অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సజ్జ

ఆంధ్రప్రదేశ్లో సజ్ఞ పంట 1.25 లక్షల ఎకరాలలో సాగుచేయబడుతూ 54 వేల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. ఎకరా సరాసరి దిగుబడి 4.90 క్వింటాళ్ళు.

విత్తే సమయం

ఖరీఫ్ : జూన్ – జూల్నై

వేసవి : జనవరి

నేలలు

తేలిక నుండి మధ్యరకం నేలలు. నీరు యింకే, మురుగు నీటి పారుదల గల నేలలు అనుకూలం.

రకం

ఋతువు

పంటకాలం(రోజుల్లో)

దిగుబడి(క్వి/ఎ)

గుణగణాలు

హెచ్.హెచ్.బి-67 (హైబ్రిడ్)

ఖరీఫ్, వేసవి

68-70

8-10

అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే సంకర రకము. వెర్రి కంకి తెగులును తట్టుకొంటుంది.

ఐ.సి.ఎం.హెచ్-350 (హైబ్రిడ్)

ఖరీఫ్, వేసవి

80-85

10-12

సంకర రకం. పైరు 185 సెం.మీ ఎత్తు ఎదిగి, 2-3 -3 పిలకలు వేస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా బూడిద రంగులో ఉంటాయి. వెఱ్ఱికంకి తెగులును తట్టు కొంటుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలం.

ఆర్.హెచ్.బి-121 (హైబ్రిడ్)

ఖరీఫ్, వేసవి

80-85

12-14

వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది.

ఐ.సి.టి.పి-8203 (కాంపొంసిట్)

ఖరీఫ్, వేసవి

80-85

8-10

గింజలు లావుగా, తెల్లగా వుంటాయి. వెట్టికంకి తెగులును, బెట్టను తట్టుకొంటుంది.

ఐ.సి.ఎం.వి-231 (కాంపొంసిట్)

ఖరీఫ్, వేసవి

80-90

8-10

వెట్టికంకిని తట్టుకోగల కాంపోజిట్ రకం. అన్ని ప్రాంతాలకు అనుకూలం. డబ్ల్యుసిసి-75 కంటే మేలైనది.

విత్తనం

ఎకరాకు 1.6 కిలోలు.

విత్తన శుద్ధి

2% (20గ్రా/లీ) ఉప్పనీటి ద్రావణంలో విత్తనాలను 10 ని|లు ఉంచటం ద్వారా ఎర్గాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ను కలిపి శుద్ధి చేయాలి.

విత్తే దూరం

వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 12 నుండి 15 సెం.మీ. దూరం ఉండేట్ల గొర్రుతో విత్తుకోవాలి.

నాటటం

నారుపోసి, 15 రోజుల వయసుగల నారు మొక్కలను పైన తెల్సిన దూరంలో నాటవచ్చు. ఎకరాకు 58,000-72,000 మొక్కలు ఉంచాలి.

ఎరువులు

ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 కి. + 16 కి. + 12 కి. వరాధార పంటకు 24 కి. + 12 కి. + 8 కి. వంతున నత్రజని + భాస్వరం + పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజనిని విత్తేటపుడు సగం, విత్తిన 30 రోజులకు మరోసగం వేయాలి.

నీటి యాజమాన్యం

మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమిలోని తేమను ఆవిరి కాకుండా కాపాడవచ్చు. అంకురదశ, పూతదశ, గింజపాలు పోసుకొనే దశ, గింజ గట్టిపడేదశల్లో నీటితడులివ్వాలి.

అంతర పంట

సజ్ఞ : కంది – 2 : 1

కలుపు నివారణ, అంతర కృషి

విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లో అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రా.ల చొప్పన 200 లీ. నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేయాలి. 25, 30 రోజులప్పడు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి.

సస్యరక్షణ

పచ్చకంకి/వెట్టి కంకి తెగులు :

తెగులు సోకిన కాండంపై పూర్తిగా లేదా అసంపూర్తిగా ఆకులుగా మారిన పుష్పగుచ్చం ఏర్పడుతుంది. తెగులు లక్షణాలు మొదట లేత మొక్కలపై 3-4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారుతాయి. గాలిలో తేమ అధికంగా వున్న వాతావరణంలో ఆకుల అడుగుభాగాన తెల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. తెగులు తీవ్రదశలో మొక్కలు గిడసబారి 30 రోజులలోపు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 6 గ్రాముల ఆప్రాన్ ఎస్.డి. 35 (Apron SD35) మందుతో విత్తన శుద్ధి చేయాలి. వ్యాధి సోకిన మొక్కలను ఏరి, కాల్చి వేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించివున్నట్లయితే Ridomi/25 WP/లీ. నీటికి 1 గ్రా. వంతున పిచికారి చేయాలి.

తేనెబంక తెగులు :

తెగులు సోకిన కంకి నుండి గులాబి లేదా ఎర్ర రంగుగా ఉన్న తేనె వంటి చిక్కటి ద్రవం బొట్ల బొట్లుగా కారుతుంది. ఈ ద్రవంలో శిలీంధ్ర బీజాలు ఏర్పడతాయి. మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం, వర్షపు తుంపరలు, వాతావరణం చల్లగా వుండటం ఈ తెగులు వ్యాప్తికి దోహద పడుతుంది. దీని నివారణకు విత్తనాలను 2% (20 గ్రా/లీ.) ఉప్పునీటి ద్రావణంతో శుద్ధి చేసి, కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ మందు కలిపి విత్తన శుద్ధి చేయాలి. పైరు పూతదశలో మాంకోజెబ్ (2.5 గ్రా/లీ) లేదా కార్బండజిమ్ (1 గ్రా/లీ.) లేదా జైరామ్ (2 గ్రా/లీ.)ను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

తేలిక నేలల్లో చెదల నివారణకు ఎకరాకు 8 కిలోల 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడిని దుక్కిలో వేసి కలియదున్నాలి. లేత మొక్క దశలో మిడతల నుండి సజ్ఞ పంటను కాపాడటానికి 5 శాతం కార్బరిల్ పొడిని లేదా 2 శాతం మిథైల్ పెరాథియాన్ను ఎకరాకు 8-10 కిలోల చొప్పన చల్లాలి.

సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే, ఒక ఎకరాకు 200 లీటర్ల నీటితో సిఫార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక / శిలీంద్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయవలసి వుంటుంది.

పంటకోత

సజ్ఞ పంటలో పిలక కంకుల కంటె ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతి కట్టాలి.

జొన్న సజ్జ, రాగి, కొర్ర, వరిగ పంటల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ సైంటిస్ట్ (చిరుధాన్యాలు), వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్లపల్లె-517 502, చితూరు జిల్లా, ఫోన్ నెం.0877-2276240

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate