హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / డ్రమ్ సైడర్ తో వరిని నేరుగా విత్తే పద్ధతి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డ్రమ్ సైడర్ తో వరిని నేరుగా విత్తే పద్ధతి

డ్రమ్ సైడర్ తో వరిని నేరుగా విత్తే పద్ధతి

ప్రధాన పొలం తయారీ :

ఈ పద్ధతిలో పొలం తయారు పై జాగ్రత్త వహించాలి. పొలాన్ని దమ్ము చేసి, చుదును చేయాలి. పొలం లెవల్ గా లేకపోతే పల్లంలో ఉన్న విత్తనాలు కుళ్లిపోతాయి. చదును చేయటానికి వీలు లేనప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. మన ప్రాంతంలో నాటడానికి అనువైన వరి వంగడాలు వేద పద్ధతికి కూడా పనికి వస్తాయి. ఎకరాకు 10 -12 కిలోలు విధానం సరిపోతుంది. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ము చేసి తరువాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ము చేసి చదును చేసుకోవాలి.

విత్తనాన్ని మండే కట్టడం :

విత్తనాలను 24 గంటలు నానబెట్టి. నానికా విత్తనాలను గొనె సంచి లో వేసుకొని లేదా సంచిలో కప్పిగాని 24 గంటలపాటు ఉంచాలి. 24 గంటలు తరువాత చూస్తే విత్తనాలు ముక్కులు పగిలి తెల్లగా మోను వస్తుంది. రబి పంట కాలంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. కాబట్టి 36 గంటలు మండే కట్టాలి.డ్రమ్ సీడర్ పద్ధతిలో గింజలకు ముక్కు పగిలి తెల్లపుతా వస్తే సరిపోతుంది. మొలకు పొడుగ్గా రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

విత్తడం : విత్తనాన్ని వరుసలలో వేయడాన్ని 8 సార్లు డ్రమ్ సీడర్ ను వుపయోగించి వెత్తికోవచ్చు. ఈ పరికరంలో వరుసల మధ్య 8 అంగుళాలు, మొక్కకు మొక్కకు మధ్య 2 -3 అంగుళాల దూరం పడేలాగా విత్తుకోవచ్చు.

నీటి యాజమాన్యం : పొలం దమ్ము చేసి మొలకెత్తిన విత్తనం పొలంలో విత్తిన తరువాత నీరు పూర్తిగా తీసి వేయాలి. మరళ 3వ రోజు పలుచగా నీరు పెట్టి వెంటనే తీసి వేయాలి. ఈ విధిగా మొక్కల మొదటి ఆకు పూర్తిగా పూరి విచ్చుకునేవరకు 7 -10 రోజుల వరకు పంటకు ఆరుతడుల అవసరం. తరువాత పొలాల్లో నీరు పలుచగా ఉంచాలి. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే 10 రోజుల ముందు వరకు 2 అంగుళాలు నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి.

కలుపు యాజమాన్యం : నేరుగా వీథి పండించే పొలాల్లో కలుపు సమస్య ఎక్కువ. ఈ పద్ధతిలో 7 -10 రోజులు పొలాన్ని ఆరకాడతాం కాబట్టి కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి  కలుపు మందులను తప్పనిసరిగా వాడాలి. విత్తిన 3 -5 రోజులలోపు ప్రీతిలకోర్ మరియు సేపనారు ఎకరాకు 300 మి.లీ. పిచికారీ చేసి ఒక రోజు ఆగి పొలాల్లో నీరు పెట్టాలి. విత్తిన 20 -25 రోజులకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటే, గడ్డి జాతి కలుపు నివారణకు ఫినాక్లాప్రాప్ ఇథైల్ (విప్ సూపర్) లేదా ఇధాక్స్ సలురాన్ 50 గ్రాముల మందు పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి . వేడల్పకు, గడ్డి జాతి కలుపు మొక్కలు రెండు ఉంటే బిస్ పైరీబాక్ సోడియం (నామినీగోల్డ్) ను ఎకరాకు 100 మి.లీ.లు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

3.0
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు