హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / ఆముదం పంటను ఆశించే తెగుళ్ళు - నివారణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆముదం పంటను ఆశించే తెగుళ్ళు - నివారణ

ఆముదం పంటను ఆశించే తెగుళ్ళు.

తెలంగాణ రాష్ట్ర పర్షాధారంగా సాగుచేసే నూనెగింజలు పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. ఆముదం పంటను రకరకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. వీటిలో మెలిక కుళ్ళు, ఎండు తెగులు, బూజు తెగులు ముఖ్యమైనవి. ఈ తెగుళ్ళను తొలిదశలోనే గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారు.

మెలిక కుళ్ళు తెగులు

ఖరీఫ్ లో ఆముదంను ఆశించే తెగుళ్లులో మెలిక కుళ్లు ముఖ్యమైనది. ఈ తెగులు నెలలో జీవించే "పైథోపితోరా" అనే శిలీముద్రం వలన కలుగుతుంది. ఆముదం పంటలో ఈ తెగులును జూన్ రెండవ పాశం నుండి సెప్టెంబరు వరకు మెలకెత్తదు. విత్తనం మొలకెత్తిన తరువాత బిజదళాలపే మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతాయి. ముదురు ఆకుల పై, కందం పై పెద్ద మచ్చలు ఏర్పడి మొక్క చనిపోతుంది.

నెలలు సమల్గా లేని పొలాలలో మరియు ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది.

నివారణ: ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి 3-4 గ్రా. ధైరామ్ లేదా మెతలాక్సిల్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

  • కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా మెతలాక్సిల్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మెదళ్లు తడపాలి.
  • పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

ఎండు తెగులు

ఎండు తెగులు ఆముదం పైన అన్ని దశంలో వచ్చే అవకాశం కలదు. ముఖ్యంగా పంట విత్తిన 20-60 రోజుల దశలో నెలలో ఫూజేరియం అనే శిలీముద్రం ద్వారా సంక్రమిస్తుంది. ఆముదం పంటను ఒకే పొలంలో ఎక్కువ కలం సాగు చేయడం వాళ్ళ ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. తెగులు సోకినా మొక్క ఆకుల నెమ్మదిగా లేదా హఠాత్తుగా పసుపు వత్ననికి మరి వాడిపోతాయి. ఈ ఆకులూ మొక్క నుండి వేలాడుతూ పైకి ముడుచుకొని ఉంటాయి. ఆకులూ ఎండిపోయి పూర్తి మొక్క గని, కొన్ని కొమ్మలు గాని చనిపోవడం లోపల కణజాలాలు కుళ్లి కందం పై భాగానికి కూడా వ్యాపిస్తాయి. ఈ దశంలో కొమ్మ మరియు కాండం పై భాగాలూ పరిశీలించినపుడు వాటి పై శిలీముద్రం నెల మరియు పంట అవశేషాలలో జీవిస్తుంది.

నివారణ: ఎండు తెగులు నివారణకు కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ట్రైకోడెర్మా వీరిదే శిలింద్రాన్ని 2.5 కిలోల పొందిన 125 కిలోల పశువుల ఎరుపు మరియు 2 కిలోల వేపపిండితో కలిపి 15 రోజుల మురగబెట్టి ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి చల్లుకోవాలి. తెగులును తట్టుకునే పి.సి.హెచ్-111 , పి.సి.హెచ్-222  రకాలను సాగుకు ఎంచుకోవాలి. తెగులు సోకినా వెంటనే కార్బండజిమ్ 2 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మెడలిలో పోయాలి. తెగులు సోకినా మొక్కలను పైకి నాశనం చేయాలి.

  • ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి.
  • పంట మార్పిడి పద్దతిని కనీసం 2-3 సం. ఒకసారి సజ్జ లేదా జొన్న పంటలతో పాటించాలి.
  • అంతర పంటగా కంది వేయటం ద్వారా కొంత వరకు తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.

బూజు తెగులు లేదా కాయ కుళ్ళు తెగులు

ఆముదం గెలల్లో కాయలు ఏర్పడే సమయంలో గాలిలో తేమ అధికంగా ఉంది రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మరియు ఎడతెరిపి లేకుండా 5-6 రోజులు తుపాను వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకినా గెలల కాయల పై దూది పింజలా లాంటి బూడిద పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకినా కాయలు మెత్తబడి, కుళ్లిపోయి రాలిపోతాయి. కంకి కాదా పై మరియు శాఖల పై కూడా తెగులు ఆశించడం వలన విరిగి పడిపోతాయి.

నివారణ: బూజు తగులు నివారణకు కిలో విత్తనానికి 3-4 గ్రా. కార్బండజిమ్ కలిపి విత్తిన శుద్ధి చేయాలి. పొలంలో మొక్కల వరుసల మధ్య కనీస దూరం 90 సెం.మీ. పాటించాలి. తుపాను సూచనలు తలిసిన వెంటనే వర్షానికి కనీసం 6-8 గంటల ముందు 1 మీ.లి. ప్రొపికోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వర్షాలు పడిన తరువాత మరోసారి పిచికారి చేసి ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్ ఎరువులను పై పాటుగా వేయాలి. తెగులు సోకినా గెలలను ఏరి పొలానికి దూరంగా వేసి తగులబెట్టాలి.

ఈ విధంగా సూచనల పాటించినట్లయితే ఆముదంలో తెగుళ్లను నివారించడమే గాక అధిక దిగుబడులు సాధించవచ్చు.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.08333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు