অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రధాన పంటల సాగు - ముఖ్య సూచనలు

మొక్కజొన్న

సిఫారసు చేయబడిన సంకర జాతి /ప్రత్యేక రకములు:

 • దీర్ఘకాలిక హైబ్రిడ్ లు -డి.హెచ్.యం-103 ,105 ,113 ,900  యం. గోల్డ్ , బయో 9681 ,ప్రో  311 ,ఎన్.కె .- 6240  ,30  బి 07
 • మధ్యకాలిక హైబ్రిడ్ లు - డి.హెచ్.యం-107 ,111 ,117 , బయో 9637 , ప్రభల్ , కె హెచ్ 510 , కోహినూర్
 • స్వల్పకాలిక హైబ్రిడ్ లు -డి.హెచ్.యం.109 ,115  ప్రకాష్, కె .హెచ్,5991 ,ఫై, ఇ, హెచ్ -1 ,2 .డి ,కె,సి,-707

అతిస్వల్పకాలిక : హెచ్. ఇ .యం-1129 వి.యల్ 42 ,ఎమ్.ఎమ్ .హెచ్-133

తీపి మొక్కజొన్న: మాధురి ప్రియా ,విన్, ఆరంజ్

పాప్ కార్న్: అంబర్ పాప్ కార్న్

బేబీ పాప్ కార్న్: హెచ్ ఐ ఎం 129 , వి ఎ ల్ 49

క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న: అంబర్ శక్తి ,హెచ్ క్యూ , పి.యం -1

చెవుడు నెలల్లో, మురుగు నీరు నిలువ ఉండే నెలల్లో సాగు చేయరాదు.

వితుకాలం: జూన్ 15 నుండి జులై 15  వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో  జులై ఆఖరు వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవచ్చు.

విత్తుపద్ధతి: తూర్పు-పడమర దిశలలో ఉన్న బోదెలకు  దక్షిణం వైపు పై నుండి 1 /3  వ వంతు ఎత్తుల్లో విత్తినచో మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఎదుగుదల బాగుంటుంది.బోదెలపద్ధతి నీటి పారుదలకు మరియు అధిక వర్షపు నీరు బయటకు పోవుటకు  సహకరిస్తుంది.

హైబ్రిడ్ రకాలకు 6-8  కిలోలు తీపి మొక్కజొన్న 4  కిలోల బేబీ కార్న్ రకానికి 10 కిలోలు విధానాన్ని ఎకరాకు వాడాలి.

థైరమ్/కప్తాన్  3  గ్రా. కిలో విధానానికి కలిపి విత్తిన శుద్ధి చేయాలి.

కలుపుప్ నివారణ: అట్రాజిన్ 50  శాతం పొడి మందును తేలిక నెలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నెలల్లో 1 .2  కిలోలు 200  లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2-3 రోజులలో నెలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసి వెడల్పకు కలుపును ఒక నెలవరకు మోకాలవకుండా నివారించాలి.

అంతర పంట: పాపుజాతి పంటలను అంతర పంటలుగా విత్తుకున్నప్పుడు అట్రాజిన్ కు బదులుగా పెండిమిథాలిన్ మందును ఎకరాకు ఒక లీటరు 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి.వర్ష భావ పరిస్థితుల్లో రెండు పంటలు వేయడం వల్ల ఒక పంట నష్టపోయిన మరొక పంట నుండి ఆదాయం పొందవచ్చు.పప్పుజాతి పంటలవల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.

ఎరువులు: ఎకరాకు 72 -80  కిలోల నత్రజని,24  కిలోల భాస్వరం, 20  కిలోల పోటాష్ నిచ్చు ఎరువులను వాడాలి.1 /3  వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పోటాష్ ఎరువులను విధి సమయంలో వేయాలి .30 -35  రోజుల మధ్య 1 /3  వంతు నత్రజని,సగం పోటాష్ ఎరువులను వేయాలి .మూడు పంటలకొకసారి ఎకరాకు 20  కిలోల జింక్ సల్ఫేట్ ను భూమిలో వేసి కలియదున్నాలి.పంటపై జింక్ సల్ఫేట్ ను భూమిలో వేసి కలియదున్నాలి.పంట పై జింక్ లోపే లక్షణాలను గమనిస్తే,2 గ్రాముల జింక్  సల్ఫేట్ ను లీటరు నీటిలో కలిపి వరం రోజులలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

 • ఆహార పంటగా సాగుచేసిన మొక్కజొన్నలో అంతరపంటగా పశుగ్రాసమునకై మొక్క జొన్నను ఒకమీటరు ఎత్తు పెరుగు వరకు సాగుచేయవచును.
 • 2.1  నిష్పత్తిలో మొక్కజొన్నలో కందిని అంతర పంటగా వేయవచ్చును. మొక్కజొన్న తరువాత కంది లేక వేరుశనగ సాగు లాభదాయకం

నీటియాజమాన్యం : మొక్కజొన్న పంట అధిక నీటిని మరియు నీటి ఎద్దడిని తట్టుకోలేడు విత్తిన తరువాత పొలంలో  నీరు నిలబడితే విత్తనం మొలకెత్తదు.30  రోజులలోపు పైరుకు అధిక నీరు హానికరం. అధిక వర్షాలతో నీరు నల్లబడకుండా బయటకు తీసివేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే  ఎకరాకు 25  కిలోల యూరియాను భూమిలో వేయాలి.తెగులు సోకకుండా మాంకోజెబ్ ను పిచికారీ చేయాలి.పూత దశ ముందు నుండి గింజ గట్టపడే వరకు పైరుకు నీరు అత్యవసరం. ఈ దశలో నీటి ఎద్దడికి గురైనచో  దిగుబడి తగ్గుతుంది.నీటి ఎద్దడి ఉంటె 20  గ్రా యూరియాను లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేసినచో  కొంతవరకు తట్టుకుంటుంది.వర్షాభావ పరిస్థితుల తర్వాత పడిన వానలకు ఎకరాకు 25  కిలోల యూరియాను అదనంగా వేసుకోవాలి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది.

కాండం తొలిచే చారల పురుగు నివారణకు విత్తిన 10 -20  రోజుల లోపు మోనోక్రోటోఫోన్ 1 .5 మీ.లి  లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా కార్బొఫ్యురం 3  జి గుళికలు ఎకరాకు 2  కిలోల చొప్పున మొవ్వుల్లో వేయాలి.

ఆకుమడు మరియు ఎండు తెగులు నివారణకు వరం రోజుల వ్యవధిలో 3  సార్లు మ్యాంకోజెబ్ 2 .5  గ్రా. లీటరు నీటికి పిచికారీ చేయాలి.సమయానుకూల సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.

గింజలలో 25 -30  తేమ శాతం ఉన్నప్పుడు కోయాలి. వారి తరువాత మొక్కజొన్నను జీరో టిల్లేజ్ లో వేయవచ్చు.

జొన్న

రకాలు: పి.ఎస్ .వి,1  సి.ఎస్.వి.13 ,15  నంద్యాల తెల్లజొన్న 2 ,3 ,4

సంకర రకాలు: సి.ఎస్. హెచ్.13 ,సి , ఎస్,హెచ్ ,16 ,సి.ఎస్.హెచ్.14 , సి.ఎస్.హెచ్.18

నెలలు: నల్లనేలలు, తేలికపాటి ఎర్రనేలలు

విత్తిన మోతాదు: 3-4  కేజీలు /ఎకరాకు

వితినసమయం ఖరీఫ్: జూన్  రబి :అక్టోబర్ -నవంబర్

కలుపు యాజమాన్యం: అత్రజోన్ -800  గ్రాములు ఎకరాకు

ఎరువులు: ఎకరాకు 50  కిలోల యూరియా (రెండుదఫాలుగా ) 100  కిలోలు  సింగల్ సూపర్ ఫాస్పేట్ మరియు 80  కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను వేయాలి.

సస్యరక్షణ:

 • జొన్నను ఆశించు ప్ప్రధానమైన పురుగు మొవ్వు చంపు ఈగ దీని నివారణకు కార్బో ప్యురాన్  3  శాతం గుళికల్ని ఎకరానికి 4  కిలోల చొప్పున మొక్కల సుడుల్లో వేయాలి.
 • ఖరీఫ్ బంకకారు తెగులు నివారణకు విత్తనశుద్ధి చేసిన విధానాన్ని వేసుకోవాలి(కిలో విధానానికి 3  గ్రా ,కాప్టాన్/థైరామ్) తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు మాంకోజెబ్ 2  గ్రా.లి. నీటికి కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
 • తెగుళ్ళల్లో గింజ బూజు ప్రధానమైనది. ఈ తెగులు ఖరీఫ్ లో ఎక్కువగా కనిపిస్తుంది.నివారణకు కాప్టాన్ మరియు అరియోఫంగిన్ (0 .2  గ్రా./లీ నీటికి ) లను కలిపివరం రోజుల వ్యవధిలో 2 -3  సార్లు పిచికారీ చేయాలి.
 • జొన్నను కందితో అంతరపంటగా 2 :1  నిష్పత్తిలో చేసుకొంటే ఆర్థిక,ఆ దిగుబడులను పొందవచ్చును.

సజ్జ

ఆర్థిక దిగుబడిని కాంపోజిట్ రకాలు : ఐ,సి,టి,పి,8203 ,ఐ.సి.ఎమ్.వి..221 , రాజ్ -171  మరియు హైబ్రిడ్

రకాలైన హెచ్,హెచ్,బి. 67 , ఆర్ .హెచ్ .బి.121 ,ఐ.సి.ఎమ్.హెచ్.356 ,ఎ.బి.హెచ్-1.

తేలికపాటి ఎర్రనేలలు మరియు నీరు నిలవాలి నల్లరేగడి నెలలు  అనుకూలం. ఎకరాకు 4  టన్నుల పశువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి.

ఎకరాకు 1.6  కిలోల విధానాన్ని ( కిలో విధానానికి 3  గ్రా. థైరామ్ లేదా కాప్టాన్ చొప్పున కలిపి శుద్ధి చేసుకోవాలి.) సళ్ళ మధ్య 45 సెం.మీ. దూరం మరియు సళ్లల్లో మొక్కల మధ్య 12-15  సెం.మీ. దూరంగా ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి.

ఎకరాకు 50  కిలోల యూరియా, 75  కిలోల సింగల్ సుప్ప్ర్ప్ ఫాస్పేట్, 35 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను వేసుకోవాలి. యూరియా మాత్రం రెండుదపాలులుగా సగభాగం వితేటప్పుడు మిగిలినస్ సగభాగం విత్తిన 25-30  రోజుల వయస్సు మొక్కలకు పై పాటుగా వేయాలి.

విత్తిన రెండు రోజులలోపు అత్రజోన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రా.చొప్పున 200  లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారీచేసి కలుపు మొక్కల ఉధృతని తగ్గించుకోవాలి.25 -30  రోజుల పంటలో దంతులతో అంతర సేద్యం చేస్తే కలుపు మొక్కలను పెరగనివ్వకుండా పంట బాగా పెరిగేలా దోహదపడుతుంది.

ఖరీఫ్ లో రెండు సళ్ళ సజ్జకు ఒక సాలు కంది పంటను అంతర పంటగా వేసుకొంటే ఆదాయం పెరుగుతుంది. ఖరీఫ్ లో సజ్జ పంటను తేనెబంక మరియు వెర్రితెగులు ఆశించుటకు అవకాశాలు ఉంటాయి .

కొర్ర

అధిక దిగుబడినిచూ కొర్ర రకాలు: ఎస్.ఐ.ఎ 3085  శ్రీలక్ష్మి, కృష్ణదేవరాయ, నరసింహరాయ మరియు ప్రసాద్

తేలికపాటి మరియు బరువైన ఎర్ర మరియు నల్ల నెలలు అనుకూలం. ఎకరాకు 2-4  టన్నులపశువుల  ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకొని బాగా కలియదున్నాలి.

జూన్-జులై మాసంలో ఎకరాకు 2  కిలోల విధానాన్ని సళ్ళ మధ్య 20-22.5  సెం.మీ. మరియు మొక్కల మశ్య 7.5  సెం.మీ.ఎడం ఉండేటట్లు గొర్రుతో విత్తు కోవాలి.( కిలో విధానానికి 2  గ్రా. రిదోమిల్ చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి) .

ఎకరాకు 35  కిలోల యూరియా మరియు 50  కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను వేయాలి. సగభాగం వితేటప్పుడు, మిగిలిన సగాన్ని విత్తిన 25  రోజుల తర్వాత పై పాటుగా వేసుకోవాలి.

కొర్ర కందిని 5:1  నిష్పత్తిలో, వేరుశనగను 2:1  నిష్పత్తిలో అంతరపంటగా సాగుచేసి ఆర్థిక దిగుబడులను సాధించవచ్చును.

శనగ

మనదేశంలో శనగ 8.71  మిలియన్  హైకోర్టులల్లో సాగియు చేయబడుతుంది. మన వార్షిక ఉత్పత్తి 8.25  మిలియన్ టన్నులు. మన  దేశంలో 2030  సంవత్సరానికి 10.22  మిలియన్ టన్నుల శనగలు అవసరమవుతాయని అంచనా, ప్రపంచ శనగ సాగు విస్తీర్ణం (71.08%) వయస్సు ఉత్పత్తి (71.51%) భారతదేశం అగ్రగామిగా ఉన్నప్పటికీ ప్రతియోటా భారతదేశం దాదాపు 400 కోట్ల రూపాయల శనగలను దిగుమతి చేసుకొంటుంది.. భారతదేశంలో శంగా సాగుచేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. గత పది సంవత్సరాలలో  శనగ సాగు విస్తీర్ణం ప్రతియోటా పెరగడమేకాక ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలోనే అత్యధిక శనగ ఉత్పాదకతను నమోదు చేసింది. శనగ పంట ఆషిక దిగుబడి శక్తి హైకోర్టుకు 5000  కిలోలుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. పెరుగుతున్న ఆహార అవసరాల దృష్ట్యా మన శనగ దిగుబడిని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

అవసరమైన రకాలు: శనగలో దేశవాలి మరియు కాబూలీ రకాలు లభ్యమవుతున్నాయి. భూమిలో నిలువ ఉన్న తేమ మరియు వర్షపాతాన్ని బట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న శనగరకాలు దాదాపు 90-120  రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. దేశవాలి రకాలలో కె.జి.11  కాబూలీ రకాలలో కె.ఎ.కె.-2  విహార్ మరియు లామ్ శనగ రకాలు అనువైనవి. ప్రస్తుతం మార్కెట్ లో కాబూలీ శనగ అత్యధికంగా ఆదరణ పొందుతుంది. శనగ గింజ సైజును బట్టి విత్తిన మోతాదు నిర్ణయించడం జరుగుతుంది.

విత్తన మోతాదు: దేశవాలి రకాలయితే ఎకరాకు 30 -35  కిలోలు, కాబూలీ  రకాలయితే 40-50  కిలోల విత్తనాలు విత్తాలి.

విత్తు సమయం: అక్టోబర్ -నవంబర్

విత్తనశుద్ధి: ఎండతెగులు మరియు వేరుకుళ్లు తెగులు నివారణకు కిలో విధానానికి 8  కిలోల గ్రా.ట్రైకోడెర్మావిరిడి అనే మిత్ర శిలింద్రము మరియు 2.5  గ్రా థైరము లేదా కప్తాన్ లేదా 2  గ్రా కార్బండిజమ్ వాడి విత్తనశుద్ధి చేయాలి.

ఎరువుల యజమాన్యము: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలో భాస్వరం, 16  కిలోల గంధకము నీచు ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. అంటే ఎకరాకు 18  కిలోల యూరియా 125  కిలోల మోనో అమ్మోనియం ఫాస్పేట్ కూడా ఒక ఎకరానికి కావలసిన పోషకానందిస్తుంది. గంధకము లోపమున్న నెలల్లో ఎకరాకు 5-8  కిలోల నీటిలో కరిగే గంధకము విత్తునప్పుడు వేయాలి. లేక గంధకము మూలా పదార్థమైతే (ఎలిమెంటల్ సల్ఫర్) విత్తుటకు ఒక నెల ముందుగా వేయాలి. కాలుష్యం కార్బోనేట్ అధికంగా ఉన్న నెలల్లో ఇనుప ధాతువులోపము గమనించినప్పుడు లీటరు నీటికి 5  గ్రా. అన్నభేది ఎకరాకు 20  కేజీల, జింకు సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి చివరి దుక్కిలో వేయాలి .

నీటి యాజమాన్యం: శనగ వర్షధారపు పంట అయినా తేలిక పాటి నీటి తడులు ముఖ్యము పూతదశ ( విత్తిన 30 -35  రోజులు )మరియు కాయదశలో (విత్తిన 55  రోజులు ) ఇచ్చిన ఆర్థిక దిగుబడులు సాధించవచ్చు. నీరు పెట్టినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
అంతర కృషి: పైరు విత్తిన 30  రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చేసుకోవాలి.రసాయనిక కలుపు మందులు పెండిమిథాలిన్ 1 .0 -1 -3  లీటరు 200  లి. నీటిలో కలిపి ఒక ఎకరానికి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. గొర్రుతో అన్తరకృషి చేసి కూడా కలుపు నివారించుకోవచ్చు.

సస్యరక్షణ: శనగపంట సాగులో పచ్చ రబ్బరు పురుగు, శనగపురుగు, వేరుకుళ్లు తెగులు మరియు ఎండుతెగులు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణ పద్దతులను పాటించాలి.

 • వేసవిలో లోతు దుక్కి చేయాలి.
 • పైరు చుట్టూ 4 -5  వరుసలు జొన్న పంటను విత్తుకోవడం ద్వారా పేనుబంక ఆశించకుండా తద్వారా ఎర్ర తెగులు  కాపాడుకోవాలి.
 • శనగలో ఆవాలు, ధనియాలు అంతరపంటగా వేయడం ద్వారా శనగపచ్చ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
 • ఎండు తెగులు మాశ్రీయు వేరుకుళ్లు తెగులు కిలో విత్తనానికి 8 గ్రా. ట్రీకోడెర్మా వీరిది అనే శీలింద్రముతో విత్తనశుద్ధి చేయాలి. రసాయనిక మందులైతే 2 .5  కప్తాన్ లేదా థైరామ్ లేదా 2 గ్రా . కార్బండిజమ్ పొడి మందును కిలో విత్తనానికి వాడి వీథినశుద్ధి చేయాలి.శనగపచ్చ పురుగు పైరును ఆశించకుండా కాపాడుకోవచ్చు.
 • పైరు తొలిదశలో పురుగు మందులను అవసరాన్ని బట్టి వాడాలి.
 • పచ్చ రబ్బరు పురుగు ( స్పాదోపతిరా ఎక్సిగ్వా ) ఆశించినప్పుడు  ఒక లీటరు నీటికి క్లోరిఫైరీఫేస్ 2 .5  గ్రా. కప్తాన్ లేదా 1 .5  గ్రా. లేదా 1 .మీ.లి. నోవాల్యురం కలుపుకొని పిచికారీ చేయాలి.
 • పూతదశలో 5  శాతం వేపగింజలు కషాయాన్ని వాడి శనగపచ్చ పురుగు పైరును ఆశించకుండా పిచికారీ చేయాలి.
 • ఎస్ .సి.వి. ద్రావణం ఎకరాకు 200  లార్వాల్ ఎక్వివలెంట్స్ (ఎల్.ఇ) చొప్పున పిచికారీ చేయవచ్చును.
 • పూతదశలో చదరపు మీటరుకు 2 -3  పురుగులు కనిపించినప్పుడు లీటరు నీటికి 1  గ్రా. అస్సిఫెట్ లేదా 2 .5  మీ.లి. క్లోరోఫాస్ లేదా 2  మీ.లి క్వినాల్ ఫాస్ లేదా 1 .5  గ్రా. థయోధికార్బ్ (లుర్విన్ ) లేదా 0 .4  మీ.లి. స్పైనోపాడ్ మందులను మర్చి మర్చి పిచికారీ చేయాలి. ఎకరాకు 200 -250  లీటర్ల మందు ద్రావణం వాడాలి.

కంది

సిఫారును చేసిన రకములు : యల్ .ఆర్ .జి. -41  యల్ .ఆర్ .జి.30 ,యల్ .ఆర్ .జి.38 ,యల్ .ఆర్ .జి.666 ,యల్ .ఆర్ .జి.1004 ,పి.ఆర్.జి. 100 ,పి.ఆర్.జి.158 , డబ్ల్యూ.ఆర్.జి 27 ,డబ్ల్యూ.ఆర్.జి 53 ,డబ్ల్యూ.ఆర్.జి-36 ,ఐ.సి.పి.ఎల్ -332 , ఐ.సి.పి.ఎల్86063 ,ఐ.సి.పి.ఎల్-87119 .

 • రకాన్ని బట్టి ఎకరాకు 3 -6  కిలోల విధానాన్ని వాడాలి .
 • రైజోబియం (200 గ్రా. ఎకరాకు) మరియు ట్రైకోడెర్మా విరిడి 8  గ్రా. కిలో విధానానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
 • కందితో పటు అంతరపంటగా పెసర /మినుము/వేరుశనగ/నువ్వులు/సోయాచిక్కుడు/జొన్న లేక మొక్కజొన్న పంటల్ని వేసుకోవాలి.
 • వర్షాలు ఆలస్యమైనప్పుడు కందిని ఆర్థిక విధానం వాడి ఏక పంటగా సాగుచేయాలి.
 • శనగపచ్చ పురుగును సమగ్ర సస్యరక్షణ పద్దతుల ద్వారా నివారించాలి.

మరుక మచ్చల కయ తొలుచు పురుగు:

 • ఎన్.ఎన్ .కె.ఇ.5 % లేదా వేపనూనె 5  మీ.లి. లీటరు నీటితో కలిపి పువ్వు మొగ్గ వచ్చే దశల్లో చల్లాలి.
 • దీని నివారణకు క్లోరిఫైరుఫాస్ 2 .5  మీ.లి. లేదా నోవోల్యురన్ 0 .75  మీ.లి. లేదా ల్యాండ్ సెహలోత్రిన్ 1 మీ.లి. డైక్లోరోవన్ 1 మీ.లి. తో లీటరు నీటికి కలిపి మందులు మర్చి పిచికారీ చేయాలి.

తెగుళ్లు:

ఎండుతెగులను ఐ.సి.పి. -87119 , ఐ.సి.పి 8863 ,మ్నుకోఫామినా ఎండు తెగులును తట్లుకొనే యం.ఆర్.జి.-1004  రకాలను సాగు చేయాలి.

మినుము

ఖరీఫ్ కు అనువైన రకాలు :

 • ఎల్ బిజీ -20 , టి -9 , ఎల్.బి.జి. 623 , డబ్ల్యూ .బి.జి.-26 పి.యు.-31
 • వరి మాగాణులకు అనువైన రకాలు ఎల్ బిజీ -402 ,611 ,648 ,752
 • తేలిక నెలల్లోనే, అనిశ్చిత వర్షపాత ప్రాంతాలలోను వర్షాధారంగా మినుముని సాగుచేయరాదు. వర్షాభావ పరిస్థితులను ఇవి తట్టుకోలేవు.
 • కిలో విధానానికి 30 గ్రా.కార్బొసల్ఫాన్ మరియు 2 .5  గ్రా. థైరామ్/కప్తాన్ మందును వాడి విత్తిన శుద్ధి చేయాలి.
 • దుక్కిలో ఎకరాకు 8  కిలోల నత్రజని 20  కిలోల భాస్వరం నిచ్ ఎరువుల్ని అందించాలి.
 • విత్తిన మరియు 50  రోజులకు 2  శాతం యూరియా పిచికారీ చేయాలి .
 • ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు 10  రోజుల వ్యవధిలో 0 .3 % కాపర్ ఆక్సీక్లోరైడ్ మందుల్ని పిచికారీ చేయాలి.
 • తుప్పు తెగులు నివారణకు మంకిజెన్ (0 .3 %) లేక ట్రై డెర్మర్ప్ తో కేరతిన్(0 .1 %) కలిపి విత్తిన 50 -55  రోజులకు వరం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

మరుక పురుగు సస్యరక్షణ:

 • ఎన్.ఎన్ .కె.ఇ. 5 %లేదా వేపనూనె 5  మీ.లి. లీటరు నీటిలో కలిపి పువ్వు, మొగ్గ వచ్చే దశల్లో చల్లాలి.
 • దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 .5  మీ.లి. లేదా 1  మి.లి. డైక్లోరోవన్ 1 .మీ.లి. లీటరు నీటిని కలిపి మందులు మార్చి మార్చి పిచికారీ చేయాలి.

పెసర

సిఫారసు చేయబడిన రకములు; యల్ .జి.జి.460 ,407 ,450 , యల్.జి.జి. 295   పియమ్.54 ,యల్.జి.జి.410 , టి.యమ్,96 -2 , డబ్ల్యూ.జి.జి. 37 . వారికి మందు పెసరని సాగుచేయవచు.

 • పళ్లకు తెగులుని తట్టుకునే రకాలు యల్.జి.జి. 460 ,407 , 450 పిడియమ్ 54 ,యమ్ .ఎల్ .267 డబ్ల్యూ జి.జి.37  సాగు చేయాలి.
 • దుక్కిలో 8  కిలోల నత్రజని,20 కిలోల భాస్వరం ఎరువుల్ని అంబడించాలి. విత్తిన 30 -40  రోజుల దశలో 2 .0 % యూరియా స్ప్రే చేయాలి.
 • అవసరమైన మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

అలసంద

 • తక్కువ వర్షపాతం గల తేలిక నెలలకు బాగా అనుకూలం.
 • తక్కువ పంట కలం కలిగి పలు రకాలుగా (పశుగ్రాసం,పాచికకాయ,గింజలు )ఉపయోగపడే వర్షధారపు పప్పుజాతిపంట అలసంద.
 • అనువైన రకాలు : కో -౭౦౨, జి.సి.-3 ,కో-4 ఎకరాకు 8 -10  కిలోల విధానం వాడి వరసల మధ్య 30 -45  సేమ్.మీ.దూరం ఉండేలా విత్తాలి.
 • అలసందను కంది జొన్న, ఆముదమాతో అంతర పంటగా సాగు చేయవచ్చును.
 • భూసార పరీక్షాలకు అనుగుణంగా ఎరువును వాడాలి.
 • 80 -90  రోజులకు కోతకు వస్తుంది. ఖరీఫ్ పంట కాలంలో ఒకటి, రెండు కోతలు తీసుకోవాలి.
 • ఎకరాకు 400 -500  కిలోల విత్తన దిగుబడి వస్తుంది.

అనుములు

 • చిరు అపరాలుగా మన ప్రాంతానికి బాగా అనుకూలమైన పంట .
 • తొలిదశలో బెట్టను బాగా తట్టుకునే 160 -180 రోజుల దీర్ఘ కలం పంట.
 • జూన్-ఆగష్టు నెలల్లో విత్తాలి. కంది, జొన్న పంటలలో అంతర పంటగా సాగు చెయ్యవచు.
 • వేరుశనగలో 10:1  నిష్పత్తిలో అంతర పంటగా సాగుచేస్తే ఆర్థిక నికరాదాయం వస్తుంది.
 • అన్ని కాలాలకు అనుకూలంగా తక్కువ కల పరిమితి (90 -100 రోజులు ) కల్గిన టి ఎఫ్ బి -1 , హెచ్ఎ-3  రకాలను జూన్ నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చును.
 • దీర్ఘ కాళికా రకాలకు ఎకరాకు 6 -8  కిలోలల్ విత్తనం వేడి వరుసల మధ్య 1 .0 - 1 .5  మీ.దూరం ఉండేలా విత్తుకోవాలి.
 • 5 % వేపగింజల కాషాయం పూత, కాయదశలో పిచికారీ చేసి చీడ, పీడలను సమర్థవంతంగా నివారించుకోవచ్చును.
 • దీర్ఘ కాళికా రకాలలో పైరు 50 -60 /70 -80  రోజుల వయసులో తీగలను కత్తిరించి పశుగ్రాసంగా వాడుకోవచ్చును. ఎకరాకు 1000 -1500  కిలోల పచ్చికాయ దిగుబడి వస్తుంది.

ఉలవ

 • వాతావరం పరిస్థితులు అనుకూలించనప్పుడు చివరగా ఆగస్టు-అక్టోబర్ ఉలవ విత్తుకోవచ్చును. చీడపీడల సమస్య తక్కువ. పశుగ్రాసంగానే కాకా, తక్కువ పెట్టుబడితో భూసారం పెంచుకోవడానికి చాల అనువైన వర్షధారపు పప్పుజాతి పంట.

ఉలవ రకాలు: పిడియమ్ -1 , పాలెం -1 ,2 , ఎ .టి.పి.హెచ్.జి.-11 రకాలను ఎంపిక చేసుకోవాలి.

 • ఎకరాకు 8  నుండి 10  కిలోల విధానాన్ని గొర్రుతో విత్తుకోవాలి.
 • ఎకరాకు 8  కిలోల యూరియా, 50  కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్ మరియు 15  కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ విధి ముందు వేసుకోవాలి.

గోరుచిక్కుడు

గోరుచిక్కుడు గింజల నుంచి తాయారు చేసిన జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలలో వాడతారు. బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగాను, గింజలను పశువుల దనగాను వాడతారు. ఈ పంటను పచ్చిరొట్ట ఎరువుగా మరియు ఔషధ తయారీలోనూ వాడుతారు.

వాతావరణం: గోరు చిక్కుడు తీవ్ర కరువు పరిస్థితులను, అధికవేడిని తట్టుకొనే గలుగుతుంది. అష్ట మండల పంట. ఇది తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది.

నెలలు: మురుగు నీరు పోయే సౌకస్యంగాల సారవంతమైన ఎర్రగారప నెలలు, ఒండ్రు నెలలు అనుకూలం.

రకాలు : HGS-563, RGM-112, GG-1, HG-365, RGC-936, మరియు RGC-1025 రకాలను ఎంపిక చేసుకోవాలి.

విత్తన మోతాదు: ఎకరాకు 5-6  కిలోలు

విత్తన శుద్ధి: విధి ముందు కిలో విధానానికి 3  గ్రా .మ్యాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేయాలి.

విత్తు పద్దతి: గొర్రుతో వాసాలలో విత్తుకోవాలి.

ఎరువులు: సారంలేని భూములకు, భూసార పరీక్షనుసరించి చివరి దుక్కిలో ఎకరాకు 20  కిలోల యూరియా, 100  కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్ చేయాలి.

అంతర పంటలు: కంది /జొన్న/సజ్జ పంటలు 7 :1  నిష్పత్తిలో విత్తుకోవలి.

కలుపు నివారణకు: కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1 .25  లీ. లేదా అలకలా 1 .0  లీ.200  లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు పిచికారీ  చేయాలి. విత్తిన 30  రోజుల వరకు పొలంలో ఎటువంటి కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.

మొక్కలు పలుచన : విత్తిన 20  రోజులకు పొలంలో మొక్కలను పలుచన చేసి మొక్కల మధ్య దూరం 10 సేమ్.మీ. ఉండేలా చేయాలి.

సస్యరక్షణ:

పెను బంక : చిన్న పెద్ద పురుగుల లె౫త ఆకుల నుండి రసం పీల్చి నష్టం కల్గిస్తాయి, వీటి నివారణకు డైమిథోమేట్లేదా మిథైల్ దేమాతం లేదా పిప్రోనిల్లోని ఏదేని ఒకమందును 2  మీ.లి. లీటరు కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు : ఆకులపై తెల్లని ప్పొడి పదార్థం ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే పసుపురంగుకు మరి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3  గ్రా. లేదా డైనొక 1 ,మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.తెగులు ఉధృతిఎక్కువ ఉంటె వరం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి.

పంట కోత సమయం :ఆర్థిక వర్షాలకు గురి కాకుండా వాతావరణ పరిస్థితులు గమనిస్తూ జాగ్రత్త వహించాలి. అధిక వర్షాలకు గింజనాన్యథా తగ్గి దార తక్కువ పలుకుతుంది.

పంట కోత : మొక్కలో 80 % కాయలు లెల్తా గోధుమ రంగుకు మారినప్పుడు మొక్కలు పీకివేయాలి.

పంట నూర్పిడి : బాగా ఎండిన తరువాత ట్రాక్టరు తో లేదా కర్రలతో కొట్టి గింజలు వేరు చేయాలి.

దిగుబడి (సగటు ) : ఖరీఫ్ ఎకరాకు 3 -4  క్వి వేరుశగనగా ప్రత్యామ్నాయ పంటగా గోపృచిక్కుడు (జిగురు ) సాగు చేసుకొనే ముందు రైతులు మార్కెట్ సదుపాయము ఏర్పాటు చేసుకోవాలి.

వేరుశనగ

వేరుశనగ ప్రధానమైన నూనెగింగ్జాల పంట. వేరుశనగ సుమారు ఆంధ్రప్రదేశ్ 20  లక్షల హైకోర్టుల లో సాగు చేయబడుతుంది.సగటుఉత్పాదక ఎకరాకు 7 .42  కిలోల ఆధునిక పరిశోధన ఫలితాల ఆధారముగా వేరుశనగలో ఆర్థిక దిగుబడులు ఈ క్రింది యాజమాన్య పద్దతుల పాటించాలి.

నెలలు మరియు పొలం తయారీ : మురుగు నీరు పోవు వసతి వున్నా తేలిక నెలలు వేరుశనగకు చాల అనుకూలమైనది . ఎప్పుడు చెమ్మ కలిగియుండి నీరు సరిగా ఇంకాని బరువు నెలలు పనికిరావు.ఏప్రిల్ -మే  మాసాలలో తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలమును దున్నుకోవాలి. వేసవి దుక్కుల వలన వేరుశనగ లో  చీడపీడల తాకిడి తగ్గి ఆర్థిక దిగుబడులు పొందవచ్చును.

విత్తు సమయం:

 • ఖరీఫ్ పంటలను /జులై మొదటి పక్షం లోపల, లేనట్లయితే జులై ఆఖరు వరకు విత్తుకోవలి.
 • వేరుశనగతో పటు కంది 7.1 (లేదా ) 11.1  (లేదా ) 15.1  భూసారాన్ని మరియు వితే సమయాన్ని అనుసరించి అంతర పంటగా వేసుకొనిన వర్షాధార వేరుశనగలో లాభదాయకము.

విత్తన మోతాదు :

 • వేరుశనగలో విత్తనానికి చాల ప్రాముఖ్యత కలదు. విత్తన ఖరీదు ఎక్కువ కావున విత్తనాన్ని ఎన్నుకోవడంలో జాగ్రత్తపడాలి.
 • వర్షధారపు పంటకు లావు గింజ రకాలను (తిరుపతి -4 జె.ఎల్.24 .కె.-6  ) వాడినప్పుడు 52  కిలోల విధానఁ అవసరమౌతుంది. అదే సన్నగింజ రకాలు ( వేమన,టి.ఎం.వి.-2 నారాయణి ) వాడినపుడు ఎకరాకు 40  కిలోల విధానం కావాలి. చిన్న విధానము వాడుకున్నట్లైతే దిగుబడిలో తేడా లేకుండా ఖర్చు తగ్గుతుంది.గింజ బరువు మరియు వితే పద్ధతి బట్టి విత్తిన మోతాదు మారుతుంది.

విత్తన శుద్ధి: కిలోవిధానానికి 3  గ్రాముల మాంకోజెబ్ లేక 1  గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి.వేరుపురుగు ఉధృతి - ఎక్కువగా వున్నా ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మీ.లి. క్లోరిపైరిపాస్ లేక 2 మీ.లి.ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలిపి శుద్ధి చేయాలి.

రకాలు : అధిక దిగుబడినిచ్చే రకాలైన కె-6 నారాయణి, కదిరి హరితాంధ్ర, అనంత, ఐ.సి.జి.వి.-91114 , ధరణి రకాలను ఎంపిక చేసుకోవాలి.

విత్తుపద్ధతి: వర్షాధారం క్రింద జులై నెలలో వర్షం పడినపుడు నెలలో తేమను కాపాడుకొని తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనాలు విత్తుకోవడం వలన మంచి దిగుబడులు పొందవచ్చును . ఇటువంటి సమస్యలు ఆధికమించడం రైతులు విధానాల్ని విత్తుటకు యంత్రాల వైఫు మొగ్గు చూపడం ఎంతైనా అవసరం. అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన అనంత వేరుశనగ విత్తు పరికరము వాడటం ద్వారా సకాలంలో నెలలో తేమ వున్నప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో విధానం విత్తుకోవచ్చు.

భూసార పరీక్షల  ఆధారంగా ఎరువుల వాడకం

 • వేరుశనగలో సాధారణంగా రైతుల భూసార పరీక్షా చేయకుండా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీని వలన సాగు ఖర్చు తో పటు భూమిలో భాస్వరం నిల్వలు పెరిగి సుక్మా పోషకాల లోపే లక్షణాలు ఎక్కువయ్యాయి.
 • భూసార పరీక్షా - ఆధారంగా భాస్వరం మరియు పోటాష్ ఎరువులను వదిన రైతు పద్ధతులు వాడైన దిగుబడిలో తేడా లేదని తెలిసింది.నెలలో లభ్యమయ్యే పోషకాలు తక్కువగా ఉన్నచో సిఫారసు చేసిన ఎరువులు, మధ్యస్థముగా ఉంటె సిఫారను చేసిన మోతాదులో సగము, ఎక్కువగా ఉన్నచో ఎరువులు వేయకూడదు.

సుక్మా పోషక పదార్థాలు లోపాలు - సవరణ : జింకు లోపించిన పైరు ఆకులు చిన్నవిగా మరి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబారతాయి. ఆకు ఈ నెల మధ్య భాగం పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400  గ్రా చొప్పున జింక్ సల్ఫేట్ 200  లీటర్ల నీటిలో కలిపి వరం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇనుము ధాతులోపం నల్లరేగడి నెలల్లో ఆర్థిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు గాను, తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని సమయానికి ఎకరాకు 1 కిలో అన్నభేది మరియు 200  గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200  లీటర్ల నీటిలో కలిపి వరం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

కలుపు నివారణ, అన్తరకృషి: కలుపు ప్లోకోరలిం 45 % ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 % ఎకరాకు 1-2 -1.6  లీ (లేదా ) చొప్పున ఎదో ఒకదానిని విత్తిన వెంటనే గని -మరుసటి రోజున గని పిచికారీ చేయాలి. విత్తిన 20  నుండి 25  రోజులపుడు అంతర కృషిచేయాలి.

పంటకోత: మొక్కల ఆకులు, కొమ్మలు 70 -80  శాతం పసుపు వర్ణంగా మరి కాయపై డొల్ల లోపలి భాగము నలుపుగా మారినప్పుడు పంటను తీయాలు. నెలలో తగినంత తేమ వున్నప్పుడు కూలీలను ఉపయోగించి పంటను తీయాలి. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎద్దులతో లాగు గుంటకతో గని ట్రాక్టరుతో లాగు గుంటకను ఉపయోగించి, లేక ఆశ గుంటకతో గని పంటను తీయవచును. పంట తీసిన తరువాత పరిస్థితులను బట్టి పచ్చికట్టే  నుండి కాయలు తీయవచ్చు. లేదా మార్పిడి యంత్రములతో కాయలను వేరుచేయవచును. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి.

పంట కోడె పరికరాలు:

ఎ) బ్లాగు గుంటక ANGRAU : నెలలోని తేమ తక్కువగా ఉన్నప్పుడు ఈ ట్రాక్టరుతో లగే ఆంగ్రో బ్లేడ్ గుంటకను ఉపయోగించి ఒకేసారి 4  వరుసల్లోని వేరుశనగ మొదళ్ళను వేర్లతో సహా పెకలించవచ్చు. ఈ పరికరంలో 15  మీ.లి.మన్దమ్ కలిగి 1 .5  మీటర్ల పొడవుతో గల బ్లేడ్ ప్రేముకు అమర్చి ఉంటుంది. ఈ బ్లేడ్ ముందుభాగం పదునుగా ఉండటం వాళ్ళ నేలలోకి బాగా చొచ్చుకునిపోతుంది. ఈ బ్లేడ్ అరిగిపోతే కొత్త బ్లెడును అమర్చుకోవచ్చు.బ్లేడ్ 15 సేమ్.మీ. వరకు నేలలోకి చొచ్చుకుని పోవడం వాళ్ళ అన్ని మొక్కలు , కాయలు విడిపోకుండా నేలపైకి వచ్చేస్తాయి. దీని ద్వారా రోజుకు సుమారు 4  నుంచి 5  హెక్టార్ల విస్తీర్ణంలో పంట కోయవచును. ఈ పరికరం ఖరీదుఋ. 20 .000 వరకు ఉంటుంది.

ఆషా గుంటక : ఆశ గుంటక కూడా ANGRAU  బ్లేడ్ గుంటకాలాగే పనిచేస్తుంది. దీనిలో బ్లేడ్ "V " ఆకారంలో ఉంటుంది. ఒకేసారి 6  వరుసలోకి మొక్కలను ఏమాత్రం నష్టపరచకుండా కేవలం భూమిలోపల వేర్లను మాత్రమే తెంచుతుంది. దీని ద్వారా ఒక రోజులో 5  నుంచి 6  హెక్టార్ల పంట కోయవచును. ఈ పరికరం ఖరీదు రూ. 35 ,000  వరకు ఉంటుంది.

బి ) వేరుశనగ డిగ్గర్, షేకర్, (వేరుశనగను తవ్వి, కాయల నుంచి మట్టిని వేరుచేసి 4  వరుసలను ఒకే వరుసలో వేసే యంత్రం ): ఈ యంత్రాన్ని అన్ని రకాలైన 45 హెచ్.వి.ట్రాక్టర్లను ఫై.టి.ఒ.షాఫ్ట్ ద్వారా అమర్చుకుని వాడుకోవచు. ఇది ఒకేసారి వేరుశనగ మొక్కలను కాయలతో సహా తవ్వి మట్టి నుంచి వేరుచసి,ఒకే వరుసలో వేస్తుంది. కాయలు మొక్క నుంచి ఏమాత్రం విడిపోవు , పగలవు ఈ యంత్రంలో "V " ఆకారం కలిగిన బ్లెడు ఫ్రేముకు అమర్చి ఉంటుంది. ఎలివేటరు, బ్లెడు తవ్విన మొక్కలను పైకి తీసుకుని వెళ్లి మట్టిని వేరుచేసి ఒకే వరుసలో వేస్తాయి. ఒక గంటకు 1 -5  నుంచి 2  ఎకరాల వేరుశనగ పంటను తవ్వితీయగలదు. కేవలం ఒక ట్రాక్టర్, డ్రైవర్ సహాయంతో పనిచేస్తుంది.వేరుశనగ తవ్వే సీజనులో కూలీలా సమస్య తీరుతుంది.నిర్వహణ ఖర్చు ఏమాత్రం ఉండదు. ఈ యంత్రం ఖరీదు రూ.1 ,80 ,000 .

పంట నూర్పిడి యంత్రాలు:

ఎ) ANGRAU: వేరుశనగలు కాయలను తెంచు యంత్రం : ఈ పరికరంతో కట్టే పచ్చిగానే ఇండగానే కాయలను వేరు చేయవచ్చు. ఇది 2 హెచ్.ఫై.కరెంటు మోటారు సహాయంతో పనిచేస్తుంది.వేరుశనగ కట్టే వేర్లను పానాలుగా యంత్రంలోకి పట్టి ఉంచితే కాయలను వేరుచేస్తుంది. ఇందులో 150  సేం.మీ.పొడవు 40 .సేం.మీ.వ్యాసం గల సిలిండర్ ఇనుప రేకుతో చేసి ఉంటుంది,. సిలిండర్ ఉపరితలం పై 4 .మీ.మీ. ఇనుప చువ్వలతో లావులను "U " ఆకారంలో చేసి ఒక క్రమపద్ధతిలో అమర్చుతారు. ఇలా అమర్చిన సిలిండరును యాంగిల్ చట్రం పై అమర్చి చుట్టూ రేకుతో మూసివేస్తారు. కాయలతో పటు ఉన్న మట్టి, ఇసుక వంటి పదార్థాలను జల్లించి వేరుచేయడానికి సిలిండర్ కింది భాగంలో జల్లెడ ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ యంత్రంలో రోజుకు 200 కిలోల కాయలను 5  మందికి కూలిన సహాయంతోప్ తెంచవచ్చు.

బి) పంట కొత్త అన్తరా వెంటనే ఉపయోగించుకొని వేరుశనగ కాయలను వేరుచేసే యంత్రం (ఫ్రెష్ పాడ్ త్రేషర్): రైతులు ఉపయోగించే సాధారణ డీజిల్ ఇంజనుతో పనిచేసే యంత్రం ద్వారా కాయలను వేరుచేయవచును కానీ ఈ యంత్రం ఉపయోగించాలంటే తవ్విన పంటను 3  నుంచి 4  రోజులు పొలంలోనే తేమ తగ్గడానికి సూర్యరశ్మిలో (ఎండలో ) ఆరబెట్టాలి . ఆ సమయంలో వర్షం వచ్చి పంట తడిస్తే పంట పాడై రైతు నష్టపోతాడు. ఈ పరిస్థితిలో పంట కోత అనంతర వెంటనే ఉపయోగించి ఫ్రెష్ పాడ్ త్రేషర్ రైతుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు పంటను తవ్వి తీసిన వెంటనే ఏమాత్రం పంటను ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేకుండా మొక్క నుంచి కాయలను ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చు.ఇది 35  హెచ్.పి. ట్రాక్టరుకు ఉండే పి.టి.ఓ షాఫ్ట్ కు అనుసందానినించడం ద్వారా పనిచేస్తుంది. ఒక గంటకు సుమారు 400 నుంచి 500  కిలోల కాయలను వేరుచేస్తుంది.ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.1 ,80 ,000 . మొక్క నుంచి కాయలను వేరుచేసే సమయంలో కాయలు ఏమాత్రం పగలవు. దీనిని ఉపయోగించుటకు 6  మంది కూలీలు అవసరం అవుతారు.కూలీలా ఆడ, సులభంగా ఉపయోగించడం, శ్రమ తగ్గించడం అత్యధిక సామర్థ్యం, స్వల్ప సాంకేతిక నైపుణ్యం, నాణ్యత, సకల వినియోగం ఈ యంత్రం ప్రత్యేకతలు.

సి) డీజిల్ ఇంజనుతో పనిచేసి వేరు శనగ కాయలను వేరుచేసే యంత్రం :ఈ యంత్రం 10  హెచ్ .పి. డీజిల్ ఇంజనుతో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించాలంటే తవ్వి తీసిన పంటను పొలంలోనే 3  నుంచి 4  రోజులు ఎండలో ఆరబెట్టాలి.సుమారు గంటకు 200 -300  కిలోల కాయలను వేరుచేయవచును. దీనిని ఉపయోగించుటకు 6 మంది కూలీలు అవసరం అవుతారు. దీని ఖరీదు సుమారు రూ.1 ,10 ,000  ఉంటుంది.

నిల్వ చేసిన వేరుశనగ నశించే నల్లపెంకు పురుగు (ఊజీపురుగు )-నివారణనిలువచేసిన వేరుశనగ కాయలను, గింజలను నష్టపరిచే నల్ల పెంకు పురుగు అనంతపురం. కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఆశిస్తోంది.మీగడ తెలుపు రంగులో నున్న గ్రుడ్డును కాయలమీద పెడతాయి.గుడ్డు నుండి వెలువడిన లార్వా తొక్కను తొలుచుకొనిపోయి గింజలను తింటుంది.ఈ దశలో కాయకు నష్టం కలిగినట్లు గుర్తించడం కష్టం కోశస్థదశ కాయలోపలగాని, బయటగాని గడిపి నల్లని రెక్కలుగా పెంకుపురుగులు బయటకు వస్తాయి. ఈదశలోనే పురుగు చేసిన నష్టం కనబడుతుంది. కానీ పాడైన గింజలు ఎందుకు పనికిరావు. ఈ పురుగు కల్లంలోని కాయలకు గనిపురుగు పట్టిన వేరుశనగ పంటకు దగ్గరగా నిల్వచేసిన కుప్పకు గని ఆశిస్తుంది.

యాజమాన్యం :

 • కాయలను బాగా ఎండబెట్టి నిల్వ చేయాలి.
 • ఎబిసిడి ను ఒక కిలో కాయలకు 5  గ్రా చొప్పున కలిపి నిల్వ చేయాలి.
 • పురుగు ఆశించిన కాఖ్యలకు సెల్ఫాన్ 3  గ్రా బిళ్ళ ఒక బస్తాకు ఒకటి చొప్పున ఉఉపయోగించి పొగబెటాలి.
 • పొగ పెట్టునపుడు బస్తాల ప్లాస్టిక్ లేదా పాలితిన్ షీట్ కప్పి పొగ బయటకు రాకుండా జాగ్రత్త పడాలి.
 • విధానం కొసం నిలువచేసే కాయలను థైరము పొడి మందుతో కిలో కాయలకు 3  గ్రా చొప్పున కలిపి నిలువ చేయాలి.
 • కాయలను ఎండబెట్టేటప్పుడు చింత, సీమచింత చెట్లకు దూరంగా ఎండబెడితే వీటిని ఆశించే పెంకుపురుగులు వేరుశనగను ఆశించకుండా ఉంటాయి.
 • పాడైపోయిన కాయలు, చేతను తీసివేసి శుభ్రం చేయాలి. కాయలను శుభ్రమైన సంచులలో నిలువ చేయాలి.
 • పథ గొనె సంచులను నిల్వ చేయడానికి ఉపయోగించి నట్లైతే వాటికీ చిగురులు లేకుండా చేసి మలాథియాన్ 50 ఇ.సి .2  మీ. /నీటికి కలిపి అద్రావణంలో మంచి ఆరబెట్టి తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించాలి. నిల్వచేసే గోధుమలను ముందుగా శుభ్రం చేసి గోధుమలను పై కప్పు గోడలు నెలలో పగుళ్లు రంద్రాళ్ళు లేకుండా సిమెంట్ తో పూడ్చి వేయాలి. తర్వాత నేలపై గోడలకు పైకప్పుకు మరియు గొనె సంచులు మలాథియాన్ 50 ఇ .సి.,10 మీ.లోకి. నీటికి లేదా డైక్లోర్ వష్ 76 % ఎస్ ,సి,7 .మీ.లి./లి నీటికి లేదా డెల్టా మేత్రిన్ 2 .5  డబ్ల్యూపీ 40 గ్రా./లి. నీటికి కలిపి 3  లీటర్ల విస్తీర్ణం పిచికారీ చేసుకోవాలి.

కాయలతో నింపిన సంచులను చెక్క  ప్లాంట్ఫామ్ పై గోడలకు దూరంగా ఉంచాలి. పదిహేను రోజుల కొకసారి కాయలను చూసి పురుగులు వున్నది లేనిది నిర్ధారించాలి.

ఆముదము :

రకాలు: క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాలా .

నెలలు: ఖరీఫ్ : నీరు నిలుపుకోగల తేలిక నెలలు నీరు ఇంకిపోయే నెల్లరేడగి నెలలు.

విత్తనా మోతాదు: రకాలు : 4 కేజీలు /ఎకరాకు హైబ్రిడ్ :2  కేజీలు /ఎకరాకు.

విత్తుసమయం ఖరీఫ్ :జులై -ఆగష్టు  రబి : అక్టోబర్

కలుపు యాజమాన్యం: విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 1 .22 -2 .0 లి /ఎకరాకు పిచికారీ చేయాలి.

ఎరువులు: 30 కి. నత్రజని, 16  కి.భాస్వరం , 16 కి. పోటాష్ /ఎకరాకు. నత్రజని సగభాగం దుక్కిలో మిగిలిన సగభాగం 2 దఫాలుగా విత్తిన 30 ,60  రోజులకు వేయాలి.

సస్యరక్షణ: దాసరి /నామాల పురుగు నివారణకు ఏసీ ఫెట్ 1 .5  గ్రా. ప్రొపెనోఫేస్ 2 మీ.లి. /నోవోల్యురం 1 .మీ.లి. /థయోధికార్బ్ 1 .5  లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రొద్దు తిరుగుడు

హైబ్రిడ్: కె.బి.ఎన్ .హెచ్.1 ,కె.బి.ఎన్.హెచ్ 44 , ఎన్.ఓ .ఎన్ .హెచ్.1  డి .ఆర్.ఎన్.హెచ్.1 , డి.ఆర్ .ఎఫ్.ఎన్.108 . ఎ.ఫై.ఎన్ .హెచ్.66 .

నెలలు: అన్ని రకాల నెలలు అనువైనవి .

విత్తిన  మోతాదు: 2  కేజీలు /ఎకరాకు

విత్తుసమయం: ఖరీఫ్ : జులై -ఆగష్టు రబి : అక్టోబర్

కలుపు యాజమాన్యం: విత్తిన వెంటనే పెండిమేథాలిన్ 1 .2 -2 .0  లీ/కి. ఎకరాకు పిచికారీ చేయాలి.

ఎరువులు: వర్షాధారం: 24  కి. నత్రజని 24 కి. భాస్వరం ,12 పోటాష్ /ఎకరాకు

నీటి పారుదల: 32  కి నత్రజని 36  కి. భాస్వరం 12 కి. పోటాష్ /ఎకరాకు .

సస్యరక్షణ: రసంపీల్చే పురుగుల నివారణకు ట్రెయజోఫ్యాన్ 2 .5  మీ.లి /ఏసీ ఫెట్ 1 గ్రా./మోనోక్రోటో ఫేస్ 1 .6 మీ.లి. /థయోమీథేక్సిమ్ 0 .5  గ్రా . లీటరు నీటికి  కలిపి  పిచికారీ చేయాలి . ఆకు తినే పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1 .6  మీ.లి./ క్లోరిపైరి ఫాస్ 2 .5  మీ.లి. /స్ప్రెనోషడ్ 0 .5  మీ.లి .నోవాల్యురం 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి . తుప్పు తెగులు, ఆకు మచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 . గ్రా ,మాంకోజెబ్ మరియు 1  గ్రా.ప్రాపికోనజోల్ కలిపి పిచికారీ చేయాలి.

నువ్వులు

రకాలు: గౌరీ,మాధవి, రాజేశ్వరి, చందాన, హీమా, శారద, శ్వేత, వై .ఎల్.ఎం .11 . వై .ఎల్.ఎం.17 .

నెలలు: మురుగు నీరు నిలువని తేలికైన ఎర్ర, ఇసుక మరియు గరపా నెలలు, ఇసుక నెలలు అనువైనవి.

విత్తన మోతాదు: 3  కేజీలు / ఎకరాకు ఇసుకతో కలిపి చల్లాలి.

విత్తు పద్ధతి: గొర్రుతో 30  సి.మీ. -15  సెం .మీ. దూరం లో విత్తుకోవాలి.

విత్తుసమయం: ఖరీఫ్ ; మే -జూన్ రబి : డిసెంబర్ 15 -జనవరి 1 5

కలుపు యాజమాన్యం: విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 1 .2 -2 .0 లీ. ఎకరాకు పిచికారీ చేయాలి.

ఎరువులు: ఖరీఫ్ :16 కి . నత్రజని , 8 కి. భాస్వరం , 8 కి .పోటాష్/ ఎకరాకు .

రబి: 24 కి . నత్రజని ,16 కి , భాస్వరం, 8 కి. పోటాష్ / ఎకరాకు .

సస్యరక్షణ: ఆకుముడత మరియు కాయతొలుచు పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1 .6  ,ఐ.లి. /డైమిథోయేట్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులును తట్టుకొనే రకాలైన రాజేశ్వరి, చంద, హిమ రకాలను సాగు చేసుకోవాలి.తెగులు సోకినా మొక్కలను పీకి తగలబెట్టాలి, పైరుకు మిథైల్ దేమంటే 1 .మీ.లి. లేదా డైమిథోయట్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దీపపు పురుగులను అరికట్టాలి.

బి.టి. ప్రత్తి

మన రాష్ట్రంలో పండించే వివిధ వాణిజ్య పంటలలో ప్రత్తి పంట ప్రధానమైనది. ఈ పంట రాష్ట్రంలో సుమారుగా 40 -45  లక్షల ఎకరాలలో సాగుచేసి ఎకరాకు దాదాపు 619  కిలోల సరాసరి  దూడి దిగుబడి సాధించడం జరిగింది. ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వివిధ కళాపరిమితిలతో, విశిష్ట లక్షణములు గల ఎన్నో మేలైన ప్రత్తి సాధారణ మరియు సంకర జాతి రకాలను విడుదల చేయబడినప్పటికీ, ప్రస్తుతము రైతులు బి.టి. ప్రత్తి వంగడాలను మాత్రమే ఆదరిస్తున్నారు. కాయతొలుచు పురుగులతో పాటుగా లద్దెపురుగును తట్టుకొనునాటి బోల్ గార్డ్ -2  సంకర ప్రత్తి విత్తనాలు ప్రస్తుతం మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. బి.టి. ప్రతిలో సకాలంలో సరైన సమగ్ర యాజమాన్య పద్దతులను పాటించడమే ద్వారా ఆర్థిక దిగుబడి పొందవచ్చును.

సమగ్ర సేద్య విధానం:

 • నల్లరేగడి భూములు మరియు నీరి సదుపాయం గల సారవంతమైన ఎర్రనేలలు ప్రత్తి సాగుకు అనువైనవి.
 • సమస్యాత్మక భూములు, చల్కనెలలు, మురుగు నీటి వసతిలేని నెలలు మరియు తరుచుగా నీటి ఏడాదికి గురయ్యే నెలల్లో ప్రతిని పండించరాదు.
 • ఉదజని సూచిక 6 .5  నుండి 8 .0  వరకు ఉన్నటువంటి నెలలు ప్రతిసాగుకు అనుకూలమైనది.
 • వేసవిలో లోతు దుక్కులు చేసుకొని తొలకరి వర్షాల అనంతరం నేలను 2 -౩ సార్లు దున్నుకోవాలి.
 • నల్లరేగడి నెలలో సళ్ళ మధ్య 90  నుండి 120  సెం.మీ. మొక్కల మధ్య 45 -60  సెం.మీ. ఉండునట్లు మరియు ఎర్రనేలల్లో ఉండునట్లు నెల స్వభావము, వర్ష పాఠము మరియు బి.టి. సంకర ప్రతు రకమును బట్టి అచ్చు వేసుకోవాలి.
 • 2010 వరకు 457 బి.టి . ప్రత్తి సంకరజాతి రకాలను భారత ప్రభుత్వము,జెనిటిక్ ఇంజనీరుంగును అప్రూవల్ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు అనుమతించబడినవి. ఇన్ని రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు 20  నుండి 30  అధిక దిగుబడినిచే రకాలను మాత్రమే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.
 • ప్రతిరైతులై గత రెండు , మూడు  సంవత్సరముల సాగు అనుభూతిని బట్టి, ప్రాంతానికి అనువైన బి.టి. ప్రతు సంకరజాతి రకాలని ఎన్నుకోవాలి.
 • రాష్ట్రంలో ప్రతిని పండించే జిల్లాల్లో కోస్త ప్రాంతములో జూన్ మాసం నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతములో జూన్ నుండి జులై మొదటి పక్షం వరకు ప్రత్తి విత్తుటకు అనుకూలము.
 • ప్రత్తి విత్తనాలకు తొలకరి తర్వాత కనీసం 75  కి.మీ. వర్షపాతము పడినప్పుడు సరియైన తేమ ఉన్నప్పుడు విత్తుకోవాలి.
 • తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగులకు మ్నారియు తెగుళ్లు నివారణకు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి.
 • ఎకరాకు 750  గ్రా. నుండి 1  కె.జి.బి.టి. ప్రతు విధానాలను వాడాలి.
 • బి.టి . ప్రతిలో సుస్థిరమైన పంట దిగుబడికి అంతర పంటలను సాగుచేయాలి. దీనికొరకు పెసర, మినుము, సోయాచిక్కుడు, అలసంద లాంటి పంటలను 1:2  లేదా 1:3  నిష్పత్తిలో సాగుచేయాలి. ప్రతిలో కందిని అంతర పంటగా సాగుచేసినప్పుడు 4:1  లేదా 6:1  లేదా 8:2  నిష్పత్తిలో సాగుచేసుకోవాలి.
 • పశువుల ఎరువు ఒక ఎకరానికి 4 -5  టన్నులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
 • మొత్తం సిపార్సు చేసిన భాస్వరము ఆఖరి దుక్కిలో వేసుకోవాలి , నత్రజని మరియు పొటాషియం ఎరువులను నాలుగు దఫాలుగా విత్తిన 20  నుండి 90  రోజుల లోపల సరియైన తేమ ఉన్నప్పుడు పైపాటుగా వేసుకోవాలి.
 • ప్రత్తి విత్తిన వెంటనే 24-36  గంటలలోపు అనగా పంట మరియు కలుపు మొక్కలు మొలవక ముందు కలుపు నివారణకు ఎకరానికి పెడ్నిమిథాలిన్ 1.25 1-5  లి. /200  మీ.లి. నీటిలో (5 మీ.లి./లీటరు నీటికి ) కలిపి పిచికారీ చేయాలి.
 • ప్రత్తి మొలకెత్తిన తర్వాత 25 -35  రోజులకు కలుపు సమస్య నివారణకు క్విజులో పస్ఇథైల్ 400 మీ.లి./ఎకరానికి (2 మీ.లి./లీటరు నీటికి ) మరియు పైరితయోబక్ 250  మీ.లి. ఎకరానికి (1.25  మీ.లి. లీటరు నీటికి ) కలిపి పిచికారీ చేసినట్లయితే గడ్డిజాతి మరియు వెడల్పాటి ఆకుజాతి మొక్కలన్నింటిని సమూలంగా నివారించు కోవచ్చు. ఈ ముందుక వలన ప్రత్తి పంటకు ఎటువంటి హాని జరగదు.
 • ప్రత్తి విత్తిన తర్వాత పరిస్థితులను బట్టి గొర్రు మరియు గుంటకాలతో పదఫాలుగా అన్తరకృషిగా చేయాలి.
 • వర్షాలు ఎక్కువగా ఉండి, అన్తరకృషి ద్వారా కలుపు నివారణ వీలుకాని పారిస్తుతులలో ప్యారక్వాట్ (5.0 మీ.లి./లి  నీటికి ) లేదా గైఫొసేట్ (10 మీ.లి.) తో పాటు 10  గ్రా. యూరియా లీటరు నీటికి కలుపుకొని ప్రత్తి మొక్కలపై పడకుండా, వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పంటకు అందించాలి.
 • ఆర్థిక వర్షకు కూడా అధిక తేమ కంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, సిఫార్సు చేసిన ఎరువులతో పాటు అదనంగా ఎకరాకు 25-30  కిలోల నత్రజని, 10  కిలోల పాఠశాలను పైపాటుగా పంటకు అందించాలి.
 • నీటి సౌకర్యం ఉన్నచో ప్రత్తిపంట పూత మరియు కయ అభివృద్ధి దశలో నీటితడులు ఇవ్వాలి.
 • ప్రతికూల పరిస్థితుల్లో (అధిక తేమ/బెట్ట) మొక్కల జీవన ప్రక్రియలలో మార్పులవలన ప్రతిలో గూడ, పూత మరియు పిండేరాలటం జరుగుహఃతుంది. దీనిని సకాలంలో పోషక పదార్థములు మరియు హార్మోనుల పిచికారీ చేయటం ద్వారా సరిదిదుకో వచ్చును. దీని నివారణకు నఫ్తాలిన్ ఎసిటిక్ 10  ఫై.సి.ఎం. ద్రావణాన్ని (నఫ్తాలిన్ ఎసిటిక్ యాసిడ్, ప్లోనోఫిక్స్ అనే పేరుతో లభ్యమౌతుంది. పిచికారీ చేసుకోవచ్చు. విడిగా లేదా 1-2 % డి.ఎ .ఫై ద్రావణంతో లేదా 2% యూరియా +1% మ్యురేట్ ఆఫ్ పోటాష్ లెల్డా 2% పొటాషియం నైట్రేట్ తో గని 1-2  సార్లు వరం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
 • మొక్క ప్రత్యుత్పత్తి దశ సమయంలో బి.టి. ప్రతు గూడ, పూత పిండే  మరియు కయ అభివృద్ధి దశలలో నత్రజని మరియు పొటాషియం ఎరువులను నెల ద్వారా ఇవ్వలేని పరిస్థితులలో లేదా ఆర్థిక తేమ ప్రభావం వలన నెలలోని నత్రజని మరియు పొటాషియం మొక్కలకు అందుబాటులో లేని పరిస్థితులలో నత్రజని మరియు పొటాషియం పోషకాలను తప్పనిసరిగా పిచికారీ ద్వారా మొక్కకు అందించవలసినియా అవసరమున్నది.ఇందుకు గాను 2 % (20 గ్ర./లి/) యూరియా + (1  గ్రా./లి.) మ్యురేట్ ఆఫ్ పోటాష్ ను లేదా 2 % (20 గ్రా./లి/) డి.ఎ.ఫై. లేదా 2% (20  గ్రా./లి ) పొటాషియం నైట్రేట్లను 7-10  రోజుల వ్యవధిలో 2 -3  సార్లు పిచికారీ ద్వారా అందించాలి.
 • గత కొంతకాలంగా బి.టి. ప్రతిలో  పంటకు తెగులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇది మొక్క 50 -60  రోజులు దశ దాటినప్పటి నుండి రావడానికి అవకాశం ఉంది. దీని నివారణకు 1 % (10  గ్రా,లి,)మెగ్నీషియం సల్ఫేట్ తో పాటుగా 2 % (20 గ్రా./లి.) యూరియా లేక 2 % డి.ఎ.పి. కలిపి 5 -7  రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
 • మెగ్నీషియం ధాతు లోపమున్నప్పుడు  ముదురు ఆకుల, అంచుల నుండి మధ్యభాగానికి పసుపురంగుకు మారుతాయి. ఆకుల ఈనెల మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. తరువాత ఆకులు ఎర్రబారి
 • ఎండి రాలిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 80 -90  రోజుల తరువాత రెండుసార్లు పిచికారీ చేయాలి.
 • బోరాన్ సూక్ష్మ ధాతు లోపమున్నప్పుడు పులా స్వరూపం మరి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలకు ముడుచుకు పోతాయి. ఈ లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గ మరియు పూత ఎండిపోవడం , చిన్న కాయలు రాలి పోవడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండం పై పగుళ్ల కూడా ఏర్పడుతాయి. కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక నిలువుగా పగుళ్ల ఏర్పడతాయి.బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60  మరియు 90  రోజులకు లీటరు నీటికి 1 .5 గ్రా, బోరాన్ కు కలిపి వరం రోజుల వ్యవధిలో రెండుసార్లు  పిచికారీ చేయాలి.

సమగ్ర సస్యరక్షణ పద్ధతులు:

 • అందుబాటులో ఉన్న వివిధ సస్యరక్షణ పద్దతులను మేళవించి వాతావరానికి ఎటు వంటి నష్టం కలుగజేయకుండా పంటలకు నష్టం కలుగజేసే పురుగులను అదుపులో ఉంచేహ్ ప్రక్రియ సమగ్ర సస్యరక్షణ . ఈ పద్దతి ద్వారా పురుగులను అదుపులో ఉంచి అవి పురుగు మందులను తట్టుకొనే శక్తిని సంతరించుకోవడం నిరోధించడమే కాకుండా, పురుగు మందు వాడకంలో లోటు పాట్లను సరిచేసి ప్రకృతిలో సమతుల్యతాన్ని నెలకొల్పటం సాధ్యమౌతుంది. రైతుసాయిలో పాటించదగిన సమగ్ర సస్యరక్షణ చర్యలలో కొన్ని .
 • వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. దీని వలన భూమిలో ఉండే వివిధ పురుగులను నిద్రావస్తదశలోనే నిర్ములించవచ్చు.
 • ప్రతి సంవత్సరం ఒకే పొలములో ప్రత్తి పంటను పండించకుండా ఇతర పంటలతో సాగుచేయాలి.
 • ప్రధాన రసం పీల్చే పురుగులైన పచ్చదోమను తట్టుకోగల బి.టి. ప్రత్తి వంగడాలను సాగుచేయాలి.
 • తొలిదశలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడ్క్లోప్రిడ్ 48  ఎఫ్.ఎస్. 9  మీ.లి. లేదా థయోమీథేక్సామ్ 4.0  గ్రా. ఒక కిలో విధానానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
 • ప్రత్తి మొక్కలు మొలకెత్తినప్పటికీ నుండి 15  రోజులవరకు కొన్ని ప్రాంతాలలో మకిలి (కొమ్మపురుగు ) అనే పురుగు వలన ముఖ్యనగ గట్టు వెంబడి మొక్కలకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. దీని నివారణకు ఏసీఫెట్  1.5 గ్రా.లి. మీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవాలి.
 • ప్రత్తి పైరులో స్వల్పకాలిక పైరులైన పెసర , మినుము, సోయాచిక్కుడు, గోరుచిక్కుడు, మరియు అలసందలలో ఏదైనా ఒకటి అంతర పంటగా సాగుచేయాలి. దీని వలన మిత్రపురుగల సంతతి బాగా పెరిగి ప్రత్తి పైరును నష్టపరిచే పురుగులను అదుపు చేయగలుగుతాయి.
 • ప్రత్తి పైరు చుట్టూ జొన్న లేక మొక్కజొన్న పంటలను అవరోధ పంటలుగా సాగుచేయాలి.
 • తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగులను అదుపు చేయడానికి కాండం మీద మందు పూత పద్దతిని పాటించాలి. మూడు పర్యాయాలు 30,45  రోజులలో మెనో క్రోటోఫాస్ 1:4  నిష్పత్తిలో వాడాలి. (1  పళ్ళ మందు, 4  పళ్ళ నీళ్లు )మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్రోప్లైడ్ 1:20  నిష్పత్తిలో వాడాలి. కాండం పూత పద్దతిలో ద్వారా పచ్చదోమ, పేనుబంక పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగుమందుల పిచికారీ లేకుండా 70  రోజుల వరకు  అదుపు చేసుకోవచ్చును. పురుగు మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్ర పురుగులసంతతి పెరిగి చీడపీడలను అదుపుచేయడంలో సహకరిస్తాయి.
 • తెల్లదోమ పసుపుపచ్చని రాళ్లతో పురుగు ఉనికిని, ఉధృతిని అంచనావేసి సకాలంలో నియంత్రణ చేపట్టాలి. 5 % వేపగుణాలు కషాయాన్ని లేక వేపనూనె 2 .మీ.లి./లల్లీటారు నీటిలో కలిపి లేక వేప సంబంధిత పురుగు మందులను తెల్లదోమ అదుపుకు ఉపయోగించి.
 • పిండినల్లి అదుపు చేయడానికి పురుగుకు ఆశ్రయం కలిగించే కలుపు మొక్కలైనా పిచిబెండా, వయ్యారిభామ మరియు ఇతర కలుపుమొక్కలు పొలములోని మరియు గట్టుమీద నుండి నిర్ములించాలి.
 • పొలములో పిండినల్లి మొదటగా ఆశించిన ప్రత్తి మొక్కలను గుర్తించి పొలము నుండి తీసి కాల్చి వేయటం ద్వారా మిగతా మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చును.
 • పిండినల్లి సమూహాలలో పరాన్నజీవులు మరియు బాదలికలను గమనించినట్లయితే పిచికారీ మందులను ఉపాయోగించకుండా. ఈ మిత్ర పురుగులు చాల సమర్థ వంతంగా పిండి పురుగును అదుపు చేస్తాయి. పురుగు పొలమంతా వ్యాప్తి చెందితేనే పురుగుమందులు వాడుకోవాలి.
 • పొగాకు లద్దెపురుగు గ్రుడ్ల సముదాయాలను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి .
 • బాగా ఎదిగిన లద్దెపురుగు లార్వా దశ పురుగులను పైరులో  గమనించినచో విషపు ఎరువును ఉపయోగించాలి. ఈ విషపు ఎరను ఎకరానికి 10  కిలోల తవుడు, 2  కిలోల బెల్లం, 500 మీ.లి. క్లొర్పైరిఫేస్
 • లేక 250  గ్రా. ల థయోధికార్బ్ మందులను తగినంత నీటితో కలిపి చిన్న గుళికళిగా తయారుచేసి సాయంత్రం వేళలో పొలంలో సమానంగా చల్లాలి.
 • బి.టి . ప్రత్తి శనగపచ్చపురుగును 100  నుండి 110  రోజుల వరకు అదుపుచేస్తుంది. కాబట్టి ఆ సమయం వరకు ఎటువంటి క్రిమి సంహారక మందులను ఈ పురుగుకు ఉపయోగించి అవసరం ఉండదు.

బి.టి. ప్రతి గులాబీ రంగు పురుగులను కూడా అదుపు చేస్తుంది. ఈ పురుగుని పంట చివరిదశలో ఫిరమోన్ బట్టలలో ఉరికినిగమనించి సిఫారసు చేసిన పురుగు మందులను పిచికారీ చేయాలి.

 • ప్రత్తిపంటలో ప్రతి తీయగానే పొలములో నుండి ముప్దులతో సహా మొక్కలను తీసి వేయాలి. దీని వలన పురుగులు తరువాత పంటకాలము వరకు జీవిత దశలను కొనసాగించుటకునిరోధించవచ్చు.
 • పురుగుల ఉద్రహుతిని అంచనా వేసుకొంటూ అవసరాన్ని బట్టి రసాయన పురుగు మందులను వాడుకొంటూ ఉండాలి.
 • రసం పీల్చు పురుగులకు తొలిదశలో పురుగులమందును పిచికారీ లేకుండా సస్యరక్షణ పాటించాలి. మలిదశలో రసం పీల్చే పురుగులకు అవసరమైతే సిఫారసు చేసిన పురుగు మందులను మాత్రమే వాడాలి.
 • తెల్లదోమ అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మీ.లి. ట్రైకోఫాస్ లేదా ప్రొపినో ఫన్ కి 5 .మీ.లి. వేపనూనె కలిపి ఆకు అడుగు భాగంలో పడేటట్లు పిచికారీ చేయాలి.
 • ఎర్రనల్లి అదుపు చేయటానికి లీటరు నీటికి 3 .0  గ్రా. నీటిలో కరిగే గంధం లేదా 5 .0  మీ.లి. డైకోఫాల్ పిచికారీ చేయాలి.
 • ప్రతి పంటలో అల్తరినేరియా, కొళ్ళైటోక్రం బాక్టీరియా ఆకుమచ్చ తెగులు విధానం ద్వారా ఆశిస్తాయి.. ఒక కిలో విధానానికి 2 గ్రా. కార్బండిజమ్  లేదా 10 గ్రా. సూడోమోనాస్ ప్లోరిస్  విత్తన శుద్ధి చేయాలి.


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate