పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఖమ్మం

ఈ పేజిలో ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నీటి పారుదల

జిల్లాలో నీటి పారుదల శాఖ ఖమ్మం డివిజన్‌ పరిధిలో వంద ఎకరాల కంటే ఎక్కువగా ఆయకట్టు ఉన్న చెరువులు 208 ఉన్నాయి. వీటి కింద 66698 ఎకరాలను స్థిరీకరించారు. వంద ఎకరాల కంటే తక్కువగా ఉన్నవి 1154 కుంటలు ఉన్నాయి. వీటి కింద 27104 ఎకరాలను స్థిరీకరించారు. బేతుపల్లి వరద కాలువ కింద 6000 ఎకరాలను స్థిరీకరించారు.

 • నీటి పారుదల శాఖ పాల్వంచ డివిజన్‌ పరిధిలో 110 చిన్న నీటి తరహా వనరులు (చెరువులు) ఉన్నాయి. వీటి ద్వారా 45,840 ఎకరాలకు నీరందుతోంది. 531 కుంటలు (చిన్న చెరువులు) ఉన్నాయి. వీటి ద్వారా 11,428 ఎకరాలకు నీరందుతుంది.
 • భద్రాచలం ఐబీ డివిజన్‌ పరిధిలో 82 చిన్న నీటి చెరువులు ఉన్నాయి. వీటి ద్వారా 22,661 ఎకరాలకు నీరందుతోంది. 369 కుంటలు ఉన్నాయి. వీటి ద్వారా 11278 ఎకరాలకు నీరందుతుంది.

మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు

 • ఖమ్మం డివిజన్‌ పరిధిలో వైరా, లంకాసాగర్‌, పెద్దవాగు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. వైరా ప్రాజెక్టు కింద 17390ఎకరాలు, లంకాసాగర్‌ ప్రాజెక్టు కింద 7350 ఎకరాలు, అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కింద 16 వేల ఎకరాల సాగు భూమి ఉంది.
 • పాల్వంచ డివిజన్‌ పరిధిలో కిన్నెరసాని ప్రాజెక్టు, బయ్యారం పెద్ద చెరువు, కిన్నెరసాని ప్రాజెక్టు కింద 7200 ఎకరాలకు నీరందుతుంది. బయ్యారం పెద్ద చెరువు కింద 7400 ఎకరాల ఆయకట్టుంది.
 • భద్రాచలం డివిజన్‌ పరిధిలో తాలిపేరు ప్రాజెక్టు, గుండ్లవాగు, పాలెంవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. తాలిపేరు ప్రాజెక్టు చర్ల మండలంలో ఉంది. ఈ ప్రాజెక్టు కింద చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 24700 ఎకరాలకు నీరందుతోంది. చర్ల మండలం వద్దిపేట వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. ఈ చెక్‌డ్యాం పూర్తయితే మరో ఐదు వేల ఎకరాలకు నీరందుతుంది. గుండ్లవాగు ప్రాజెక్టు వెంకటాపురం మండలం మల్లాపురం వద్ద ఉంది. 10,132 ఎకరాలకు సాగునీరు, 39 గిరిజన గ్రామాలకు తాగునీటి సరఫరా అందించవచ్చు. పనులు నడుస్తున్నాయి. వాజేడు మండలం కిష్ణాపురం గ్రామంలో మోడికుంట ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఈప్రాజెక్టు కింద 13,152 ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించారు.

ప్రాజెక్టు పేరు  -  ఆయకట్టు

 1. వైరా రిజర్వాయర్‌ - 17,390 ఎకరాలు (వైరా మండలం)
 2. లంకసాగర్‌ ప్రాజెక్టు - 7,350 ఎకరాలు (పెనుబల్లి మండలం)
 3. పెదవాగు ప్రాజెక్టు - 16,000 ఎకరాలు (అశ్వారావుపేట మండలం)
 4. మూకమామిడి ప్రాజెక్టు - 350 ఎకరాలు (ములకలపల్లి మండలం)
 5. పెద్దచెరువు - 7,200 ఎకరాలు (బయ్యారం మండలం)
 6. కిన్నెరసాని ప్రాజెక్టు - 15,000 ఎకరాలు (పాల్వంచ మండలం)
 7. తాలిపేరు ప్రాజెక్టు - 24,700 ఎకరాలు (చర్ల మండలం)

జిల్లాలో చెరువులు, కుంటలు

 1. నీటి పారుదల శాఖ పరిధిలో చెరువులు - 399
 2. వీటి పరిధిలో సాగయ్యే ఆయకట్టు - 1,41,653 ఎకరాలు
 3. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని చెరువులు - 1875
 4. వీటి పరిధిలో ఆయకట్టు - 48,707 ఎకరాలు
 5. జిల్లాలో మొత్తం చెరువులు, కుంటలు - 2,274
 6. వీటి పరిధిలో సాగయ్యే ఆయకట్టు - 1,90,060 ఎకరాలు

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

 • జిల్లా భౌగోళిక విస్తీర్ణం మొత్తం: 16,02,900 హెక్టార్లు
 • అటవీ విస్తీర్ణం: 7,59,438 హెక్టార్లు
 • బంజర భూమి: 88,887 హెక్టార్లు
 • వ్యవసాయేతర భూమి: 1,29,012 హెక్టార్లు
 • సాగుకు అనుకూలంగా ఉండి వదిలేసిన భూమి: 15,006 హెక్టార్లు
 • వర్షాలు కురవక ఈ సంవత్సరం సాగు: 68,661 హెక్టార్లు
 • మొత్తం పంటవేసిన భూమి: 4,53,183 హెక్టార్లు
 • ఒకసారి కంటే ఎక్కువ పంటవేసిన భూమి: 56,180 హెక్టార్లు
 • జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం: 5,09,363 హెక్టార్లు

జిల్లాలో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం

జిల్లాలో ప్రధాన పంటలు...వాటి సాధారణ సాగువిస్తీర్ణం(హెక్టార్లలో)
1.వరి - 1,31,964

2.జొన్న - 141

3.సజ్జ - 10

4.మొక్కజొన్న- 14,010

5.పెసర - 10,533

6.మినుము  - 252

7.కంది - 9,376

8.వేరుశనగ  - 287

9.నువ్వులు  - 930

10.మిర్చి - 19,924

11.పత్తి  - 1,52,296

12.చెరకు  - 3,558

13.పసుపు  - 361

14.మామిడి  - 46,000

15.కూరగాయలు -  6,500

16.జామ  - 4,112

17.జీడిమామిడి  - 5.145

18.అరటి  - 4,182

19.బొప్పాయి  - 3,567

20.ఆయిల్‌పామ్‌ -  9,617

మొత్తం పంటల సాగువిస్తీర్ణం - 4,05,014

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

 1. భద్రాచలం - 08743-232236 - సెల్‌.9838168344
 2. బూర్గంపాడు - 08746-278225 - సెల్‌.9866647500
 3. దమ్మపేట - 08740-252303 - సెల్‌.9912413148
 4. ఏన్కూరు - 08744-277944 - సెల్‌.9849723682
 5. ఖమ్మం - 08742-256723, 256267, 256187 - సెల్‌.9703916058
 6. కొత్తగూడెం - 08744-242685 - సెల్‌.9703916246
 7. మధిర - 08749-274228 - సెల్‌.9299558760
 8. నేలకొండపల్లి - 08742-287228, 287101 - సెల్‌.9849114006
 9. చర్ల - 08747-257616
 10. సత్తుపల్లి - 08761-282028 - సెల్‌.9849812849
 11. వైరా - 08749-251416, 252627 - సెల్‌.9908339695
 12. ఇల్లెందు - 08745-252030, 255110 - సెల్‌.9703916039
 13. కల్లూరు - 08761-287056 - సెల్‌.9989140148

ఉద్యానశాఖ

జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం: 50,351 హెక్టార్లు

 • మామిడి: 40,000 హెక్టార్లు
 • బత్తాయి: 3,600
 • నిమ్మ : 856
 • జామ : 588
 • సపోట : 100
 • అరటి : 3,700
 • బొప్పాయి: 765
 • పామాయిల్‌: 7,000

సూక్ష్మ సేద్యం

 • బిందు సేద్యం లక్ష్యం : 3,500 హెక్టార్లు
 • సాధించింది : 2,500 హెక్టార్లు
 • తుంపర్ల సేద్యం లక్ష్యం : 1500 హెక్టార్లు
 • సాధించింది : 1400 హెక్టార్లు

మత్స్య శాఖ

 • చెరువులు : 299
 • రిజర్వాయర్లు : 2
 • మత్స్యకారులు: 50 వేల మంది
 • మత్స్య సహకార సంఘాలు: 170

గంబూషియా చేపల ఉత్పత్తి

వైరాలోని మత్య్సవిత్తన క్షేత్రంలో మూడున్నర దశాబ్దాలుగా చేపల ఉత్పత్తి కేంద్రం మత్య్సశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కట్ల, రోహు, మృగాల, బంగారుతీగ రకం చేపలను ఉత్పత్తి చేస్తుంటారు. గుడ్లద్వారా చేపల పిల్లను ఉత్పత్తి చేసి వాటిని ఇక్కడ నెలరోజుల వరకు పెంచి మత్స్యకారసంఘాలకు ఇస్తుంటారు. ఏటా ఇక్కడ సుమారుగా 2.5 కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేస్తుంటారు. వీటితో పాటు ఇక్కడ దోమల నిర్మూలనలో కీలకమైన గంబూషియా చేపలను ఉత్పత్తి చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభంలో ఏటా సుమారుగా పదిలక్షల గంబూషియా చేపలను ఉత్పత్తి చేసి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పంపిణీ చేస్తారు. మురికి గుంతల్లో ఉండే వ్యర్థపు నీటిలో గంబూషియా చేపపిల్లలను వదిలితే అవి దోమల లార్వాను, గుడ్లను తిని దోమల నిర్మూలనలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇక్కడ సిమెంట్‌తొట్టుల్లో గంబూషియా చేపలను ఉత్పత్తి చేస్తారు. వివరాలకు సంప్రందించాల్సిన ఫోన్‌నెంబర్‌- 9951096622

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ దాని ఉప  కాలువలు జిల్లాలోని 16 మండలాల్లో విస్తరించాయి. సాగర్‌ కాలువల కింద 2,51,800 ఎకరాల ఆయకట్టుంది. కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో భూములకు సాగర్‌ నీటి సరఫరా జరుగుతుంది.

దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం

అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. రెండు లక్షల ఎకరాలకు నీరందించడం లక్ష్యం. ఖమ్మం జిల్లాలో 16 మండలాలు, వరంగల్‌ జిల్లాలో ఒక మండలం దీని ద్వారా లబ్ధి పొందుతాయి. పనులు నత్తనడకన సాగుతున్నాయి.

దుమ్ముగూడెం ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం

వేలేరుపాడు మండలం రుద్రంకోట వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాలు లబ్ధి పొందుతాయి. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఈ ఎత్తిపోతల పథకం డిజైన్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే ఈప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుంది.

దుమ్ముగూడెం-నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ లింక్‌ కెనాల్‌

ఖమ్మం జిల్లా మణుగూరు మండలం అనంతారం వద్ద గోదావరి నదిపై చేపట్టిన లింక్‌ కెనాల్‌ ఇది. దీని ద్వారా గోదావరి నది నుంచి 165 టీఎంసీల నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టుకు పంపాలని నిర్ణయించారు. ఈప్రాజెక్టు నిర్మాణం నిలిపేయాలని జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ఈప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పటికే టెండర్లు పూర్తి చేశారు. గుత్తేదారులకు రూ.500 కోట్ల వరకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

శ్రీరాంసాగర్‌ వరద కాలువ

శ్రీరాంసాగర్‌ వరద కాలువల నిర్మాణం జిల్లాలోని 4 మండలాల్లో చేపట్టారు. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌, కూసుమంచి, ముదిగొండ మండలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరందించటం లక్ష్యం. ఈపనులు పదేళ్లుగా సాగుతున్నాయి.

ఆధారము: ఈనాడు

నదులు

గోదావరి

మహారాష్ట్రంలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టింది. వరంగల్‌లోని ఏటూరినాగారం వైపు నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భద్రాచలం, రాజమండ్రిలలో గోదావరిపై వంతెనలున్నాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను తాకుతూ గోదావరి ప్రవహిస్తుంది.

శబరి

గోదావరికి ప్రవర, మూల, మంజీర, ప్రాణహిత, వైన్‌గంగ, పెన్‌గంగ, వార్ధ, ఇంద్రావతి, శబరి ఉపనదులున్నాయి. ఇందులో శబరి ఖమ్మం జిల్లాలోని కూరవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. శబరి అనే భక్తురాలికి వనవాసం సమయంలో రాముడు ఓ వరాన్ని ప్రసాదించాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. ఈ వరం వల్లనే శబరి నదిగా మారిందని కథనం. ఒరిస్సా కొండలు ఈ నది జన్మస్థానం. శబరికి ఉపనది సీలేరు.

తాలిపేరు

భద్రాచలం డివిజన్‌లోని అతిపెద్ద సాగునీటి పథకం ఇది. గోదావరికి ఉపనది. ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో పుట్టి దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించి చర్ల మండలం పూసుగుప్ప వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. చర్ల మండలం ఎర్రగడ్డ వద్ద గోదావరిలో కలుస్తుంది. తాలిపేరు కింద దాదాపు 25 వేల ఎకరాల భూమి సాగు అవుతుంది.

ఆధారము: ఈనాడు

3.00866425993
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు