నీటి వసతి ఉన్న ప్రాంతాలలో దీర్ఘకాలిక సంకర రకాలయిన డి.హెచ్.ఎమ్-103, డి.హెచ్.ఎమ్-105, త్రిశూలత అనుకూలంగా వుంటాయి.
మధ్యకాలిక రకాలయిన డి.హెచ్.ఎమ్-107, వరుణ, హర మరియు అశ్విని వంటి వాటిని విత్తుకోవచ్చును.
సాధారణ పరిస్థితులలో జూన్ 15 నుండి జులై 15 వరకు, ఆలస్యమైన పరిస్థితులలో స్వల్ప కాలిక రకాలను జులై 15 నుండి ఆగష్టు 15 వరకు వేసుకోవాలి.
మాపల్లె టౌన్‌కు దగ్గరగా ఉన్నది. పచ్చి కండెలు మార్కెట్ చేద్దామనుకుంటున్నాము. ఏ రకాలు వేసుకుంటే బావుంటుంది. సలహ ఇవ్వగలరు.
మాధురి మరియు ప్రియ అనే రకాలు 60-75 రోజులలో పంటకు వచ్చి పచ్చి కండెలుగా మార్కెట్ చేయడానికి పనికి వస్తాయి. ఎకరానికి 30000-85000 కండెలు వరకు వస్తాయి. వీటిలో చక్కర శాతం 30-36 వరకు .
సిఫారసు చేసిన దూరంలో సాళ్ళలో విత్తుకోవాలి. 25 రోజుల తరువాత అంతర కృషి చేసి, బోదె నాగలితో మట్టిని మొక్కల మొదళ్ళ దగ్గరకు ఎగదోయాలి.
గింజకొరకు అయినట్లయితే, ఎకరానికి 7 కిలోల విత్తనం అవసరం అవుతుంది. దీనిని మీరు సాలుకు, సాలుకు 75 సెం.మీ. మొక్కకు, మొక్కకు 20 సెం.మీ. దూరం ఉంచి విత్తుకోవాలి. పచ్చికండెలు మరియు పాప్‌కార్న్ కొరకు అయితే ఎకరాకు 4-5 కిలోలు, సాలుకు, సాలుకు మధ్య 60 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేటట్లు విత్తుకోవాలి.
పై పాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేసుకోకూడదు. వరాధార పంటకు, ఎకరాకు 36 కిలోల నత్రజని + 20 కిలోల భాస్వరం + 16 కిలోల పొటాష్ పోషకాలను సూటి ఎరువుల రూపంలో కాని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కాని వేసుకోవాలి.
సూటి ఎరువుల రూపంలో వాడినట్లయితే ఎకరాకు 80 కిలోల యూరియా + 125 కిలోల సూపర్ పాస్ఫేట్ + 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దానిలో 50 కిలోల యూరియా, 125 కిలోల సూపర్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. పై పాటుగా మోకాలు ఎత్తు దశలో (30-40 రోజుల మధ్యలో) ఇంకో 30 కిలోల యూరియా వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసుకున్నట్లయితే ఎకరాకు 65 కిలోల యూరియా + 45 కిలోల డి.ఎ.పి + 27 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అందులో ఆఖరి దుక్కిలో 40 కిలోల యూరియా + 45 కిలోల డి.ఎ.పి + 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాగే మోకాలు ఎత్తు దశలో (30-40 రోజుల మధ్య) ఇంకో 25 కిలోల యూరియా పె పాటుగా వేసుకోవాలి.
మీరు ఎకరాకు 48 కి|ల నత్రజని + 24 కిలోల భాస్వరం + 24 కిలోల పొటాష్ పోషకాలను సూటి ఎరువులు లేదా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించాలి. సూటి ఎరువుల రూపంలో ఎకరాకు 105 కిలోల యూరియా + 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ + 34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేసుకోవాలి. దానిలో ఆఖరి దుక్కిలో 26.5 కిలోల యూరియా, మొత్తం సూపర్ ఫాస్పేట్, మ్యూరెట్ ఆఫ్ పొటాష్ లను వేయాలి. 30 రోజుల తరువాత 53 కి. యూరియాను, 50-55 రోజులకు 26.5 కి. యూరియాను పైపాటుగా అందించాలి.
కాంప్లెక్స్ ఎరువుల రూపంలో ఎకరాకు, 65 కిలోల యూరియా + 52 కిలోల డిఎపి + 34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందించాలి. దానిలో ఆఖరి దుక్కిలో 6.5 కిలోల యూరియా+52 కిలోల డి.ఎ.పి+34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 30 రోజులకు 53 కిలోల యూరియా, 50-55 రోజులకు 26.5 కిలోల యూరియా పె పాటుగా వేసుకోవాలి.
అట్రాజిన్ అనే కలుపు నివారిణి మందును ఎకరాకు 600-800 గ్రా, చొప్పన 250 లీటర్ల నీటిలో కలిపి లేదా 3-4 గ్రా. లీటరు నీటికి కలిపి విత్తిన 3 రోజుల లోపు తేమ నేల మీద పిచికారీ చేయాలి.
ఈ రసాయనాన్ని 2-2.5 గ్రా. లీటరు కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 250 లీ. పిచికారి ద్రావణం సరిపోతుంది. పిచికారి చేసిన తరువాత, తేలికపాటి తడి యిచ్చి ఎకరాకు 20 కిలోల యూరియా వేసినట్లయితే పంట మామూలుగా అవుతుంది.
మొక్కజొన్న పంట మొదట 30 రోజులు వరకు అధిక తేమను తట్టుకొనలేదు కాబట్టి కాలువలు ఎక్కువగా ఉన్ననీటిని పొలం నుండి బయటకు తీసి వేయండి.
మంచి నీటి వసతి ఉంటే భూ స్వభావాన్ని బట్టి (ఇసుక నేల, ఎర్రనేల, నల్ల నేలలు) 10, 15, 20 రోజులకు ఒక్క సారి యివ్వండి. ఒక వేళ పరిమితి నీటి వసతి వుంటే తడులు కంకి వేసినప్పడు, గింజ పాలు పోసుకొనేటప్పడు, గింజ చెందే దశలో యివ్వండి.
మొదట ఎక్కువగా ఉన్న నీటిని మరుగు కాలువల ద్వారా బయటకు తీసి వేయాలి. భూమి కొద్దిగా ఆరిన తరువాత అంతరకృషి చేసి భూమికి గాలి తగిలేటట్లు చూడాలి. ఒక శాతం యూరియా అంటె 10 గ్రా. లీటరు నీటికి కలిపి పంట మీద పిచికారి చేయండి లేదా ఎకరానికి 20-25 కిలోల యూరియాను పై పాటుగా పంటకు అందించండి.
బలంగా ఉన్న కంకిని ఉంచి మిగతా వాటిని తీసి వేయండి.
తుంగ మొలకెత్తిన 20 రోజుల తరువాత, ఒక లీటరు నీటికి 10 మి.లీ. గైఫోసేట్ + 10 గ్రా. యూరియాను కలిపి, కలుపు మొక్కలు బాగా తడిచేటట్ల పిచికారి చేయాలి. ఎకరానికి 250 లీటర్ల నీరు పడుతుంది. పిచికారి చేసిన 25 రోజుల తరువాత మాత్రమే నేలను కలియదున్ని కొత్త పంటను వేసుకోవాలి.
మొక్కజొన్న+ కంది 2:1 నిషత్తిలో, మొక్కజొన్న + పెసర / మినుము 1:1 , మొక్కజొన్న -- కూరగాయలు (ముల్లంగి, క్యారట్, యెంతి, కొత్తిమీర, గోరుచిక్కుడు) 1:1 నిష్పత్తిలో అంతర పంటలుగా చేయవచ్చు.
మొక్కజొన్నను కొబ్బరి తోటలో అంతర పంటగా తీసికోవచ్చా? కొబ్బరితోట వయస్సు 5 సం||ల లోపు ఉన్నట్లయితే మొక్కజొన్నను అంతర పంటగా తీసికోవచ్చును.
పంట కోతకు వచ్చినప్పడు కండిపైన పొరలు ఎండి, గింజ మొదలు భాగాన నల్లటి పొర ఏర్పడి పంట పరిపక్వతను సూచిస్తుంది. కండెలు పక్కకు వాలిపోతాయి. ఆ కండెలను మాత్రమే మొక్కల నుండి వేరు చేసి బాగ ఆర పెట్టాలి. పేలాలు రకం, సాగు చేసినప్పడు గింజల్లో 30-35 శాతం తేమ ఉన్నప్పడే, కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. తీపిరకం వేసినప్పడు గింజలు పాలు పోసుకునే దశలో కండెలు .
ఎండలో ఆరపెట్టి నట్లయితే సరైన పేలాలుగా మారక గింజలు పగిలి నాణ్యత తగ్గుతుంది. అందువలన పేలాల కండెలను నీడలోనే ఆరబెట్టుకోవాలి.
ఏ దశలో కోసుకుంటే మేతగా పనికి వస్తుంది? మొక్కజొన్న 50 శాతం పూత దశలో వున్నప్పడు కోసుకుని పశువుల మేతగా ఉపయోగించవచ్చును.
అక్టోబర్ 15 నుండి నవంబరు 15 వరకు అనుకూలం. కోస్తాలో విత్తనోత్పత్తి కొరకు జనవరి 15 వరకు పంటను తీసికోవచ్చును. తరువాత తీసికొంటే దిగుబడులు బాగా తగ్గుతాయి.
తీపి మొక్కజొన్న రకాలన్నీ బేబికార్న్ సాగుకు అనుకూలం. దీనికి ఎకరాకి 10 కిలోల విత్తనం అవసరం అవుతుంది. 45 X 20 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. కండెల నుండి సిల్కు బయటకు వచ్చిన తరువాత 1-4 రోజుల లోపు కోసుకొని బేబికార్స్గా ఉపయోగించ వచ్చు (సిల్కు పొడవు 1-2 సెం.మీ. ఉంటుంది) కోసిన వెంటనే మార్కెట్‌కు తరలించండి.
వరి మాగాణిలో మొక్కజొన్న వేసుకోవచ్చును. మొదట దేశవాళి నాగలితో దున్నితె పెద్ద పెద్దలు ఏర్పడతాయి. కొద్దిగా ఆరనిచ్చి ట్రాక్టర్‌తో నడిచే తిరిగే దంతిని (రోటావేటరు) ఉపయోగించి దుక్కి చేసి, బోదెలు, కాలువలు వేసికొని బోదెలుకు దూరంగా సాలుకు దగ్గరగా విత్తుకోవాలి. ఎకరానికి 7 కిలోల విత్తనం అవసరం, నీటి వసతి తప్పకుండ ఉండాలి.
జింకు ధాతులోపం వలన యిలా జరుగుతుంది. నివారణకు 2 గ్రా. జింకు సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి (400 గ్రా. ఎకరాకు) రెండు సార్లు 5 నుండి 7 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
విత్తిన 10-12 రోజులకు ఎండోసల్బాన్ 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి పై మందును రెండవ సారి పిచికారీ చేయాలి. పంట 30 రోజులు పై బడినచో కార్బోప్యరాన్ 3 శాతం లేక ఎండోసల్బాన్ 4 శాతం గుళికలను ఎకరాకి 3-4 కిలోల చొప్పున ఇసుకలో కలిపి ఆకు సుడులలో వేసుకోవాలి.
అంతర్వాహిక మందులైన మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఇది మొలక వేరు మరియు కాండం కుళ్ళు, ఈ తెగులు అధిక ఉష్ణోగ్రత వర్షపాతం ఉండి సరైన మరుగు పోయే సౌకర్యం లేనప్పడు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి, పంట అవశేషాలను నాశనం చేయాలి. దాని నివారణకు మెటలాక్సిల్ 4 గ్రా. లేదా కాష్ట్రాన్ 3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి ఎప్పటి కప్పడు నీళ్లు నిలబడకుండా తీసి వేయాలి. ఈ తెగులు కనిపించిన వెంటనే కాప్లాన్ 1.5 గ్రా. లేక కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటలాక్సిల్ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి నేల బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
ఆకు మాడు తెగులు ఆశించినప్పడు ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ఆకులపై పొడవైన కోలాకారపు బూడిదతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ మచ్చ లేర్పడి క్రమేపి ఆకంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ముందు జాగ్రత్తగా మొక్కజొన్న పైరు అవశేషాలు, జొన్న మరియు సూడాన్ జాతి గడ్డి మొక్కలను నాశనం చేయాలి. డి.హెచ్.యమ్-103 మరియు డి.హెచ్.యమ్-105 వంటి రకాలను సాగు చేయాలి. తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం ఆశించే ప్రాంతాల్లో పంటమార్పిడి చేయాలి.
పైరుపై కార్బండజిమ్ 1 గ్రా. లేదా ప్రోపికోనాజోల్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మొక్కజొన్నలో రెండు రకాల వడలు తెగుళ్ళ వలన మొక్కలు ఎండుతాయి. ఆక్రిమోనియమ్ వడలు తెగులు లేదా బ్లాక్ బండిల్ తెగులు ఆశిస్తే ఆకులు, కాండం ఉదారంగుకు మారి కాండం లోపల నల్లగా మారి కణుపుల దగ్గర కాండం కుళ్ళుతుంది.
సెఫాలోస్పోరియమ్ వడలు తెగులు లేదా లేట్ విల్డ్ ఆశిస్తే మొక్కలు పై నుండి క్రిందికి వడలి, ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారి ఎండిపోతాయి.
నివారణకు పంట అవశేషాలను కాల్చి వేయాలి. కిలో విత్తనానికి ధైరమ్ లేదా కాప్లాన్ 3 గ్రా, చొప్పన కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులును తట్టుకొనే రకాలైన డి.హెచ్.యమ్-103, డి.హెచ్.యమ్-105 రకాలను సాగు చేయాలి. పూత దశ నుండి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి మరియు తరచూ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంటమార్పిడి చేయాలి.
ఆధారం: http://www.apagrisnet.gov.in
హైబ్రిడ్ విత్తనోత్పత్తి అనువైన ప్రాంతాలు,విత్తుసమయ...
మొక్కజొన్న వివిధ యజమాన్యపధ్దతులు