অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నవంబర్ మాసంలో ఉద్యాన పంటలలో సేద్యపు పనులు

మామిడి

  • పొలాన్ని దున్నటం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం చేయకూడదు. దీని వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడి పూత మొగ్గలు ఏర్పడతాయి.
  • తేనె మంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగులు అధికంగా వ్యాపించే తోటలలో డైక్లోరోవాస్ 1 మి.లీ + వేపనూనె 2.5 మి.లీ. లీటరు నీటిని కలిపి ఈ మాసంలో పిచికారి చేసుకోవాలి.
  • ఇప్పటి వరకు చాలా ప్రాంతాలలో అధిక వరాలు కురిసాయి. దీనివల్ల మచ్చ, మసి, మంగు తెగుళ్ళు  వచ్చే అవకాశం ఉంటుంది. నివారణకు కార్భండాజిమ్ 1 గ్రా. లేదా మ్యాంకోజెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

జామ

  • కాయలు కోసిన తరువాత తోటను దున్ని పాదుల్లో కలుపు తీసి, 30 కిలోల పశువుల ఎరువు, 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను చెట్టు మొదలు నుండి 1 మీ. దూరంలో 25 సెం.మీ. లోతు గాడి తీసి, ఎరువులను వేసి పాదుల్లో తడి పెట్టాలి.
  • ఆ పిండినల్లి ఉధృతి అధికంగా ఉన్న తోటల్లో చెట్టకు 250 గ్రా క్లోరిఫైరిపాస్ పాడి మందును పాదుల్లో చల్లి మట్టిలో కలిసేటట్లు చేయాలి.

అరటి

  • పండ్ల పరిమాణము మరియు నాణ్యత పెంచుటకు గెల లోని ఆఖరి హస్తం విచ్చుకొన్న 5 వ రోజున మరియు 15 వ రోజున సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రా. ను లీటరు నీటిలో కలిపి గెలలపై పిచికారి చేయాలి.
  • పేను, పిండి పురుగుల నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

బత్తాయి, నిమ్మ

  • ఈ మాసంలో మ్రిగ్ బహర్ (జూన్ లో పూతకు వచ్చిన) బత్తాయి చెట్లకు నీటిని అందించాలి.
  • కాయలు కోసిన తరువాత ఎండిన కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి, 1 గ్రా. కార్భండాజిమ్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • అంబేబహార్ (జనవరిలో పూత) పూత రావడానికి బత్తాయి లేదా నిమ్మ చెట్లకు నీటిని అందించడం ఆపాలి.
  • నల్లి పురుగులు కనిపిస్తే నివారణకు 5 మి.లీ. డైకోపాల్ లేదా 2 మి.లీ. ఇధియాన్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ద్రాక్ష

  • పూ గుత్తుల పొడవు పెరగడానికి జిబ్బరిల్లిక్ ఆమ్లం 10 పి.పి.ఎం. రెండు సార్లు పిచికారి చేయాలి. పూగుత్తిలోని పువ్వులు విచ్చుకొన్న దశలో జిబ్బరెల్లిక్ ఆమ్లం 15 పి.పి.ఎం. ద్రావణ పూగుత్తిని ముంచాలి.
  • కత్తిరింపులు జరిపిన 20 వ, 40 వ రోజున ఇమిడాక్టోప్రిడ్ 0.5 మి.లీ. ను లీటరు నీటికి కలివి భూమిని తడిపినట్లయితే పిండి నల్లిని నివారించవచ్చు.
  • తామర పురుగు నివారణకు పిప్రానిల్ 2 మి.లీ. లేదా థయామిధాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

సపోట

  • ఇటీవల అధిక వరాల వల్ల భూమిలో అధిక తేమ వల్ల ఆకు మచ్చ తెగులు కనిపిస్తుంది. చిన్న చిన్న వలయాకారపు మచ్చలు, తెల్లని మధ్య భాగం, ఎరుపు రంగు అంచులతో ఏర్పడతాయి. మచ్చలు ఆకులకు రెండు వైపులా ఏర్పడతాయి. మచ్చలు ఎక్కువగా  ఏర్పడినప్పుడు ఆకులు రాలి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆపిల్ రేగు

  • కాయ తొలుచు పురుగుల పండును తొలిచి లోపల గుజను తింటాయి. ఈ పురుగు ఆశించిన కాయలు పోతాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. డెల్టామెత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 2 - 3 సార్లు బఠాని గింజ సైజు నుండి పిచికారి చేసుకోవాలి.

కూరగాయలు

టమాట

  • కాయతొలుచు పురుగు నివారణకు నాటిన 28 . 35 రోజులకు పూబెండమైడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
  • మొక్కల పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత వరకు 5 శాతం వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
  • తామర పురుగులు, పచ్చదోమ నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వంగ

  • నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యూరాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి.
  • ఎకరాకు 200 కిలోల వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాలలో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి.

బెండ

  • రసం పీల్చే పురుగుల నివారణకు ఫిప్రానిల్ లేదా డైమిధోయేటీను లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి.
  • కాయతొలుచు పురుగుల నివారణకు ప్రాఫెనోఫాన్ ను లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
  • దోస, కాకర, బీర లలో ఈ మాసంలో బూజు తెగులు అధికంగా ఆశిస్తుంది. ఆకులపై భాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదా రంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా మెటలాక్సిల్ ఎమ్.జెడ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాబేజి

  • క్యాబేజి రెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి, ఆకులను తిని నాశనం చేస్తుంది. దీని నివారణకు 1.5 గ్రా, ఎసిఫేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పుచ్చ, ఖర్బూజా

  • పుచ్చ, ఖర్బూజా లను ఈ మాసం రెండవ పక్షం నుండి విత్తుకోవచ్చు. దీని కోసం 2 - 2.5 మీ. ఎడంతో 60 సెం.మీ. వెడల్పు గల నీటి కాలువలు తయారు చేసుకొని, కాలువలకు ఇరువైపులా 30 - 50 సెం.మీ. ఎడంతో విత్తనాలు విత్తుకోవాలి. 500 గ్రా. విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది.

మునగ

  • మునగలో వేరుకుళ్ళు, కాండం కుళ్ళను మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో కనిపిస్తుంది. వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి, చెట్టు విరిగిపోతుంది. నివారణకు మొక్కల మొదళ్ళ వద్ద 1 గ్రా. కార్బండాజిమ్ లేదా మాంకోజెట్ 3 గ్రా"ను లీటరు నీటికి కలిపి బాగా తడపాలి.
  • మొక్కలకు 3, 6, 9 నెలలకొకసారి 100 గ్రా. యూరియా, 50 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు కట్టాలి.

ఉల్లి

  • రబీ ఉల్లి కోసం ఈ మాసంలో నారు పోసుకోవాలి. నేలను బాగా దున్ని 120 సెం.మీ వెడల్పు, 3 మీ. పొడవు గల ఎత్తైన నారుమళ్ళను తయారు చేసుకొని విత్తనాన్ని పలుచగా వరుసల్లో పోయాలి. నారుకుళ్ళ తెగులు సోకకుండా 10 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరప

  • మిరపలో ఈ మాసంలో పై ముడత (తామర పురుగులు)తో పాటు క్రింది ముడత (తెల్లనల్లి) కూడా కనిపిస్తుంది. వీటి నివారణకు జోలోన్ 2 మి.లీ. లేదా పెగాసస్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • మిరపలో పూత పురుగు వల్ల పూత ఎండిపోయి రాలి పోవడం వల్ల కాయలు ఏర్పడవు. ఏర్పడినా కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకరలు తిరిగిపోతాయి. దీని నివారణకు టైజోఫాస్ 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి, వారం రోజుల తర్వాత మరలా క్లోరిఫైరిఫోస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.
  • గత మాసంలో అధిక వర్షాల వల్ల మిరపలో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా కనపడుతున్నది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు పండుబారి రాలిపోవడం జరుగుతుంది. నివారణకు 30 గ్రా, కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1 గ్రా. స్టెప్టోసైక్లిన్ లను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 9441168156



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate