অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కూరగాయలు

కూరగాయలు

 1. వంగ
  1. వంగ ఏకాలంలో ఏఏ రకాలు సాగు చేయవచ్చు
  2. వంగలో అధిక దిగుబడికి ఏ ఎరువులు వేయాలి
  3. వంగలో పూత రాలుటను అరికట్టడం ఎలా
  4. వంగలో కొమ్మ కాయతొలుచు పరుగు నివారణ ఎలా
  5. వంగలో ఆకులపై తెల్లమచ్చలు వస్తున్నాయి. నివారణ
  6. వంగలో తెల్లదోమ నివారణ ఎలా
  7. వంగలో మొక్కలు ఎదుగుదల లేక, వడలి పోయి చనిపోతున్నవి. ఎలా నివారించాలి. లేదా వంగలో నులి పురుగులు లేక రూట్నాట్ నిమటోడ్స్ను ఎలా నివారించాలి
 2. బెండ
  1. బెండ ఎప్పడు వేయాలి. రకాలు ఏమిటి.
  2. బెండలో అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలు ఏవి
  3. బెండలో మొవ్వ మరియు కాయ తొలుచు పరుగు నివారణ ఎలా
  4. బెండ ఆకులపై పసుపు పచ్చ చారలుండి ఆకులు తెల్లగా అయిపోతున్నాయి నివారణ ఎలా
 3. టమాట
  1. టమాటా ఏకాలంలో పండించవచ్చు. రకాలు ఏవి
  2. టమాటా నారు కుళ్ళిపోతుంది. ఏం చేయాలి
  3. టమాటాలో అధిక దిగుబడికి ఏ ఎరువులు వేయాలి
  4. టమాటాలో పూత నిలబడటం లేదు, ఏం చేయాలి
  5. వేసవి టమాటా పంటలో పెరుగుదల ఆశించినంత లేదు. ఏం చేయాలి
  6. టమాటా ఆకులపై నల్లని మచ్చలు కనబడుతున్నాయి నివారణ ఎలా
  7. టమాటాలో మచ్చల ఎండు తెగులు ఎలా నివారించాలి
  8. టమాటాలో వడలు తెగులు ఎలా నివారించాలి
  9. టమాటాలో ఆకు ముడత తెగులు ఎలా నివారించాలి

వంగ

వంగ ఏకాలంలో ఏఏ రకాలు సాగు చేయవచ్చు

వంగ సంవత్సరం పొడవునా సాగు చేయుటకు అనువైన పంట. వర్షాకాలం పంటగా జూలై – ఆగస్టు, శీతాకాలం పంటగా నవంబర్ - డిసెంబర్, వేసవికాలం పంటగా ఫిబ్రవరి - మార్చి 15 లోగా నాటుకోవాలి.

అనువైన రకాలు: కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసాపర్పుల్ లాంగ్, పూసా పర్పుల్క్లస్టర్, పూసాక్రాంతి, గులాబి, అరుషీల్ తెలంగాణా ప్రాంతానికి పూసాక్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల మరియు రాయల సీమ ప్రాంతానికి అర్మకుసుమాకర్, దేశవాళి పచ్చవంగ రకాలు, దేశవాళి చారల వంగ (రాయదుర్ల) రకాలు అనువైనవి. ఇవికాక హైబ్రిడ్ రకాలు కూడమేసుకోవచ్చు. ఊదారంగు గుండ్రటి రకాలు: అర్మనవనీత్, పూసా హైబ్రిడ్ - 6, మహికో హైబ్రిడ్ నెం.2, 54, ఉత్కర మోహిని, మంజు, సంజు

ఊదారంగు గుత్తి రకాలు: మహికో-రవయ్య మహికో- హైబ్రిడ్ నెం. 3 ఊదారంగు పొడవు రకం - పూసా హైబ్రిడ్ - 5. పచ్చటి పొడవు రకాలు: హరిత, హరిత్ర, గ్రీన్ లాంగ్, మహికో హైబ్రిడ్ నెం. 9 పచ్చటి గుండ్రటి రకాలు - మహికో హైబ్రిడ్ నెం. 56, గ్రీన్ బంచ్ ఊదారంగు చారల రకాలు: కల్పతరు, మహికో హైబ్రిడ్ నెం. 11, 16, అప్సర.

వంగలో అధిక దిగుబడికి ఏ ఎరువులు వేయాలి

ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువుతో బాటు 24 కిలోలల భాస్వరం 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60 మరియు 75 రోజులకు పై పాటుగా వేయాలి. అదే హైబ్రిడ్ రకాలకు ఈ ఎరువులకు 50 శాతం అధికంగా వేయాలి.

వంగలో పూత రాలుటను అరికట్టడం ఎలా

పూత, కాపు దశలలో ఎల్లప్పడూ తగినంత తేమ వుండేట్లు చూడాలి. వేసవిలో 4 రోజుల కొకసారి నీరివ్వాలి. బరువైన నల్లరేగడి నేలల్లో మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. వేసవిలో కాయ కోతకు ఒకటి రెండు రోజుల ముందు తప్పని సరిగా నీరివ్వాలి. లేకుంటే కాయలో చేదు ఎక్కువవుతుంది. పూత, కోత దశలో 2,4-డి లీటరు నీటికి 10 మి.గ్రా. లేదా ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

వంగలో కొమ్మ కాయతొలుచు పరుగు నివారణ ఎలా

వంగను నష్టపరిచే పరుగుల్లో అతి ప్రధానమైనది. లార్వాలు గులాబిరంగులో ఉండి మొవ్వను తొలచి తినటం వల్ల మొవ్వ వడలి ఎండి పోతాయి. లార్వాలు పూ మొగ్గలను, కాయలను తొలచి నాశనం చేస్తాయి. కొమ్మ తొలచిన భాగాలో మరియు కాయల రంధ్రాల వద్ద పరుగు విసర్జించిన గమనించవచ్చు.

ఈ పురుగు ఆశించే ప్రాంతాల్లో భాగ్యమతి వంటి తట్టుకొనే రకాన్ని ఎన్నుకోవాలి. ఎకరాకి 4 లింగాకర్షక అమర్చి పురుగుల ఉనికిని గమనించవచ్చు. అందుబాటులో ఉన్నచోట ఎకరాకి 40 అమర్చి పురుగు ఉదృతిని చాలా వరకూ అదుపు చేయవచ్చు. పరుగు ఆశించిన కాయలను, కొమ్మలను తృంచి నాశనం చేయాలి. రెక్కల పురుగులు ఎక్కువగా ఉన్న సమయంలో టైకోగ్రామా ఎకరాకి 20,000 చొప్పన విడుదల చేయాలి. పూత, కాయ సమయంలో ఎండో సల్ఫాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉదృతిని బట్టి క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా డెల్టామెర్రిన్ లేదా సైపర్ మెద్రిన్ లేదా ఫెన్వలరేట్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును నివారించవచ్చు.

వంగలో ఆకులపై తెల్లమచ్చలు వస్తున్నాయి. నివారణ

లేదా వంగలో ఎర్రనల్లి ఆశించింది. ఏం చేయాలి? నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేక డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వంగలో తెల్లదోమ నివారణ ఎలా

పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల మొక్కలు పసుపు పచ్చగా మారి, ఎండిపోయి, గిడస బారతాయి. తెల్ల దోమ నివారణకు పసుపు రంగు ఆల్ల్లు లేదా డబ్బాలకు జిగురు పూసి అక్కడక్కడా వ్రేలాడగట్టాలి. ఆకుకు 5-10 తెల్లదోమలు గమనించిన వెంటనే ట్రయజోఫాస్ 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిద్రాయిడ్ మందులు వాడితే ఈ పురుగుల ఉదృతి పెరుగుతుంది కాబట్టి సాధ్యమయినంత వరకూ వీటిని వాడకూడదు.

వంగలో మొక్కలు ఎదుగుదల లేక, వడలి పోయి చనిపోతున్నవి. ఎలా నివారించాలి. లేదా వంగలో నులి పురుగులు లేక రూట్నాట్ నిమటోడ్స్ను ఎలా నివారించాలి

కంటికి కనిపించని తల్లి పురుగులు వేరుపై గ్రుడ్లను పెడతాయి. గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన లార్వాలు వేర్లలో ప్రవేశించి రసాన్ని పీల్చటం వల్ల మొక్కలు ఎదుగుదల మధ్యాహ్నం ఎండి పోయినట్లు కనిపిస్తాయి. ఆశించిన మొక్కల వేర్ల మీద బుడిపెలు గమనించవచ్చు.

వంగలో తట్టుకొనే రకాలైన బ్లాక్ బ్యూటీ, విజయ, బనారస్, జెయింట్, టి-2 రకాలు తట్టుకుంటాయి. టమాటలో నిమాటెక్స్, యస్.యల్-120, యన్.టి.ఆర్-1, నీమోరెడ్ రకాలు తట్టుకుంటాయి. వేసవిలో లోతుగా దున్నాలి. పొలంలో నులి పరుగుల సంతతిని తగ్గించటానికి బంతి పూలు పంటతో పంట మార్పిడి చేయాలి. పొలాన్ని బాగా దున్ని20 కిలోల వరి పొట్టును ఒక చదరపు గజానికి చొప్పన పరచి కాల్చాలి. నారుమడిలో కార్బోప్యూరాన్ 3 జి గుళికలను చదరపు మీటరుకు 65 గ్రా, చొప్పన వేసుకోవాలి ఆశించిన పొలంలో హెక్టారుకి 48 కిలోల లేదా ఎకరాకు 20 కిలోల కార్బోప్యురాన్ గుళికలు ప్రతి నాలుగు సంవత్సరాల కొకసారి వేసుకోవాలి.

బెండ

బెండ ఎప్పడు వేయాలి. రకాలు ఏమిటి.

బెండను   వరా కాలం పంటగా జూన్-జులై మరియు వేసవి పంటగా జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు పండించవచ్చు. శీతాకాలంలో పెరుగుదల తగ్గి దాఇగుబడి తగ్గే అవకాశం వుంది.

రకాలు: పల్లాకు తెగులు త్వరగా ఆశించి దిగుబడి తగ్గే అవకాశం వుంది. కనుక ఈ తెగులును తట్టుకునే రకాలు వేయాలి. ఇందుకు అర్క అనామిక , అర్మఅభయ, పర్భనిక్రాంతి అనువైనవి. హైబ్రిడ్ రకాలు: వర్ష విజయ్, విశాల్, నాథ్ శోభ, మహికో హైబ్రిడ్ నెం. 1,6,7,8, ప్రియ, సుప్రియ రకాలు శంఖు రోగం (పల్లాకు తెగులు)ను తట్టుకుంటాయి.

బెండలో అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలు ఏవి

పల్లాకు తెగులును తట్టుకునే రకాలు ఎన్నుకొని కిలో విత్తనానికి 5 గ్రా, ఇమిడాక్లోప్రిడ్ తర్వాత 4 గ్రా. టైకొడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి. వర్షాకాలం పంటను జూలై 15 లోగా, వేసవి పంటను ఫిబ్రవరి లోగా వేయుట వల్ల పల్లాకు తెగులు తక్కువగా ఆశించి ఎక్కువ దిగుబడి పొందవచ్చు. సిఫార్పు చేసిన ఎరువులతో బాటు పూత దశలో యూరియ 10 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయుట ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు. పల్లాకు తెగులు వ్యాప్తికి కారణమైన రసం పీల్చేపురుగులను నివారించుటకు తగిన సస్యరక్షణ చర్యలను పాటించాలి. బెండ 3-4 కణుపులు పెరిగిన తరువాత తల విరిచేస్తే ప్రక్క నుండి కొమ్మలు వచ్చి దిగుబడి పెరగడానికి అవకాశము కలదు.

బెండలో మొవ్వ మరియు కాయ తొలుచు పరుగు నివారణ ఎలా

నాటిన 30 రోజుల నుండి కోత దశ వరకూ ఆశిస్తుంది. మొక్క పెరిగే దశలో మొవ్వును, పూతను, కాత దశలో కాయలను తొలచి నపఁట చేస్తుంది. ఆశించిన మొక్కలు వడలి, ఎండిపోతాయి. పరుగు ఆశించిన కొమ్మలను ఒక అంగుళం క్రిందవరకు తృంచి నాశనం చేయాలి. లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా డైక్లోర్వాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి ఫెనవలరేట్ లేదా డెల్టామెద్రిన్ లేదా సైపర్ మెద్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బెండ ఆకులపై పసుపు పచ్చ చారలుండి ఆకులు తెల్లగా అయిపోతున్నాయి నివారణ ఎలా

ఈ లక్షణాలున్న తెగుల్ని శంఖురోగం లేదా ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అని అంటారు. ఇది వైరస్ వల్ల వస్తుంది. వేసవి వరాకాలపు పైరుపై ఎక్కువగా వస్తుంది. తెల్లదోమ ద్వార వ్యాప్తి చెందుతుంది. పర్చని క్రాంతి, పూసా సవాని, అర్క అనామిక, అర్క అభయ్ రకాలు తెగులును తట్టుకునే రకాలను సాగు

చేసుకోవాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమను డైమిధోయేట్ 2 మి.లీ. లేదా అసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

టమాట

టమాటా ఏకాలంలో పండించవచ్చు. రకాలు ఏవి

వర్షాకాలం పంట (ఖరీఫ్) గా జూన్ – జులై మాసాల్లో, శీతాకాలం పంటగా (రబీ) అక్టోబర్ - నవంబర్ మాసాలలోను, వేసవి పంటగా జనవరి – ఫిబ్రవరి మాసాలలో నాటుకొని పండిస్తే అధిక దిగుబడి పొందవచ్చ

రకాలు: వర్షాకాలంలో పండించుటకు అనువైనవి. పూసారూబి, పూసా ఎర్లీ డ్వార్స్, అర్మవికాస్, అర్క సౌరబ్, అర్కమేఘాలి

శీతాకాలంలో అన్ని రకాలను సాగు చేయవచ్చు. వేసవికాలంలో పండించుటకు అనువైనరకాలు: పికెయం -1. మారుతమ్, అర్క వికాస్

హైబ్రిడ్ రకాలు: వైశాలి, రూపాలి, రష్మి నవీన్, మంగళ, అవినాష్-2, బిఎస్ఎస్-20, రజనీ, అన్నపూర్ణ, ఎమ్. టి.హెచ్-1, 2, 6

టమాటా నారు కుళ్ళిపోతుంది. ఏం చేయాలి

కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు తడపాలి. నారుమడి పోయుటకు ముందు 3 గ్రాముల ధైరామ్ లేదా మాంకొజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. 15 సెం.మీ. ఎత్తైన నారుమళ్ళను తయారు చేసి, 10 సెం.మీ. ఎడంలో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకొంటే గాలి, సూర్యరశ్మి సోకి తెగులు రాకుండా చూడవచ్చు.

టమాటాలో అధిక దిగుబడికి ఏ ఎరువులు వేయాలి

చివరి దుక్మిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువుతో బాటు 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. 60 కిలోల నత్రజనిని 3 సమపాళ్ళగా నాటిన 30, 45 మరియు 60 రోజులకు పై పాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేయటం వల్ల 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. జింక్ సల్ఫేట్ను నీటికి కలిపి నాటిన 30-45 రోజులకు పిచికారీ చేస్తే జింక్ లోప నివారణతో పాటు 20 శాతం దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే, పూత, పిందె నిలిచి ఎండాకాలంలో కూడ అధిక దిగుబడి పొందవచ్చు.

టమాటాలో పూత నిలబడటం లేదు, ఏం చేయాలి

వేసవి పంటలో పొటాషియం నైట్రేట్ (మల్టి-కె) 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పెరుగుదల బాగుంటుంది. ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత రాలుట తగ్గి కాయ నిలబడుతుంది.

వేసవి టమాటా పంటలో పెరుగుదల ఆశించినంత లేదు. ఏం చేయాలి

అధిక ఉష్ణోగ్రత వల్ల పెరుగుదల తగ్గే అవకాశం వుంది. వేసవి పంటగా వేసినప్పడు ప్రతి రెండు, మూడు టమాటా వరుసలకు రెండు వరుసల మొక్కజొన్న ఉత్తర దక్షిణ వరుసలలో విత్తుకోవాలి. అంటే వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కజొన్న మొక్కల మధ్య 25-30 సెం.మీ. మరియు టమాట మొక్కల మధ్య 80 సెం.మీ. దూరం వుండేలా విత్తుకోవాలి. ఈ విధంగా నీడ కల్పిస్తే టమాటా పెరుగుదల బావుంటుంది. వేసవి పంటగా వేసేటప్పడు ఫిబ్రవరి లోగా నాటాలి. ఆలస్యమయితే అధిక ఉష్ణోగ్రత వల్లపెరుగుదల ఆశించిన మేర వుండదు.

టమాటా ఆకులపై నల్లని మచ్చలు కనబడుతున్నాయి నివారణ ఎలా

ఆకులపై ముదురు గోధుమ రంగు వలయాకారపు మచ్చలు శిలీంద్రము వల్ల వచ్చే ఆల్టర్వేరియా ఆకుమచ్చ తెగులు. ఆకుల విూద, కాండం విూద మరియు కాయల విూద కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తీవ్రముగా ఉన్నచో కాయలు కుళ్ళిరాలిపోవును మొక్కలు ఎండిపోవును. కాష్ట్రాన్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి తెగులు సోకిన ప్రాంతాలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల విత్తనాలను వాడకూడదు.

టమాటాలో మచ్చల ఎండు తెగులు ఎలా నివారించాలి

ఈ మధ్య ఈ తెగులు టమాటలోనే కాక ఇతర పంటలను ఆశించి ఎక్కువ కలుగజేస్తున్నది. లేత ఆకులు ఇత్తడి రంగుకుమారి ఎక్కువ సంఖ్యలో చిన్న ముదురు రంగు మచ్చలేర్పడతాయి. కాండంమీద కూడ గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. లేత మొక్కలకు తెగులు ఆశించినప్పడు కాయల విూద తెల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇది టమాటో స్పాటెడ్ విల్డ్ వైరస్ (టిఎస్డబ్ల్యువి) వల్ల వస్తుంది. ఈ తెగులు విత్తనం ద్వార, తామర పురుగు ద్వార వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తామర పురుగులను అరికట్టడానికి కార్బోప్యూరాన్ గుళికలు 40 చ.మీ. నారుమడిలో 100 గ్రా. మరియు నాటిన 10వ రోజున 6 కిలోలు వేయాలి.

టమాటాలో వడలు తెగులు ఎలా నివారించాలి

తెగులు సోకిన మొక్కల అడుగు భాగం ఆకులు పసుపు రంగుగా మారి తొడిమతో సహా రాలి పోయి, మొక్కలు వడలిపోయి చనిపోతాయి. మొక్కల యొక్క కాండం చీల్చి చూసినట్లయితే లోపల కణజాలం గోధుమ రంగుకు మారిపోవును.

ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించాలి. తెగులు తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి. పంట మార్పిడి పద్ధతిని .

టమాటాలో ఆకు ముడత తెగులు ఎలా నివారించాలి

ఈవైరస్ తెగులు టమాటాలో ఎంతో నష్టం కలుగజేస్తున్నది. ఈ తెగులు ఎక్కువగా పైరు మధ్య దశలో వచ్చి పూత, పిందెలు రాలిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. ఆకుల అడుగు భాగాన పరుగులు రాసాన్ని పీల్చి వేయడము వలన ఆకులు ముడుచుకొని పోతాయి. తెల్లదోమ వలన ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పరుగు నివారణకు టైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి అరికట్టాలి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 10/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate