హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / ఖరీఫ్ సజ్జ సాగులో మెళకువలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఖరీఫ్ సజ్జ సాగులో మెళకువలు

ఖరీఫ్ సజ్జ సాగులో మెళకువలు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాతావరణ పరిస్ధితులలో రైతులు విభిన్నమైన పంటలను సాగు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఉష్ణోగ్రతలు పెరగటం మరియు వర్షాభావ పరిస్ధితులు ఏర్పడటం వల్ల రైతులు పంటల సరళి మార్చుకోవాల్సి ఉంది. ఇతర పంటలకు భిన్నంగా ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టాను తట్టుకునేదిగా సజ్జ సాగు లాభదాయకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువగా సన్నని తెల్లబియ్యం ఆహారంగా తీసుకునేవారిలో ఇనుము వంటి పోషకం సరిగా అందటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్ధ వెల్లడి చేసింది. దీనితో ఇనుపధాతు లోపం వల్ల రాష్టహీనత వంటి రోగాలతో సతమతముతున్నారు. సజ్జలో అధికంగా ఇనుము, ఫోలేట్ వంటి పోషకాలున్నాయి. ఇవి ఆహారంగా తీసుకోవటం చాల అవసరం.

రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్న తరువాత సజ్జ ప్రధానమైన ఆహారపు పంట. సజ్జ పంటను మెత్త ప్రాంతాల్లో తక్కువ సారవంతమైన నెలల్లో సాగు చేయటం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి. సజ్జ ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచుటకు రకాలను ఎంపిక చేసుకోవటం, మేలైన యాజమాన్య పద్దతులను పాటించటం ఎంతో అవసరం. రాష్ట్రంలో సజ్జ సాధారణ విస్తీర్ణం సుమారుగా 2500 హెక్టార్లు కాగా అసలు సాగు విస్తీర్ణం  1000 హెస్టర్లు వరకు ఉంది.

ఇందులో మఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో సాగవుతోంది.

 • సజ్జ సాగుకి సుమారుగా 400-450 మి.మీ. వర్షపాతం అవసరం. తేలికపాటి ఎర్రనేలలు ఖరీఫ్ సాగుకి అనుకూలం.
 • నల్లరేగడి నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు కానీ నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. నీరు నిలువ ఉంటే మొక్కలు సరిగ్గా ఎదగవు. తొలకరి వర్షాలు పడిన వెంటానే ఖరీఫ్ లో జూన్ మొదటి వారం నుండి జులై రెండవ వారంలోపు విత్తుకోవాలి. విత్తటం ఆలస్యమైతే తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 • ఎకరానికి 1.6 కిలోల విత్తనం అవసరం.
 • పి.హెచ్.బి-3 , హెచ్.హెచ్.బి-67 , ఐ.సి.యం.హెచ్-356 , ఐసిటిపి - 8203 (కంపోజిట్) రకాలను ఎంపిక చేసుకోవచ్చు.
 • పై సంకర రకాలు సుమారుగా 10-12 క్వింటాళ్ళ దిగుబడినిస్తాయి. మరియు 80-85 రోజులలో కోతకు రావటంతో పాటుగా 8-10 క్వి. పశుగ్రాస దిగుబడి వస్తుంది.
 • విత్తే ముందు 2% ఉప్పునీటి ద్రావణంలో విత్తనాలను 10 ని. లు ఉంచటం ద్వారా ఎర్గట్ శిలింద్ర అవశేషాలను తొలగించవచ్చు. తడి ఆరిన తర్వాత కిలో విత్తనానికి 6 గ్రా. మెతలాక్సీలతో విత్తనశుద్ధి చేయటం ద్వారా వెర్రి తెగులును నివారించుకోవచ్చు.
 • లోతు దుక్కి చేసుకోవటంతో పాటుగా దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 800 గ్రా. పాస్పోబాక్టీరియం కూడా వేసుకోవటం అవసరం.
 • విత్తుకోవటానికి కల్టివేటర్/నాగలి సహాయంలో 45 సెం.మీ. ఎడంతో, 16 సెం.మీ. ఎత్తులో బోదెలను తాయారు చేసుకోవాలి. విత్తేటప్పుడు దుక్కిలో వర్షాధార పంటకు 12 కిలోల నత్రజని + 12 కిలోల భాస్వరం + 8 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి.
 • బోదెల పై విత్తనాలను 12-15 సెం.మీ. ఎడంతో గొర్రుతో విత్తుకోవాలి. తద్వారా వర్షాకాలంలో అధిక వర్షపాత పరిస్ధితులలో మెలిక పాడవకుండా ఉంటుంది.
 • నారు పోసి, 15 రోజుల వయసు గల నారు మొక్కలను నాటుకోవచ్చు. ఎకరాకు 58,000-72,000 మొక్కలు ఉండాలి. వర్షాభావ పరిస్ధితుకున్నట్లయితే విత్తిన వెంటనే నీటి తడి ఇచ్చుకోవాలి.
 • విత్తిన 48 గంటలలోపు అట్రాజిన్ కలుపు మందును 4 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి తేమ పై పిచికారి చేయాలి. విత్తిన మూడు వారాల వరకు నీరు నిల్వ యందుకుండా చూసుకోవాలి.
 • విత్తిన 3 వారాల లోపు మొక్కలను కుదురుకు 1-2 మొక్కలు ఉంచి పలుచన చేసుకోవాలి. తద్వారా ఎక్కువ కంకులు ఏర్పడే పిలకలు వస్తాయి. విత్తిన నెల రోజులకి కలుపు తీసి, తేమలో 12 కిలోల నత్రజని అందించే ఎరువును వేసుకోవాలి. మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది.
 • సాధారణంగా ఖరీఫ్ లో సాగు చేయనప్పుడు నీరు కట్టాల్సిన అవసరం రాదు. కానీ వర్షాభావ పరిస్ధితులలో క్లిష్ట దశలలో పూత, గింజ ఏర్పడు దశ, గింజ నిండుకునే దశలలో నీటి తడులు ఇవ్వాలి.
 • సజ్జలో వెర్రికంకి తెగులు వచ్చే లక్షణాలు ఎక్కువ. తెగులు నొక్కినా మొక్కల్లో ఆకులూ పుష్పగుచ్ఛంగా ఏర్పడి మొక్క గిడసబారి పోతుంది. విత్తిన 21 రోజులకు తెగులు సోకినా మొక్కలు 5% మించి ఉంటే మెతలాక్సిల్ 35 డబ్య్లు.ఎస్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • పూత దశలో తేనెబాంకా తెగులు వస్తుంది. తెగులు సోకినా కంకి నుండి తేనె వంటి ద్రావణం కారుతుంది. మబ్బులతో కూడిన వాతావరణం మరియు వర్షపు తుంపరణ ఈ తెగులు వ్యాప్తిని పెంచుతాయి. దీని నివారణకు పూత దశలో కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
 • మొక్క ఆకుల పై దారపు కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు హెక్సాకోనజోల్ 2 మీ.లి. లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • కత్తెర పురుగు సోకే ప్రాంతాలలో పిల్ల పురుగుల నివారణకు క్లోరి పైరిపాస్ 2.5 మీ.లి.  లేదా స్పైనోషద్ 0.3 మీ.లి. లేదా ఇమామేక్తిన్ బెంజోయెట్ 0.4 గ్రా  స్పైనోషద్ 0.5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • కత్తెర పురుగు పెద్ద పురుగుల నివారణకు ఇండక్షకార్బ్ 1.0 మీ.లి. లేదా విషపు ఎర (10 కిలోల తేడు + 2 కిలోల బెల్లం + 100 గ్రా. డయేదికార్బ్) ను తాయారు చేసుకొని సాయంత్రం వేళల్లో వెదజల్లాలి.
 • కొన్ని ప్రాంతాలలో చెదలు నివారణకు 2 శతం మిథైల్ పరచియం పొందిన ఎకరాకు 9 కిలోళ్ళు చొప్పున కలిపి దుక్కిలో వేసి కలియదున్నాలి.
 • పంట తొలిదశలో మిడతలు నివారణకై ఎకరాకు 8-10 కిలోల చొప్పున పొడి మందును చళ్లలో. సజ్జలో పశులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. సకాలంలో పాశల బెడద నివారించలేని పాశంలో సజ్జ దిగుబడులు తగ్గుతాయి.
 • సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కండపు కంకి మీదట కోతకు వస్తుంది. కాబట్టి 2-3 దశల్లో కాకులు కోయాల్సి ఉంటుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతి కట్టి, తూర్పార పట్టి గింజలను  నిల్వ  చేసుకోవాలి.
 • పంట కోతను ఆలస్యం చేయకూడదు. సజ్జ గింజకూ ఎక్కువ రోజులు పురుగు పర్రకుండా ఉండే లక్షణం ఉంది. గింజ  నిల్వకు తేమ శాతం 12% కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.95833333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు