చేపల పట్టుబడి అయిన తరువాత పూర్తిగా నీటిని తీసివేసి చేరువును ఎండగట్టాలి. కనీసం 10-15 రోజులు చెరువును ఎండ గట్టుట వలన చాలా ఉపయోగాలున్నాయి.
ఎండబెట్టిన తరువాత చెరువు అడుగు భాగాన్ని 5-15 సె.మీ మేర కలియదున్నాలి. దీని వలన క్రింది పొరల్లో ఉన్న హానికర వాయువులు పైకి వచ్చి అక్సికరణం చెంది తొలిగించబడతాయి.
చెరువు మట్టి P(H) ని బట్టి సున్నం వాడాలి.
మట్టి P(H) |
సున్నం మోతాదు |
4-5 |
800 జి/ఎకరాకు |
5-6 480 కె.జి/ఎకరాకు |
|
6-6.5 |
400 జి/ఎకరాకు |
6.5 – 7.5 160 కె.జి/ఎకరాకు |
|
కొద్దిగా క్షారత్వం ఉన్న చెరువులో కూడా సున్నము వాడటం మంచిది. చెరువులో పిల్లలను వదిలే ముందు ఎకరానికి 40 కె.జి.లు నెలకొకసారి 12 కె.జి/ఎకరాకు వాడటం మంచిది సున్నం చెరువు నేలపై వాడటం మంచిది. సున్నం చెరువు నేలపై వాడటం వలన చెరువు నేలనుంచి పోషకాలు విడుదలై త్వరితగతిన ప్లవకాలు ఉత్పత్తికి దోహదపడతాయి. సున్నము చెరువు నీటిని శుభ్రపరిచి వ్యాధికారక సుక్ష్మజీవులను నాశినము చేస్తాయి.
సున్నమును మొదట నీటిలో నానబెట్టి చల్లబడిన తరువాత చెరువు అంతా చాల్లాలీ.
చేపలు వత్తిడికి లోనై అనారోగ్యంతో ఉన్నప్పుడు ‘లైమ్’ 60-80 కె.జి/ఏకారానికి వాడాలి సున్నము ఉదయం పూట వాడాలి
చెరువు మట్టిలో పోషకాలు స్టాయినిబట్టి ఎరువులు వాడాలి ఎరువులు వాడకం ముఖ్య ఉద్దేశ్యం చేపలకు కావలసిన సహజ ఆహారాన్ని అనగా వృక్ష పోశాకాలును రోగ నిరోదోక శక్తిని అందించి చేపలు ఆరోగ్యంగా త్వరితగతిని పెరగడానికి దోహదపడతాయి
చేపల పెంపకానికి అనువైన చెరువు నేలలో ఉండవలసిన పోషకాల స్ధాయి
చేరువునేల పరిక్ష అందుబాటులో లేనప్పుడు సాదరణంగా వాడవలసిన ఎరువుల మోతాదు-
చెరువు నీటి రంగు ఆకుపచ్చ లేదా గోధుమ ఆకుపచ్చ గా ఉండాలి. సేచి డిస్క్ రీడింగ్ 30 సె. మీ. ఉంటే ప్లాంక్టన్ సాంద్రత తగు మోతాదులో ఉన్నట్లు. చేరువునిటిలో రంగు తగ్గినప్పుడు అనగా ప్లాంక్టన్ సాంద్రత తగ్గినప్పుడు పశువుల ఎరువు 30-40 కేజీలు, సూపర్ ఫాస్ఫేట్ 500 గ్రా. యూరియా 500 గ్రా. కలిపి చెరువు నీటిలో చల్లాలి. ప్రతికూల వాతావరణం పరిస్టితులు ఏర్పదినప్పుడు ఎరువుల వాడటము నిలిపి వేయాలి.
రచయిత: ఎ.శినివాస్, మత్య శాస్త్రవేత్త, కె.వి.కె,. ఉండి