অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అపరాల (పప్పుధాన్యాలు) సాగు

మన దేశం అపరాలు (పప్పుధాన్యాలు) ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, అంత కన్నా ఎక్కువ స్థాయిలో పప్పుధాన్యాల వినియోగం ఉండడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ - సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది.apara

అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి, వాణిజ్య పరంగానే కాకుండా, ఆహార భద్రతను ముఖ్యంగా పోషకాహార భద్రతను సాధించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి కూడా ఆహార భద్రతలో ఈ అపరాల ప్రాధాన్యాన్ని అపరాల సాగువల్ల నేలల సారం పెరగడం లాంటి ప్రయోజనాలను గుర్తించి, 2016 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరం" గా ప్రకటించింది.

ప్రస్తుతం అపరాల్లో అధిక దిగుబడినిచ్చే పంట రకాలు లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. అందుకని అటువంటి రకాలని అభివృద్ధి చేసి రైతులకు అందించడానికి ప్రభుత్వం వివిధ చర్యలను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ 2016-17 ఖరీఫ్ పంట కాలం నుండి పప్పుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే బాధ్యతను ప్రభుత్వంతో పాటు ప్రత్యేకంగా జాతీయు ఆవరీర భద్రతా వివన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) కి కూడా అప్పగించింది. ఈ చర్య క్షేత్రస్థాయిలో రైతులకి ఎంతో లాభం చేకూరు నుంది. ఎందుకంటే ఈ అనేది దేశంలోని 27 రాష్ట్రాల్లో, 622 జిల్లాల్లో విస్తరించి ఉంది. పైగా ఈ ఎన్.ఎఫ్.ఎస్.ఎం.కి కేటాయించిన మొత్తం బడ్జెట్లో దాదాపుగా సగం కేవలం పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికే కేటాయించారు.

అపరాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంది

 • గత ఏడాదికన్నా ఈ సంవత్సరం అదనంగా రూ.440 కోట్లను పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి బడ్జెట్లో కేటాయించారు. ఈశాన్య రాప్తాల్లో హరిత విప్లవాన్ని తీసుకు రావడంలో భాగంగా ఈ 2015-16 రబీ కాలంలో కొన్ని గ్రామ సమూహాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పప్పుధాన్యాల ఉత్పత్తిపై శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
 • దేశంలో ఉన్న అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో లభించే, స్థానిక నేలలకు అనువయ్యే అత్యుత్తమ రకాల విత్తనాల ప్రదర్శన, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
 • వివిధ ప్రభుత్వ వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో పప్పుధాన్యాల సాగు పరిమాణం, దిగుబడులను పెంచడానికి రైతు స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, విత్తనాల సరఫరా, సాగులో ప్రధాన సమస్య అన్నటువంటి చీడపీడల యాజమాన్యం, స్థూలంగా రైతు గరిష్ట పంట ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించడానికి రకరకాల కార్యక్రమాలు చేపడతారు.
 • అధిక దిగుబడి వచ్చిన సమయాల్లో మార్కెట్ ధరలు పడిపోయి అపరాలు సాగుచేసే రైతులు నష్టపోకుండా, స్థిర నిల్వలు కోసం గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. అందువల్ల ధరలు స్థిరీకరించి రైతుకు నష్టం రాకుండా చేయగలుగుతాం.
 • ఈ రబీ 2016-17 పంటకాలం నుండి ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధరపైన అధనంగా ఓ పప్పుధాన్య పంటపైన రూ. 475/- క్వి0టాలుకు బోనస్ గా చెల్లించాలని నిర్ణయించారు.

పప్పుధాన్యాల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు

 • వరి లాంటి ప్రధాన పంటల మాదిరిగా అధికంగా నీటి అవసరం లేకుండానే అపరాలను సాగు చేయవచ్చు. ముఖ్యంగా రెండవ, మూడవ పంటగా ఈ అపరాలు సాగు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరం.aparala
 • అపరాల సాగు వల్ల నత్రజని స్థిరీకరణ జరిగి, నేల సారాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
 • ఇతర పంటల మాదిరిగా కాకుండా, మార్కెట్లో సరైన ధర రాని పక్షంలో ఎంత కాలం అయినా ఇ పప్పుధాన్యాలను నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుంది.
 • ప్రధాన పంటల్లో క్రమం తప్పకుండా వచ్చే చీడపీడల సమస్యల నుండి బయటపడటానికి కూడా పంట మార్పిడిలో భాగంగా అపరాలను సాగుచేయవచ్చు.
 • రైతు భాగస్వామ్యం కలిగిన సంస్థలే (ఉదా : రైతు సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలు) విత్తన ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు చర్యలు చేవట్టడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి, అందులో భాగస్వాములైన రైతులు కూడా అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.
 • రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే నేరుగా పప్పుధాన్యాలను సేకరించడానికి, సేకరించిన ధాన్యాన్ని సంచార వాహనాల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే పథకాన్ని ప్రారంభించే ఆలోచనను కూడా ప్రభుత్వం పరిగణిసున్నందు వలన అంతిమంగా పప్పుధాన్యాలు పండించే రైతులకు అధిక నికర ఆదాయాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కాబట్టి ఈ ప్రత్యేక ప్రయోజనాలే కాకుండా, సాధారణ రైతుల కోసం ప్రభుత్వం అందించే రుణ సదుపాయం, సబ్సిడీ ఎరువులు లాంటి ఇతర సౌకర్యాలను ఉపయోగించుకొని అపరాలు సాగుచేసి దేశ ఆహార బద్రతను కాపాడటంలో భాగస్వాములు కాగలరు.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate