జీవుల జీవన గమనానికి ఆహారం చాలా ప్రధానమైనది. ఈ ఆహారం కొరకు మనందరం కష్టపడి పనిచేసి సంపాదించుకొని తినడం ద్వారా మన ఆకలిని తీర్చుకోగలుగుతున్నాం, విశాంతి పొందుతున్నాం. కానీ మనలో చాలా మందికి మనం ఎలాంటి ఆహార పదార్థాలను తింటున్నామో సరిగ్గా తెలియదు. మనం తినే ఆహార పదార్థాలు, రసాయన పదార్ధాలు, రంగులు, అద్దకాలతో కలిసి ఉంటున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి కలుషితమైన ఆహార పదార్థాలు కలిగిన కూరగాయలు, పళ్ళను తినడం ద్వారా ఆరోగ్యానికి బదులుగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
సాధారణంగా వేసవి కాలంలో ముఖ్యంగా కూరగాయలు, పళ్ళు కలీ అవుతుంటాయి. కూరగాయలు అధిక ఉష్ణోగ్రతలకు తొందరగా వాడిపోయినట్లు కనబడకుండా చూడగానే ఆకువచ్చగా, ఆకర్షణీయంగా, తాజాగా కనపబడానికి వాటిని వివిధ రంగులలో మంచి తీస్తారు.
కూరగాయలలో ముఖ్యంగా ఆకుపచ్చ రంగులో ఉండే కాకర, బెండ, పాలకూర, బరాణి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకొని కలీ చేస్తున్నారు. కూరగాయలు తాజాగా కనిపించడానికి మలానైట్ గ్రీన్ అనే ఆకుపచ్చని రసాయనంలో, వివిధ పురుగు మందులలో, ఇతర రసాయనాలలో ముంచి తీస్తారు. చివరగా వీటిపై మైనపు పూతను పూస్తారు. ఇలాంటి చర్యలు అన్ని కూడా కూరగాయలు తాజాగా కనబడడానికి అమ్మకాలు బాగా జరగడానికి దోహదం చేస్తుంది.
పళ్ళను మగ్గపెట్టడానికి ముఖ్యంగా కాలియం కార్బైడ్ అనే రసాయన పదార్గాన్ని వినియోగిస్తున్నారు. ఇదే కాలియం కార్బైడ్ ను గ్యాస్ వెల్డింగ్ ద్వారా ఇనుప పరికరాలను అతికించడానికి, చవకగా లభించే టపాసుల తయారీకి వినియోగిస్తారు. కాలియం కార్బైడ్‌లో ఆర్సెనిక్, ఫాస్పరస్ అవశేషాలు ఉన్నాయి. ఇవి ఎసిటిలీన్ వాయువును విడుదల చేసి పళ్ళను త్వరగా పక్వానికి రావడానికి, పెరుగుదలకు హార్మోన్లు కలిపిన రసాయన ద్రావణాలలో మంచి తీస్తారు. మన దేశంలో ముఖ్యంగా అరటి పళ్ళను మగ్గపెట్టడానికి రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటిని తినడం ఆరోగ్యానికి చాలా చాలా హానికరం. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి పళ్ళను తినిపించరాదు.
నిరంతరం రసాయనాలు పూసిన, కృత్రిమంగా మగ్గబెట్టిన కూరగాయలను, పళ్ళను తినడం ద్వారా నోటిలో అల్సర్లు, ఉదర సంబంధ సమస్యలు, అతిసారవ్యాధి, చర్మం మీద దదుర్లు వస్తాయి. రసాయనాలలో ఉండే ఫ్రీ రాడికల్స్ వలన యుక్త వయస్సులో వృద్దాప్య ఛాయలు వస్తాయి. క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులు, గుండెనొప్పి, కీళ్ళనొప్పి, అలర్జీలు వస్తాయి. ఒకవేళ గర్భంతో ఉన్న స్త్రీలు కృత్రిమంగా మగ్గబెట్టిన పళ్ళను తిన్న ఎడల గర్భస్రావం, పెరుగుదల లోపించిన శిశువు జన్మించడానికి అవకాశం ఉంది.
ఆహార పదార్థాలు కల్లీ కాకుండా ఉండడానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ మన ఆరోగ్య పరిరక్షణకు తినే ఆహారం కలీ జరిగిందా లేదా అని తెలుసుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
పచ్చిమిరప, ఆకుపచ్చని కూరగాయలలో కల్లీని గుర్తించడం : కూరగాయలలో ఆకుపచ్చ రంగును, తాజాగా కనిపించడానికి వాటిని మలాసైట్ గ్రిన్ అనే ఆకుపచ్చని రసాయన ద్రావణంలో మంచి తీస్తారు. దీనిని ఇలా ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రసాయనాన్ని గుర్తించడానికి కొంత దూదిని తీసుకొని పారాఫిన్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి కూరగాయల ఉపరితలంపై రుద్దాలి. ఒకవేళ దూది ఆకుపచ్చ రంగుకు మారితే ఆ కూరగాయ మలాసైట్ గ్రీన్ రసాయనంతో కలీ చేయబడినదిగా గుర్తించాలి.
పచ్చిబఠాణి : గుప్పెడు బరాణి గింజలను తీసుకొని ఒక గ్లాసులో వేసి నీరుపోసి బాగా కలపాలి. ఒక అరగంట సేపు అలాగే కదపకుండా ఉంచితే బరాణి రంగు నీటిలో కలిసిపోతుంది.
చిలగడదుంప : చిలగడదుంప మంచి రంగులో కనపడడానికి తాజాగా ఉంచడానికి రోడోమైన్ - బి అనే రంగుతో కలీ చేస్తారు. దీనిని గుర్తించడానికి కొద్దిగా దూదిని తీసుకొని పారఫిన్ ద్రావణంలో నానబెట్టి చిలగడదుంప ఉపరితలంపై రుద్దాలి. దూది ఎరుపు రంగులోకి మారితే ఆ చిలగడదుంప కల్లీ చేయబడినదిగా గుర్తించాలి.
పుచ్చకాయ, ఆపిల్, బత్తాయి, ఇతర పళ్ళలో కల్లీని గుర్తించడం : పచ్చకాయ, ఆపిల్, బత్తాయి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్ ద్వారా లోపలికి ఎక్కించి కలీ చేస్తారు. ఈ విధమైన కలీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్ లేదా వెనిగర్ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి. తరువాత ఆ కాయను అలాగే రెండు రోజులు ఉంచాలి. కాయలోపలికి ఏమైన కృత్రిమ ఎక్కించినట్లయితే అది పులిసిపోయి వాసన వస్తుంది. రంధ్రాల నుండి నురుగుతో కూడిన నీరు కారుతుంది.
అరటిలో కల్లీని గుర్తించడం : సహ అరటి పండ్లు ముదురు పసుపు వర్ణంలో ఉండి చిన్న చిన్న గోధుమ లేదా నలుపు మచ్చలు ఉంటాయి. కాడలు నలుపు రంగులో ఉంటాయి. కాలియం కార్బైడ్‌తో కృత్రిమంగా పండిన పండ్లు నిమ్మపసుపు రంగులో ఉండి కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయ మొత్తం పసుపు వర్ణంలో ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. రుచి సరిగ్గా ఉండదు. తక్కువ రోజులు నిలువ ఉంటాయి.
మామిడిలో కల్లీని గుర్తించుట : మామిడి పండ్లు మంచివా లేదా కలీవా అని తెలుసుకోవడానికి వాటిని ఒక బకెట్ నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ మామిడి పండు నీటిలో మునిగినట్లయితే ఆ పండ్లు సహజంగా పండినవిగా గుర్తించాలి. ఒకవేళ అవి నీటిలో తేలియాడినట్లయితే వాటిని కృత్రిమంగా మగ్గబెట్టినవిగా గుర్తించాలి. కృత్రిమంగా పండించిన పండ్లలో రసాయనాలు పండు మొతానికి చేరలేవు ఫలితంగా పండ్లు పసుపు రంగులోకి మారిన పండ్లలో ఉన్న చక్కెర పదార్ధాలు పక్వానికి రావు. అలాంటివి రుచిగా ఉండవు. సహజంగా పండిన పండ్లతో పోల్చినప్పుడు కృత్రిమంగా పండిన పండు ఎండిపోయి, రసం తక్కువగా ఉంటాయి. కృత్రిమంగా పండిన పండ్లలో మంచి వాసన కూడా రాదు.
కూరగాయలు, పండు పక్వానికి వచ్చే ప్రక్రియ : కాయలు పక్వానికి రావడం అనేది ఒకేసారి జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పూత నుండి పిందెలు ఏర్పడి కణ విభజన జరిగి కాయలు పెద్దగా ఏర్పడతాయి. పిండం పరిణితి చెంది విత్తనాలు ఏర్పడి నిలువ చేయబడి ఉంటాయి. ఇలా తయారయిన కాయలు పక్వానికి రావడం ప్రారంభమవుతుంది. కాయలలో ఉన్న పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు కాయ నిర్మాణంలో రంగు రుచి మంచి వాసనను కల్పించడంలో తోడ్పడతాయి. కాయలు పక్వానికి రావడానికి మొక్కల్లో ఉండే ఇథిలీన్ అనే హైడ్రోకార్బన్ తోడ్పడుతుంది. ఈ వాయువు కాయలన్నింటికీ వ్యాపించి పక్వానికి రావడానికి తోడ్పడతాయి. ఫలితంగా కాయలపై క్లోరోఫిల్ తొలగిపోయి కొత్త వర్ణద్రవ్యాలు ఏర్పడి ఆకుపచ్చ రంగునుండి ఎరుపు లేదా పసుపు లేదా ఇతర రంగులకు మారతాయి. కాయల్లోని ఆమ్లత్వం తొలగి తుది స్థితికి చేరుతుంది. పిండి పదార్థాలను అమైలేస్ చక్కెరలుగా మారతాయి. ఈ చర్యల వలన కాయలు పక్వానికి వస్తాయి. అయితే కూరగాయలను కాయదశలో పండ్లను మగ్గిన దశలో ఉపయోగిస్తుంటారు.
కాయలను మగ్గబెట్టడానికి సరైన పద్ధతులు: కాయలను సరిగ్గా మగ్గబెట్టడానికి ఈ రోజుల్లో రైతులకు అనేక పద్ధతులు ఉన్నాయి. సాధారణంగా కాయలు ఎన్నిరోజుల్లో పక్వానికి వస్తాయో ఆ పండ్లమీద, అక్కడ పరిస్థితులు మీద ఆధారపడి ఉంటుంది. సహజ పరిస్థితుల్లో చెట్లనుండి విడుదలయ్యే ఇథిలీన్ వాయువు కాయలు మగ్గడానికి దోహదపడతాయి.
ఇంట్లో సులభమైన పద్ధతి ద్వారా కాయలను మగ్గబెట్టవచ్చు. ఒక అట్టపెట్ట తీసుకొని దానిలో పండిన పండ్లను, పండించవలసిన పండ్లను పండ్లు విడుదల చేసే ఇథలీన్ వాయువు వలన ఇతర కాయలు కూడా తొందరగా మగ్గుతాయి.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక