పంటకాలాన్ని బట్టి మే నెల చివరి వారం నుండి జూన్ చివరి వరకు నాటవచ్చు. జులై రెండవ పక్షం తర్వాత నాటితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఎంపిక చేసిన కొమ్మలను లీటరు నీటికి 3 గ్రా. మాంకొజెబ్ మరియు 5 మి.లీ. మలాథియాన్ కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు వుంచి తీసి నీడన ఆరబెట్టాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసిన కొమ్మలను బోదెల మధ్య 45-60 సెం.మి. చాళ్లలో 15-20 సెం.మి. ఎడం వుండునట్లు నాటాలి. నల్లని బంకనేలల్లో ఎత్తైన మళ్లను తయారు చేసి 30X15 సెం.మిూ, ఎడం వుండునట్లు నాటాలి.
ఆఖరి దుక్మిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు మరియు 188 ఫాస్ఫేట్ 40 మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి బాగా కలియదున్నాలి. నాటిన 40 రోజులకు 55 కిలోల యూరియా వేయాలి. తరువాత 55 కిలోల యూరియా మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను నాటిన 80 మరియు 120 రోజులకు వేయాలి.
పసుపు మరియు మొక్కజొన్న కలిపి విత్తినపుడు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 315 కిలోల ఫాస్పేట్ మరియు 70 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్మిలో వేసి కలియ దున్నాలి. నాటిన 40 రోజులకు 90కిలోల యూరియా వేయాలి. యూరియా 90 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 35 కిలోల చొప్పున నాటిన 80 మరియు 120 రోజులకు వేయాలి. కావలసిన పోషక పదార్ధాలలో 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా ఇవ్వడం వలన ఎండిన పశువు శాతం మరియు పసుపు రంగు శాతం ఎక్కువగా వుండటమే గాక దుంపకుళ్ళు చాలా వరకు నివారించవచ్చు. ఆకులు తెలుపు రంగులోకి మారి ఆకుల చివర నుండి ఎండినట్లుంటే ఇనుపధాతులోపంగా గుర్తించి, నివారించుటకు 0.3 శాతం అన్నబేధి మరియు ఒక కాయ నిమ్మరసాన్ని 3-4 సార్లు 6 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
పసుపు, అల్లం పంటలకు విత్తనము మరియు భూమి ద్వార సంక్రమించే శిలీంద్రముల వలననష్టం కలుగుతున్నది. టైకోడర్మా విరిడి అనే శిలీంద్రమును ఉపయోగించి భూమిలో ఉన్న హానికరమైన శిలింద్రమును నిర్మూలించి మొక్కల వేరు వ్యవస్థకు రక్షణ కవచంగా ఏర్పడి మొక్కను సంరక్షించవచ్చును. పచ్చిరొట్ట ఎరువులు, వేపచెక్క ఆముదం, పిండి పశువుల ఎరువుల వాడకం ద్వారా ఈ శిలింద్రమును చెంది భూమిలో ఎక్కువ కాలం ఉంటుంది.
పసుపు పంటను వేసుకునే ముందు పశువుల ఎరువులో చెందిన టైకోడర్మాను నాగలి చాళ్ళలో చల్లి త పసుపు కొమ్మలను పెట్టుకునేటట్లయితే దుంప కుళ్ళను చాలా వరకు నియంత్రించవచ్చు.
పసుపులో రెండు రకాల ఆకుమచ్చలున్నాయి. ఈ నెల మధ్య వరుసలలో మచ్చలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి యొక ఆకుమచ్చ చాలా తీవ్రమైనది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు అండాకారంలో మొదలై క్రమేపి పెద్దవై ఆకంతా ఎండిపోయేలా చేస్తుంది. ఈ తెగులు నివారణకు కార్బెండజిమ్ 1 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారీ చేయాలి.
అల్లం పంటను ఏప్రిల్ నెలాఖరు నుండి మే మొదటి పక్షం వరకు నాటుకోవచ్చు. విత్తటం ఆలస్యం అయితే దుంపకుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. ఎకరాకు 350 కిలోల విత్తనం అవసరం. విత్తన దుంపలను లీటరు నీటి 3 గ్రా.ల చొప్పున మాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి విత్తనశుద్ధి చేయాలి. ఎర్రనేలలు, చల్కా భూములు మరియు గరప నేలలు అనుకూలం బరువైన బంక మట్టి నేలలు అల్లం సాగుకు పనికి రావు. తగినంత మురుగు నీటి వసతి కలిగి వుండాలి.
ప్రాంతాన్ని బట్టి విత్తనం సేకరించాలి. మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సిద్ధిపేటరకం, కోస్తా ప్రాంతానికి ఖైరి, తుని మరియు నర్సీపట్నం మొదలైన స్థానిక రకాలు అనువుగా వుంటాయి. ఇవి కాక రియో-డి-జెనిరో, వి1యస్.1-8, వి8యస్. 1-8 మరియు వి2ఇ5-2
ఎంపిక చేసిన దుంపలను నేల స్వభావాన్ని ఎత్తైన మళ్ళను తయారు చేసి నాటాలి. నీటి పారుదల మరియు మురుగు నీటి కాల్వలను ఒక దాని ప్రక్కన ఒకటి వుండేట్లు చేయాలి. లేని పక్షంలో బోదెలు, కాలువలు 45 సెం.మీ. ఎడంలో ఏర్పాటు చేసి బోదెలపై నాటుకోవచ్చు. దుంపల మధ్య 15 సెం.మీ. దూరం వుండాలి. దుంప నాటిన వెంటనే మొక్కజొన్న అలసంద మరియు ఆముదం వంటి పంటలను వేసి తగినంత నీడ కల్పించాలి. లేదా మళ్ళకు ఏర్పాటు చేయాలి. కొబ్బరి, అరటి, నిమ్మ తోటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు.
ఆరోగ్యవంతమైన తెగులు సోకని విత్తనాన్ని ఎన్నుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. కిలో విత్తనాన్ని మందు ద్రావణంలో 20-30 నిమిషాలు నానబెట్టి, నీడలో ఆరబెట్టి తరువాత విత్తుకోవాలి.
పొలంలో నీరు నిలవ ఉండకుండా చూడాలి. తెగులు సోకినపుడు కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి తెగులు సోకిన మొక్కలకు, చుటూ ఉన్న 4-5 మొక్కలకు మరియు వరసల్లోని మొక్కల మొదళ్ళ దగ్గర భూమి తడిచేలా మందు ద్రావణం పోయడం వల్ల దుంపకుళ్ళు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
ధనియాలు వర్ష ఆధారము క్రింద ఉన్న నల్ల రేగడి నేలల్లో, నీటి వసతి క్రింద గరపనేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలిక పాటి నేలల్లో అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుకోవచ్చు. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల, క్షార లక్షణాలు గల భూములు పనికి రావు.
కొత్తిమీర మరియు గింజ కొరకు సంవత్సరం పొడవునా సాగు చేయుటకు సాధన అనే రకం అనువుగా వుంటుంది. విత్తనం కొరకు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం ఫారం, గుంటూరు వారిని సంప్రదించండి.
ఇందు కొరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గింజ ఏర్పడిన తరువాత బూడిద తెగులు ఆశించినచో గంధకం పొడి చల్లకుండా, కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలపై 60 శాతం గింజలు పక్వాని కొచ్చినప్పడు పంట కోసుకొని 2-3 రోజులు పొలంలోనే ఆరనిచ్చి నూర్చుకోవాలి.
ఆధారం: www.apagrisnet.gov.in