హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / అంతర పంటల సాగు – ప్రాముఖ్యత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర పంటల సాగు – ప్రాముఖ్యత

సర్వసాధారణంగా రైతులు ఒక కాలంలో ఒకే పంటను సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరిత్యాలు, చీడపీడల బెడద వల్ల పంట నష్టపొతే రైతు ఆర్ధిక పరిస్ధితి దెబ్బతింటుంది. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 800 నుండి 1100 మి.మీ వర్షపాతం కురుస్తుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో రెండు లేదా మూడు పంటలను ఒకేసారి సాగుచేయవచ్చు. రెండుగానీ, అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగుచేస్తే అంతర పంటలు అంటారు. ఆ అంతర పంటల క్రమంలో ఒకటి ప్రధానపంట, రెండవదీ అంతర పంట.

అంతర పంటల సాగులో ప్రయోజనాలు

ఒక పంట నష్టపోతే రెండవ పంట నుండి రాబడి సంపాదించి, నష్టాన్ని భర్తీ చేయవచ్చు. రైతు పొలం నుండి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పోషక పదార్ధాల వినియోగ సామర్ధ్యం పెంచవచ్చు. కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని పంటల మధ్యనున్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేల కోతను అరికట్టవచ్చు. పంటల నాణ్యతను పెంచవచ్చు. పుష్పజాతి మొక్కలను, గడ్డిజాతి ధాన్యపు మొక్కలతో పెంచడం వల్ల భుసారాన్ని పెంచవచ్చు. సరైన పద్ధతిలో సరైన పంటల్ని ఎన్నుకొని అంతర పంటలుగా పండించడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు.

అనువైన అంతర పంటలు

నేల నుంచి పోషక పదార్ధాలు, నీరు గ్రహించే లోతులో వ్యత్యాసం ఉండే వెళ్ళ నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి. ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి. పోషక పదర్ధాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటి ఉండకూడదు. వేర్వేరూ కాలపరిమితులలో ఉన్న పంటలను, కలపడం వల్ల పోషక పదార్ధాల అవశ్యకతలో తేడాలవల్ల, కీలక దశల్లో పోటి ఉండకుండా ఆరోగ్యంగా పెంచవచ్చు. బహువార్షిక పంటలైన ఉద్యాన పంటల తొలుత నాలుగైదు ఏళ్ళ వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో పంటలు పండించవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి రెండు కంటే ఎక్కువ పంటలను వివిధ అంతస్తుల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటపై ఆకర్షించి చీడపీడలబారి నుండి ప్రధాన పంటను రక్షించవచ్చు.

అంతర పంటగా పప్పుధాన్యాల పంటలతో ఎన్నో లాభాలు

పప్పుధాన్యాల పంటలు రాల్చిన ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పప్పుధాన్యాల పంటలు వాతావరణంలోని నత్రజనిని రైజోబియం వేరుబుడిపెల ద్వారా స్ధిరీకరించి భుసారాన్ని పెంచుతాయి. అంతేకాక అన్ని పప్పుధాన్యాల ఉత్పత్తికి దోహదపడి లభ్యత పెరిగి కొరతను తగ్గిస్తాయి. తోడుగా రైతుకు ఆర్ధిక వెసులు బాటు కలుగుతుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.99373040752
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు