ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానం మరియు కోళ్ళ మాంసము ఉత్పత్తిలో ఐదవ స్థానంలో వుంది. కోళ్ళ సంఖ్యలోను, గుడ్ల మరియు మాంసము ఉత్పత్తిలోను మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన ఉంది.
2005 నాటి కోళ్ళ పరిశ్రమల వివరాలు :
|
భారతదేశం ఉత్పత్తి (కోట్లలో) |
ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి (కోట్లలో) |
సంకరజాతి గుడ్ల కోళ్ళు |
18.9 |
6.5 |
గుడ్ల ఉత్పత్తి |
4,455 |
1,690 |
బ్రాయిలర్లు |
160 |
16 |
దేశవాళీ కోడి, గుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడిఉంది. అందుచేత గుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు మరియు వాటినుండి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకోబడ్డాయి. వీటిలో వైట్ లెగ్హార్న్ ముఖ్యమైనది. ఎక్కువ సంఖ్యలో గుడు పెట్టటానికి వైట్ లెగ్హార్న్ కోళ్ళ నుండి రూపొందించిన సంకరజాతి కోళ్ళు సాధారణంగా ఉపయోగించబడుచున్నవి.
గుడ్ల రకాల కోళ్ళు : బి.వి. 300, హెచ్.హెచ్. 260, బొవాన్సు, డికాల్ఫ్ శేవర్. వీటిలో ఏ రకాన్నైనా వాటి శ్రేష్టతను బట్టి మరియు అనుభవమున్న రైతుల సమాచారాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.
క్రమ సంఖ్య |
హేచరీ |
ప్రదేశం |
కోడిపిల్లల పేరు |
1. |
శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం |
హైద్రాబాద్ |
ఐఎల్ఆర్-90 జూబ్లీ |
2. |
బాలాజీ హేచరీస్ |
చిత్తూర్ |
బివి-300 |
3. |
శ్రీనివాస్ హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
విజయవాడ |
బివి-300 |
4. |
సిస్టమిక్ హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
హైద్రాబాద్ |
హైలైన్ |
5. |
తిరుమల హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
వరంగల్ |
బివి-300 |
6. |
వెంకటేశ్వర హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
హైద్రాబాద్ |
బివి-300 |
7. |
సింగ్ పౌల్ట్రీ లిమిటెడ్ |
హైద్రాబాద్ |
హైబ్రో |
పెద్దు నిర్మాణానికి ఎంచిన స్థలం, మంచి నీటివసతి, విద్యుచ్చక్తి సరఫరా, మార్కెట్టుకు చేరువలో ఉండటం మున్నగు సదుపాయాలు కలిగి ఉండాలి. పెడు ఎత్తులో ఉంటే గాలి చలనం బాగా ఉండి, మురుగు నీరు నిల్వకు అవకాశం లేనటువంటి ప్రదేశాలను ఎన్నుకోవాలి.
షెడ్డు నిర్మాణానికి ఆయా ప్రాంతాల్లో సులభంగా తక్కువ ఖర్చులో దొరికే ఇటుక, కలప, బోద, కొబ్బరి లేక తాటాకు మొదలగునవి వాడవచ్చు. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో పెడును ఎలుకలకు, అగ్ని ప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు. ఇందుకుగాను కాంక్రీటు నేల, ప్రక్కలకు అల్లిన ఇనుపతీగ, పై కప్పుకు రేకులు వాడటం మంచిది. కోడి పిల్లలను, పెరిగే కోళ్ళను, గ్రుడు పెట్టే కోళ్ళను వేర్వేరు షెడ్లలో పెంచడం మంచిది. అయితే చిన్నకారు రైతులకు ఇది సాధ్యం కాదు కాబట్టి ఒకే షెడ్డును అన్ని దశల్లోని కోళ్ళ కొరకు వాడుకోవచ్చు. షెడు వెడల్పు 25 నుండి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ళ సంఖ్యను బ్ట్టి పొడవు ఎంతైన ఉండవచ్చు. పెద్దు ప్రక్కగోడలు 1 అడుగు ఎత్తు ఉండి, ఆ పైన 6-7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుపతీగను (వైర్మెష్) అమర్చాలి. చూరు కనీసం 3-4 అడుగులుండేటట్లు చూడాలి. కప్ప ఆకారంలో షెడ్, గేబులు, మోనిటర్, మొదలగు రకాలున్నప్పటికీ, గేబులు సాధారణంగా వాడబడతాయి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయుట మంచిది. షెడ్డులో ఎండపడకుండా ఉండుటకుగాను, షెడ్ ను తూర్పు, పడమర దిశలో నిర్మించుకోవాలి. కోళ్ళను నేలమీద (డీప్ లిట్టరు) లేదా పంజరం (కేజ్)లో పెంచడానికి కావలసిన గృహవసతి వేరువేరుగా ఉంటుంది. కేజ్ గృహవసతి ఎత్తుగా ఉండి, రెట్టను నేలమీద పడేందుకు అనువుగా ఉండేలా చూడాలి. ఇలా చేయడం వలన ఈగల బెడద, దుర్వాసనలను అరికట్టవచ్చు.
కోడిని పెంచి పోషించే విధానంపైనే దాని గుడ్ల దిగుబడి ఆధారపడి ఉంటుంది. కోళ్ళ పోషణ వాటి వయస్సును బట్టి మూడు దశలుగా విభజించబడుతుంది. కాబట్టి వాటి యాజమాన్య పద్ధతులు కూడా కోళ్ళ వయస్సును బట్టి మారతాయి.
పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వచ్చే వరకు గల దశను పిల్లదశ లేదా స్టార్టరు దశ అంటారు. కోళ్ళ పెంపకంలో దాదాపు 5 లేక 6 శాతం ఖర్చు చిన్న పిల్లల కొరకు వినియోగించబడుతుంది. ఈ దశలో క్రోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అపుడే అవి వాతావరణ పరిస్థితుల నెదుర్కొని చక్కగా పెరిగి సమర్థవంతమైన గుడ్లు పెట్టే కోడిగా మారగల్లుతుంది. వీలైనంతవరకు ఒక రోజు వయస్సు పిల్లలతో పరిశ్రమ ప్రారంభించటం మంచిది.
కోడి పిల్లల రాకకు పది రోజుల ముందుగా పెడులోని బూజు, దుమ్ము దులిపి, శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్ల, నీటి తొట్ల కడిగి క్రిమి సంహారక మందుతో శుభ్రపరచాలి. వరి పొట్టు లేక వేరుశెనగ పొట్టు 2-3 అంగుళాల మందంలో నేలపై పరచాలి (లిట్టరు). లిట్టరు పైన కాగితాలు పరచాలి. కోడి పిల్లల మేత తొట్లు, నీటి తొట్లు, బ్రూడరు క్రింద బండి చక్రంలోని ఆకులలాగా ఒక దాని తరువాత ఒకటి అమర్చాలి. మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లాలి. బ్రూడరు చుటూ 2-3 అడుగుల దూరంలో 18 అం. ఎత్తుగా అట్టగాని, రేకులుగాని వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.
బ్రూడింగ్ :
కోడి పిల్లలు తొలిదశలో పరిసరాల ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకొనేటంతటి శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వటాన్ని "బ్రూడింగ్” అంటారు. ఈ బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులనుబట్టి 4-6 వారాల వరకు అవసరం. అయితే బ్రూడింగ్కు ఉపయోగించే బ్రూడరు క్రింద వేడిని కోడి పిల్లల వయస్సుని బట్టి క్రమంగా 90-95o ఫారన్హీట్ నుండి 70-75 o ఫారన్ హీట్ కు (వారానికి 5-7o F) తగ్గించాలి. బ్రూడరు క్రింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి. తక్కువైనట్లయితే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడమో, ఎక్కువ చేయడమో చేయాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడరు క్రింద 250 నుండి 300 పిల్లలను పెంచవచ్చు.
కోడి పిల్లలు వచ్చిన తరువాత ముందుగా అమర్చిన బ్రూడరు క్రింద వదిలేముందు కొన్ని పిల్లల (5 లేదా 10) ముక్కు నీటితొట్లలో ముంచాలి. దీనితో అవి నీరు త్రాగడానికి అలవాటు పడతాయి. చుటూ అమర్చిన అట్టదడిని 2 రోజుల కోసారి క్రమంగా దూరంగా జరుపుతూ, 10వ రోజున పూర్తిగా తీసివేసి గది మూలలందు అట్టలను అమర్చాలి. బ్రూడరు క్రింది కాగితం 5 లేక 6 రోజుల తరువాత తీసివేయాలి.
ప్రతి 50 పిల్లలకు ఒక మేత తొట్టి మరియు నీటి తొట్టి అమర్చాలి. మొదటి వారంలో ఒక పిల్లకు ఒక అంగుళం స్థలం చొప్పున, 50 పిల్లలకు దాదాపు 24 అం. పొడవుగల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు క్రింది అంచున 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి మళ్ళీ నీటితో నింపుకోవాలి.
పిల్లల గృహంలో రాత్రంతా లైట్ల వెలుగుతుండాలి. పిల్లలకు మొదటి 7-10 రోజుల మధ్యలో "డీ బీకర్" అను పరికరం సహాయంతో ముక్కును కత్తిరించాలి. దీనివలన పిల్లలు ఒకదాని నొకటి పొడుచుకొనటం, మేతను తొట్లనుండి కిందకు తోయుట తగ్గుతుంది.
సాధారణంగా పుట్టిన రోజునే కోడిపిల్లలకు హేచరీవారు మేరెక్స్ రోగానికి టీకా వేస్తారు. తరువాత సామాన్య రోగాలైన కొక్కెర తెగులు, గంబోరో మరియు మశూచి వ్యాధులకు ఈ దశలో తగిన మోతాదు మరియు పద్ధతుల్లో టీకాలను వేయించాలి. రక్తపారుడు రోగం (కాక్సి) రాకుండ మేతలో కాక్సిడియోస్టాట్ మందులు, ఏంప్రాలు లేక డాట్ వంటి మందులను కంపెనీవారు సూచించిన మోతాదులో కలపాలి.
ఈ దశలో కోళ్ళను ప్రత్యేకమైన షెడ్లో కాని లేదా సాధారణంగా చిన్న పిల్లల నుంచిన షెడ్లో కాని పెంచవచ్చు. ప్రతి పెరిగే కోడి పిల్లకు వయసుని బట్టి 1-1.5 చదరపు అడుగుల స్థలం కావలసి ఉంటుంది. మేత తొట్టెలు, నీటి తొట్టెలు పిల్లలకుపయోగించిన వాటికంటె పెద్దవిగా ఉండాలి. దీనికిగాను ప్రతికోడికి 2.5 అం. మేత తినే స్థలం, 0.75 అం. నీరు త్రాగే స్థలం అవసరం. ఈ తొట్ల పొడువుగా గాని, వృత్తాకారంగా గాని ఉండవచ్చు. రాత్రులందు వెలుతురు ఇవ్వనవసరంలేదు.
ముక్కులను మరొకసారి 12-16 వారాల మధ్య కత్తిరించటంగాని, మొండిగా కాని చేయటం ముఖ్యం. లిట్టరును అపుడపుడూ తిరగ వేసూ, పొడిగా ఉండేట్లు చూడాలి. అవసరమైతే కొత్త లిట్టరు చల్లుకోవాలి.
ఈ వయసులో కోడి పిల్లల కడుపులో ఏలికపాములు, బద్దె పురుగులు పెరిగే అవకాశం కలదు. వీటి నివారణకు మందులు వాడాలి. లిట్టరుపై పడ్డ పురుగులను ఏరివేసి లిట్టరును బాగా తిరుగవేయాలి.
ఈ వయస్సులో, నాసికరకపు పిల్లలను వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వయసులో రెండవసారి కొక్కెర తెగులుకు, మశూచికి బూస్టరు డోసు టీకాలు వేయాలి. సాధారణంగా 18–20 వారాల వయసు వచ్చేటప్పటికి కొన్ని కోళ్ళ గ్రుడు పెట్టటం మొదలు పెడతాయి. కాబట్టి ఈ సమయంలో షెడ్లో గూళ్ళను అమర్చాలి. ప్రతి 5 కోళ్ళకు ఒక గూడు చొప్పున అమర్చాలి.
గుడ్లు పెట్టే కోళ్ళకు ప్రత్యేక షెడ్ ఉన్న ఎడల, 16 లేక 17 వారాల్లో కోళ్ళను ఆ షెడ్లోనికి మార్చుకోవాలి. ఇలా చేయడం వలన క్రొత్త వాతావరణానికి అలవాటు పడటానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది.
ఈ దశలో ఏ విధమయిన ప్రయాస కలుగకుండా చూసుకోవడం, అతిముఖ్యం. టీకాలు, ముక్కులు రెండవసారి కత్తిరించటం మన్నగు కార్యక్రమాలు కోళ్ళు గుడు పెట్టే దశకు చేరకముందే పూర్తి చేయాలి.
ఈ దశలో కోళ్ళకు రోజుకు 14 నుంచి 16 గం. వెలుతురు అవసరం. అనగా పగటి వెలుతురుతోబాటు అదనంగా 4-5 గం| వెలుతురు రాత్రుల్లో యివాల్సి ఉంటుంది (వారానికి 1 గం| చొప్పన). కాబట్టి 19–20వ వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గం. వచ్చేవరకు పెంచాలి. షెడ్లోని వెలుతురు, కోళ్ల యొక్క గుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని విస్మరించకూడదు. ప్రతి 200 చ.అ. స్థలానికి ఒక 40 వాట్ల బల్బునుకాని, ట్యూబులైటునుకాని అమర్చాలి.
ఒక్కొక్క కోడికి కనీసం 3-4 అం. మేత స్థలం, 1 అం. నీటి స్థలం లభించేలా చూడాలి. ఇందుకోసం తొట్టెల సైజును పెంచుకోవాలి. 10-12 కిలోల పరిమాణంగల మేత తొట్టి షుమారు 20-25 కోళ్ళకు సరిపోతుంది. దాణా మిశ్రమం ఒక రకం నుండి వేరొక రకానికి క్రమంగా మార్చాలి.
లిట్టరు తడిగా యుండి, అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో 10 చ.అలకు. 1 కిలో పొడిసున్నాన్ని కలిపినచో చెడువాసన నివారింపబడి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రతి కోడికి 1.5 నుండి 2 చ.అ. స్థలాన్ని కేటాయించాలి. దగ్గరలోని ఫారమ్లలో కాని, అదే ఫారమ్లోకాని ఏవైనా రోగాలు ప్రబలినపుడు అవసరాన్ని బట్టి మందులు లేదా టీకాలు వేసి కోళ్ళను కాపాడవచ్చు. పెరిగే దశలో ఎక్కువ సమయం వెలుతురునిస్తే గర్భసంచి బయటకు వచ్చి (ప్రాలాప్స్) చాలా సమస్యలు కలిగిస్తుంది. కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలు అయిన తరువాత ఒక సంవత్సరము వరకు అంటె కోడి వయస్సు 72 వారాల వరకు లాభదాయకంగా పెంచవచ్చును.
కోళ్ళ పెంపకం లాభసాటిగా జరగడానికి, నాసిరకమయిన కోళ్ళను తరచు ఏరివేయటం ముఖ్యం. కోళ్ళు గుడ్ల దశకు వచ్చిన తరువాత మూడు మాసాల నుండి ప్రతి నెల గుడ్లు పెట్టని కోళ్ళను ఈ క్రింది లక్షణాలు గమనించి ఏరివేయవచ్చు.
నాసిరకపు కోళ్ళ అవకుండా తగు యాజమాన్య పద్ధతులను గృహవసతి, నాణ్యతగల దాణా, రోగనిరోధక శక్తి మరియు రోజువారి పోషణలో సక్రమమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కోళ్ళ ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన కోళ్ళతో ఫారం లాభదాయకంగా సాగుతుంది.
క్ర.సం. |
శరీరభాగం |
శ్రేష్ఠమైన కోళ్ళు |
నాసిరకం కోళ్ళు |
1. |
జట్టు ఉంటుంది |
పెద్దదిగా, మృదువుగా, గులాబి రంగులో ఉంటుంది. |
చిన్నగా, గరుకుగా, పాలిపోయి ఉంటుంది. |
2. |
కటివలయ భాగం |
వెడల్పుగా మెత్తగా ఉంటుంది. రెండు ఎముకల మధ్య రెండువేళ్ళకు పైగా వెడల్పుగా ఉంటుంది. |
చిన్నదిగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎముకల మధ్య స్థలం ఇరుకుగా వెడల్పుగా ఉంటుంది. |
3. |
కడుపు భాగం |
ఛాతి ఎముకకు, ఉదర భాగం ఎముకకు స్థలం 3-4 వేళ్ళ వెడల్పుగా ఉంటుంది. |
గట్టిగా ఉండి, ఛాతి ఎముకకు, ఉదర ఎముకకు మధ్య ఇరుకుగా ఉంటుంది. |
కోడి శరీర నిర్మాణం చలిని తట్టుకొనే విధంగా మలచబడింది. కాబట్టి, ఎక్కువ ఉష్ణోగ్రతకు కోడి తట్టుకోలేదు. ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకన్నా ఎక్కువ ఉన్నపుడు, కోళ్ళు ఆయాసపడుతూ తక్కువ మేత తింటాయి. ఎక్కువ నీళ్ళు తాగుతాయి. తీవ్ర పరిస్థితుల్లో వడదెబ్బకు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. 80o ఫారన్ హీట్ వరకు కోళ్ళకు సదుపాయంగా ఉంటుంది. ఆపై ఉష్ణోగ్రతల్లో కోడియొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బ తింటుంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. అందుచేత వేసవిలో కోళ్ళ పెడులను సాధ్యమైనంతవరకు చల్లగా ఉండేట్లు చూడాలి. దీనికోసం ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
కోళ్ళ పరిశ్రమలో కేజ్ పద్ధతి నూతనాధ్యాయం ఆరంభింపచేసింది. కోళ్ళను కేజెస్లో పెంచటం వల్ల స్థలం మిగులుబాటు అవుతుంది. గుడ్ల ఉత్పత్తి అధికం, మేతలో మిగులు, కోళ్ళకు నట్టల బెడద తప్పటయేకాక, కాక్సీడియా రోగం నివారణ మొదలగు లాభాలు కలవు. గుడ్ల సైజు కూడా పెద్దగా ఉంటుంది. కేజెస్ షెడ్ల వల్ల కోడికి సగటు ఖర్చు తక్కువ కాగలదు. తక్కువ లేబర్తో ఎక్కువ పని తీసుకోవచ్చు. రోగం వచ్చిన, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయిన కోళ్ళ ఏరివేత, టీకాలు వేయడం కూడా సులభం. పొదిగే స్వభావం తగ్గిపోతుంది. ఒకదానినొకటి పొడుచుకోవు.
ఒక కేజ్ భాగం 15-20 అం. పొడవు, 12-15 అం. వెడల్పు (లోతు), 18 అం. ఎత్తుకలిగి ఉంటుంది. ఇందులో 3-4 కోళ్ళ నుంచవచ్చు. కేజెస్లో చాలా రకాలున్నాయి. ఒక అంతస్తుపై మరో అంతస్తు ఉండే పద్ధతి, ఎమ్ కాలీఫోర్నియా పద్ధతి, దీనిలో కేజస్ స్టెప్ ఆఫ్లో అమర్చబడి వుంటాయి. ఈ రెండో పద్ధతి అత్యంత ప్రచారంలో ఉన్నది. విదేశాల్లో దాదాపుగా కోళ్ళ పెడ్ కేజెస్తోనే నిర్మించబడి ఉంటుంది.
కోళ్ళ పరిశ్రమ ప్రోత్సాహకరంగా ఉండాలంటే సరియైన నాణ్యతగల దాణాను అందజేయడం మరియు మేతలో పొదుపు పాటించటం అత్యవసరం. ఎందుకంటే, కోళ్ళ పెంపకంలో దాదాపు 70-75 శాతం వరకు మేతకు మాత్రమే ఖర్చవుతుంది. ఈ మధ్యకాలంలో, కోళ్ళ పరిశ్రమ పెరిగినంత వేగంగా, కోళ్ళ మేతకు కావలసిన ముడి సరుకుల దిగుబడి అభివృద్ధి కాకపోవటం వలన మేత రేటు విపరీతంగా పెరిగిపోతుంది.
కోళ్ళ పెరుగుదలకు, గుడ్ల ఉత్పత్తికి, పోషక పదార్థాలు అతి ముఖ్యం. మేతలో పోషక పదార్థాల లోపాల వల్ల కోళ్ళు సరిగా ఎదగవు. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇతర రోగాల తాకిడికి గురవుతాయి.
రైతు తన కోళ్ళకు కావలసిన మేతను తానే తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా కోడి మేతలో ఉపయోగించే పదార్ధాలను శక్తినిచ్చేవిగాను, మాంసకృత్తుల నిచ్చేవిగాను, విటమిన్లు, ఖనిజలవణాలనిచ్చేవిగాను, ఎడిటివ్స్గాను విభజించవచ్చు. శక్తి నిచ్చే వాటిలో మొక్కజొన్నలు జొన్నలు, సజ్ఞ మరియు ఇతర చిరుధాన్యాలు, బియ్యపు తెడు, నూనెతీసిన వరితొడు, మొదలగునవి ముఖ్యమైనవి. దాణాలో దాదాపు 60 శాతం ఇవే ఉంటాయి. వృక్ష సంబంధిత మాంసకృత్తుల నిచ్చే వాటిలో వేరుశనగ, నువ్వులపిండి, సోయాబీను పిండి, ప్రొద్దుతిరుగుడు పువ్వు పిండి మొదలగునవి మరియు జంతు సంబంధమైన మాంసకృత్తుల్లో చేపపొడి, మాంసపు పొడి ముఖ్యమైనవి.
కోడి వయస్సును బట్టి పోషకావసరాలు కూడా మారుతాయి. కాబట్టి దాణా కూడా మారుతుంది. చిన్న పిల్లలకిచ్చే దాణాలో (1 నుండి 8 వారాలు) శక్తి 2800 కిలో కేలరీలు, 22 శాతం మాంసకృత్తులు; 26 పిల్లలకిచ్చే దాణాలో (9 నుండి 20 వారాలు) 2600 కి. కేలరీల శక్తి, 16 శాతం మాంసకృత్తులు గ్రుడు పెట్టే కోడికి (21 వారాలపైబడి) 2700 కి. కేలరీల శక్తి, 18 శాతం మాంసకృత్తులు దాణాలో ఉండేటట్లు చేయాలి. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, లభిస్తున్న ముడి ఆహార పదార్థాలను ఉపయోగించి, దాణా తయారు చేసుకోవచ్చు. గుడ్లపెట్టే కోళ్ళ దాణాకి, మిగతా పిల్లల దాణాకి ముఖ్యమైన తేడా కాలియం మరియు అమైనో ఆసిడ్స్ కాలియం పిల్లలకి 0.9 - 1 శాతం సరిపోతే, పెద్ద కోళ్ళకు 2.5 నుండి 3 శాతం వరకూ ఇవ్వాలి. వీటితో పాటు, విటమిన్లు, లవణ మిశ్రమాలు, రోగ నిరోధక మందులు మొదలగునవి కూడా తగుపాళ్ళలో జత చేయవలసి ఉంటుంది. కోడి కడుపులో (జీర్ణాశయంలో) ఆహారం జీర్ణం కావడానికి చిన్న గులకరాయి (గ్రిట్) అవసరం. ఈ గ్రిట్ సున్నపురాయి రూపంలో కాని, ఆలుచిప్పల ముక్కల లేదా పాలరాతి ముక్కల రూపంలోగాని ఇవ్వవచ్చు.
కోడి పిల్లల దాణా మిశ్రమం (1 రోజు నుండి 8 వారాల వరకు) :
పదార్ధాలు |
పాళ్ళు (శాతం) |
||
1 |
2 |
3 |
|
మొక్కజొన్నలు |
40 |
20 |
30 |
జొన్నలు/రాగులు/సజ్జలు |
10 |
30 |
20 |
నూనె తీసిన తవుడు |
10 |
- |
10 |
నూనె తీసిన సోయా పిండి |
10 |
25 |
- |
నూనె తీసిన వేరుశనగ పిండి |
10 |
- |
18 |
నూనె తీసిన ప్రొద్దు తిరుగుడు పువ్వు పిండి |
10 |
10 |
10 |
చేప (మంచిది) |
8 |
- |
10 |
డై కాల్షియం ఫాస్ఫేటు |
1.1 |
1.9 |
1 |
సున్నపురాయి పొడి (కాలియం కార్బోనేట్)/గవ్వలపొడి) |
0.8 |
1.5 |
1 |
సూక్ష్మ లవణాల మిశ్రమం |
0.1 |
0.1 |
0.1 |
ఉప్పు |
- |
0.3 |
- |
లైసిన్ |
- |
- |
0.09 |
మెథియోనిన్ |
0.1 |
0.14 |
0.1 |
విటమిన్ ఎ, బి2, డి3, కె (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి కాంప్లెక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి12 మిక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
కొలిన్ క్లోరైడ్ (గ్రా/100 కిలోలకు) |
50 |
50 |
50 |
డాట్/డాట్ప్లస్/ఎమికాక్స్ (గ్రా/100 కిలోలకు) |
50 |
50 |
50 |
జింక్ బెసిట్రేసిన్ (గ్రా/100 కిలోలకు) |
25 |
25 |
25 |
పెరిగే కోళ్ళ దాణా మిశ్రమం (9-18 వారాల వరకు) :
పదార్ధాలు |
పాళ్ళు (శాతం) |
||
1 |
2 |
3 |
|
మొక్కజొన్నలు |
40 |
30 |
30 |
జొన్నలు/రాగులు/సజ్జలు |
15 |
35 |
30 |
నూనె తీసిన తవుడు |
10 |
- |
10 |
నూనె తీసిన సోయా పిండి |
6 |
16 |
- |
నూనె తీసిన వేరుశనగ పిండి |
6 |
- |
8 |
నూనె తీసిన ప్రొద్దు తిరుగుడు పువ్వు పిండి |
15 |
15 |
10 |
చేప (మంచిది) |
6 |
- |
10 |
డై కాల్షియం ఫాస్ఫేటు |
1.2 |
1.9 |
1 |
సున్నపురాయి పొడి (కాలియం కార్బోనేట్)/గవ్వలపొడి) |
0.8 |
1.5 |
0.8 |
సూక్ష్మ లవణాల మిశ్రమం |
0.1 |
0.1 |
0.1 |
ఉప్పు |
- |
1.3 |
- |
లైసిన్ |
- |
- |
- |
మెథియోనిన్ |
- |
0.4 |
- |
విటమిన్ ఎ, బి2, డి3, కె (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి కాంప్లెక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి12 మిక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
కొలిన్ క్లోరైడ్ (గ్రా/100 కిలోలకు) |
50 |
50 |
50 |
డాట్/డాట్ప్లస్/ఎమికాక్స్ (గ్రా/100 కిలోలకు) |
50 |
50 |
50 |
గ్రుడ్లు పెట్ట కోళ్ళ దాణా మిశ్రమం (18 వారాల పై బడి) :
పదార్ధాలు |
పాళ్ళు (శాతం) |
||
1 |
2 |
3 |
|
మొక్కజొన్నలు |
30 |
30 |
30 |
జొన్నలు/రాగులు/సజ్జలు |
22 |
25 |
20 |
నూనె తీసిన తవుడు |
10 |
- |
10 |
నూనె తీసిన సోయా పిండి |
5 |
15 |
- |
నూనె తీసిన వేరుశనగ పిండి |
5 |
- |
4 |
నూనె తీసిన ప్రొద్దు తిరుగుడు పువ్వు పిండి |
12 |
18 |
16 |
చేప (మంచిది) |
6 |
- |
10 |
డై కాల్షియం ఫాస్ఫేటు |
1.2 |
1.8 |
0.8 |
సున్నపురాయి పొడి (కాలియం కార్బోనేట్)/గవ్వలపొడి) |
9 |
10 |
9 |
సూక్ష్మ లవణాల మిశ్రమం |
0.1 |
0.1 |
0.1 |
ఉప్పు |
- |
0.3 |
- |
లైసిన్ |
- |
- |
- |
మెథియోనిన్ |
- |
0.2 |
0.2 |
విటమిన్ ఎ, బి2, డి3, కె (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి కాంప్లెక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
విటమిన్ బి12 మిక్స్ (గ్రా/100 కిలోలకు) |
10 |
10 |
10 |
కొలిన్ క్లోరైడ్ (గ్రా/100 కిలోలకు) |
50 |
50 |
50 |
కోళ్ళ పెంపకంలో లోపాలున్నట్లయితే అంటువ్యాధులు ప్రబలి, ఒక్కోసారి తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి పెద్లో శుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కోళ్ళకు అంటువ్యాధులు సూక్ష్మక్రిముల వలన వస్తాయి.
ఇవి కాక ఇన్ఫెక్షియస్ బ్రాంక్రెటిస్, ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్, క్రానిక్ రెస్పిరేటరి డిసీజ్ మొదలగునవి కూడా తరచు కనిపిస్తాయి. వీటిని సంబంధిత టీకాలు వేసి నివారించవచ్చు.
కోళ్ళ మీదగాని, షెడ్లోగాని ఈ కీటకాలు కనబడగానే కీటక సంహారక మందును వాడి నివారించవచ్చు. సెవిన్ (0.5 శాతం) లేదా మలాథియాన్ (0.5 శాతం) లేదా సుమిథియాన్ను కోళ్ళపై మరియు షెడ్డు లోపల, బయట పిచికారి చేసి ఈ వ్యాధులను నివారించవచ్చు.
ఎ. పెట్టుబడి |
||
1. |
స్థలం = ¼ ఎకరం స్వంతభూమి |
|
2. |
కోళ్ళ పెడు ఒక కోడికి 2 చ.అ. చొప్పున 1000 కోళ్ళకు (2 x 1000 చ.అ) ఒక చ.అ. నకు రూ. 150.00 చొప్పున 2 x 1000 x 150 |
3,00,000 |
3. |
బ్రూడర్సు, మేత తొట్లు మొదలగు పరికరాలు 1 కోడికి రూ. 15.00 చొప్పున 1000 కోళ్ళకు.... 15 x 1000 |
15,000 |
4. |
కోడి పిల్లల ధర ఒక కోడిపిల్లకు రూ. 16.50 1000 కోడి పిల్లలకు 16.50 x 1000 |
16,500 |
5. |
దాణా ఖర్చు ఒక కోడిపిల్లకు 0 నుండి 20 వారాల వరకు 6.5 కిలోల దాణా చొప్పున 1000 కోళ్ళకు = 6500 కిలోలు కిలో రూ. 11 చొప్పున మొత్తం ఖర్చు 6.5 x 1000 x 11 |
71,500 |
6. |
వివిధ ఖర్చులు (లిట్టరు, మందులు, కరెంటు మొదలగునవి) 0 నుండి 20 వారాల వయస్సు వరకు ఒక కోడికి రూ. 6.00 చొప్పున 1000 కోళ్ళకు 6 x 1000 20 వారాల వయస్సు వరకు మొత్తం పెట్టుబడి ఖర్చు |
6,000 4,09,000 |
బి. ఫారం నడుపు ఖర్చులు |
||
1. |
కోడి పిల్లల ధర |
16,500 |
2. |
ఎ. దాణా ఖర్చు (0 నుండి 20 వారాల వయస్సు వరకు) బి. దాణా ఖర్చు (20 నుండి 72 వారాల వయస్సు వరకు) ఒక కోడికి 38 కిలోల చొప్పున కిలో రూ. 10.00 చొప్పన 1000 కు 38 x 1000 x 10.00 |
71,500
3,80,000 |
3. |
ఎ. వివిధ ఖర్చులు (0 నుండి 20 వారాల వరకు) బి. వివిధ ఖర్చులు (20–72 వారాలకు) ఒక కోడి రూ. 5.00 చొప్పున 1000 కోళ్ళకు రూ. 5 x 1000 |
6,000
5,000 |
4. |
తరుగు ఎ. షెడ్లు ఖర్చులో 10 శాతం చొప్పున మొత్తం 3,00,000 x 10/100 బి. బ్రూడరు మొదలగు పరికరాల ఖర్చులో 15 శాతం చొప్పున మొత్తం |
30,000
2,250 |
5. |
పెట్టుబడి మీద వడ్డీ 12 శాతం చొప్పున 3,68,100 x 12/100 |
44,172 |
6. |
లేబరు ఛార్జీలు వారానికి రూ. 500.00 చొప్పున 72 వారాలకు |
36,000 |
|
ఫారం సదపు ఖర్చులు |
5,91,422 |
సి. రాబడి |
||
1. |
కోడిగుడ్ల నుండి ఆదాయం ఒక కోడికి సగటున 300 గుడ్ల చొప్పున 950 కోళ్ళకు 300 X 950 గుడ్లు, ఒక్క గుడ్డు సగటున రూ. 2,00 300 x 950 x 2.00 |
5,70,000 |
2. |
బతికిన కోళ్ళు 1 కోడి రూ. 30 చొప్పున 950 కోళ్ళకు రాబడి 950 x 30 |
28,500 |
3. |
ఖాళీ సంచులు ఒక్క సంచి రూ. 6.00 చొప్పున 680 సంచులకు రాబడి 680 x 6.00 |
5,440 |
4. |
లిట్టరు ఎరువు 40 కోళ్ళకు 1 టన్ను చొప్పున 950 కోళ్ళకు 23.7 టన్నులు ఒక టన్ను రూ. 800 చొప్పన 23.7 టన్నులకు 23.7 x 600
|
18,960 |
|
మొత్తం ఆదాయం మొత్తం ఆదాయం (1000 కోళ్ళకు 18 నెలలకు) మొత్తం ఖర్చు (1000 కోళ్ళకు 18 నెలలకు) నికర లాభం (1000 కోళ్ళకు 18 నెలలకు) నెలసరి ఆదాయం (18 నెలల కార్యక్రమానికి) నెలసరి ఆదాయం కోడికి లాభం ఒక కోడికి 18 నెలలకు లాభం ఒక కోడికి సంవత్సర కాలంలో |
6,22,900 6,22,900 5,91,422 91,478 1,749 1.84 33.12 22.08 |
పై ఆదాయ, వ్యయపట్టిక యందు 0-20 వారాల వయస్సు నందు 5 శాతం, 20-72 వారాల వయస్సునందు 8 శాతం కోళ్ళ చనిపోయినట్లు భావించబడింది. అంతేకాక గుడ్ల అమ్మకపు ధర, దాణా మొదలగు ఖర్చులు స్థానిక పరిస్థితులను బట్టి మారుతాయి.
వయస్సు |
వ్యాధి |
టీకామందు |
ఇచ్చే విధానం |
ఒకరోజు |
మెరెక్స్ |
మెరెక్స్ వాక్సిన్
|
ఒక గొట్టంలో 1000 పిల్లలకు సరిపోవు మందు ఉంటుంది. దీనిని 200 మి.లీ. డైల్యుయెంటుతో కలిపి, ప్రతి పిల్లకు 0.2 మి.లీ. చొప్పున ఇంజక్షన్ మెడ భాగాన గల చర్మం క్రింద ఇవ్వాలి. దీని ప్రభావం 18 నెలల వరకు ఉంటుంది. హేచరివారు చేస్తారు. |
4-7 వ రోజు |
కొక్కెర తెగులు |
ఎఫ్-1 (లసోట) వాక్సిన్ |
గొట్టంలో మందును 10-15 మి.లీ. సెలైన్ ద్రావణంలో కలిపి, ఒక్కొక్క చుక్క చొప్పున ప్రతి పిల్లకు కంటిలో లేక్త ముక్కులో వేయాలి. ఇది కోడి పిల్లలకు 2-4 నెలల వరకు రక్షణ కలిగిస్తుంది. |
14-15 వ రోజు |
గంబోరో |
ఇంటర్మీడియేట్ స్ట్రైన్ |
బాటిల్ లోని వాక్సీనుకు దాని వెంట యిచ్చిన డైల్యుయెంట్ కలిపి, ఒక చుక్క ఒక కోడి పిల్లకు కంటిలో గాని, ముక్కు రంధ్రంలో గాని, నోటిలో గాని వేయాలి. |
18-19 వ రోజు |
మెరెక్స్ (మరోసారి) |
మెరెక్స్ వాక్సిన్ |
ఒక గొట్టంలో 1000 పిల్లలకు సరిపోవు మందు వుంటుంది. దీనిని 200 మి.లీ. డైల్యుయెంటుతో కలిపి, ప్రతి పిల్లకు 0.2 మి.లీ. చొప్పున ఇంజక్షన్ మెడ భాగాన గల చర్మం క్రింద ఇవ్వాలి. దీని ప్రభావం 18 నెలల వరకు వుంటుంది. |
21-25 వ రోజు |
గంబోరో (మరోసారి) |
ఇంటర్మీడియేట్ స్ట్రైన్ |
బాటిల్ లోని వాక్సీనుకు దాని వెంట యిచ్చిన డైల్యుయెంట్ కలిపి, ఒక చుక్క ఒక కోడి పిల్లకు కంటిలో గాని, ముక్కు రంధ్రంలో గాని, నోటిలో గాని వేయాలి. లేక కొన్ని జాగ్రత్తలతో నీటిలో కలిపిగాని యివ్వవచ్చు. |
4 వ వారం |
కొక్కెర తెగులు మరియు ఇన్ఫెక్సియస్ బ్రాంకైటీస్ (ఐ.బి.) |
లసోట + ఐ.బి. |
పై విధంగాగాని, నీటిలోగాని యివ్వవచ్చు. |
7 వ వారం |
కోళ్ళ మశూచి |
ఫౌల్ఫాక్స్ వాక్సిన్ |
గొట్టంలోని మందును షుమారు 5 మి.లీ. గ్లిజరిన్ సెలైన్ తో కలిపి, దీనిలో మంచిన సూదితో రెక్కలో గ్రుచ్చిన వ్యాధి నిరోధక శక్తి 1½ సం. ఉంటుంది. ఇది కూడా 4 నెలల వయస్సులో తిరిగి చేయాలి. గొట్టంలోని ముందును డైల్యుయెుంటు తో కలిపి కండరంలోకి కూడ ఇవ్వవచ్చును. |
8 వ వారం |
కొక్కెర తెగులు |
ముక్షేశ్వర్ రకం |
గొట్టంలోని మందును కొక్కెర తెగులు డైల్యుయెంట్ కలిపి 1½ మి.లీ. ఒక కోడికి చర్మం క్రింద గాని లేక కండరంలోకి గాని ఇంజక్షన్ ఇవ్వాలి. |
13 వ వారం |
ఇన్ఫెక్సియస్ బ్రాంక్రెటీస్ (ఐ.బి.) |
ఐ.బి. వాక్సిన్ |
గొట్టంలోని మందు వెయ్యి కోళ్లకు సరిపోతుంది. త్రాగునీటిలో కలిపి ఇవ్వాలి. |
14 వ వారం |
కోళ్ళమశూచి |
ఫౌల్ఫాక్స్ వాక్సిన్ |
గొట్టంలోని మందు వెయ్యి కోళ్ళకు సరిపోతుంది. ఈ మందు రెక్కలో గ్రుచ్చి గాని లేక ఇంజక్సన్ రూపంలో గాని ఇవ్వవచ్చు. |
16 వ వారం |
కొక్కెర తెగులు (మరోసారి) |
ముక్షేశ్వర్ రకం |
గొట్టంలోని మందును కొక్కెర తెగులు డెల్యుయెంట్ కలిపి, ½ మి.లీ. ఒక కోడికి ఇంజక్షన్ వేయాలి. |
40 - 45 వ వారం |
కొక్కెర తెగులు (మరోసారి) |
లసోట వాక్సిన్ |
మాములుగా ఇచ్చేదానికంటే రెండింతలు పరిమాణం నీటిలో కలిపి కోళ్ళకు త్రాగు నీటి ద్వారా ఇవ్వాలి. |
పైన సూచించబడిన టీకా మందులతో బాటు కోళ్ళ శాస్త్ర నిపుణుని సలహా మేరకు మాత్రమే ఇన్ ఫెక్షియస్ బ్రాంక్రెటిస్ వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉంటుంది.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024