অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రాద్దుతిరుగుడు

ప్రాద్దుతిరుగుడు

 1. ప్రొద్దుతిరుగుడు పండించడానికి ఎటువంటి నేలలు అనుకూలంగా వుంటాయి? వరి మాగాణుల్లో ప్రాదు తిరుగుడు సాగు చేయవచ్చా.
 2. అధిక దిగుబడులనిచ్చే సంకర రకాలను సూచించండి.
 3. ప్రొద్దుతిరుగుడు పంట వేసుకొందామనుకుంటున్నాము. కలుపును అదుపులో ఉంచటానికి తీసుకొనే చర్యలు ఏమిటి.
 4. ప్రొద్దుతిరుగుడులో తాలు గింజలు రాకుండా, పువ్వులు నిండుగా రావాలంటే ఏమి చెయ్యాలి.
 5. మా ప్రాంతంలో పక్షుల బెడద ఎక్కువగా వుంటుంది? ఏ జాగ్రత్తలు పాటించాలి.
 6. మేము ప్రొద్దుతిరుగుడులో హైబ్రిడ్ విత్తనం కొరకు వేశాము. ఆడ, మగ పుష్పాలు ఒకేసారి పూతకు రావడం లేదు ఏమి చెయ్యాలి.
 7. క్రిందటేడు ప్రాదుతిరుగుడు వేశాము, విత్తనాలు పూర్తిగా మొలక రాలేదు. ఈసారి కూడా వేద్దామనుకుంటున్నాము. ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాలా.
 8. ప్రాదుతిరుగుడు ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి వివరించండి.
 9. ప్రొద్దుతిరుగుడులో శనగ పచ్చ పురుగును ఎలా నివారించాలి.
 10. ప్రాదు తిరుగుడులో పొగాకు లద్దె పరుగును ఎలా అదుపు చేయాలి.
 11. ప్రొద్దుతిరుగుడులో పచ్చదోమ నివారణ ఎలా.
 12. ప్రొద్దుతిరుగుడులో తెల్లదోమ నివారణ ఎలా.
 13. ప్రొద్దుతిరుగుడులో ఆకు మచ్చలు నివారణ ఎలా.
 14. ప్రొద్దుతిరుగుడులో వెర్రి తెగులు (మెజాయిక్) నివారణ తెలపండి.
 15. ప్రొద్దుతిరుగుడు మొక్కలు వడలి ఎండిపోతున్నాయి. ఎలా నివారించాలి.
 16. ప్రొద్దు తిరుగుడులో నెక్రోసిస్ తెగులు నివారణ ఎలా.

ప్రొద్దుతిరుగుడు పండించడానికి ఎటువంటి నేలలు అనుకూలంగా వుంటాయి? వరి మాగాణుల్లో ప్రాదు తిరుగుడు సాగు చేయవచ్చా.

నీటి పారుదల పంటగా సంవత్సరం పొడవున అనగా ఖరీఫ్లో జులై 15 నుండి ఆగష్టు 10 మధ్య వరకు, నీరు నిల్వ వుండని అన్ని రకాల నేలల్లోను సాగు చేయవచ్చును. లోతట్టు ప్రాంతాలు ఈ పంటకు అనుకూలం కాదు. వరి మాగాణుల్లో ప్రొద్దుతిరుగుడు పంటను తీసుకొనేటప్పడు నేల తయారు చేసుకొని జనవరిలో విత్తుకోవాలి. రబీలో సెప్టెంబర్ - అక్టోబర్ నెలలో, వేసవిలో జనవరి 15 నుండి జనవరి 30 లోపల విత్తుకొని పండించవచ్చును.

అధిక దిగుబడులనిచ్చే సంకర రకాలను సూచించండి.

ప్రొద్దుతిరుగుడులో ఎ.పి.యస్.హెచ్-1, బియస్ హెచ్-1, కెబియస్ హెచ్-1, ఎమ్ఎస్ఎఫ్ హెచ్-8, ఎమ్ఎస్ఎఫ్ హెచ్-17 మరియు ఎన్డిఎస్ హెచ్-1 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్నీ దాదాపుగా 85-95 రోజులలోపు పంటకు వచ్చి ఎకరాకు 600 కిలోల దిగుబడి నిస్తాయి.

ప్రొద్దుతిరుగుడు పంట వేసుకొందామనుకుంటున్నాము. కలుపును అదుపులో ఉంచటానికి తీసుకొనే చర్యలు ఏమిటి.

ప్రొద్దుతిరుగుడు పంట వేసే పది రోజుల ముందు ప్నక్లోరాలిన్ (బసాలిన్), వేసిన మూడు రోజులకైతే పెండిమిథాలిన్ (స్టాంపు) ఎకరాకు ఒక లీటరు 250 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20 రోజుల తరువాత అయితే రెండు సార్లు దంతులు తోలుకొని అంతరకృషి చెసుకొ చెసుకొవలి

ప్రొద్దుతిరుగుడులో తాలు గింజలు రాకుండా, పువ్వులు నిండుగా రావాలంటే ఏమి చెయ్యాలి.

ప్రొద్దుతిరుగుడులో తాలు గింజలు రాకుండా, పువ్వులు నిండుగా ఉండటానికి ముఖ్యంగా పూత బాగా విచ్చుకున్నప్పడు, పర్యావరణంలో తేనెటీగలు వుండాలి. వాతావరణం మబ్బుగా వున్నప్పడు తేనెటీగలు ఉధృతి తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఉదయం 8 గంటల నుండి 11 గంటల సమయంలో పువ్వులపై సున్నితమైన గుడ్డతో రుద్దడంవల్ల పరపరాగ సంపర్కం జరిగి, గింజ బాగా కట్టి, దిగుబడి బాగా పెరుగుతుంది. అంతే కాకుండ బొరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ కట్టే సమయంలో (65-80 రోజులు) పంటను బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి.

మా ప్రాంతంలో పక్షుల బెడద ఎక్కువగా వుంటుంది? ఏ జాగ్రత్తలు పాటించాలి.

గింజకట్టే దశ నుండి సుమారు నెల రోజుల వరకూ పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవాలి. దీనికొరకు మెరపు రిబ్బన్ (అగ్నిరిబ్బన్) పైరుపై అడుగు ఎత్తున ఎటు చూసినా 15 అడుగుల పొడవు వుండే విధంగా ఎకరానికి 4 టేపులు ఉత్తర దక్షిణ దిశగా అమర్చాలి. అపుడు సూర్యరశ్మి నేరుగా రిబ్బనుపై బడి మెరసూ ఉండటం వల్ల పక్షులు రావు. పిట్ట కాపలా ఏర్పాటు చేసుకొని కూడా పంటను పక్షులబారి నుండి కాపాడుకోవచ్చును.

మేము ప్రొద్దుతిరుగుడులో హైబ్రిడ్ విత్తనం కొరకు వేశాము. ఆడ, మగ పుష్పాలు ఒకేసారి పూతకు రావడం లేదు ఏమి చెయ్యాలి.

హైబ్రిడ్ ప్రొద్దుతిరుగుడు ఆడ మగ మొక్కలు పుష్పించు సమయంలో తేడాను బట్టి రెండు ఒకేసారి పూతకు వచ్చేలా ముందు, వెనకలుగా విత్తుకోవాలి. ఉదాహరణకు రెండు పుష్పాలకు, పూతకు వారం రోజులు తేడా ఉంటే, మగమొక్కలు విత్తిన వారం రోజుల తరువాత ఆడమొక్కలు విత్తితే పూత సమన్వయం జరిగి, ఆడ మొక్కలపై విత్తనోత్పత్తి బాగా జరుగుతుంది.

క్రిందటేడు ప్రాదుతిరుగుడు వేశాము, విత్తనాలు పూర్తిగా మొలక రాలేదు. ఈసారి కూడా వేద్దామనుకుంటున్నాము. ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాలా.

ప్రొద్దుతిరుగుడు విత్తనాలు వితే ముందు 12 గంటలు నానబెట్టి ఆ తరువాత కిలో విత్తనానికి 3 గ్రా. ధైరామ్ లేదా కాప్లాన్ కలిపి విత్తనశుద్ధి చేసి వాడితే మొలక శాతం అధికంగా వుంటుంది. విత్తేటప్పుడు తగినంత తేమ వుండాలి.

ప్రాదుతిరుగుడు ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి వివరించండి.

ప్రొద్దుతిరుగుడు వరాధారంగా సాగు చేసేటప్పుడు 25 కిలోలు యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. మిగతా సగం (25 కిలోలు) యూరియా నాటిన 30 రోజుల తరువాత వేసుకోవాలి. అలాగే నీటి పారుదల క్రింద సాగు చేసేటపుడు నత్రజని మూడు దఫాలుగా వేసుకోవాలి. 25 కిలోలు యూరియా దుక్కిలోను, 12 కిలోలు నాటిన 30 మరియు 45 రోజులకు వేసుకోవాలి. సూపర్ ఫాస్పేట్, పొటాష్ ఎరువులు ఆఖరి దుక్మిలో వేసుకోవాలి.

యాజమాన్యంలో, భూమి రకం, పంటకాలాన్ని అనుసరించి 4-6 తడులు అవసరమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ వుండ కూడదు. పైరు మొగ్గ మీద వున్నప్పడు, పూత సమయంలోను, గింజకట్టే సమయంలో భూమిలో తేమ చాలా అవసరం. ఆ సున్నితమైన దశలలో పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి.

ప్రొద్దుతిరుగుడులో శనగ పచ్చ పురుగును ఎలా నివారించాలి.

సాద్దుతిరుదులొ లార్వాలు మధ్యన చేరి గింజలను తింటూ అధికంగా కలుగజేస్తాయి. ఎకరాకి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. ఉధృతి ఎక్కువైతే ఎండోసల్బాన్ లేదా క్వినాల్ఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా మిథైల్ పెరా థియాన్ లేదా సైపర్ మెద్రిన్ లేదా డెల్టామెద్రిన్ లేదా ఫెన్వలరేట్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

అందుబాటులో ఉన్న చోట హెచ్.యన్.పి.వి. వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 200 ఎల్.ఇ. ఎకరాకి చొప్పన చల్లని కాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఎంతకీ చావని పెద్ద పరుగులను చేతితో ఏరి వేయాలి.

ప్రాదు తిరుగుడులో పొగాకు లద్దె పరుగును ఎలా అదుపు చేయాలి.

ఎకరాకి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. గ్రుడ్ల సముదాయాలను, గుంపులుగా చిన్న లార్వాలు ఉన్న జల్లెడాకులను ఏరి నాశనం చేయాలి. తొలిదశ లార్వాల నివారణకు వేప గింజల ద్రావణాన్ని 4 శాతం పిచికారి చేయాలి. పురుగుల వలసలను అరికట్టడానికి లోతైన నాగటి చాలు తీసి మిథైల్ పెరాథియాన్ 2 శాతం లేదా ఎండోసల్ఫాన్ 4 శాతం పొడి మందును 70 మీటర్ల చాలుకి 1 కిలో చొప్పన చల్లాలి. 10 కిలోల తవుడు + కిలో బెల్లం + 1 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బరిల్ నీటిలో కరిగే పొడి మందును తగినంత నీటితో ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో విషపు ఎరగా పొలంలోనూ, మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి.

ప్రొద్దుతిరుగుడులో పచ్చదోమ నివారణ ఎలా.

పచ్చదోమ ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపి ఆకులు ఎర్రబడి, ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి. ఆకులన్నీ ఎండి రాలి పోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రొద్దుతిరుగుడులో తెల్లదోమ నివారణ ఎలా.

తెల్లదోమ ఆశిస్తే ఆకులు పసుపు రంగుకి మారి, గిడసబారి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించే ಕನ వంటి పదార్ధం వల్ల బూజు తెగుళ్ళ మరియు వెర్రి తెగులు వంటి వైరస్ తెగుళ్ళు ఆశిస్తాయి. నివారణకు తొలిదశలో వేప సంబంధిత మందులను పిచికారీ చేయాలి. పసుపు రంగు అట్టలకు జిగురు రాసి / వాడేసిన గ్రీజు / అయిల్ వంటివి రాసి పొలంలో అక్కడ అక్కడా వ్రేలాడ గట్టాలి. వీలైన చోట ఈ విధంగా పసుపు రంగు అట్టలను కర్రకు కట్టి మొక్కలపై త్రిప్పాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే ట్రయజోఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధ్యమయినంత వరకూ సింథటిక్ పైరిత్రాయిడ్స్ వాడరాదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. లేకపోతే తెల్ల దోమ ఉధృతి అధికమవుతుంది.

ప్రొద్దుతిరుగుడులో ఆకు మచ్చలు నివారణ ఎలా.

ఆల్టర్నేరియా ఆకు మాడు తెగులు ఆశించిన ఆకులపై గుండ్రని లేదా అండాకారపు గోధుమ లేదా నలుపు మచ్చలు . మచ్చల చుటూ పసుపు పచ్చని వలయం ఉండి మచ్చల మధ్య భాగం బూడిద రంగులో వలయాలు వలయాలుగా కనిపిస్తాయి.

కుంకుమ తెగులు లేదా త్రుప్ప తెగులు సోకినట్లయితే చిన్న ఇటుక రంగు పొక్కులు ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు, పంట అవశేషాలను, తెగుళ్లు

కలుగజేసే శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను నిర్మూలించాలి. తెగులు తరచూ ఆశించే ప్రాంతాల్లో బిఎస్ హెచ్-1 వంటి తట్టుకొనే రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి ధైరమ్ లేదా కాప్లాన్ 3 గ్రా, చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆకు మచ్చలు కనబడగానే మాంకోజెబ్ లేదా జినెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

ప్రొద్దుతిరుగుడులో వెర్రి తెగులు (మెజాయిక్) నివారణ తెలపండి.

ఈ వైరస్ తెగులు ప్రధానంగా తెల్ల దోమల వల్ల వ్యాపిస్తుంది. తెగులు సోకని పొలం నుండి విత్తనం సేకరించాలి. గట్లపై, పొలంలో కలుపు మొక్కలు, తోటకూర మొక్కలు లేకుండా చూడాలి. తెగులు సోకిన మొక్కలను తీసివేసి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. ట్రయజోఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రొద్దుతిరుగుడు మొక్కలు వడలి ఎండిపోతున్నాయి. ఎలా నివారించాలి.

సాధారణంగా పంట విత్తిన 40 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే స్కెరోషియం వడలు తెగులు వల్ల ఈ విధంగా మొక్కలు పేలవంగా మారి ఎండిపోతాయి. కాండంపై నేల ఉపరితలం దగ్గర తెల్లని శిలీంద్రపు పెరుగుదల ఉండి దానిపై ఆవగింజల పరిమాణం కల్గిన గోధుమ రంగు స్కెరోషియా బీజాలు కనబడతాయి. నివారణకు, తెగులు నివారణకు పంట అవశేషాలు నిర్మూలించాలి. కిలో విత్తనానికి ధైరమ్ లేదా కాప్లాన్ 3 గ్రా, చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఈ తెగులు ఆశిస్తే చెషంట్ కాంపౌండ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల కాండం దగ్గర (మొదలు చుటూ) భూమి తడిచేలా పోయాలి. దీనికి గాను 2 సాళ్ల మైలతుత్తం (కాపర్ సల్ఫేట్) : 11 పాళ్లు అమ్మోనియమ్ కార్బొనేట్ విడివిడిగా పొడి చేసుకొన్న తర్వాత రెండూ కలిపి గాలి సోకని గాజు లేదా ప్లాస్టిక్ (లోహరహితమైన) పాత్రలో మూత పెట్టి 24 గంటలు వుంచాలి. మరుసటి రోజు ఈ మిశ్రమం నుండి 3 గ్రా. లీటరుకి చొప్పున పై విధంగా వాడాలి.

ప్రొద్దు తిరుగుడులో నెక్రోసిస్ తెగులు నివారణ ఎలా.

మొక్క లేత దశలో చివరి భాగం ఎండి పోతుంది. పూత దశలో పూవు వికసించకుండా మెలితిరిగి పోయి ఎండిపోతుంది. ఈ తెగులు నివారణకు గట్లమీద ఉండే పార్టీనియం మొక్కలను పీక వేయాలి. పంట చుటూ తీగ జాతి కూరగాయలైన దొండ, బీర మొదలగు పంటలు వేయరాదు. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసి, లీటరు నీటికి 1 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫాస్పామిడాన్ 2 మి.లీ. చొప్పన కలిపి 15 రోజుల వ్యవధిలో 3,4 సార్లు పిచికారీ చేయాలి.

ఆధారం: http://www.apagrisnet.gov.in

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate