অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రంగారెడ్డి

నీటి పారుదల

జిల్లాలో 7,49,300 హెక్టార్ల భూమిఉంది. ఇందులో సాగుకుయోగ్యమైన విస్తీర్ణం 2,37,881 హెక్టార్లు. ఇందులో 72,700 హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మూసీ నది జిల్లాలోనే పుట్టి ప్రవహిస్తూ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్లకు ప్రధాన నీటివనరుగా ఉంది.

కోట్‌పల్లి జలాశయం

జిల్లాలోనే అతి పెద్దదైన సాగు నీరందించే కోట్‌పల్లి జలాశయం పెద్దేముల్‌ మండలంలో ఉంది. ధారూర్‌, పెద్దేముల్‌ మండలంలోని 18 గ్రామాల్లోని 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి దీని ఏర్పాటు జరిగింది. యాలాల మండలం జుంటుపల్లి గ్రామ సమీపంలో 202 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే జలాశయం ఉంది. 1000 ఎకరాలఆయకట్టుకు నీరందించే తాండూరు మండలం అల్లాపురం, జిన్‌గుర్తి శ్రీరాముల వారి జలాశయాలు ఉన్నాయి.

కాగ్నా నది

తాండూరు నియోజకవర్గంలో 40 కిలో మీటర్ల పొడవున ప్రవహించే అతి పెద్ద నది. ప్రతి ఏటా ఆరు టీఎంసీల నీటితో ప్రవహిస్తోంది. నదిని ఆధారం చేసుకుని 2వేల వ్యవసాయ బోరుబావులు, 30 వరకు తాగునీటి సరఫరా పథకాలు ఏర్పాటయ్యాయి. నది నుంచి వృథాగా పోతున్న నీటిని పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటుంది.

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును క్రీ.శ.1555 లో నిర్మించారు. జిల్లాలోనే ఈ చెరువు అతిపెద్దది. ఈ చెరువులో నీళ్ళుంటే వంద గ్రామాలకు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే వెయ్యిమంది మత్స్య కార్మికులకు, ఐదారు వేల మంది రైతులు జీవనాధారం లభిస్తుంది. గతంలో నీళ్ళున్నప్పుడు 13వందల ఎకరాల భూమిలో వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. అలాగే దండుమైలారం, రాయపోల్‌ గ్రామాల్లో చారిత్రాత్మకమైన చెరువులు, కుంటలున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టికాన, శేరిగూడ వద్ద పులందేశ్వరీ చెక్‌డ్యామ్‌లున్నాయి.

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

రంగారెడ్డి జిల్లాలో 19 రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 1,84,395 హెక్టార్లలో పంటలు సాగవుతుండగా రబీలో 75వేల హెక్టార్లలో పంటలు సాగవుతుంటాయి. జిల్లాలో 18,69,566 ఎకరాల భూభాగం ఉంది. 1,42,560 ఎకరాల్లో అటవీ భూములు.. 1,22,989 ఎకరాల్లో బీడు భూములు.. 1,96,372 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 781 మి.మీ.గా ఉంది.

పంటల వారీగా విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో)

పంటలు సాధారణ విస్తీర్ణం

 • వరి - 21,806
 • జొన్న - 18,228
 • మొక్కజొన్న - 26,257
 • రాగి - 1214
 • ఉలవలు - 246
 • పెసర - 11,368
 • మినుము - 7,566
 • కంది - 34,855
 • మిర్చి - 1036
 • ఆలుగడ్డ - 88
 • పసుపు - 3984
 • ఉల్లి - 270
 • పత్తి - 22,447
 • వేరుసెనగ - 169
 • నువ్వులు - 694
 • ఆముదం - 6085
 • పొద్దుతిరుగుడు - 185
 • చెరకు - 1280
 • ఆహారేతర పంటలు - 4272
 • ఇతర పంటలు - 21,657

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు ఏమీ లేవు. అన్నీ చిన్న తరహా ప్రాజెక్టులే. ప్రధానంగా చెరువులపై ఆధారపడి వ్యవసాయం సాగుతోంది.

ఇబ్రహీంపట్నం పెద్దచెరువు

ఆయకట్టు - 1250 ఎకరాలు

ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ఘనమైన చరిత్ర ఉంది. 500 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. వర్షాలు బాగా కురిస్తే 0.8 టిఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు చేరడం కూడా గగనంగా మారింది.

సాలార్‌నగర్‌ ప్రాజెక్టు

ఆయకట్టు- 1327 ఎకరాలు

సాగవుతున్నది - 300 ఎకరాలు

గండేడ్‌ మండలంలోని సాలార్‌నగర్‌ ప్రాజెక్టును 1975లో నిర్మించారు. దీని కింద 1327 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతుల  కోసం రూ. 1.1 కోట్లు మంజూరుకాగా అందులో రూ. 11 లక్షలతో అలుగు నిర్మించారు. కాలువలు, తూముల మరమ్మతులు జరగవలసివుంది. నిల్వ సామర్థ్యం తగ్గడంతో ఏటా 300 ఎకరాలకు మించి సాగవడం లేదు.

శామీర్‌పేట పెద్దచెరువు

ఆయకట్టు - 2600

సాగవుతోంది - 800 ఎకరాలు

శామీర్‌పేట పెద్ద చెరువు 956 ఎకరాల్లో విస్తరించి 42 అడుగుల లోతు కలిగి ఉంది. శామీర్‌పేట చెరువు పూర్తిస్థాయిలో నిండితే 2600 ఎకరాలకు రబీ, ఖరీఫ్‌ సీజన్లలో నీరందుతుంది. చెరువు ఆయకట్టు పొలాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం వల్ల 1800 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయింది.

ప్రాంతాల వారీగా ఉన్న ప్రాజెక్టులు

పెద్దేముల్‌ కోట్‌పల్లి
తాండూరు శ్రీరాములవారి ప్రాజెక్టు
తాండూరు అల్లాపూరు
యాలాల జుంటుపల్లి
వికారాబాద్‌ సర్పన్‌పల్లి
మోమిన్‌పేట నందివాగు
గండేడ్‌ సాలార్‌నగర్‌
పరిగి లఖ్నాపూర్‌
ధారూర్‌ మూన్నూరు సోమారం
మర్పల్లి కొంశెట్‌పల్లి
పెద్దేముల్‌ పెద్దేముల్‌ పెద్దచెరువు
తాండూరు అంతారం పెద్దచెరువు
గండేడ్‌ మహమ్మదాబాద్‌మల్కచెరువు
గండేడ్‌ జూలపల్లి వూరచెరువు
శామీర్‌పేట శామీర్‌పేట పెద్దచెరువు
కుల్కచర్ల దంతెకాని చెరువు
కుల్కచర్ల అంతారం పాటిమీది చెరువు
కుల్కచర్ల కామన్‌పల్లి
దోమ ఐనాపూర్‌ పెద్దచెరువు

ఆధారము: ఈనాడు

నదులు

జిల్లాలోని అత్యధిక భాగం మూసీ నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది. జిల్లాలో 90 కిలోమీటర్ల దూరం ప్రవహించి నల్గొండ జిల్లాలోని వాడపల్లి సమీపంలో అందులో కలుస్తోంది. మూసీజన్మస్థానం జిల్లాలోని అనంతగిరి కొండలు. హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల మీదుగా ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ఈసీ వాగు కూడా ఇక్కడినుంచే ప్రారంభమవుతుంది. మూసీపై ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌ ఉండగా ఈసీపై హిమాయత్‌సాగర్‌ ఉంది. ఇవి రెండూ హైదరాబాద్‌ మంచినీటి అవసరాలకు ఉద్దేశించినవి కావడంతో ఈ నదుల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకోవడంపై నిషేధం ఉంది. బీమా ఉపనదిగా ఉన్న కాగ్నా నది జిల్లా మీదుగానే ప్రవహిస్తున్నది. దీని ఆధారంగానే ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు కొన్ని ఏర్పాటయ్యాయి.

కాగ్నా నది

తాండూరు నియోజకవర్గంనియోజకవర్గంలో 40 కిలో మీటర్ల పొడవున ప్రవహించే అతి పెద్ద నది. ప్రతి ఏటా ఆరు టీఎంసీల నీటితో ప్రవహిస్తోంది. నదిని ఆధారం చేసుకుని 2వేల వ్యవసాయ బోరుబావులు, 30 వరకు తాగునీటి సరఫరా పథకాలు ఏర్పాటయ్యాయి. నది నుంచి వృథాగా పోతున్న నీటిని పొరుగున్న ఉన్న కర్ణాటక రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటుంది.

ఆధారము: ఈనాడు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate