హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / డ్రమ్ సీడర్ తో నేరుగా వరి విత్తడం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

డ్రమ్ సీడర్ తో నేరుగా వరి విత్తడం

డ్రమ్ సీడర్ తో నేరుగా వరి విత్తడం.

ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యవసాయంలో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. వ్యవసాయంలో కూలీలు అందుబాటులు లేకపోవడం వలన వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి కూలీల ఖర్చులు పెరిగి తద్వారా రైతుకు సాగు ఖర్చు పెరిగి నిఖర ఆదాయం తగ్గుతున్నది. నీటి సమస్య మరియు కూలీల సమస్య వలన వరి పండించే రైతులు సకాలంలో నాట్లు వేయలేక పోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నీరు అందుబాటులో ఉన్నప్పుడు సమయం వృధా కాకుండా నారుమడి లేకుండా నేరుగా వరి పంట పండిద్దామనుకొనే రైతులకు డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా వరి విత్తడం అనే పద్ధతి అనుకూలము.

దమ్ము చేసిన పొలాల్లో మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ ద్వారా విత్తడము రైతులకు తెలిసిన పాత పద్దతే అయినప్పటికీ, సరైన కలుపు నాశినులు లేకపోవడం వలన ఈ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందలేక పోయండి. వరి విత్తినప్పుటి నుంచి నెల రోజల వరకు కూడా వాడుకోదగ్గ కలుపు మందులు ప్రసుత్తం అందుబాటులోనికి రావడంతో రైతులు డ్రమ్ సీడర్ వరి సాగు పై ఆసక్తి చూపుతున్నారు.

డ్రమ్ సీడర్ తో సాగు - ఉపయెగలు

 • డ్రమ్ సీడర్ పద్దతిలో నార్లు పెంచుకోవలసిన అవసరం లేదు.
 • నాటువేసే పనిలేదు, కాబట్టి నటులు అవసరమైన కూలీల ఖర్చును ఆదాచేయవచ్చు.
 • విత్తన మేతదును సగానికి సగం తగ్గించవచ్చు.
 • డ్రమ్ సీడర్ పద్దతిలో విత్తినప్పుడు, ఒక చదరపు మీటరుకు  ఉండవలసిన  మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండడం వల్ల వరి దిగుబడులు నాటు వేసిన వరికన్నా అధికంగా ఉంటున్నాయి.
 • కలుపు నివారణకు, వరి సాళ్ళ మధ్య కోనోవిడార్ నడపవచ్చు, దీని వల్ల కలుపును సెంద్రయా ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది మరియు అంతరకృషి వలన వేర్లు బాగా పెరిగి, దిగుబడులు పెరుగుతాయి.
 • వర్షాలు ఆలస్యమై నీరు సకాలంలో అందనపుడు, కాలువల ద్వారా నీటి విడుదల ఆలస్యమైనప్పుడు, ముదురు నార్లతో నాట్లు వేయడము జురుగుతుంది. దీనివల్ల వరిలో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అలాంటి నాట్లతో నాట్లు వేయడము జరుగుతుంది. దీనివల్ల వరిలో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అలాంటి పరిస్ధితుల్లో డ్రమ్ సీడర్ పద్ధతి అనువుగా ఉంటుంది.
 • నాటువేసిన వరి కన్నా 5-7 రోజులు ముందుగా డ్రమ్ సీడర్ తో వేసిన వరి కోతకు వస్తుంది.

డ్రమ్ సీడర్ తో సాగు - అవరోధాలు

 • డ్రమ్ సీడర్ పద్ధతి చేడు నెలలకు, నీటి ముంపుకు గురి అయ్యే ప్రాంతాలకు అనుపు కాదు.
 • పొలం ఎత్తు వంపులు లేకుండా చదునుగా ఉండాలి. లేనట్లయితే నీరు విలువ ఉండి మెలిక మురిగి, మొక్కల సంఖ్య తగ్గిపోతుంది.
 • డ్రమ్ సీడర్ పద్దతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణ అనివార్యం.
 • డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలను విత్తిన వెంటనే వర్షం పడితే గింజలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. మెలిక ఆరిపోకండా సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.

సాగు పద్ధతులు

నేలలు: సాధాణంగా వరి సాగుచేసే అన్ని నేలలు అనుకూలం, దిగుబడే భూమిలో మరియు చేడు భూములలో కొంత వరకు ఇబ్బంది ఉంటుంది.

ప్రధాన పొలం తయారీ: సాధారణ పద్దతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారీ చేసినట్లుగానే ఈ పద్దతిలో కూడా తాయారు చేయాలి. సాధ్యమైనంత వరకు పొలమంతా సామానంగా ఉండేటట్లు చేయాలి. వీలైతే పైపు సహాయంతో లేదా కర్ర సహాయంతో సమానం చేసుకోవాలి.

కాలం: రబి సీజన్

రకము: ఏ రకమైనా ఈ పద్దతిలో సాగు చేసుకోవచ్చు.

విత్తన శుద్ధి: కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండజిమ్ పొడి, నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టాలి.

వరి విత్తనాల్లో నిద్రవస్ధను తొలగించటం: కోత కోసిన వెంటనే విత్తునాలను వాడుకోవాలంతే వారిగింజల్లోని నిద్రవస్ధను తొలగించి అధిక మెలిక శాతం రావడానికి, లీటరు నీటికి తక్కువ నిద్రవస్ధ ఉన్న విత్తనాలకైతే 6.3 మీ.లి. లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రవస్ధ ఉన్న విత్తనాలకైతే 10 మీ.లి. గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 24 గంటల వరకు నానబెట్టాలి. మరో 24 గంటల పాటు మండికట్టాలి.

విత్తనాన్ని మండే కట్టడం: 24 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత 24 గంటలు మండే కట్టిన విత్తనాలు ముక్క పగిలితే చాలు. ఆలస్యమైనతే తెల్లని మెలిక ఎక్కువ వచ్చి డ్రమ్ లో పోసినప్పుడు గింజ జారదు.

ప్రధాన పొలంలో విత్తడం: విత్తే సమయానికి నీరు లేకుండా బురద బురదగా ఉండే చాలు. డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి ద్రమ్మకు 20 సెం.మీ. దూరంలో రెండు చివర్ల రంద్రాలు చేసి ఉంటాయి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ లో కేవలం 3/4 వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి గింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుస వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. వరసలో కుదురు కుదురుకు మధ్య దూరంలో 5-8 సెం.మీ. ఉంటుంది.

విత్తడానికి అవసరమయ్యే కూలీలు: ఒక ఎకరా విత్తడానికి కేవలం ఇద్దరు సరిపోతారు (డ్రమ్ సీడర్ బరువు కేవలం 8 కిలోలు).

విత్తడానికి పట్టే సమయం: ఒక ఎకరా విత్తడానికి సాధారణంగా 2-3 గంటలు పడుతుంది.

ఎరువుల యాజమాన్యం: నతజని 40 నుండి 48 కిలోలు, భాస్వరం 24 కిలోలు మరియు పోటాష్ నిచ్చే ఎరువులను 16 కిలోలు, 20 కిలోల జింక్ సల్పేట్ లను ఎకరానికి వేయాలి.

కలుపు యాజమాన్యం

విత్తిన 4-5 రోజుల తర్వాత నీరు తీసివేసి తేమ ఉన్నప్పుడు ఎకరాకు 35 గ్రా. అక్సాదయార్జిల్ 500 మీ.లి. నీటిలో కలిపి దాన్ని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలి. ఆరుతడిలాగా నీరు పెట్టినప్పుడు కలుపు మెలచినట్లయితే, సన్నగడ్డి మరియు వెడల్పకు కలుపు మొక్కలు ఉన్నటైయితే 2-5 ఆకుల దశలో బిన్ పైరిబ్యాంక్ సోడియం 100 మీ.లి. లేదా కెలొరీమ్యారం మిదైల్ 8 గ్రా. + సైహలోపప్ బ్యుటైల్ 250 మీ.లి. 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మీద పడేటట్లు పిచికారి చేయాలి. ఈ కలుపు ముందు పిచికారి చేసిన తర్వాత 3 రోజుల వరకు నీరు పెట్టరాదు.

ఈ పద్ధతి ద్వారా నాటుకున్నపుడు పవర్ వీడర్ సహాయంతో అంతరకృషి చేసి కలుపును సమర్ధవంతంగా తక్కువ సమయంలో నిర్ములించవచ్చును.

నీటి యాజమాన్యం

 • డ్రమ్ సీడర్ పద్దతిలో విత్తిన తర్వాత 2-3 రోజుల వరకు నీటి విలువ వల్ల మెలికలు మురగకుండా జాగ్రత్త వహించాలి.
 • మొక్కలు మొదటి ఆకు పూర్తిగా విచ్చుకొని వరకు (సుమారు 7-10 రోజుల వరకు) ఆరుతడులు ఇవ్వాలి.
 • పిలక దశ నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో పలుచగా (1-2 సెం.మీ.) నీరు ఉంచాలి.
 • పూత దశ నుండి, గింజ గట్టి పడే వరకు 3-5 సెం.మీ. నిల్వ ఉండేలా జాగ్రత్త వహించాలి.
 • కోతకు వారము/పది రోజులు ముందుగా నీరు పెట్టడము ఆపివేయాలి.

సస్య రక్షణ

 • డ్రమ్ సీడర్ వరి వరుసక్రమంలో ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి, గాలి బాగా సోకి చీడపీడల బెడద తగ్గుతుంది.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.91666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు