లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, అభివృద్ధి చెంది చాలాకాలం దిగుబడినిస్తాయి. చౌడు, ఉప్ప, సున్నం మరియు నీరు నిలువ వుండే బరువైన నల్లరేగడి నేలల్లో నాటరాదు. ఉదజని సూచిక 6-7.5 వున్న నేలలు అనుకూలం. నీరు ఉపరితలము నుండి కనీసం రెండు మీటర్లు క్రింద వుండాలి.
బంగినపల్లి మరియు తోతాపురి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పండించుటకు అనువైన వాణిజ్య రకాలు. sਹੇ ప్రాంతానికి అనువైన రకాలు : సువర్ణరేఖ, పెద్దరసం, చిన్నరసం, చెఱకురసం, పంచదార కలశ తెలంగాణా ప్రాంతానికి అనువైన రకాలు : సువర్ణరేఖ, దశేరి, హిమయత్, చెఱకురసం, మల్లిక, రత్న రాయలసీమ ప్రాంతానికి అనువైన రకాలు: సువర్ణరేఖ, నీలేషాన్, ఎ.యు. రుమాని.
జూన్ – డిసెంబరు వరకు నాటవచ్చు. జూన్-జులై మరియు సెప్టెంబరు నెలల్లో నాటుట మంచిది. నేలను బాగా దున్ని 1X1X1 మీ. గుంతలు తవ్వి, 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు చెదలు ఆశించకుండా 100 గ్రాముల ఫాలిడాల్ 2 శాతం పొడిని త్రవ్విన పైమట్టితో కలిపి నింపి మొక్కలను 7-10 మీటర్ల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటాలి.
మొక్క వయస్సును బట్టి ఎరువులు వాడాలి. ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. ప్రతి సంవత్సరం పై మోతాదును పెంచుతూ 10 సంవత్సరములు ఆ పై వయస్సు గల చెట్లకు ఒక్కో క్రితో నత్రజని, , పొటాష్ ఎరువులను వాడాలి. నత్రజనిని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇస్తే మంచిది. మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగిలిన 1/3 వంతు ఎరువులను జనవరి 2 లేదా 3వ వారంలో వేయాలి. కాపుకు రాని చెట్లకు ప్రతి 2-3 నెలలకొకసారి వేయాలి.
జూన్-జులై ఎండు పుల్లలను, గుబురుగా, అడ్డదిడ్డంగా 856f:3 చిన్న కొమ్మలను తీసివేసి చెట్టుకు సూర్యరశ్మి గాలి బాగా సోకునట్లు చూడాలి. కొమ్మలను కత్తిరించిన చోట బోర్లో మిశ్రమాన్ని పూయాలి. తరువాత సిఫార్సు చేసిన మేరకు ఎరువులను వేయాలి. 8-10 సం||లు దాటిన చెట్లకు గొడుగు కొమ్మ తీసివేయాలి.
ఆధారం: http://www.apagrisnet.gov.in