অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆముదము

ఆముదము
  1. మాకు ఖరీఫ్లో వేసుకోవటానికి అనువైన రకాలు / సంకర రకాలు తెలుపండి
  2. మేము పోయిన సంవత్సరము ఆముదము వేసినప్పడు ఎండు తెగులు వచ్చినది. దీనిని తట్టుకొనే రకాలు ఉంటే తెలుపండి
  3. ఖరీఫ్ పంటను ఎప్పడు విత్తుకుంటే మంచిది
  4. ఆగష్టు నెలలో ఆముదం పెట్టుకోవచ్చునా ఆగష్టులో విత్తుకోవాలంటే ఎకరాకు ఎక్కువ విత్తన మోతాదు వాడి ఎక్కువ మొక్కలు ఉండేట్లు చూసుకోవాలి.
  5. రబీ పంటగా ఆముదము వేసుకోవచ్చునా, ఏ రకాలు మంచివి.
  6. ఆముదములో ఏ పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు
  7. ఆముదములో ఎరువుల యాజమాన్యం తెలుపండి? పై పాటుగా ఏఏ ఎరువులు వేసుకోవాలి
  8. ఆముదము పంటలో నీటి యాజమాన్యం గురించి తెలుపండి
  9. ఆముదంలో మొగ్గలు తుంచటం ద్వారా లాభం ఏమన్న ఉన్నదా? మాకు పంట 90 రోజులలో అయిపోవాలి
  10. ఆముదంలో దాసరి పురుగు లేదా నామాల పురుగును ఎలా అరికట్టాలి
  11. ఆముదంలో కొమ్మలు ఎండిపోతున్నాయి. పురుగు ఉంది లేదా ఆముదంలో కొమ్మ మరియు కాయతొలిచే పరుగు నివారణ ఎలా
  12. ఆకులు పసుపుగా మారుతున్నాయి. పచ్చదోమ వుంది. ఏం చేయాలి
  13. ఆముదంలో ఆకులపై పాములాగా తెల్లమచ్చలు లేదా ఆకు తొలిచే పురుగు నివారణ ఎలా
  14. ఆముదంలో ఎర్ర గొంగళి పరుగు / బొచ్చు పురుగు ఆశించింది. ఏం చేయాలి?
  15. ఆముదంలో వడలు తెగులు మరియు ఎండు తెగులును ఎలా నివారించాలి? ఆముదంలో వేరుకుళ్లను ఎలా అరికట్టాలి.
  16. ఆముదంలో కాయలు మెత్తపడి బూజుపట్టి కుళ్ళుతున్నాయి. లేదా ఆముదంలో కాయకుళ్ళు / బూజు తెగులు నివారణ తెలపండి.

మాకు ఖరీఫ్లో వేసుకోవటానికి అనువైన రకాలు / సంకర రకాలు తెలుపండి

ఖరీఫ్లో క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్ అనే రకాలు, పిసిహెచ్-1, జిసి హెచ్-4 డిసి హెచ్-32, డిసి హెచ్-177 అనే సంకర రకాలు అనుకూలంగా వుంటాయి.

మేము పోయిన సంవత్సరము ఆముదము వేసినప్పడు ఎండు తెగులు వచ్చినది. దీనిని తట్టుకొనే రకాలు ఉంటే తెలుపండి

హరిత, జ్యోతి వంటి రకాలు ఎండు తెగులును తట్టుకొంటాయి. వీటితోపాటు టైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి (4 గ్రా. కిలో విత్తనానికి) చేసుకోవటం ద్వారా ఈ తెగులును కొంతవరకు నివారించవచ్చు.

ఖరీఫ్ పంటను ఎప్పడు విత్తుకుంటే మంచిది

ఖరీఫ్ పంటను విత్తుకోవడానికి జూన్ రెండవ పక్షం బాగా అనుకూలం. ఆలశ్యం అయిన కొద్ది దిగుబడులు తగ్గటానికి అవకాశం ఎక్కువ.

ఆగష్టు నెలలో ఆముదం పెట్టుకోవచ్చునా ఆగష్టులో విత్తుకోవాలంటే ఎకరాకు ఎక్కువ విత్తన మోతాదు వాడి ఎక్కువ మొక్కలు ఉండేట్లు చూసుకోవాలి.

అందుకోసం, తేలిక నేలలలో 60 x 45 సెం.మీ. (లేదా) 60 X 30 సెం.మీ. దూరంలోనూ, బరువు నేలలలో 90 X 45 సెం.మీ. (లేదా) 90 X 30 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

రబీ పంటగా ఆముదము వేసుకోవచ్చునా, ఏ రకాలు మంచివి.

నీటి వసతి ఉంటే సెప్టెంబరు 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చును. పైన తెలిపిన అన్ని రకాలు /సంకర రకాలు రబీలో వేసుకోవచ్చును.

ఆముదములో ఏ పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు

ఆముదము + కంది 2:1 లేదా 1:1 నిష్పత్తిలో, ఆముదము + వేరుశనగ 1:7 నిష్పత్తిలోనూ, ఆముదము + గోరుచిక్కుడు 1:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు.

ఆముదములో ఎరువుల యాజమాన్యం తెలుపండి? పై పాటుగా ఏఏ ఎరువులు వేసుకోవాలి

మీరు రకాలు వేసుకుంటే ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ పోషకాలను యిచ్చే ఎరువులను సూటి ఎరువుల రూపంలో పంటకు అందించినట్లయితే లాభసాటి.

దిగుబడులను పొందవచ్చును. దానికొరకు ఆఖరి దుక్కిలో, 25 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దీనితో పాటు 4 బండ్ల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పై పాటుగా 30-35 రోజులకు, 60-65 రోజులకు రెండుసార్లు ఎకరాకు 15 కిలోల యూరియా చొప్పన పంటకు అందించాలి.

అదేవిధంగా సంకర రకాలకు, 30-32కి నత్రజని, 16 కి. భాస్వరం, 12 కి. పొటాష్నిచ్చే ఎరువులు వాడాలి. అందుకొరకు ఆఖరి దుక్కిలో, 4 బండ్ల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 20 కిలోల, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు పై పాటుగా, 30-35 రోజులకు, 60-65 రోజులకు, 90-95 రోజులకు ఎకరాకు దఫాకు 15 కిలోల చొప్పన యూరియా పంటకు అందించాలి. వరాధార పంటకు వర్షం పడిన వెంటనె పై పాటుగా వేసుకుంటే మంచిది.

ఆముదము పంటలో నీటి యాజమాన్యం గురించి తెలుపండి

ఖరీఫ్లో నీటి వసతి ఉంటే, బెట్ట పరిస్థితులలో 30-35 రోజులకు మరియు 60-65 రోజులకు రెండు తడులు యిస్తే మంచిది. అదేవిధంగా రబీలో అయినట్లయితే, పొడి దుక్మిలో విత్తనం వేసి నీరు పెట్టాలి. తరువాత అవసరాన్ని బట్టి, భూమిని బట్టి ప్రతి 10-15 రోజులకు నీటి తడి యివ్వాలి

ఆముదము పంటలో పూతరాలిపోతున్నది. నివారణ చర్యలు తెలుపండి? ప్రొద్దున్నే మంచు కురియటం వలన ఇలా జరుగుతుంది. నివారణ ఏమి లేదు.

ఆముదంలో మొగ్గలు తుంచటం ద్వారా లాభం ఏమన్న ఉన్నదా? మాకు పంట 90 రోజులలో అయిపోవాలి

మొదటి గెల వచ్చిన తరువాత రెండవ, మూడవ శ్రేణి కొమ్మలు రాకుండ ఉండటానికి మొగ్గలు తుంచవచ్చు. దీని వలన ఒక్క గెల మాత్రమే వచ్చి 90 రోజులలో కోతకు వస్తుంది.

ఆముదంలో దాసరి పురుగు లేదా నామాల పురుగును ఎలా అరికట్టాలి

తొలి దశలో పరాన్నజీవులకు హాని చేయని వేపనూనె 5 మి.లీ. లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ 1 మి.లీ. లేక 1 గ్రా. లీటరు నీటికి చొప్పన ఆకులు బాగా తడిచేలా పిచికారి చేయాలి. పట్టు పరిశ్రమను ఉన్నచోట బి.టి. మందులు వాడరాదు. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ దాసరి పరుగులను మైక్రోఫైటిస్ మాక్యులిపెన్నిస్ మరియు మైక్రోప్లెటిస్ మాటర్నస్ అను పరాన్న జీవులు ఎక్కువగా ఆశించి అదుపులో వుంచుతాయి. ఇవి లేనప్పడు కార్బరిల్ 3 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి.

పొలంలో ఎకరాకి 10-15 'టి' ఆకారపు కర్రలను పక్షి స్థావరాలుగా ఏర్పరచాలి. దాసరి పురుగులు పెద్దగా వుంటే వాటిని ఏరి నాశనం చేయాలి. పొలంలో క్రిందపడిన ఆకులను తీసి కాల్చివేస్తే కోశస్థ దశలోని దాసరి పురుగును నివారించవచ్చు.

ఆముదంలో కొమ్మలు ఎండిపోతున్నాయి. పురుగు ఉంది లేదా ఆముదంలో కొమ్మ మరియు కాయతొలిచే పరుగు నివారణ ఎలా

ఈ పరుగు పంట పుష్పించే కాలం నుండి పంట వరకూ ఉంటుంది. తొలి దశలో కొమ్మలు, కాయలపై పత్రహరితాన్ని గీకి తిని తర్వాత కొమ్మల్లోకి పోతే కొమ్మ ఎండి పోతుంది. తర్వాత కాయల్లోకి చేరి కాయలను నష్ట పరుస్తుంది. నివారణకు, పుష్పించే దశలో ఒకసారి, 20 రోజులకు మరోసారి డైమిధోయేట్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా మిధైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకులు పసుపుగా మారుతున్నాయి. పచ్చదోమ వుంది. ఏం చేయాలి

పరుగుల ఉధృతి నవంబర్ నుండి జనవరి వరకూ వుంటుంది. తొలి దశలో వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా వుంటే మోనోక్రోటోఫాస్ లేదా డై మిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పై విధంగా పిచికారీ చేయాలి.

ఆముదంలో ఆకులపై పాములాగా తెల్లమచ్చలు లేదా ఆకు తొలిచే పురుగు నివారణ ఎలా

తొలిదశలో వేపనూనె 5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే టైయజోఫాస్ 2.5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు ఉన్నప్పడు మోనోక్రోటోఫాస్ పిచికారీ చేయరాదు.

ఆముదంలో ఎర్ర గొంగళి పరుగు / బొచ్చు పురుగు ఆశించింది. ఏం చేయాలి?

ఆముదంలో పొగాకు లద్దె పురుగు నివారణకు,

  • పంట వేసే ముందు లోతుగా దున్ని నట్లయితే కోశస్థ దశలో వుండే పురుగులు (ప్యూపాలు) ఎండ వేడికి గానీ పక్షులు ఏరుకు తినడం వల్ల గానీ నశిస్తాయి.
  • వేరుశనగలో ఎర పంటగా ఆముదం లేదా ప్రొద్దు తిరుగుడు 7 సాళ్ల ప్రధాన పంటకు 1 సాలు ఎర పంట చొప్పన లేదా కంచె పంటగా, వేరుశనగ చుటూ వేసుకోవాలి. ప్రధాన లేదా ఎర పంటల ఆకులపై ఉన్న గ్రుడ్ల సముదాయాన్ని లార్వాలతో వున్న జల్లెడాకులను ఎప్పటికప్పుడు గమనించి ఏరి నాశనం చేయాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షక ಬುಟ್ಟಲು అమర్చి రెక్కల పరుగుల ఉధృతిని ప్రతి మూడు రోజులకొకసారి గమనించాలి. వీటిలో వారానికి 100 రెక్కల పురుగులు దాటి పడినా లేదా 10 మొక్కలకు రెండు గుడ్ల సముదాయాలు కనబడినా లేదా మొక్కకు ఒకటి లేదా రెండు లార్వాలు లేదా 50 రోజుల పైరులో 25 శాతం నష్టపోయినా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
  • పైరు లేత దశలో వేప గింజల కషాయం 5 శాతం లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • 2 లేదా 3 వ దశలో అంటే సుమారు అరంగుళం పొడవున్న లార్వాలు వుండి వాతావరణం చల్లగా వుంటే పొగాకు లద్దె పురుగు ఎన్.పి.వి. ద్రావణం 200 ఎల్.ఇ + బెల్లం 1 కిలో + శాండోవిట్ 100 మి.లీ. + నీలి మందు (రాబిన్ బ్యూ) 50 గ్రా, కలిపి సాయంత్రం పిచికారీ చేయాలి.
  • పక్షులు వాలటానికి వీలుగా 'టి' ఆకారపు కర్రలు ఎకరానికి 10-15 పక్షి స్థావరాలుగా అమర్చి వాటిని ఆకర్షించటానికి పసుపు కలిపిన అన్నం మెతుకులు వేయాలి.
  • వలసలను అరికట్టడానికి పొలం చుటూ లోతైన నాగటి చాలు తీసి మిథైల్ పెరాథియాన్ లేదా ఎండోసల్బాన్ లేదా కార్బరిల్ పొడి మందులను 90 మీటర్ల చాలుకు 1 కిలో చొప్పన చల్లాలి.
  • అవసరాన్ని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి చొప్పన కలిపి పిచికారీ చేయాలి.
  • బాగా ఎదిగిన లార్వాలు, పురుగు మందులు కొట్టినా చావని లార్వాలను వీలైతే చేతితో ఏరి వేయాలి లేదా ఎకరాకి 5 కిలోల తవుడు + 500 గ్రా. బెల్లం + 500 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ లేదా 500 గ్రా. కార్బరిల్  మందులను కలిపి చిన్న చిన్న వుండలుగా చేసి ఎరగా సాయంత్రం పూట చల్లాలి.
  • బెల్లం ముందురోజు నానబెట్టి పులిసినట్లయితే పురుగులు బాగా ఆకర్షింపబడి మంచి ఫలితాలు పొందచ్చు

ఆముదంలో వడలు తెగులు మరియు ఎండు తెగులును ఎలా నివారించాలి? ఆముదంలో వేరుకుళ్లను ఎలా అరికట్టాలి.

పంటల అవశేషాలను తీసి కాల్చి వేయాలి. పచ్చిరొట్ట పైర్లను వేసి భూమిలో కలియ దున్నాలి. కిలో విత్తనానికి 3గ్రా, ధైరమ్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ లేదా 4 గ్రా, టైకోడెర్మా విరిడి + 3 గ్రా, ధైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. టైకోడెర్మా విరిడి 2 కిలోలను 50 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుతో కలిపి 15 రోజులు తడిపి ప్లాస్టిక్ షీట్ లేదా గోనె సంచులు కప్పిన తర్వాత చాళ్ల మధ్యలో వేయాలి. తెగులు తట్టుకొనే హరిత, జ్యోతి, జ్వాల, జిసి హెచ్-4 వంగడాలను సాగు చేయాలి. పొలంలో నీరు నిలవకుండా చూడాలి. తెగులు లక్షణాలు గమనించగానే కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లను తడపాలి. ఎండి చనిపోయిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి.

ఆముదంలో కాయలు మెత్తపడి బూజుపట్టి కుళ్ళుతున్నాయి. లేదా ఆముదంలో కాయకుళ్ళు / బూజు తెగులు నివారణ తెలపండి.

పూత సమయంలో వరాలు అధికంగా పడి గాలిలో తేమ ఎక్కువగా వున్నప్పడు గెలల మీద బూజు కనిపిస్తుంది. దీనివలన కాయలు కుళ్లి నల్లగా మారతాయి. నివారణకు, తెగులును తట్టుకునే జ్వాల అనే రకం సాగు చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా, ధైరమ్ లేదా కార్బండజిమ్ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. తుఫాన్ వాతావరణం లేదా వరాలు పడే సూచనలు కనబడగానే ముందు జాగ్రత్తగా కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే, తెగులు సోకిన గెలలు, కాయలను ఏరి కాల్చి వేయాలి. తర్వాత కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పన వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నేలలో తేమను అనుసరించి ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. దాని వల్ల మళ్లీ కాయలు వచ్చి కొంత దిగుబడి పొందవచ్చు.

ఆధారం:www.apagrisnet.gov.in



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate