. |
తొలకరి (యంటియు-1031) |
ఖరీఫ్ |
155 |
2.5 |
- |
సుడిదోమ, ఎండాకు తెగులు |
కాండం దళసరి, చేను పొలం పై పడిపోదు. గింజ తెలుపు. |
గోదావరి (యంటియు-1032) |
ఖరీఫ్ |
150 |
2.5 |
- |
సుడిదోమ |
గింజ సన్నరకం. ఎరుపు గింజ, కాండం దళసరి. |
ఇంద్ర (యంటియు-1061) |
ఖరీఫ్ |
150 |
2.5 |
- |
సుడిదోమ |
సన్నగింజ, తెలుపు, 2-3 వారాల నిద్రావస్థ, చేనుపై పడిపోదు. 10 రోజులు ముంపును తట్టుకొనును. |
బాపట్ల సన్నాలు (బిపిటి-1768) |
ఖరీఫ్ |
165 |
2.5 |
- |
ఎండాకు తెగులు |
సన్నగింజ, క్రిష్ణా పశ్చిమ డెల్లాకు అనువైనది. 10 రోజుల ముంపును తట్టుకొనును. |
బాడవ మషూరి (పిఎల్ఎ-1100) |
ఖరీఫ్ |
160 |
2.5 |
- |
- |
నీరు నిల్వవుండు పల్లపు ప్రాంతాలకు అనువైన రకం. గింజలు సన్నగా మషూరి రకాన్ని పోలి వుంటాయి. గింజ సులువుగా రాలే స్వభావం ఉంది. కోత సమయంలో వరమొస్తే గింజ మొలకెత్తుతుంది. |
విజేత (యంటియు-1001) |
ఖరీఫ్, రబీ |
140 120 |
2.5 3.2 |
6 |
సుడిదోమ, అగ్గితెగులు |
కోస్తా జిల్లాల్లో రెండు పంటలు పండించటానికి అనుకూలమైనది. సన్నబియ్యం. జింకు ధాతు లోపానికి తట్టుకొనలేదు. |
కాటన్దొర సన్నాలు (యంటియు-1010) |
రబీ |
120 |
3.2 |
3 |
సుడిదోమ, అగ్గితెగులు, కొంత వరకు |
గింజ ఐ.ఆర్. 64 లాగా సన్నరకం. కొంత వరకు జింకు లోపం విజేతలో వచ్చినట్లుగా రాదు. ఐ.ఆర్ 64, విజేత సాగుచేసే ప్రాంతాల్లో అనుకూలం. |
ప్రభాత్ (యంటియు-3626) |
ఖరీఫ్, రబీ |
135 |
2.5 3.2 |
3 |
అగ్గితెగులు |
గోదావరి జిల్లాల్లో దాళ్వాకు అనువైనది. చేను పడిపోదు. ముతక బియ్యం. |
సోనామషూరి(బిపిటి-3291) |
ఖరీఫ్ |
135-140 |
2.5 |
2 |
అగ్గితెగులు |
గింజ సన్నం |
ఐఆర్-64 |
రబీ |
120 |
3.0 |
2 |
అగ్గితెగులు |
అతి సన్న బియ్యం |
సూర్య బిపిటి-(4358) |
ఖరీఫ్ |
145 |
2.5 |
- |
సుడిదోమ |
సన్నబియ్యం. నాగారుసాగర్ ప్రాజెక్టు మరియు క్రిష్ణా పశ్చిమ డెల్లాలోను అనుకూలం. |
నంద్యాల సన్నాలు (యస్డిఎల్ఆర్-8) |
ఖరీఫ్, రబీ |
135 125 |
3.0 |
- |
దోమ కొంత వరకు |
నీటి ఎద్దడికి తటుకునే సన్నగింజ రకం. గింజ సాంబ మపూరిని పోలి ఉంటుంది. |
రాశి (ఐఇటి-1444) |
ఖరీఫ్, రబీ |
115 |
2 |
- |
- |
జింకు ధాతు లోపాన్ని తట్టుకోగలదు. వర్షాభావ పరిస్థితిలో కూడా నిలువ గలదు. |
యం.టి.యు-9993 |
ఖరీఫ్ |
110 |
1.2(మెట్టలో) 1.5(ఆరుతడి) |
2 |
అగ్గితెగులు |
వర్షాధారపు పంటగా/ఆరుతడి పైరుగా అనువైనది. |
మారుబేరు సన్నాలు (యం.టి.యు-1006) |
ఖరీఫ్ |
110-115 |
1.2(వర్షాధారం) 1.5(ఆరుతడి) |
- |
- |
వర్షాధారపు పంటగా/ఆరుతడి పైరుగా అనువైనది. అతి సన్నగింజ. |
ఫల్గుణ (ఆర్పిడబ్ల్యూ 6-17) |
ఖరీఫ్ |
140-145 |
2.5 |
3 |
ఉల్లికోడు, అగ్గితెగులు |
గింజ పొడవుగా నాణ్యత కలిగి వుంటుంది. గోదావరి డెల్లా మరియు నాగారుసాగర్ ప్రాంతాలకు అనువైనది. |
పుష్కల (ఆర్జిఎల్-2624) |
షష్ఠికం |
105 |
2.0 |
- |
- |
సన్నబియ్యం. అధిక దిగుబడి నిచ్చే వర్షాధారప పంటగా ఉపయోగించవచ్చు. |
వసుంధర (ఆర్జిఎల్-2538) |
ఖరీఫ్ |
135 |
2.5 |
- |
ఉల్లికేడు |
ఆలస్యంగా విత్తి (ఆగషు-సెప్టెంబర్) ఆలస్యంగా నాటటానికి అనువైనది. |
మహేంద్ర (ఆర్జిఎల్-1750) |
ఖరీఫ్ |
150 |
2.5 |
- |
- |
గింజ చాలా సన్నం. నారుమడిలో ఆలస్యమైనా తట్టుకొంటుంది. లోతట్టు పొలాలకు అనువైనది. |
వంశీ |
ఖరీఫ్ |
130-135 |
2.5 |
- |
- |
గింజ సన్నం. నీటి ఎద్దడికి తట్టుకొంటుంది. ఆలస్యంగా సాగు చేయటానికి అనువైనది. |
సురక్ష |
ఖరీఫ్ |
125 |
2.5 |
- |
ఉల్లికేడు |
- |
శ్రీకాకుళం సన్నాలు (ఆర్జిఎల్-2537) |
ఖరీఫ్ |
165 |
3.0 |
- |
ఉల్లికేడు |
మిక్కిలి సన్న బియ్యం. 60 రోజుల వరకు నాటుకొనవచ్చు. చేను పడిపోదు. |
క్రొత్తమొలగొలుకులు 74 (యన్యుఎల్ఆర్-9674) |
ఖరీఫ్ |
165-170 |
2.5 |
- |
అగ్గితెగులు కొంత వరకు |
గింజ వెన్నుపై మొలకెత్తదు. గింజలు ఎన్ఎల్ఆర్-9672 కంటె నాణ్యమైనవి. |
పినాకిని (ఎన్ఎల్ఆర్9672-96) |
ఖరీఫ్ |
160 |
2.5 |
- |
అగ్గితెగులు |
ధాన్యం మొలగొలుకులను పోలివుంటుంది. |
తిక్కన ఎన్ఎల్ఆర్-27999) |
ఖరీఫ్ |
165 |
2.5 |
- |
అగ్గితెగులు |
ధాన్యం మొలగొలుకులను పోలివుంటుంది. |
సింహపురి (ఎన్ఎల్ఆర్-28600) |
ఖరీఫ్ |
160-170 |
3.0 |
- |
అగ్గితెగులు |
ధాన్యం మొలగొలుకులను పోలివుంటుంది. ముదురు నారు నాటుటకు అనువైనది. |
శ్రీరంగ (ఎన్ఎల్ఆర్-28523) |
ఖరీఫ్ |
170 |
2.5 |
- |
అగ్గితెగులు |
సన్నబియ్యం. ముదురు నారు నాటటానికి అనువైనది. |
స్వర్ణముఖి (ఎన్ఎల్ఆర్-145) |
ఎర్లీరబీ |
135 |
3.2 |
- |
అగ్గితెగులు |
నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అతి సన్నబియ్యం. చౌడును తట్టుకొంటుంది. |
వేదగిరి (ఎన్ఎల్ఆర్-33641) |
ఖరీఫ్ |
150-155 |
2.5 |
- |
అగ్గితెగులు, టుంగ్రోవైరస్ |
గింజ మధ్యస్థ సన్నం. చౌడును తట్టుకొంటుంది. వెులగొలుకులు వేసే ప్రాంతాల్లో అనువైనది. |
భరణి (ఎన్ఎల్ఆర్-30491) |
ఎర్లీ ఖరీఫ్ (వేసవి) |
125 |
2.5 |
- |
టుంగ్రోవైరస్ |
సన్నబియ్యం. నెలల్లారు, చితూరు జిల్లాల్లో ఎడగారు పంట కాలానికి అనుకూలమైనది. |
సోమశిల (ఎన్ఎల్ఆర్-33358) |
అన్ని కాలాలకు |
105-110 |
2.5 |
- |
అగ్గితెగులు |
బియ్యం అతిసన్నం. ఎగుమతికి అనువైనది. చౌడు భూముల్లో కూడా సాగుకు అనుకూలం. |
స్వాతి (ఎన్ఎల్ఆర్-33057) |
రబీ |
125 |
2.5 |
- |
అగ్గితెగులు |
మిక్కిలి సన్నబియ్యం. ఐ.ఆర్. 20కి ప్రత్యమ్నాయంగా సాగు చేసుకోవటానికి అనువైనది. చెరువులు మరియు బావుల క్రింద సాగు చేసుకోవచ్చు. |
శ్రావణి (ఎన్ఎల్ఆర్-33359) |
రబీ |
120 |
2.5 |
- |
|
ధాన్యం ఐ.ఆర్. 36 రకాన్ని సోలివుంటుంది. నెలల్లారు, చితూరు జిల్లాలకు అనువైనది. |
సావిత్రి (సిఆర్-1009) |
ఖరీఫ్ |
150 |
2.5 |
- |
- |
గింజముతక, దోమకు తట్టుకోదు. ముంపు ప్రాంతాలకు అనుకూలం. |
అపూర్వ (ఎన్ఎల్ఆర్-33654) |
రబీ, ఖరీఫ్ |
135 |
3.0 |
- |
అగ్గితెగులు |
గింజ మధ్యస్థ సన్నం |
తెల్లహెంస |
అన్ని కాలాలకు |
125 |
2.5 |
- |
అగ్గితెగులు, ఎండాకు తెగులు |
పెరిగే దశలో చలిని కూడా తట్టుకుం కాలాలకు తెగులు టుంది. గింజ పొడవుగా నాణ్యత కలిగి ఉంటుంది. తెలంగాణాలో మరియు పరిసర రాఫ్రాలలో విసారంగా పండిస్తున్నారు. |
కృష్ణ హంస |
ఖరీఫ్, రబీ |
115-120 |
2.5 |
- |
అగ్గితెగులు |
గింజ నాణ్యత కల్గి ఉంటుంది. చలికి కొంత వరకు తట్టుకొంటుంది. |
సాంబ మషూరి (బిపిటి 5204) |
ఖరీఫ్ |
145-150 |
2.5 |
4 |
- |
సన్నబియ్యం. వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలం. |
రాజవడ్లు (ఆర్ఎన్ఆర్ 99377) |
ఖరీఫ్ |
140 |
2.5 |
2 |
అగ్గితెగులు, ఎండాకు తెగులు |
మిక్కిలి సన్నబియ్యం |
చందన్ (ఆర్ఎన్ఆర్ 174802) |
ఖరీఫ్ |
135 |
2.5 |
1 |
అగ్గితెగులు, ఎండాకు తెగులు |
సన్నబియ్యం |
ఎర్లీ సాంబ (ఆర్ఎన్ఆర్ఎం-7) |
ఖరీఫ్ |
145 |
2.5 |
1 |
అగ్గితెగులు, సుడిదోమ |
సన్నబియ్యం |
సత్య (ఆర్ఎన్ఆర్ 1446) |
ఖరీఫ్ |
130-135 |
2.5 |
2 |
- |
తెలంగాణా, రాయలసీమలో సాంబ మషూరి స్థానంలో సాగుచేయటానికి అనువైనది. |
సాగర్ సాంబ (ఆర్ఎన్ఆర్ 52147) |
ఖరీఫ్, రబీ |
120 |
2.5 |
- |
అగ్గితెగులు |
గింజ పొడవుగా సన్నగా వుంటుంది. |
సురేఖ |
ఖరీఫ్ |
135 |
2.5 |
2 |
ఉల్లికోడు |
సన్నబియ్యం |
వికాస్ |
ఖరీఫ్ |
120-125 |
2.0 |
- |
- |
గింజ చాలా సన్నం. చౌడును తట్టుకొంటుంది. |
సుమతి (ఆర్ఎన్ఆర్ 18833) |
ఖరీఫ్ |
135-140 |
2.0 |
- |
ఉల్లికోడు, ఆగ్గితెగులు |
సువాసన కల్గిన అతిసన్న గింజ రకం. హెచ్చు నత్రజని వేస్తే గింజ పగులుతుంది. |
సలీమ (ఆర్ఎన్ఆర్ 29692) |
ఖరీఫ్, రబీ |
135 |
2.5 |
- |
అగ్గితెగులు, ఎండాకు తెగులు |
గింజ సన్నం |
పోతన (డబ్ల్యూజిఎల్ 22245) |
ఖరీఫ్, రబీ |
125 |
2.5 |
- |
ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు కొంత వరకు |
గింజ పొడువుగా సన్నగా వుంటుంది. |
కావ్య (డబ్ల్యూజిఎల్ 48684) |
ఖరీఫ్ |
135 |
2.5 |
1 |
ఉల్లికోడు |
బియ్యం మద్యస్థ రకం
|
దివ్య (డబ్ల్యూజిఎల్ 44645) |
ఖరీఫ్, రబీ |
125 |
2.5 |
1 |
ఉల్లికోడు |
గింజ పొడువుగా సన్నగా వుంటుంది. |
ఎర్రమల్లెలు (డబ్ల్యూజిఎల్ 20471) |
ఖరీఫ్, రబీ |
120 |
2.5 |
- |
ఉల్లికోడు |
నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. గింజ పొడవుగా సన్నగా వుంటుంది. |
కేశవ (డబ్ల్యూజిఎల్ 3825) |
ఖరీఫ్ |
120-140 |
2.5 |
- |
ఉల్లికోడు |
ధాన్యం సన్నగా వుంటుంది. ఖరీఫ్ లో ఆలస్యంగా నాటటానికి అనువైనది. |
రుద్రమ (ఆర్డిఆర్ 7555) |
ఖరీఫ్ |
105 |
2.0 |
- |
ఉల్లికోడు, ఎండాకు తెగులు |
నీటి ఎద్దడి మరియు ఇనుప ధాతు లోపాన్ని తట్మకొంటుంది. దక్షిణ తెలంగాణా ప్రాంతంలో వర్బాధారపు మరియు ఆరు తడి భూములకు అనుకూలం. |
పేలాల వడ్లు (ఆర్డిఆర్ 8702) |
ఖరీఫ్ |
135-140 |
2.0 |
- |
ఉల్లికోడు |
ఉత్తర తెలంగాణాలో పేలాలకు అనువైనది. |
జగిత్యాల సన్నాలు (జెజిఎల్ 1798) |
ఖరీఫ్ |
120-125 |
2.5 |
- |
ఉల్లికోడు 1,3,4 |
గింజ సన్నం. సాంబ మషూరి రకాన్ని పోలి వుంటుంది. |
పొలాసప్రభ (జెజిఎల్ 384) |
ఖరీఫ్ |
130-135 |
2.5 |
- |
ఉల్లికోడు 3 |
గింజ సన్నం. నాణ్యత కల్గినది. |
వరాలు (ఢబ్ల్యూజిఎల్ 14377) |
ఖరీఫ్, రబీ, ఎడగారు |
90-95 |
1.6 (వర్షాధారం 2.5 ఆరుతడి) |
- |
ఉల్లికోడు 1,3,5 |
గింజ సన్నం. వరాధారపు మెట్టకు అనువైనది. |
రాజేంద్ర |
ఖరీఫ్ |
110 |
2.5 |
- |
- |
చలికి, బెట్టకు కొంత వరకు తటు కొంటుంది. గింజ ముతక, మెరక భూములకు అనుకూలం. |
ఓరుగల్లు (ఢబ్ల్యూజిఎల్ 47970) |
ఖరీఫ్ |
135-145 |
2.0 |
- |
ఉల్లికోడు |
సన్నబియ్యం |
భద్రకాళి (ఢబ్ల్యూజిఎల్ 3962) |
ఖరీఫ్ |
135 |
2.0 |
- |
ఉల్లికోడు |
మిక్కిలి సన్నబియ్యం |
శివ (ఢబ్ల్యూజిఎల్ 3943) |
ఖరీఫ్ |
130-135 |
2.0 |
- |
ఉల్లికోడు, అగ్గితెగులు, పొడతెగులు కొంతవరకు |
సన్నబియ్యం |
వర్ష (ఆర్డిఆర్ 355) |
రబీ |
125 |
2.0 |
- |
కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకు ముడత |
సన్నబియ్యం |
ఇందూర్ సాయి (ఆర్డిఆర్ 355) |
ఖరీఫ్ |
120-125 |
2.5 |
1 |
ఉల్లికోడు |
మిక్కిలి సన్నబియ్యం. బియ్యం సాంబ మషూరిని పోలి వుంటుంది. |
పార్ధివ (ఎన్ఎల్ఆర్ 33892) |
ఖరీఫ్ |
155 |
2.2 |
- |
అగ్గితెగులును తట్టుకొనును |
సన్నబియ్యం, మొలగొలుకులు రకం. |
శ్రీ కుర్మ (ఆర్జిఎల్ 2332) |
ఖరీఫ్ |
150-155 |
2.1 |
- |
ఉల్లికోడు, అగ్గితెగులు, ముంపుకు తట్టుకొనును |
సన్నబియ్యం |
వరంగల్ సన్నాలు (డబ్ల్యూజిఎల్ 32100) |
ఖరీఫ్, రబీ |
135 |
2.5 |
- |
- |
సన్నబియ్యం |
పుష్యమి (యంటియు 1075) |
ఖరీఫ్, రబీ |
135 |
2.5 |
- |
అగ్గితెగులు, సుడిదోమ |
సన్నబియ్యం |
నెల్లూరు మషూరి (ఎన్ఎల్ఆర్ 34449) |
దాళ్వా |
125 |
3.2 |
- |
అగ్గితెగులును పూర్తిగా తట్టుకుంటుంది |
చేను మీద పడిపోదు. పొట్టి రకం. గింజ నాణ్యత కలిగి, సాంబ మషూరిని పోలి వుంటుంది. అగ్గితెగులు సమస్యగల దక్షిణ మండలానికి అనుకూలం. |
అమర (ఎంటియు 1064) |
సార్వా |
150 |
2.5 |
3 |
దోమపోటు ఎండాకు తెగులు |
చేను మీద పడిపోదు, గింజరాలదు. సన్న బియ్యం. కృష్ణా, గోదావరి మండలాలకు అనుకూలం. |
రామప్ప (డబ్ల్యూజిఎల్ 23985) |
సార్వా దాళ్వా |
125-130 |
2.5 |
- |
ఉల్లికోడు |
చేను మీద పడిపోదు, గింజ నాణ్యత దాళ్వా మధ్యస్థం. ఉల్లికోడు సమస్యగల ప్రాంతాలకి అనుకూలం. |
తారామతి (ఆర్ఎన్ఆర్ 23064) |
సార్వా దాళ్వా |
130-135 |
3.0 |
- |
ఉల్లికోడు, పొట్టకుళ్ళు |
మంచి గింజ నాణ్యత కలిగి అన్నానికి దాళ్వా బాగుంటుంది. చేను మీద పడిపోదు. చలిని కూడ తట్టుకుంటుంది. |
శ్రీ సత్య (ఆర్ఎన్ఆర్ 1880) |
సార్వా దాళ్వా |
110-120 |
2.0 |
- |
ఉల్లికోడు |
ముతక రకం, వరాదార ప్రాంతాలకు అనుకూలం. చేను మీద పడిపోదు. |
మానేర్ సోన (జెజిఎల్ 3828) |
సార్వా దాళ్వా |
130-135 140-145 |
2.5 |
- |
ఉల్లికోడు, టుంగ్రోవైరస్ |
సన్నబియ్యం, ఆలస్యంగా నాటు వేసే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అనుకూలం. |
జగిత్యాల సాంబ (జెజిఎల్ 3844) |
సార్వా దాళ్వా |
130-135 |
3.0 |
- |
ఉల్లికోడు |
మంచిగింజ నాణ్యత కలిగి అన్నానికి బాగుంటుంది. చేను మీద పడిపోదు. చలిని తట్టుకుని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అనుకూలం |
కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్భండిజం కలిపి 24 గంటల తర్వాత నారు మడిలో జల్లుకోవాలి. దంప నారుమళ్ళకు అయితే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపి, ఆ ద్రావణం లో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండె కట్టి మొలకలను దంప నారుమడి లో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుంది.
కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్థ ను తొలగించి అధిక మొలక శాతం రాబట్టడానికి, లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ గల విత్తనాలకు అయితే 6.3 మి.మీ లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకు అయితే 10 మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణం లో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండె కట్టాలి.
దంప నారుమడి : 20 - 25 కిలోలు
వెదజల్లడానికి (గరువు భూముల్లో) : 24-30 కిలోలు (ఎకరాకు)
గొర్రు తో విత్తడానికి (వర్ణాధారపు వరి) 30-36 కిలోలు
శ్రీ పద్ధతి వరి సాగు : 2 కిలోలు
పంటకాలం / పరిస్థితి |
గోదావరి మండలం |
|
స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, తొలకరి, గోదావరి, ఇంద్ర, అమర, అక్షయ, నెల్లూరు, సోన |
|
స్వర్ణ, చైతన్య, ఇంద్ర, అమర |
|
చైతన్య, కృష్ణవైణి, దీప్తి, ఇంద్ర, గోదావరి, అమర |
|
బాడవ మషూరి, ఇంద్ర, స్వర్ణ |
|
స్వర్ణ, దీప్తి |
|
స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్, చొరసన్నాలు |
|
మారుటేరు సన్నాలు, వరాలు, ప్రథ్యున్ను |
|
స్వర్ణ, మూరుటేరు సన్నాలు, కాటన్ దొర సన్నాలు, విజేత |
|
కాటన్ దొర సన్నాలు, విజేత, ప్రభాత్, ఐఆర్ 64, జగిత్యాల సన్నాలు, నెల్లూరు మషూరి, నెల్లూరు సోన, శ్వేత |
10.ఆలస్యంగా వేయటానికి |
కాటన్ దొర సన్నాలు |
11. దోమపాటు ఆశించే ప్రాంతాలకు |
విజేత, కాటన్ దొర సన్నాలు |
12. చౌడు పొలాలకు |
- |
నారుమడులు తొలకరి వానలు ప్రారంభం అవగానే తయారు చేసుకొని అనగా జూస్ నెలలో వరి నారు పోసుకుంటారు. నారు వయసు 20-25 రోజులు అవగానే పంట మడి లో నాట్లు వేసుకుంటారు.
వరి నారును ప్రస్తుతం అనేక విధాలు గా తయారు చేసుకుంటున్నారు. వాటిలో ముఖ్యం గా మొట్ట నారు మడి మరియు దంప నారుమడులలో నారు ను పెంచుతారు.
నేలను బాగా దుక్కి వచ్చు వరకు దున్ని, నీరు పెట్టుటకు తగు విధం గా కాల్వల నేర్పరచుకొని కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్భండిజం కలిపి 24 గంటల తర్వాత నారు మడి లో జల్లి, విత్తనం బాగా నేలలో కలిసేటట్లు చేసి వెంటనే నీరు పెట్టాలి. ఈ పద్ధతి లో నేల తడి ఆరకుండా నీరు పెట్టుకోవాలి. ఈ పద్ధతి లో కలుపు వచ్చే అవకాశాలుండడం వల్ల కలుపు నిర్మూలన సకాలం లో చేయాలి.
నేలను బాగా దమ్ము చేసి, నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలను ఏర్పరచు కోవాలి. లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపి, ఆ ద్రావణం లో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మంది కట్టి మొలకెత్తిన విత్తనాన్ని సెంటు కు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. కిలో విత్తనాన్ని నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుంది. నారు తీసే వరకు నారు మడిలో నీరు తీస్తూ మరల నీరు పెట్టి నేల పొడి బారకుండా చూచుకోవాలి.
విత్తనోత్పత్తి గ్రామస్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో చేసేటప్పుడు, ఒక ప్రాంత రైతులందరూ తమ కు కావాల్సిన విత్తనాన్ని ముఖ్యంగా ఒకే రకానికి చెందినదై ఉండే విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మంచిది.
ఈ విధంగా మెళకువలు పాటిస్తే పైన వివరించిన లక్షణాలు గల నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ తమ పొలాల్లో తామే స్వయంగా తయారు చేసుకొని, విత్తనాలు ఖర్చు తగ్గించుకోవడమేకాక, కలీ విత్తనాల బారిన పడకుండా తమను తావ యి రక్షించుకొని, అధిక దిగుబడులను సాధించగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.
హిస్సా (తాటాకు తెగులు) :
హిస్సా నారుమడిలో కూడ ఆశించవచ్చు. తల్లి : పెంకు పరుగుల శరీరంపై ముళ్ళు కలిగి నల్లగా ఉంటాయి. పిల్ల పరుగులు ఆకుపొరల్లో ఉంటాయి. పిల్ల పెద్ద పరుగులు ఆకులోని పత్ర హరితాన్ని గోకి తినివేయటంవలన తెల్లటి మచ్చలు, చారలు ఏర్పడి ఆకులు ఎండి పోతాయి. దుబ్బుకు : 2 పెంకు పరుగులు / 2 పరుగు ఆశించిన ఆకులు.
సస్యరక్షణ: ఆకుకొనలను తుంచి నాటాలి. ప్రొఫెనో ఫాస్ 2మీ.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లేక క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీ టరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి ఈగ :
పిల్ల పురుగులు ఆశించిన ఆకులపై చిన్నరంధ్రాలు ఏర్పడతాయి. పరుగు ఆశించిన దగ్గర ఆకు తెల్లబడి గాలికి విరిగిపో వచ్చు. తాటాకు తెగులుకి సిఫారసు చేసిన మందులు వాడి నివారించవచ్చు.
సుడిదోమ :
గోధుమ వర్ణపు / తెల్లమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటిమట్టంపై వుండి దుబ్బులనుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది. పిల్లదశలో : దుబ్బుకి 10 పరుగులు ఈనిక దశలో : దుబ్బుకి 20 నుంచి 25 పరుగులు తట్టుకునే రకాలు సాగు చేయాలి. పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి. ప్రతి రెండు మీ.లకి20 సెం.మీ.ల బాటలు వదలాలి. బూప్రో పెజిస్1.6 మీ.లీ లేక ఇతోఫెన్ ప్రాక్స్ 2.0 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లేక ఇమిడా క్లోప్రిడ్ + ఎథిప్రోల్ 80 డబ్ల్యుజి 0.25 గ్రా లేక మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ. లేదా పైమెట్రోజన్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి వాడాలి.
పచ్చదీపపు పురుగులు :
పెద్ద, పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పీలుస్తాయి. క్రమేపి ఆకులు పసుపు రంగుకి మారుతాయి. టుంగో వైరస్ను వ్యాప్తి చేస్తాయి. పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులోవుండి ముందు రెక్కలమీద మచ్చలు ఉంటాయి. నారుమడి దశ : చ.మీ.1 లేక 2 పురుగుల లకదశ : దుబ్బుకి 10 పరుగులు, ఈనికదశ : దుబ్బుకి 20పురుగులు, టంగ్రోవైరస్ : దుబ్బుకి ఒక పరుగు ఆశించే ప్రాంతాలు. దోమకు తెలిపిన నివారణ చర్యలు చేపట్టాలి
రెల్లరాల్చు పురుగు :
గొంగళి పరుగులు గింజ గట్టిపడే దశలో వెన్నులు కొరికి నష్టాన్ని కలుగజేస్తాయి. రాత్రి పూట మాత్రమే పంటకు హాని చేస్తాయి. ఈనిక దశ : చ.మీ. కి 4 నుంచి 5 పరుగులు ఉనప్పుడు నివారణ చర్యలు తీసుకోవాలి. పొలానికి ముందుగా నీరు పెట్టి క్లోరిపైరిఫాస్2.5 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లను డైక్లోర్వాస్ 1.0 మి.లీ. తో ఒక లీ టరు నీటికి చొuన కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీచేయాలి.
ఆకునల్లి:
పిల్ల, పెద్దనల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీల్చి వేయడం వలన ఆకులు పాలిపోయి పైరు ఎండిపోయినట్లు కనపడుతుంది. బోట్ట పరిస్థితుల్లో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే గంధకపు పొడి 50 శాతం 3 గ్రాIIలు లేక డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కంకినల్లి (నల్లకంకి):
ఇవి కంటికి కనబడని సూక్ష్మ సాలీడు వర్గానికి చెందినపరుగులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు వర్ణపు చారలు ఏర్పడి క్రమేపి ఆకుతొడిమల లోప, ఆకు ఈనెల్లో వృద్ధి చెందుతాయి. ఆకు అడుగుభాగాన ఈనెలపై మరియు ఆకు తొడిమలపై నల్లటిమచ్చలు ఏర్పడతాయి. గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలుగా అవుతాయి. త్రిప్స్ లేక తామరపురుగులు:పిల్ల, పెద్ద పరుగులు ఆకులనుండి రసాన్ని పీల్చడంవలనఆకుల అంచులు పైకి చుట్టుకుంటాయి. వర్షాభావ పరిస్థితుల్లోఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి కంపనల్లి:
పిల్ల, పెద్ద పరుగులు గింజ పాలుపోసుకొనే దశలో రసాన్నిపీల్చడంవల్ల గింజలు తాలైపోతాయి. ఆశించిన పొలం నుండి చెడు వాసన వస్తుంది. తెలంగాణా, చిత్తూరు జిల్లాలో ఉధృతి ఎక్కువ. దుబ్బుకి 1 లేక 2పరుగులు డైక్లోర్వాస్ 1.0 మి.లీ. ను క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేక మలాథియాన్ 2 మి.లీ.లతో లీటరునీటికి చొప్పన కలిపి సాయంత్రం, గింజ పాలు పోసుకొనే దశలో పిచికారీ చేయాలి. పిచికారీపొలం అంచు నుండి చుటూ తిరుగుతూ మధ్యకు చేయాలి.
ఉల్లికోడు:
పురుగు ఆశించిన గుర్తులు : నారుమడి దశనుండి పిలకదశ వరకు నష్టపరుస్తుంది. అంకురం ఉల్లికాడ వలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుంది. కంకి వెయ్యదు.
నిర్ణీత తీవ్రత స్థాయి : నారుమడిలో: చ.మీ.కు 1 ఉల్లికోడు సోకిన పిలక. పిలక దశలో : 5 శాతం ఉల్లి గొట్టాలు లేక దుబ్బుకి 1 కోడు సోకిన పిలక.
నివారణ : తట్టుకునే వంగడాల సాగు. ఒక సెంటు నారుమడిలో 160 గ్రా.ల కార్బోప్యురాన్ లేక 50 గ్రా. ఫోరేట్ గుళికలు విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల లోపల వేయాలి. నాటిన 10 నుంచి 15 రోజులకు - ఎకరాకు కార్బోప్యరాన్ 10 కిలోలు లేక ఫోరేట్ 5 కిలోల గుళికలు వాడాలి.
కాండం తొలిచే పురుగు:
పురుగు ఆశించిన గుర్తులు : నారుమడి నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. పిలక దశలో - మొవ్వ చనిపోతుంది, ఈనిక దశలో - తెల్ల కంకులు వస్తాయి.
నిర్ణీత తీవ్రత స్థాయి : నారుమడి: చlమీ. కు 1 తల్లి పురుగు లేదా గ్రుడ్ల సముదాయం పిలకదశ : 5 శాతం చచ్చిన మొవ్వలు లేక 1 చlమీ.కు ఒక తల్లి పురుగు లేక గ్రుడ్ల సముదాయం.
నివారణ : క్లోరిఫైరిఫాన్ 2.5 మి.లీ. లేక ఫాస్పామిడాన్ 40 శాతం 2 మి.లీ లేక ఎసిఫేట్ 1.5గ్రా.లు. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0గ్రా. క్లోరోస్టనిలిప్రోల్ 20 యస్.సి. 0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక చిరుపొట్ట దశలో కార్తాప్ హైడ్రోక్లోరైడ్ 4జి.ఎకరాకు 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఎకరాకు 10 కిలోలు వాడాలి.
ఆకుమడత/నాము/ తెల్ల తెగులు:
పురుగు ఆశించిన గుర్తులు : గొంగళి పురుగు ఆకు ముడతలో వుండి పత్రహరితాన్ని గోకి తినివేయటం వలన ఆకులు తెల్లబడతాయి. పోటాకు దశలో నష్టం ఎక్కువ.
నిర్ణీత తీవ్రత స్థాయి : దుబ్బకి 1 లార్వా లేక 2 పరుగులు సోకిన ఆకులు.
నివారణ : పిలకదశలో తాడుతో చేనుకు అడ్డంగా 2-3 సార్లు లాగితే పురుగులు క్రిందపడి పోతాయి. క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేక ఎసిపేట్ 1.5 గ్రా. లేక కార్చావ్ హైడ్రోక్లోరైడ్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక కార్చావ్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు వేయాలి.
త్రిప్స్ లేక తామర పురుగులు:
పురుగు ఆశించిన గుర్తులు : పిల్ల, పెద్ద పరుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి చుట్టుకుంటాయి. వరాభావ పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.
నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పిండినల్లి (మట్ట సుడి):
పురుగు ఆశించిన గుర్తులు : తెల్లటి మైనం లాంటి పూతతో కప్పబడిన సన్నని పురుగులు. ఆకు ఒరలలో నుండి రసాన్ని పీల్చటం వలన ఆకులు పాలిపోతాయి. మొక్కలు గిడసబారతాయి. వెన్నులు ఏర్పడవు.
నివారణ : మిథైల్-ఒ-డెమటాన్ 2 మి.లీ. లేక మిథైల్ పారాథియాన్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరి కంపనల్లి:
పురుగు ఆశించిన గుర్తులు : పిల్ల, పెద్ద పరుగులు గింజ పాలుపోసుకొనే దశలో రసాన్ని పీల్చడం వల్ల గింజలు తాలైపోతాయి. ఆశించిన పొలం నుండి చెడు వాసన వస్తుంది. తెలంగాణా, చితూరు జిల్లాల్లో ఉధృతి ఎక్కువ.
నిర్ణీత తీవ్రత స్థాయి : దుబ్బుకి 1 లేక 2 పురుగులు
నివారణ : డైక్లోర్వాస్ 1.0 మి.లీ.ను ఎండోసల్బాన్ 2 మి.లీ లేక క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ. లేక మలాధియాన్ 2 మి.లీ. లతో లీటరు నీటికి చొప్పన కలిపి సాయంత్రం, గింజపాలుపోసుకొనే దశలో పిచికారి చేయాలి. పిచికారి పొలం అంచు నుండి చుట్టూ తిరుగుతూ మధ్యకు చేయాలి.
అగ్గితెగులు లేక మెడ విరుపు తెగులు :
తెగులు ఆశించినపుడు కనబడే లక్షణాలు ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిదరంగుగల నూలుకండె ఆకారపు మచ్చలు, ఆకులు ఎండిపోయి తగులబడినట్లర్లనిపిస్తాయి. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద విరిగి పిలక వాలిపోతుంది. వెన్నుల మెడభాగంలో ఈ తెగులు ఆశించటంవలన వెన్నులు విరిగి క్రిందకు వాలిపోతాయి.
నిర్ణీత తీవ్రతస్థాయి: 5 శాతం ఆకులు మరియు 2 శాతం ఆశించిన వెన్నులు
అభివృద్ధి అనుకూల పరిస్థితులు: ఒక వారంరోజులపాటు రాత్రి ఉష్ణోగ్రత 18° – 22° సెల్సియస్, గాలిలో తేమ90 శాతంతో, మంచు (లే దా) వర్షపుజల్లలు. నవంబరు-ఫిబ్రవరి మాసాల్లో ఈ పరిస్థితులు ఉంటాయి. నత్రజనిఎక్కువైనప్పడు తెగులుత్వరగా అభివృద్ధిచెంది ఎక్కువ నష్టం కలుగజేస్తుంది.
నివారణ: తట్టుకొను శక్తిగల రకాల సాగు కిలో విత్తనానికి 3 గ్రా. కార్చెండిజిమ్ని కలిపి పొడి విత్తనశుద్ధి లేదా 1 గ్రాము లీటరునీటికి, కిలో విత్తనానికి కలిపి తడి విత్తనశుద్ధి చేయాలి. టైసైక్లోజోల్ 75 శాతం 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయొలేన్ 40 శాతం 1.5 మి.లీ. (లేక) కాసుగా మైసిన్3 ఎల్ 2.5 మి.లీ. / లీటరు నీటికి కలిపిపైరుపై పిచికారీ చేయాలి. చేనులోను, గట్లపైన కలుపును సకాలంలో నివా రించాలి. తగు మోతాదులో నత్రజనిఎరువులను ఎక్కువ దఫాలుగా వాడాలి. పైరులో నీరు లేకుండా ఆరగట్టరాదు.
పొడతెగులు లేక మాగుడుతెగులు :
దుబ్బచేసే దశనుండి కాండం/మట్టఆకులపై మచ్చలు పెద్దవై పాముపొడమచ్చలుగా ఏర్పడుతాయి. మొక్కలు/పైరు పూర్తిగా ఎండిపో తుంది. తెగులువెన్నువరకు వ్యాపిస్తే తాలు గింజలు ఏర్పడతాయి.
నిర్ణీత తీవ్రతస్థాయి: 10 శాతంపిలకలు
అభివృద్ధి అనుకూల పరిస్థితులు: ఉష్ణోగ్రత 18° – 22°సెల్సియస్, గాలిలో తేమ 90 శాతం, మబ్బులతోకూడిన వర్షం, చెట్లనీడకు, పై రు చేనుపై పడిపోయినప్పడు, నత్రజనిఎరువులు ఎక్కువైనప్పడు తెగులుత్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టంకలుగజేస్తుంది.
నివారణ: విత్తనశుద్ధి చేయాలి. సిఫారసు చేసిననత్రజనిని 3-4 సార్లు వేయాలి. గట్లపైన చేనులో కలుపు లేకుండా చూడాలి. హెక్సా కొనజోల్ 2 మి.లీ. లేక వాలిడామైసిన్ 2 మి.లీ. లేక ప్రోపికోనజోల్ 1 మి.లీ. లేదా టైఫాక్సీస్లోబిస్ + టెబ్యుకొనజోల్ 75 డబ్ల్యుజి. 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజులకొకసారింండు పర్యాయాలు మందు ద్రావణాన్నిపిచికారీ చేయాలి.
బాక్టీరియా ఎండు తెగులు:
ఆకు అంచుల నుండి పసుపు రంగు డాగు మచ్చలు గ ఏర్పడి ఎండిపోవును. నారు మడి దశలో ఏందీ పోవటాన్ని క్రీసేక్ అని అంటారు.
నిర్ణీత తీవ్రతస్తాయి: 10 శాతం పిలకలు
అభివృద్ధి అనుకూల పరిస్థితులు: ఉష్ణోగ్రత 30° సెల్సియస్, బ్బులతోకూడిన వర్షం, చెట్లనీడకు, పైరు చేనుపై పడిపోయినప్పడు, నత్రజనిఎరువులు ఎక్కువైనప్పడు తెగులుత్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టంకలుగజేస్తుంది.
నివారణ: విత్తనశుద్ధి చేయాలి. సిఫారసు చేసిననత్రజనిని 3-4 సార్లు వేయాలి. గట్లపైన, చేనులో కలుపు లేకుండా చూడాలి. ఎకరాని కి 15 కే. జిమ్యురేట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలి.
ఆకుఎండు తెగులు:
తెగులు ఆశించినప్పుడు కనబడే లక్షణాలు : బాక్టీరియా వల్ల వస్తుంది. ఆకు అంచుల నుండి పసుపు రంగు నీటి డాగు మచ్చలుగా ఏర్పడి ఆకులు పై నుండి క్రిందికి ఎండిపోవును.
నిర్ణీత తీవ్రత స్థాయి : 5 శాతం ఆశించిన మొక్కలు
అఙివృద్ధికి అనుకూల పరిస్థితులు : ఉష్ణోగ్రత 300 సెల్సియస్, గాలిలో ఎక్కువ తేమ, మంచు లేదా వర్షం ఉన్నప్పడు, గాలి, వరంగాని లేక గాలివాన వచ్చినచో అభివృద్ధి చెంది వ్యాపిస్తుంది. నీటి ద్వారా ఇతర చేలకు వ్యాపిస్తుంది.
నివారణ : తట్టుకొనుశక్తి గల రకాల సాగు. ఆరోగ్య వంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించాలి. నత్రజని యాజమాన్యం (3-4 సార్లు వేయడం) తప్పక చేయాలి. తెగులు 5 శాతం కంటె ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలుపు చేయాలి. ప్రస్తుతానికి నివారణకు మందులు లేవు.
కాండంకుళ్ళు తెగులు:
తెగులు ఆశించినప్పుడు కనబడే లక్షణాలు : కాండములోపల కణుపుల మధ్య a మంతా నల్లగా మారుతుంది. ఆకులు వసుపు రంగుకు వూరి వీలుకలు చనిపోతుంటాయి. పాలు పోసుకునే దశలో కాండం కుళ్ళిన ప్రదేశం దగ్గర, పిలకలు వాలిపోయి ఎండిపోతాయి. క్రమంగా దుబ్బు అంతా ఎండిపోతుంది.
అఙివృద్ధికి అనుకూల పరిస్థితులు : పొలంలో ఈ తెగులు, వ్యాధి సోకిన మొక్కల భాగాల నుండి, విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత నీటి ద్వారా మిగిలిన పొలాలకు విస్తరిస్తుంది.
నివారణ : తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. విత్తనశుద్ధి చేయాలి. ప్రారంభ దశలో తెగులు లక్షణాలను గుర్తించి వాలిడామైసిన్ (2 మి.లీ.) లేదా హెక్సాకొనాజోల్ (2 మి.లీ.) లేదా కార్బండైజిమ్ (1 గ్రా.) లేదా బెనోమిల్ (1 గ్రా.) లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల కొకసారి 2సార్లు పిలకలు క్రింద వరకు తడిచేలా పిచికారి చేయాలి.
టుంగ్రోవైరస్:
తెగులు ఆశించినప్పుడు కనబడే లక్షణాలు : ఈ వైరస్ పచ్చదీపపు పురుగులవలన వ్యాపిస్తుంది. వైరస్ సోకిన మొక్కలు కురచగ, ఎదగక, పిలకలు తగ్గిపోతాయి, ఆకులు చివరల నుండి లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారుతాయి. ముదురు ఆకులమీద తప్పమచ్చలు గమనించవచ్చును. వైరస్ ఆశించిన మొక్కలనుండి వెన్నులు రావు. వచ్చినా చిన్నవిగా, చిన్నవిగా గట్టిపడక తాలుగా మారతాయి.
అభివృద్ధికి అనుకూల పరిస్థితులు : వైరస్ ఆశించిన ప్రాంతాల్లో పచ్చ దీపపు పురుగులు అభివృద్ధి ఎక్కువైనపుడు.
నివారణ : ఈ వైరస్ ఆశించిన మొక్కలను గుర్తించిన వెంటనే తీసి నాశనం చేయాలి. పచ్చదీపపు పరుగుల నివారణ చర్యలు చేపట్టాలి.
పొట్టకుళ్ళ తెగులు:
తెగులు ఆశించినప్పుడు కనబడే లక్షణాలు : పోటాకు తొడిమలపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు/చాక్లేట్ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్ళిపోతాయి. వెన్ను .మాత్రమే బయటకు వస్తుంది. వెన్నులో తాలు గింజలు ఏర్పడతాయి. గింజలు రంగు మారుతాయి.
అఙివృద్ధికి అనుకూల పరిస్థితులు : రాత్రి ఉష్ణోగ్రత 200 సెల్సియస్ కంటే తక్కువ, మంచుపడటం, వాతావరణం చల్లగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ తెగులు అభివృద్ధి ఎక్కువ.
నివారణ : పొట్టదశలో ఒకసారి, 7 రోజుల తరువాత రెండవసారి కార్బండైజమ్ 50 శాతం మందు లీటరు నీటికి 1 చొప్పున కలిపి పిచికారి చేయాలి.
మానిపండు తెగులు:
తెగులు ఆశించినప్పుడు కనబడే లక్షణాలు : పూతదశలో వస్తుంది. అండాశయం శిలీంధ్రం వల్ల ఆకుపచ్చరంగు మద్దగా అభివృద్ధి చెంది, పసుపురంగులోకి మారి చివరకు నల్లబడి పోతుంది.
అఙివృద్ధికి అనుకూల పరిస్థితులు : పూతదశలో గాలిలో ఎక్కువ తేమ శాతం ఉన్న మంచు లేదా మబ్బులతో జల్లలు.
నివారణ : ప్రాపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండైజిమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయాలి.
నాట్లకు వివిధ ప్రాంతాల్లో అనుకూల సమయం
ప్రాంతం |
ఖరీఫ్ (సార్వా) |
రబీ (దాళ్వా) |
ఎడగారు |
కృష్ణా, గోదావరి, తెలంగాణా |
జులై |
డిసెంబర్ |
- |
ఉత్తర కోస్తా |
ఆగష్టు |
నవంబర్ |
- |
దక్షిణ మండలం |
సెప్టెంబర్ |
నవంబర్ |
ఏప్రిల్ - మే |
అత్యల్ప వర్షపాత మండలం |
జులై – ఆగష్టు |
డిసెంబర్ |
|
నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగా పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2 - 3 దఫాలు గా మురుగు దమ్మ చేయాలి. నాట్లు వేయవలసిన పొలం లో పచ్చి రొట్ట ఎరువు కలియ దున్నాలంటే కనీసం 20 - 25 రోజుల ముందు కలియ దున్ని బాగా చివికిన తర్వాత నాట్లు మేయాలి. త్వరగా చివకడం కోసం సింగిల్ సూపర్ ఫాస్పేట్ జల్లి కలియదున్న వచ్చు. నాట్లు వేయడానికి ముందు పొలమంతా సమానం గా దమ్ము చెక్కతోగాని, అడ్డతో గాని పొలం అంతటా ఒకే లోతు నీరు ఉండేటట్లు చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందు గానే దమ్మపూర్తి చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.
సాధారణం గా వరి వరుసల్లో నాటుకొంటే అనేక లాబాలు ఉన్నాయి. కాని ఖర్చుతో కూడిన పని కాబట్టి ఎక్కువ విస్తీర్ణం లో (చిక్కు నాట్లు) వేయడమే జరుగుతున్నది.
నాట్లు:
వరి మరియు ఇతర ఏదేని పంట దిగుబడులను పెంచేందుకు ధృవీకరింపబడిన, నాణ్యత గల్లిన, మంచి విత్తనాన్ని వాడాలి. మంచి విత్తనం అనగానే శుభ్రత, నాణ్యతతో పాటు బాగా మొలకెత్తే స్వభావం (80%) గల్లి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి నివ్వాలి. తక్కువ పరిమాణంలో నాణ్యమైన విత్తనాన్ని ప్రతి రైతు తనకు తయారుచేసుకొంటే తక్కువ ఖర్చుతో మంచి రాబడి పొందగలరు. విత్తనోత్పత్తిలో ప్రధానంగా బ్రీడరు విత్తనం(జన్యుస్వచ్చత నూరు శాతంగా ఉండి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పరిశోధనా స్థానాల్లో ఉత్పత్తి చేయబడుతుంది) ఫౌండేషన్ విత్తనం(బ్రీడరు విత్తనం నుండి ఉత్పత్తి చేయబడుతుంది). ధృవీకరింపబడ్డ విత్తనం(సర్టిఫైడ్ సీడ్), (ఫౌండేషన్ విత్తనం నుండి ఉత్పత్తి చేయబడుతుంది) అనే మూడు తరగతులు ఉంటాయి.
వరి స్వపరాగ సంపర్కంతో వృద్ధి చెందే పంట గనుక సులభంగా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. వరి వంగడాలు కొంత కాలం సాగుచేసిన తర్వాత ముఖ్యంగా ఇతర రకాలతో కలీ జరగటం వలన, పైరుపై తెగుళ్ళ ప్రభావం వలనా మరియు కొద్ది మేర పరపరాగ సంపర్కం వలన విత్తనం యొక్క స్వచ్ఛత, నాణ్యత దెబ్బతిని దిగుబడి శక్తిలో మార్పువచ్చి, ఆశించిన మేరకు దిగుబడి రాదు. ఈ మార్పులకు వాతావరణ ప్రభావం, స్వల్ప జన్యు మార్పులు కూడా దోహదం చేస్తాయి. మంచి నాణ్యత కొరకు, జన్యు/ బాహ్య శుభ్రత కై తగు జాగ్రత్తలు పాటించి రైతులు స్వయంగాని /గ్రామ స్థాయిలో గాని ఉత్పత్తి చేసి ఖర్చు తగ్గించుకోవడమేగాక అధిక దిగుబడి పొందవచ్చు. ప్రదానముగా గ్రామస్థాయిలో ఉత్పత్తి చేసిన యడల అనేకయ లాభములు కలవు. గ్రామస్థాయిలో ఉత్పత్తి చేసేటప్పడు సాధ్యమయినంత వరకు ఒక వరి రకమును ఉత్పత్తి చేయుట, సామూహికముగా చేయుట, ఒకే ప్రదేశములో చేయుట వలన మంచి ఫలితాలు వస్తాయి.
మంచి విత్తనోత్పత్తికి సూచనలు :
విత్తనోత్పత్తి కొరకు నాట్లను దూరదూరముగా వేసుకొనుట, సమతుల్యమయిన నేలలో ముందు సంవత్సరము వరి వేయని లేదా అదే రకము వరి వేసిన భూములు ఎంచుకొనుట అనే విషయాలను ప్రధానముగా గమనించాలి. పరపరాగ సంపర్కం ద్వారా కలీలు లేకుండా యుండటానికి వివిధ వరి రకాలను, దూరదూరంగా పండించాలి. కలీ మొక్కలను పైరు దుబ్బ చేసే సమయం, పూత, గింజ గట్టిపడే దశల్లో ఏరి తీసివేయాలి. పొలంలో గట్టు ప్రక్కలగాక చుటూ ఐదు మీటర్ల విస్తీర్ణం మేరకు వదిలి లోపలి పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. ఒక కల్లీ మొక్కను వదిలివేస్తే షుమారు వెయ్యి గింజలు రాబోయే పైరులో కేబీలుగా తయారవుతాయి.
సమతుల్యంగా ఎరువులు వాడటం వలన పోషక విలువలతో పాటు గింజ నాణ్యతను పెంపొందించవచ్చు. నత్రజని ఎరువులను ఈనిక దశ ముందే వాడాలి. తర్వాత వాడితే ధాన్యంలో విరుగుళ్ళ శాతం పెరుగుతుంది. వరి పంట అంకురం దశ నుండి పక్వదశ వరకు నీటి ఎద్దడి ఉండరాదు. లేకుంటే తాలు గింజలు, విరుగుళ్ళు ఏర్పడతాయి. గింజ గట్టిపడే సమయంలో అనగా కోతకు 7-10 రోజులు ముందుగానే నీటిని తీసివేయాలి.
పైరు కోసినప్పటి నుంచి ఇతర విత్తనాలతో కలవకుండా తగు జాగ్రత్త వహించాలి. వెన్నులో 75శాతం గింజలు పండినపుడు కోత కోయాలి. పక్వానికి రాకముందే కోసే విత్తనం మొలకెత్తే స్వభావం దెబ్బతింటుంది. పనలను 2-3 రోజులు ఆరబెట్టాలి. ఓదెలను త్రిప్పికూడా ఆరబెట్టవచ్చు. నూర్పిడి చేసిన తర్వాత ధాన్యంలో తప్ప, తాలు గింజలు ఇతర పదార్థాలేవీ లేకుండా చూడాలి. ముఖ్యంగా నూర్పిడి చేసిన తరువాత మరియు ఎగరబోత సమయంలో వేరే వరి విత్తనములతో కలియకుండా జాగ్రత్త పాటించవలెను.
శుభ్రపరచిన విత్తనాన్ని ఎండలో ఆరబెట్టాలి. డైయర్లు వాడకలోనికి వచ్చేంత వరకు విత్తనాన్ని ఆరుబయట 9-11 గంటల మధ్య 5-6 రోజులు ఆరబెట్టాలి. 11 గంటల తర్వాత ఎండ తీవ్రంగా ఉండి గింజ పై పగుళ్ళ వచ్చే అవకాశముంది. గింజలో తేమ శాతం 13 కన్నా తక్కువ వచ్చేంత వరకు ఆరబెట్టాలి. ఎక్కువగా ఉన్నట్లయితే శ్వాసక్రియ, బూజు పెరిగి, పరుగుపట్టి, విత్తనం చెడి, మొలక శాతం తగ్గుతుంది. గింజల్లో అధిక శాతం తేమ ఉన్నా లేక అధికంగా ఆరబెట్టిన గింజల్లో విరుగుళ్ళు అధికమవుతాయి. విత్తనాన్ని ఎప్పటికప్పుడు కొత్త సంచుల్లో నిల్వ చేసుకోవడం ఎంతో శ్రేయశ్కరం.
కాల పరిమితి |
నాటవలసిన దూరం (సెం.మీ) |
చ.మీ. కు ఉండవలసిన కుదుళ్ళు |
దీర్ఘ కాలిక రకాలు (150 రోజుల పైన) |
20 x 15 |
33 |
మధ్య కాలిక రకాలు (120-135 రోజులు) |
15 x 15 |
44 |
స్వల్ప కాలిక రకాలు |
15 x 10 |
66 |
భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్ల నాటాలి. ముదురు నారు నాటినప్పడు కుదుళ్ళ సంఖ్యను పెంచి, కుదురుకు 4, 5 మొక్కల చొప్పన నాటు వేయా లి. అలా ముదురు నారు నాటినప్పడు నత్రజని ఎరువును సిఫార్పు కంటే 25% పెంచి మూడు దఫాలుగా గాక, రెండు ద ఫాలుగా అంటే 70 శాతం దమ్మలోను మిగతా 30 శాతం అంకురం దశలోనూ వాడాలి.
వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారసు చేసిన ఫోషకాల మోతాదు (కిలోలు/ఎకరాకు)
వ్యవసాయ వాతావరణ మండలం
|
ఖరీఫ్ |
రబీ |
||||
నత్రజని |
భాస్వరం |
పొటాష్ |
నత్రజని |
భాస్వరం |
పొటాష్ |
|
గోదావరి (గోదావరి డెల్టా) మండలం |
36 |
24 |
24 |
72 |
36 |
24 |
కృష్ణా డెల్టా మరియు తేలిక భూములకు |
24-32 |
16 |
12-16 |
|||
ఉత్తరకోస్తా |
32 |
24 |
16-20 |
48 |
24 |
20 |
దక్షిణ మండలం |
32 |
24 |
16 |
48 |
24 |
16 |
ఉత్తర తెలంగాణా |
40 |
20 |
16 |
48 |
24 |
16 |
మధ్య తెలంగాణా |
40 |
20 |
16 |
48 |
24 |
16 |
దక్షిణ తెలంగాణా |
40-48 |
24 |
16 |
48 |
24 |
16 |
తక్కువ వర్షపాత మండలం |
64 |
32 |
32 |
-
|
- |
- |
ఎత్తైన ప్రదేశాల మండలం |
32 |
24 |
20 |
- |
- |
- |
పై పట్టికలో సిఫారసు చేసిన పోషకాల మోతాదు, రకాల కాలపరిమితి, నేల స్వభావం, భూసారం, ఋతువు, యాజమాన్య పద్ధతులను బట్టి మారుతుంది.
సవరణ:
ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒక సారి, రెండు పంటలు పండించే పొలాల్లో ప్రతి రబీ సీజస్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు ఇరవై కిలోల జింకు సల్ఫేట్ వేయాలి లేదా పైరు పై జింకు లోపం కనిపించ గానే లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధి లో 2,3, సార్లు పిచికారి చేయాలి.
గమనిక:
సవరణ :
శ్రీ కళ్యాణి ఎంటర్ ప్రైజెస్, కెనాల్ రోడ్, పెనుగొండ - 534 320, పశ్చిమ గోదావరి (జిల్లా) ఫోన్ నెం. 08819 - 246735, 9440286964
వరి - వరి (గోదావరి, కృష్ణా డెల్టా లలో రెండవ పంటకు నీరు ఇచ్చినపుడు)
వరి - పప్పు జాతి పంటలు
వరి - చెరకు
వరి - వేరుసెనగ
వరి - మెస్తా
వరి - రాగి
వరి - రాగి
వరి - నువ్వులు
వెన్నులోని 80 శాతం గింజలు పక్వానికి వచ్చిన తర్వాత, కాండం పచ్చగా ఉన్నప్పడే కోత కోయటం మంచిది. కోతకు పూత దశనుండి సుమారు 28-32 రోజుల వ్యవధి తీసుకొంటుంది. ఈ దశలో గింజల్లో సుమారు 18-24 శాతం తేమ ఉంటుంది.
దాళ్వా / రబీ పంటగా కాటన్ దొరసన్నాలు (యం.టి.యు 1010) ఎంపిక చేసినచో, తప్పనిసరిగా 20 - 25 రోజుల నారుతోనే వరినాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా 35-40 రోజుల నారుతో నాట్లు వేసినచో, నాటిన 20-25 రోజులకే తల్లి కర్ర (పిలకలు వేయకుండానే) పుష్పించి వెన్నులు చిన్నవిగా వచ్చి దిగుబడులు తగ్గుతాయి. అలాగే సకాలంలో అన్ని చర్యలు పాటించినను వరి కోత దశలో ఈ రకం పొలంలో గింజ రాలుట ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గింజ కట్టే దశలో రాత్రిపూట చలి, మంచు ఎక్కువగా ఉండటం వలన ఇలా జరుగుతుంది. అందువలన వరి కోతకు ఒక వారం ముందుగానే చేను (నేల తడి) ఆరగట్టుట మరియు చేనుపై మంచు కూడా పూర్తిగా ఆరనిచ్చినచో వరికోత సమయంలో గింజ రాలుట కొంతవరకు అరికట్టవచ్చు లేదా వరి కోతకు వరికోత యంత్రాన్ని వాడిన యెడల కూడ గింజరాలటాన్ని అరికట్టవచ్చును.
ఎగుమతులకు బియ్యపు భౌతిక లక్షణాలైన
పైన పేర్కొనబడిన లక్షణాలు గల సువాసన లేని ఎక్కువ మరియు మధ్యస్ట నాణ్యత కలిగిన పొడవు గింజ మరియు జపానికా వర్గానికి చెందిన పొట్టి గింజ రకాలు 90 శాతం ఎగుమతి అవుతున్నాయి. ఈ లక్షణాలు గల బియ్యం ముఖ్యం గా ఆస్ట్రేలియా, సూరినాం,ధాయిలాండ్, ఉత్తర అమెరికా లు ఎగుమతి చేయు చున్నవి.
సువాసన గల "బాస్మతి బియ్యం" ప్రపంచ మార్కెట్ కు మిగిలిన 10 శాతం భారత దేశం, పాకిస్తాస్ దేశాలు ఎగుమతి చేస్తున్నాయి.
క్రమ సం. |
గమనించిన దిగుబడి నిరోధకాలు
|
అధిగమించటానికి ఆచరించవలసిన పద్దతులు
|
ఆచరించటం వలన కలిగే ఫలితం
|
||||||||
1. |
విత్తనశుద్ధి పాటించక పోవటం |
1)విత్తన శుద్ధి తప్పకుండా ఆచరించాలి. 2)పొడివిత్తన శుద్ధి -కిలో విత్తనానికి 3 గ్రా. కార్భండిజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారు మడిలో చల్లుకోవాలి. 3)తడి విత్తనశుద్ధి-కిలో విత్తనానికి 1 గ్రా/1 లీ. నీటిలో కార్బండిజిమ్ కలిపి ఆ ద్రావణం లో 24 గంటలు మండె కట్టి నారు మడిలో చల్లుకోవాలి.
|
నారు మడి దశలో అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవచ్చు.దీని వల్ల సస్య రకణ కు అయ్యే ఖర్చు ను 10-15 % తగ్గించ వచ్చును మరియు దిగుబడి 5-10% పెరుగుతుంది. |
||||||||
2. |
మండె కటే పదతిని పాటించక పోవటం |
మండె కట్టే పద్దతి ని తప్పక పాటించాలి . |
విత్తనఖర్చు తగ్గి మొలక శాతం పెరుగుపడుతుంది. |
||||||||
3. |
నారు మడిలో సస్యరకణ పద్దతులు పాటించక పోవడం |
నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 - 2OO గ్రా. కారోృప్యురాన్ గుళికలు వేయాలి. |
సాగు ఖర్చు ఎకరానికి రూ. 1500 - 2000/- తగ్గుతుంది. |
||||||||
4. |
సరియైన మొక్కల సాంద్రత లేకపోవటం |
సిఫారసు చేసిన మొక్కల సాంద్రత ను తప్పక పాటించాలి .
|
విత్తనం ఖర్చు తగ్గి , దిగుబడి 10-15 శాతం పెరుగుతుంది.
|
||||||||
5. |
విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం |
భూసార పరిక్ష ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులు వేయాలి. ధీర్ఘ కాలిక రకాలకు 32-24-16 ఎకరాకు, స్వల్పకాలిక రకాలను 48-24-18 కిలోల నత్రజని , భాస్వరం, పొటాష్ లను అందించే ఎరువులను ఎకరాకు వేసుకోవాలి . |
పోషకాల సమతుల్యత పాటించవచ్చు. ఎరువుల పైపెట్టే అనవసరం ఖర్చు 20 - 30% తగ్గించు కోవచ్చు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది
|
||||||||
6. |
విచక్షణా రహితంగా పురుగులు – తెగుళ్ళ మందులను వాడడం |
ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటిన తర్వాతనే పురుగులు - తెగుళ్ళ మందులను సిఫార్పు చేసిన మోతాదులో పిచికారీ చేయాలి. ఉదా: కాండం తొలిచేపురుగు-1 తల్లిపురుగు /చ.మీ. లేదా 1-2 గుడ్ల సముదాయం/ చ.మీ. |
సస్యరక్షణ ఖర్చులు 20 – 40 % తగ్గి భూమి, నీరు మరియు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది.
|
||||||||
7. |
పచ్చి రొట్ట ఎరువులు వాడకపోవడం |
పచ్చి రొట్ట ఎరువులను నాట్లకు ముందు పెంచి పూతదశలో కలియ దున్నాలి. వీటివల్ల కలుపు ఉదృతిని తగ్గించవచ్చు. ఉదా. జీలుగ, ఇనుము, పిల్లిపెసర మొదలగునవి. (1)జనుము – 24 కి/ఎ (2) జీలుగ – 12 - 14 కి/ఎ (3) పిల్లిపెసర – 6 - 8 కి/ఎ (4) అలసంద – 6 - 8 కి/ఎ చౌడు నేలలకు జీలుగ అనుకూలమైన పచ్చిరొట్ట పైరు.
|
భూమిలో సేంద్రియ పదార్ధం పెరిగి నేల ఆరోగ్యం మొరుగు పడటంతోబాటు ఎరువుల మోతాదు 15 – 20 % తగ్గించి వాటికి అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాలను నివారించవచ్చు.
|
||||||||
8. |
సేంద్రియ ఎరువులు వాడక పోవడం |
సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పకుండా వేయాలి. ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు / కంపోస్టు ఎరువు వేసుకోవాలి. |
నేల ఆరోగ్యం మెరుగుపడి సూక్ష్మజీవుల చర్య పెరిగి , పోషకాల లభ్యత మెరుగవుతుంది. దీనివల్ల 15 - 20 % అధిక దిగుబడి సాధించవచ్చు. |
||||||||
9. |
పైపాటుగా సంకీర్ణ ఎరువుల వాడకం
|
సంకీర్ణ ఎరువులను ఆఖరి దుక్కిలో / నాట్లకు ముందు మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేసే నత్రజని ఎరువులను సూటి ఎరువుల రూపంలోనే వేయాలి. |
దీనివల్ల పోషక వినియోగ సామర్థ్యం పెరిగి, ఎరువుల మీద పెట్టే ఖర్చును 30 – 40 % తగ్గించుకోవచ్చు. సూక్మ పోషక లోపాలు కూడా తగ్గుతాయి. |
||||||||
10. |
సకాలంలో కలుపు యాజమాన్యం చేపట్టకపోవడం |
నాటిన 40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. దీని కొరకు నాట్లకు 15 రోజుల ముందు పొలాన్ని తయారు చేసుకూవడం, వేసవిలో లోతు దుక్కులు చేయూలి. బూటాక్లోర్ 1.25 లీ. లేదా అనిలో ఫాస్ 500 మి.లీ. లేదా పైటిలాక్లోర్ 5OO మి.లీ. ఎకరాకు నాటిన 3-5 రోజుల తర్వాత 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలమంత సమానంగా వెదజల్లాలి. వెడల్పు ఆకుల కొరకు ఎకరాకు నాటిన 8 - 12 రోజులప్పుడు పైరజోసల్చ్యురాన్ ఇదైల్ 8Oగ్రా. లేదా ఇధాక్సీసల్చ్యురాన్ 50 గ్రా, చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. ఏ పంటకు సిఫారసు చేసిన కలుపు నాశినిలను ఆ పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. |
నీటి మరియు భూసార వినియోగం పెరిగి 2O - 3O % అదిక దిగుబడులు సాధించవచ్చు.
|
||||||||
11. |
పంట మార్పిడి పాటించకపోవడం |
వరి తర్వాత అపరాలతో పంట మార్పిడి చేయాలి. |
దీనివల్ల భూసారం అభివృద్ధి చెందటమే కాకుండా పురుగులు తెగుళ్ళ ఉధృతి తగ్గి దిగుబడులు 2O – 30 % పెరుగుతాయి. |
||||||||
12. |
సరైన నీటి యజమాన్యం పాటించకపోవటం |
సరియైన నీటి యజమాన్యం పాటించాలి. బురద పదునులో (2.5 సెం.మీ. నీరు) నాట్లు వేసుకోవాలి. అంకురం దశ నుండి విత్తనం తయారయ్యే వరకు పంటలో 5 సెం.మీ నీరు ఉండేటట్లుగా చూసుకోవాలి. నాటిన వారం రోజుల వరకు 2.5 సెం.మీ. నీటిని మరియు నాటిన వారం రోజుల తర్వాత 5 సెం.మీ నీటిని పొలంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. |
దీని వల్ల పైరుభాగా దుబ్బుచేసి , తాలు గింజలు లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు. నీరు 35 - 50% ఆదా అవుతుంది. ఖర్చు తగ్గుతుంది. దిగుబడి 2O – 40 % పెరుగు తుంది
|
||||||||
13. |
సాంప్రదాయక వరి సాగు |
యాంత్రీకరణతో వరి సాగు కస్టమ్ హైరింగ్ పద్దతి ద్వారా, సమయానికి నాట్లు వేయవచ్చు. కూలీల ఖర్చు తగ్గుతుంది. రిస్్క తగ్గుతుంది. |
15 నుండి 2O % దిగుబడి పెంచవచ్చు.
|
||||||||
14 |
ఆలస్యంగా నీటి విడుదలకు దీర్ఘకాలిక రకాలు వాడటం.
|
తక్కువ నుండి మధ్యస్థ కాలపరిమితి గల రకాలు వాడటం తక్కువ కాలపరిమితి గల రకాలు (120 నుండి 125 రోజులు) ఎన్.ఎల్.ఆర్. - 34449, ఎన్.డి.ఎల్.ఆర్. - 7,8, ఎం.టి.యు. - 1010 మరియు నెల్లూరు నిరోనా (ఎన్.ఎల్.ఆర్. - 3041) |
1O నుండి 15% దిగుబడి పెంచవచ్చు.
|
||||||||
15. |
తక్కువ నత్రజని వినియోగ సామర్ధ్యం. |
నత్రజని ఎరువులను బురద పదునులో వేసుకోవాలి, నేల స్వభావాన్ని బట్టి నత్రజని ఎరువులను 3 లేదా 4 దఫాలుగా వేసుకోవాలి. వేప నూనె కలిపిన యురియాను వేసుకోవాలి. |
నత్రజని వినియోగ సామర్థ్యం 30 – 40 % పెరుగుతుంది.
|
||||||||
16. |
వరిలో మొవ్వు పురుగు నివారణకి చిరుపొట్ట దశ తర్వాత కూడా పురుగు మందుల గుళికలు వాడటం. |
(1) వరి పంటకు చిరు పొట్టదశ తరువాత గుళికలు గాని , ఎరువులు గాని గ్రహించే శక్తి ఉండదు. కాబట్టి కార్బోప్యురాన్ 3జి 10 కిలోలు లేదా కార్ధాప్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోల గుళికలను చిరుపొట్ట దశలోనే వేసుకోవచ్చు. (2) మొవ్వు పురుగు గొంగళి పురుగు ఒక దుబ్బులోనే దాని జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఒక దుబ్బులోని గొంగళి పురుగు వేరొక దుబ్బులోకి వెళ్ళే అవకాశం లేదు. (3) చిరుపొట్ట దశ తరువాత చ. మీ. ఒక మొవ్వు పురుగు గ్రుడ్ల సముదాయం ఉంటే పిచికారి మందులు లీటరు నీటికి కార్ధాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. లేదా ఎసిఫెట్ 1.5 గ్రా, చొప్పున పిచికారి చేయాలి. |
చిరుపొట్ట దశ తరువాత గుళికలు వాడకుండా ఉండటం వలన మందు వృధా అరికట్టవచ్చు. గింజ పై పురుగు మందుల అవశేషాలను లేకుండా అరికట్టవచ్చు. |
||||||||
17. |
వరిలో యూరియూ ఎరువుతో పాటు కలుపు మందులు కలిపి వాడటం. |
(1)ఎరువు బరువు మరియు కలుపు ముందు బరువు సమానంగా ఉండవు కాబట్టి ఆ రెంటిని కలిపి వెదజల్లినపుడు చేనులో సమానంగా పుడవు. (2) యూరియూ ఎరువులకు ఆవిరి అయ్యే గుణం ఉంటుంది కాబట్టి ఎరువును కలుపు మందుతో కలపటం వలన అనవసర రసాయన చర్య ఏర్పడే అవకాశం ఉంది. (3) కావున కలుపు మందును దాని బరువుతో సమానంగా ఉండే ఇసుకతో కలిపి 2 అంగుళాల నీరు ఉంచి చల్లుకోని ఆ నీరు ఇంకే వరకు ఉంచాలి. |
విడిగా చల్లినపుడు ఎరువు మరియు కలుపు ముందు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృధాను అరికట్టవచ్చు.
|
||||||||
18. |
యూరియూ ఎరువును పొలంలో నీరు ఎక్కవగా పెట్టి వాడటం
|
యూరియా ఎరువును బురద పదునులో వాడితే మొక్కకి బాగా ఉపయోగపడుతుంది |
ఎరువు వృధాను అరికట్టవచ్చు. నత్రజని పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. |
||||||||
19. |
సుడి దోమ సంతతిని పెంచే పరుగు మందులను వాడటం |
(1)క్లోరిపైరిఫాస్, ఫోరేట్, సింథటిక్ పైరిత్రాయిడ్స్, ప్రొఫెనోఫాస్ పురుగు మందులు సుడి దోమ ఉన్నపుడు పిచికారి చేస్తే వాటి ఉధృతి అధికం అవుతుంది. (2) అందు వలన పైన పేర్కొన్న మందులను సుడి దోమ ఉన్నపుడు వాడరాదు |
పురుగు మందుల పైన పెట్టె ఖర్చు తగ్గుతుంది.
|
||||||||
20. |
పంట తొలి దశలో పురుగు మందులను అదిక మోతాదుల్లో తక్కువ నీరు ఉపయోగించి వాడటం. |
(1) అవసరం ఉన్న లేకున్నా పరుగు మందులు విచక్షణా రహితంగా వాడటం వలన సహజ శత్రువులు చనిపోయి సుడి దోమ లాంటి శత్రు పురుగులు అధికం అవుతాయి. ఏ మందుకు కూడా లోంగకుండా తయారవుతాయి. (2) నష్టపరిమితి స్థాయిని బట్టి ఉదా దుబ్బు దశలో దుబ్బుకి 10 దోమలుకు మించి ఉంటే మందులు పిచికారి చేయాలి. (3) నీరు మోతాదు కూడా తగినంతగా ఉంటే మొక్క పూర్తిగా తడిచి పురుగును నివారించడం తేలిక అవుతుంది (ఎకరాకీ 200 లీ. నీటిని వాడాలి). |
పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. పురుగు మందుల పైన పెట్టి ఖర్చు తగ్గుతుంది.
|
||||||||
21. |
ఉల్లి కోడు నివారణకి పంట దుబ్బు దశ తరువాత కూడా గుళికలు లేదా మందులు పిచికారి చేయటం |
(1) సాధారణంగా ఉల్లి కోడు చేయవలసిన నష్టం దుబ్బు దశకే అంటే నాటిన 30 రోజులకే పూర్తి అవుతుంది. (2) కాబట్టి దాని నివారణకి దుబ్బు దశ తర్వాత గుళికలు వేయటం వలన ఏ ఉపయోగం ఉండదు. (3) దుబ్బు దశలో ఎకరానికి కార్బోప్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు చొప్పున వేయాలి. |
పురుగు మందు ఖర్చు తగ్గించవచ్చు.
|
||||||||
22. |
ఆకు ముడత పురుగు నివారణకి పంట తోలి దశ నుండే ఎక్కువ ఖరీదు గల మందులు ప్లూబెండమైడ్ (ఫేమ్) లేదా క్లోరాంట్రినిలిప్రోల్ (కొరాజెన్) వాడటం.
|
(1) ఆకు ముడత పురుగు వలన పంట తోలి దశల్లో పెద్దగా నష్టం ఉండదు. (2) ఒక ఆకు నష్ట పోయినా తిరిగి క్రొత్త ఆకు తొడుగుతుంది. పోటాకు దశలో ఆకు ముడత పురుగు వల్ల నష్టం కలుగుతుంది. (3) కావున పోటాకు దశలో మాత్రమే మందులు పిచికారి చేయాలి. లీటరు నీటికి ప్లూపెండమైడ్ 20 WDG 0.2 గ్రా. లేదా 48 SC 0.1 మి.లీ. లేదా క్లోరాన్ ట్రినిసిప్రోల్ 0.4 మి.లీ. చొప్పున పిచికారి చేయాలి. |
పురుగు మందు ఖర్చు, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. |
||||||||
23. |
యాంత్రీకరణ పద్దతిలో కాకుండా సాధారణ పద్దతిలో నాట్లు వేయటం
|
(1) యాంత్రీకరణ పద్దతిలో వరుసలలో నాట్లు వేయటం వలన మొక్కలకు బాగా గాలి, వెలుతురు అందుతాయి. (2) సుడి దోమ ఉధృతి బాగా తగ్గుతుంది. |
పంట ఆరోగ్యంగా పెరిగి పురుగు, తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. |
||||||||
24. |
వరిలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంచడం |
(1) పంట తొలి దశల్లో నీటి మోతాదు ఎక్కువగా ఉంటే పైరు సరిగా దుబ్బు చేయదు. మరుగు నీరు పోయే వసతి లేనప్పుడు సూక్ష్మ పోషక లోపాలు, సుడి దోమ/కాండం కుళ్ళు ఆశించే అవకాశం ఉంది. (2) కాబట్టి దుబ్బు దశ వరకు ఆరు తడులుగా నీరు ఇవ్వాలి. |
నీటి ఆదా, పురుగు మందుల ఖర్చు ఆదా అవుతుంది. కాండం కుళ్ళు ఆశించదు. పురుగు ఉధృతి తక్కువ.
|
||||||||
25. |
నారుమడిలో నాట్లు వేసే వారం ముందు కాకనాట్లు వేసిన తరువాత పరుగు మందుల గుళికల వేయకపోవడం |
(1) నారుమడిలో సెంటుకి 160 గ్రా. చొప్పున కార్బోప్యురాన్ 3జి గుళికలు నాట్లు వేయటానికి 7-10 రోజుల లోపు వేయాలి. (2) ఇది నాట్లు వేసిన తరువాత 20 రోజుల వరకు పంటను తొలి దశలో ఆశించే పురుగుల నుండి కాపాడుతుంది. మిత్ర పురుగుల పైన కూడా ప్రభావం ఉండదు. (3) నారుమడిలో గుళికలు వేయక పోతే నాట్లు వేసిన తరువాత ఎకరాకు కార్బోప్యురాన్ 3జి గుళికలు 10 కిలోల చొప్పున వేసుకోవాల్సి వస్తుంది. |
ఎకరాకు సుమారు 750 రూ. ఆదా చేయవచ్చు. |
||||||||
26. |
వరిలో ఆకునల్లి నివారణకి ఆకు పైన మచ్చలు పోయే దాకా మందులు పిచికారి చేయటం |
(1) ఆకు నల్లి వలన ఆకు పైన తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. ఇవి మందులు పిచికారి చేసిన తరువాత కొత్త ఆకుల పైన వస్తున్నాయా లేదా అని గమనించాలి. దీని నివారణకు నీటిలో కరిగే గందకం పొడి 50 % 3 గ్రా. లేదా డైకొపాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి (2)కొత్త ఆకుల పైన లేక పోతే నల్లి నివారించబడినట్లుగా భావించాలి.
|
పురుగు మందుల పైన పెట్టే ఖర్చు ఆదా చేయవచ్చు. |
||||||||
27. |
వరిలో కలుపు మొలకెత్తక ముందు నాట్లు వేసిన 3-5 రోజుల తరువాత కలుపు మందులు వాడకపోవడం. |
నాట్లు వేసిన 3-5 రోజులకు కలుపు మందులు ఎకరానికి అక్పాడయార్డిల్ 35-50 గ్రా. లేదా ప్రెటిలాక్లోర్ 500 మి.లీ. పల్చగా నీరు పెట్టి 20 కిలోల ఇసుకలో కలిపి పొలం అంతా సమానంగా వేసుకోవటం వలన కలుపు గింజలు మొలకెత్తటం తోనే కలుపును నివారిస్తాయి. |
కలుపును సకాలంలో నివారించవచ్చు. తదుపరి పంట పెరుగుదల , ఎరువుల వినియోగించు కోనే సామర్థ్యం పెరిగి తద్వారా అధిక దిగుబడి వస్తుంది.
|
||||||||
28. |
వరిలో నాట్లు వేసిన తరువాత కలుపు నివారణకి కలుపు 23 ఆకుల దశ దాటిన తరువాత కలుపు మందులు వాడటం |
(1) నాట్లు వేసిన సుమారు 20-30 రోజులకి కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నపుడు కలుపు మందులు బిస్ పైరిబాక్ సోడియం (10% ద్రావకం) 80-120 మి.లీ. ఎకరానికి పిచికారి చేస్తే వెడల్పాటి ఆకు జాతి మరియు గడ్డి కలుపును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. (2) ఈ కలుపు మందులను నీరు తీసి వేసి పిచికారి చేసుకోవాలి |
సకాలంలో కలుపును నివారించడం వలన మంచి దిగుబడులను విందవచ్చును.
|
మరిన్ని వివరాలకు సంప్రదించాల్చిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త (వరి), వ్యవసాయ పరిశోధనా స్థానం, ముత్తుకూరు రోడ్, నెలూరు – 524 003 ఫోన్ నెం. 0861 – 2327803, సెల్ : 9989625214
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023