অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జామతోటల సాగులోనులిపురుగులబెడద-సమగ్రయాజమాన్య పద్దతులు

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో మామిడి, అమ్మ, అరటి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగుబడి చేయబడే పండ్లతోట జమ పంట. అధిక పోషక విలువలు కలిగి వుండడం వలనీ ఆమఖ “వేదవాడి యాపిల్ పండు” అంటారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు దాదాపు 12,000 హెక్టార్లలో జామ పంటను సాగు చేస్తూ హెక్టారుకి సుమారు 15 మెట్రిక్ ఉన్నటివరకు దిగుబడిని సాధిస్తున్నారు. దేశ ఉత్పత్తిలో దాదాపు 28 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోంది అనే విషయం ఈ రాష్ట్రాలలో ఈ పంట యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

జామ తోటల సాగులో అధిక దిగుబడి సాధించడానికి సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం. జామ సాగులో సాధారణంగా కనిపించే పండు ఈగ, పిండి వడ్డి, పాసు పురుగు మయు ఎండుతెగులులాంటి చీడపీడలకు సంబంధించిన సస్యరక్షణ చర్యలగురించి తెలుగు రైతులకు చాలా వరకు అవగాహన వుంది. అయితే గత 2 - 3 సంవత్సరాలుగా తెలుగు ర్యాలలో రైతులు జామ తోటల్లో మరియు పర్సరీలలో హఠాత్తుగా ఆకులు పచ్చబారి, మొక్కలు వాడిపోయి, చెట్టు ఎండిపోవడం లాంటి లక్షణాలున్న వింత తెగులునీ గమవీంచి ఆందోళణ చెందుతున్నారు. ఈ తెగులు పంట దిగుబడివి చాలా వరకు తగ్గిస్తుంది. ఈ తెగులు దేని వలన వస్తోంది? పోషకాల లోపం వలనా? లేదా నీటి ఎద్దడి వలనా? అని రైతులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయం పై జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (NIPHM) శాస్త్రవేత్తలు చేసిన విస్తృతమైన పరిశోధనల వల్ల ఈ వ్యాధి మొక్క వేర్లను ఆశించే నులి పురుగులు (Nematodes). ప్రత్యేకంగా మెలాయిడోగైన్ ఎంటిరోలోబి (Melofodogyne enterolobil) అనే కొత్త తెగకు చెందిన వేరు ముడి నులి పురుగు(Root Knot Nematode) వలన వ్యాపిస్తుందని నిర్ధారించబడింది.

రైతుల నుంచి మరియు నర్సరీ పెంపక దారుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నులి పురుగులు తెగులు సోకిన జామ అంట్ల ద్వారా విదేశాల నుంచి దిగుమతి అయి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకురాబడి జామ అంట్ల ద్వారా వచ్చి స్థిరపడి పంట ఇష్టం కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తెగులు ఇంతకు ముందు మన దేశంలో కనిపించని మలాడోగైన్ ఎంటరోలోబి అనే కొత్త తెగకు చెందిన నులి పురుగు ద్వారా సంక్రమించడం మరియు విదేశీ జామ రకమైన “తైవాన్ రకం”లో ఈ నులి పురుగు ఉధృతి ఎక్కువగా వుండటం మరియు దేశీయ రకాలలో ఈ వ్యాధి ఉదృతి తక్కువగా ఉండటం కూడా గమనించడమైనది.

జామ తోటల్లో ఈ మధ్య కాలంలో అధికంగా కనిపిస్తూ పంట దిగుబడిని తగ్గిస్తూ రైతుల సమస్యగా మారిన ఈ మలిపురుగుల తెగులు మరియు దాని యాజమాన్యం గురించి రైతులకి అవగాహన కలిగించడమే ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.

నులి పురుగులు ఆశించిన జామ పంటలక్షణాలు

 1. ఆకులు పసుపురంగులోకి మారడం.
 2. 2 కొమ్మలు, లేత చిగుర్లు వడలి పోవడం, మలిపురుగులు ఆశించిని తొలిదశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయి కనిపిస్తాయి.
 3. కొమ్మలుఎండిపోవడం.
 4. చెట్టువదుగుదలలోపించడం, చెట్టుమోడుబారడం.
 5. పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం.
 6. ఈలక్షణాలు కనిపించిన మూడుమాసాల్లో చెట్లు చనిపోవడం.
 7. నీరు, ఎరువులు అందించినామొక్క కోలుకోకపోవడం.
 8. ఈ లక్షణాలు, పోషకలోపాల లక్షణాలు మరియు ఎండుతెగులు లక్షణాలుపోలివుండటం.
 9. వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి వుండటం, వేరు వ్యవస్థ క్షీణించి ఉండటం.
 10. నులిపురుగులు ఆశించిన వేరు భాగాల్లో ఎండు తెగులు శిలీంద్రం ఆశించివేర్లుకుపోవడం.

ఈ విధమైన లక్షణాలు మొక్కల్లో కనిపించి నట్లయితే మలిపురుగులు ఆశించివట్లుగా నిర్థారించవచ్చు.

పంటనష్టం

ఈ మలి పురుగుల వలన ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరముల వరకు జామతోటలలో 60-100 శాతం మరియు నర్సరీలలోనైతే 90-100 శాతంవరకునష్టంవాటిల్లుతుంది.

సమగ్రయాజమాన్య పద్ధతులు

నులిపురుగులవ్యాప్తినివారణ చర్యలు

 1. మలిపురుగుల వ్యాప్తిని విరోధించుటకు గాను, దిగుమతి సంస్థలైన,విమానాశ్రయాలు, పోర్టులు మరియు రోడ్డు రవాణా కేంద్రాలలో నులిపురుగులపై శాస్త్రీయమైన నిఘానువిధిగా నిర్వర్తించాలి.
 2. నులి పురుగులు లేనివిగా నిర్ధారిందబడిన నర్సరీల (Certified Nematote Free Nursery} నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైవ జామ అంట్లను కొనగోలు చేయాలి.
 3. జమ అంట్లు కట్టడానికి మరియు నర్సరీలలో అంటు మొక్కలను పెంచడానికి నులిపురుగులులేని స్వచ్చమైన మట్టిని వాడుకోవాలి.
 4. ఆకులు పచ్చబారి,వాడిపోయి వేరు పైబొడిపెలులాంటివి కలిగివున్న మొక్కలను తోటలోనాటరాదు.

నర్సరీలలో నులిపురుగులయాజమాన్యం

 1. ఒక టన్ను మట్టిలో 50-100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి మరియు జీవ నియంత్రణ కారకాలైన పర్ఫురిసిల్లమ్ లిలాసినస్, సూడోమోనాస్ ఫోరిసిన్స్ మరియు టైకోడెర్మా హార్డియానమ్ ఒక్కో కిలో చొప్పున కలిపిణ మట్టిని అంట్లు కట్టే మందుసంచుల్లో నింపాలి.
 2. కార్బోప్యూరాన్ 3Gలేదా ఫోరేట్ 10G5కిలోలను ఒక టన్ను మట్టిని కలపాలి.
 3. నారు మడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టివి వేసవి కాలంలో తెల్లపాలిథిన్ (25 m) షీటుతో (45-60 రోజులు) కప్పి వుంచి సోలరైజేషన్ ప్రక్రియ ద్వారా నులి పురుగులను నివారించవచ్చు.
 4. డయాజోమెట్ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి, కలియబెట్టి పాలిథిన్ షీటుతో కప్పి, ఒక వారం వుంచి తర్వాత సీటుని తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2-3 రోజుల తర్వాత మొక్కలు నాటు కోవాలి. ఈ పద్ధతి ద్వారా నులి పురుగులను త్వరితగతిలో నివారించవచ్చు.
 5. వీలైనంత వరకు ఎయిర్ లేయరింగ్ (Air layering) పద్ధతిలో నులిపురుగులు లేని మట్టి లేదా కొబ్బరిపీచు లేదా వర్మిక్యులేట్ ని వాడి జామ అంట్లను తయారుచేసుకొవాలి.

జామతోటల్లో చలిపురుగులుయాజమాన్యం

 1. వేసవిలో లోతుగా దుక్కులు దున్ని మట్టిని కలియబెట్టాలి.
 2. కొత్తగా జామ తోటలు వేసే ముందు మట్టిని నులిపురుగులకై పరీక్ష చేయించుకోవాలి.
 3. నులిపురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమృద్ధి చేయబడిన వానపాముల ఎరుపు/వేపపిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకొని అంట్లని నాటాలి.
 4. ఒక టన్ను వానపాముల ఎరువు పశువుల ఎరువు వేప పిండిలో 5 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్ బిలాసిపమ్, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మరియు ట్రైకోడెర్మా హార్జినియమ్ కలిపి 30 రోజులు ఉంచి సమృద్ధి చేసిన మిశ్రమాన్ని 3-4కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలోవేయాలి.
 5. పైన సూచించిన జీవనియంత్రణ కారణాలతో వున్న వేపపిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి, 2-3 లీటర్లతో ఒక్కో చెట్టు పొదళ్ళు తడిపి నులి పురుగులమనివారించవచ్చు.
 6. ఈ ద్రావణాన్ని వడకట్టి 15-20రోజుల వ్యవధిలో డ్రిప్ పద్దతిలో చెట్లకు పంపించడం ద్వారా నులిపురుగులనువియంత్రించవచ్చు.
 7. జామమొక్క మొదళ్ళల్లో బంతినారుమొక్కలు నాటడం ద్వారా నులి పురుగులను నివారించవచ్చు.
 8. కార్బోప్యూరాన్ లేదా ఫోరేట్ ఒక్కో చెట్టుకు 100 గ్రా. చొప్పున ఇసుకలో కలిపి సంవత్సరానికి రెండుసార్లు వేసుకోవాలి.

పైన సూచించిన విధంగా సకాలంలో సరియైన ముందు జాగ్రత్తలు మరియు యాజమాన్య పద్దతులు చేపట్టి జామసాగులో నులి పురుగుల సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate