অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పొగాకు లద్దెపురుగు - నివారణ చర్యలు

వివిధ పంటలలో లద్దె పరుగుల బెడద తీవ్రంగా నష్టాన్ని కలిగించే స్థాయిలో ఉంటుంది. పంటలకు అత్యంత హాని కలిగించే చీడ పొగాకు లద్దె         పురుగుగా పరిగణించవచ్చు. పొగాకు లద్దెపురుగును సకాలంలో గుర్తించి అదుపు చేయకపోతే 80 శాతం పంట నష్టపోవడం కూడా జరుగుతుంది.

జీవిత చరిత్ర

కోశస్థ దశను భూమిలో గడుపుతాయి. అనుకూల వాతావరణానికి రెక్కల పురుగులుగా మారి బయటికి వచ్చి మళ్ళీ గుడ్లు పెడుతూ తన సంతతిని అభివృద్ధి పరచుకుంటాయి. గుడ్లు పొదగడానికి 3 నుండి 5 రోజులు, గుడ్లు నుండి బయటికి వచ్చిన గొంగళి పరుగు (లార్వా దశ) పెరగడానికి పంటను బట్టి 15 నుండి 30 రోజుల వరకు పడుతుంది. ఈ పరుగు ఎడాదిలో 8 తరాలు పూర్తి చేసుకొని పంటలను నాశనం చేస్తుంది. దాదాపుగా అన్ని మాసాలలో పంటలపై ఆశిస్తుంది.

పలు పంటలపై ప్రభావం

పొగాకు, పత్తి, వేరుశనగ, ఆముదం, పెసర, మినుము, జొన్న మొక్కజొన్న కాలీఫ్లవర్, బెండ, టమాట, మిరప, వంగ, పొద్దుతిరుగుడు పువ్వు, అరటి మొదలగు పంటలను ఆశించి నష్టం కలిగిస్తుంది.

plpఇవి గొంగళి పరుగు (లార్వా దశ) దశలోనే పంటలకు హాని చేస్తాయి. పురుగులు పగటి వేళల్లో నేలపై ఉన్న ఆకులు, చెత్తాచెదారం, మట్టి బెడ్డల కింద దాగి ఉండి రాత్రి వేళల్లో బయటకు వచ్చి ఆకులను, కొమ్మలను తినివేస్తాయి. మొదటి దశలో ఉన్నప్పుడు ఒకే చోట గుంపులుగా ఉండి పత్రహరితాన్ని గీకి తిని జల్లెడాకులుగా మార్చుతాయి. మిరప పంటలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తిని నష్టం చేస్తుండటం, పత్తి పంటలో ఆకులను తర్వాత పూమొగ్గలు, కాయలకు రంధ్రాలు నష్టం చేస్తాయి. పరుగులు ఆశించిన మొక్కలు పెరుగుదల క్షీణించి, పంట దిగుబడి, నాణ్యతలకు తీవ్ర విఘాతం కలుగచేస్తాయి. శనగ, అపరాల పంటలకు ఆశిస్తే రైతులు వారం రోజుల అశ్రద్ధ చేస్తే చేనులో పంట తాలూకు అవశేషాలను కూడా మిగల్చకుండా తినివేసి తీవ్రనష్టాన్నికలుగచేస్తాయి.

నివారణ చర్యలు - సమగ్ర యాజమాన్య పద్ధతులు

  • వేసవిలో లోతు తుక్కులు చేయడం వలన భూమిలో ఉండే పురుగు కోశస్థదశ (ప్యూపా, నిద్రావస్థ దశ)లను నిర్మూలించవచ్చు. పక్షులు తినివేయడం, ఎండకు నశించడం జరుగుతుంది.
  • పంట మార్పిడి విధానాన్ని అవలంబించి, సిఫారుసు మేర రసాయనిక ఎరువులను వాడాలి. ఎక్కువ నీటి తడులు పెట్టరాదు.
  • పంటలు సాగు చేస్తున్నప్పుడు పొగాకు లద్దె పురుగు గుడ్ల దశలో నివారించే టైకోగ్రామా పరాన్నజీవులను 3 లేదా 4 సార్లు విడుదల చేయాలి. ఈ సమయంలో వారం పాటు ఏ విధమైన పురుగు మందులను చల్లరాదు.
  • పక్షి స్థావరాలను ఎకరంలో 20 చొప్పున ఏర్పాటు చేసి వీటిపై గోరింకలు, కొంగలు వంటి పక్షులు వాలి లద్దె పురుగులను ఏరుకొని తింటాయి. అందుకు గాను మొదటి రెండు రోజులు పక్షులను ఆకర్షించడానికి ఎదైనా ఆహారాన్ని చల్లాలి.
  • ఫిరమోన్ ఎరల (లింగాకర్షక బుట్టలు)ను ఎకరానికి 5 వరకు అమర్చి రెక్కల పరగుల సంఖ్యను బట్టి పురుగు ఉధృతిని అంచనా వేసి సస్యరక్షణ చేయాలి.
  • రాత్రిపూట పొలం చుటూర మంటలు అక్కడక్కడ వేస్తే రెక్కల పురుగులు వెలుతురుకు ఆకర్షితమై మంటలో పడి చనిపోతాయి.
  • చేను చుటూర కందకం తవ్వి అందులో ප්‍රංතූරිජ් 5 శాతం పొడి చల్లితే, ఈ లార్వాలను ఒక పొలం నుండి మరొక పొలం వలసలు వెళ్ళకుండా అరికట్టవచ్చు.
  • తొలిదశ పురుగులను నివారించడానికి వేప సంబంధిత మందు 5 మి.లీ. లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
  • స్పోడాఫ్టేరా, ఎన్.పి. వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 200 ఎల్.ఇ.లు పిచికారీ చేస్తే లద్దె పురుగులకు ఈ వైరస్ సోకి క్రమేణా తలకిందులుగా వేలాడుతూ చనిపోతాయి. సాయంత్రం చల్లని సమయంలో పిచికారీ చేయటం మంచిది.
  • విషపు ఎరను ఉపయోగించి బాగా ఎదిగిన లద్దె పరుగులను నివారించాలి. దీని కోసం 5 కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, 300 మి.లీ. మోనోక్రోటోఫాన్ 500 మి.లి. క్లోరిఫైరిపాస్ గానీ లేదా 400 గ్రా, మిథోమిల్ కలిపి రెండు రోజులు పులియబెట్టి ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో చేనులో చల్లితే విషపు ఎరను తిని చనిపోతాయి.plptwo

సస్యరక్షణ

థయోడికార్చ్ 75 శాతం

300 మి.లీ. గానీ లేదా

క్లోరిఫైరిఫాస్ 50 ఇ.సి

250 మి.లీ. గానీ లేదా

ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి.

400 మి.లీ. గానీ లేదా

ఇండాక్సాకార్బ్ 13.5

200 మి.లీ. గానీ లేదా

స్పైనోశాడ్ 45 శాతం

75 గ్రా గానీ లేదా

నొవాల్యూరాన్ 10 ఇ.సి.

300 మి.లీ. గానీ

ఎకరంలో 200 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని సాయంత్రం పూట పిచికారీ చేయాలి. లార్వా పెద్దగా అయి బలిసినచో పూబెండామైడ్ 39 శాతం - 50 మి.లీ. గానీ, డైపూబెంజురాన్ 25 శాతం - 250 గ్రా. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ - 5 శాతం 80 గ్రాములు గానీ పైన తెలిపిన మాదిరి పిచికారీ చేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate