অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖరీఫ్ జొన్న సాగులో సమగ్ర సస్యరక్షణ

ఖరీఫ్ జొన్న సాగులో సమగ్ర సస్యరక్షణ

సేద్య పద్ధతులు

  • లోతు దుక్కులు చేసుకోవాలి.
  • త్వరగా / సమయానికి విత్తుకుంటే మొవ్వ ఈగ ఉధృతి తగ్గించవచ్చు.
  • ఒకే రకం జొన్నలను ఒకే సమయంలో విత్తడం ద్వారా మొవ్వ ఈగ, కంకి నల్లి తక్కువ ఆశిస్తాయి.
  • ఆలస్యంగా విత్తితే అధిక విత్తన మోతాదు వాడితే మొవ్వ ఈగ నుండి నష్టాన్ని తగ్గించవచ్చు.

యాంత్రిక పద్దతులు

  • దీపపు ఎరలను అమర్చడం వలన కాండం తొలిచే పరుగు ఉనికిని గమనించి నివారించవచ్చు.
  • సిఫారుసు చేయబడిన మోతాదులో ఎన్.పి.కె. ఎరువులను వాడాలి.

రసాయనిక పద్ధతులు

  • థయోమిథాక్సామ్ 70 డబ్యూ.ఎస్. -3 గ్రా. కిలో విత్తనానికి వేసి విత్తన శుద్ధి చేస్తే మొవ్వ ఈగ, కాండం తొలిచే పరుగు, రసం పీల్చే పురుగుల నుండి పంటను కాపాడవచ్చు.
  • కార్బోప్యూరాన్ 3జి గుళికలను మీటరుకు 2 గ్రా, వితేటప్పుడు వేసుకుంటే మొవ్వ ఈగను అదుపులో ఉంచవచ్చు.
  • పంట విత్తిన 35-40 రోజుల లోపు కార్బోప్యూరాన్ గుళికలు 8-12 కిలోల / హెక్షారుకు మొక్క సుడులలో వేసుకుంటే కాండం తొలిచే పరుగు ఉధృతి తగ్గుతుంది.
  • రసం పీల్చే పురుగులు (చిగురునల్లి, పేనుబంక) నివారణకు డైమిధోయేట్ 30 శాతం ఇ.సి. 1.5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
  • కంకి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సైపర్ మెత్రిన్ 25 శాతం ఇ.సి. 0.5 మి.లీ. / లీటరు కంకులపై పిచికారీ చేసుకోవాలి.
  • జొన్న మిడ్డి నివారణకు ఫాసలోన్ 2 మి.లీ. / లీటరు నీటికి కలిపి కంకులు బయటకు రాగానే, వారం రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి.
  • జొన్న నల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. / లీటరు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. / లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate