పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటల యాజమాన్య పద్ధతులు

ఈ పేజిలో వివిధ పంటల యాజమాన్య పద్ధతులు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

కొబ్బరి యాజమాన్య పద్ధతులు

కొబ్బరి పండించే ముఖ్య రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ఉన్నది. ఉత్పాదకలో రాష్ట్రం ముందు ఉన్నా దిగుబడి ఇంకా పెంచడానికి చాలా అవకాశం ఉన్నది. శాస్త్రీయమైన ఆధునిక పద్ధతులు పాటిస్తే, కొబ్బరి రైతులు దిగుబడితో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు.

కొబ్బరిని ఆశించు తెగుల్ల యాజమాన్యం, కొబ్బరి తోటలో సమస్యలు - నివారణ, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు కంపోస్ట్ తయారీ, నల్ల ముట్టే మరియు కొమ్ము పురుగు నివారణ మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బత్తాయి యాజమాన్య పద్ధతులు

బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ప్రథమ స్థానలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,94,345 హెక్టారులలో సాగుచేయబడుతూ, 26.25 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు (గమనిక : పాత గణాంకాల ప్రకారం) ఉత్పత్తి చేయబడుతున్నాయి. బత్తాయిలో సుస్థిరమైన అధిక దిగుబడికి యాజమాన్య పద్ధతులు ఈ క్రింద జతచేసిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జామ యాజమాన్య పద్ధతులు

జామ సాధారణ నేలల్లో కూడా బాగా పెరిగి, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవటమేగాక మంచి దిగుబడిని ఇస్తుంది. చౌకగా దొరికే జామ పండ్లలో నారింజ రసంలో కంటే 2.5 రెట్లు ఎక్కువగా 'సి' విటమిన్ మరియు 'ఎ' విటమిన్, భాస్వరం, పాంటాథొనిక్ ఆమ్లము, రిబోప్లావిస్ మరియు నియాసిన్ ఉన్నాయి. అయితే జామ అధిక దిగుబడికి యాజమాన్య పద్ధతులు ఈ క్రింద జతచేసిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

చిరుధాన్యాల యాజమాన్య పద్ధతులు

చిరుధన్యాలను ఆశించే తెగుళ్ళు మరియు వాటి యాజమాన్యం

చిరుధన్యాలను వర్షాధారిత ఎత్తైన కొండ ప్రాంతాలలో సాగుచేస్తున్నారు. ఈ చిరుధన్యాలలో అత్యంత విలువైన పోషకాలతో పాటు, ఔషధ గుణాలు కూడా ఉండటం వలన వీటిని "పోషక ధాన్యాలుగా" పరిగనిస్తారు.

చిరుధాన్యాల ప్రాముఖ్యత, రాగిలో వివిధ తెగుళ్ళు, కొర్రలొ వివిధ తెగుళ్ళు, సామలలో వివిధ తెగుళ్ళు, ఊదలలో వివిధ తెగుళ్ళు, పరిగలు - తెగుళ్ళు, ఆరికలలో వివిధ తెగుళ్ళు, చిరుధన్యాలను నిలువ ఉంచే సమయంలో వచ్చే తెగుళ్ళు మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయము

3.00861326443
Ravi kumar Dec 02, 2015 08:47 PM

abuot citrus

Naresh Mar 31, 2015 01:21 PM

ఈ వెబ్ సైట్ బాగుంది. ఇంకా ఈటువంటివి వేరే ఏమైనా రైతులకు ఉపయోగకరమైన వెబ్ సైట్లు ఉంటె తెలపండి.

sreenivasa rao Mar 31, 2015 01:20 PM

ఈ పోర్టల్ చాల ఉపయోగంగా ఉన్నది మరియు ఛాల్ విషయాలు పొందు పచబద్దీ. అందులకు కృతజ్ఞతలు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు