অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మల్లె సాగులో మెళకువలు

భారతదేశం అంతటా వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న పూలల్లో మల్లె చాలా ముఖ్యమైనది.

ఉపయెగాలు:

  1. మల్లెను లతగా, పొందగా, అరుదుగా కుండీలలో పెంచవచ్చును.
  2. పరిమళభరితమైన మల్లెను పూలదండలు తయారీకి విరివిగా ఉపయేగిస్తారు.
  3. స్త్రీలు తమ సౌమదర్యాన్ని పెంచుకోవటానికి, పూజలకు మల్లెపూలు ఎక్కువగా ఉపయేగిస్తారు.
  4. మరిమళ ద్రవ్యాల పరిశ్రమల్లో మల్లెల నుండి సంగ్రహించిన పరిమళ పదార్ధానికి ఎంతో గిరాకీ ఉంది.
  5. మల్లె పులా నుండి తీసిన సుగంధభరితమైన నూనెను ఎగుమతి చేయడానికి ఎంతో అవకాశం ఉంది.

వాణిజ్యపరంగా మూడు మల్లె జాతులను సాగు చేస్తున్నారు

  1. జస్మినం సాంబాక్ (గుండు మల్లె) : పూల మొగ్గలు గుండ్రంగా ఉంటాయి. రకాలు : రామనాథపురం, కో-1, కో-2.
  2. జస్మినం గ్రాండిఫ్లోరా (జాజి మల్లె) : ఇవి విడిపూల సాగుకి, పరిమళం నూనె తియ్యడానికి అనుకూలం. పూ మొగ్గల మీద పింకు చారలు ఉంటాయి. రకాలు : కో-1, కో-2 , ఆర్కా సురభి.
  3. జస్మినం ఆరిక్యులేటం (కాగడా మల్లె) : పూలు పొడవుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా దండల తయారీలో వాడతారు. రకాలు : మరిమల్లె.

వాతావరణం : వేసవిలో ఎక్కువగాను, శీతాకాలంలో తక్కువగాను ఉంటాయి.

నేలలు: మల్లె మంచి భూముల్లో పెరుగుతుంది. కానీ ఒండ్రు మట్టి నేలల్లో, పొడి ఇసుక నేలల్లో, నీటి సదుపాయం క్రైందా మంచి దిగుబడులు వస్తాయి. నీరు నిల్వ ఉంటే మొక్కులు చనిపోతాయి.

నేల తయారీ / మొక్కలు నాటుట : మల్లె 10-12 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. కాబట్టి నేలను బాగా దుక్కి దున్నాలి. 60 సెం.మీ. లోతు గుంతను తీసి, ఆ గుంతలో తీసిన పై మట్టికి 25-30 కిలోలు పశువుల ఎరువు కలిపి నింపాలి. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే నాటుకోవాలి.

ప్రవర్ధనం : కొమ్మ కత్తిరింపులు ద్వారా గానీ, అంటు మొక్కలు తొక్కడం ద్వారా గానీ మరియు టిష్యుకల్చర్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు.

నీటి యాజమాన్యం : కొమ్మ కత్తిరింపులు తర్వాత, నీరు కట్టడం వలన మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8-10 రోజులకొకసారి తడి ఇవ్వాలి. మొక్క సరిగా ఎదగటానికి, పూలు పూయటానికి నేలలో తగినంత తేమ ఉండాలి.

రకం

మొక్కల మధ్యదూరం (మీ.)

వరుసల మధ్య దూరం (మీ.)

ఎకరాకు మొక్కల

సాంబాక్

1.2

1.2

2777

సన్నజాజి

1.5

2.0

1333

తీగజాతి రకాలు

1.8

1.8

1234

ఎరువులు  యాజమాన్యం : అన్ని జాతుల మల్లెలకు ఎరువులు రెండు సార్లు ఇవ్వవలసి వస్తుంది. కానీ రైతులు ఒక్కసారే మొక్కల కత్తిరింపులు తరువాత ఇస్తూ ఉంటారు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు, వర్షాకాలం ఆరంభంలోనూ, రసాయనిక ఎరువులు కత్తిరింపులు తరువాత వాడితే మంచి ఫలితం పొందవచ్చును. డిసెంబర్ నెలలో మల్లె మొక్కను బెట్టకు వదిలి జనవరిలో పదులు చేసి మొక్కకు 10 కిలోల పశువులు ఎరువు, 100 గ్రా. నత్రజని, 150 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాషియం 3 సమాదఫాలుగా నెల వ్యవధిలో వేసి నీరు పెట్టాలి.

సాధారణంగా మల్లె నాటిన రెండవ సంవత్సరంలోనే పూతకు వస్తుంది. నాటిన మొదటి సంవత్సరం మొక్క బాగా పెరుగుటకు వీలుగా నత్రజని, భాస్వరం ఎరువులను నెలకొకసారి 100-150 గ్రా. వర్మీకంపోస్టు ఎరువును 3 నెలలకు ఒకసారి ఇస్తే మొక్క పెరుగుదల బాగుంటుంది. రెండవ సంవత్సరం నుండి అన్ని ఎరువులు వాడాలి. మంచి దిగుబడి పొందుటకు ఈ క్రైందా ఎరువులను రెండు దఫాలుగా జూన్-జులై మరల నవంబర్-డిసెంబర్ లో వేసుకోవాలి.

కత్తిరింపులు : మల్లెలో లేత చిగురులు నుండి పూలు వస్తాయి. కాబట్టి ఆకులు రాల్చడం, కొమ్మ కత్తిరింపులు తప్పని సరిగా చేపట్టాలి. కొమ్మలు కత్తిరించటానికి 10-13 రోజుల ముందే నీరు పెట్టడం ఆపివేయాలి. డిసెంబరు-జనవరి నేలల్లో తీగను సగానికి కత్తిరించి, వేర్లను కొద్దీ రోజులు బహిర్గతం చేయాలి. ఆ తర్వాత పశువుల ఎరువును 5 కిలోల చొప్పున వేయాలి. అప్పుడు నీటిని నిదానంగా ఇస్తూ మొగ్గలు ప్రారంభమైన తర్వాత నీటి పరిమాణం పెంచాలి. పూల దిగుబడి కాలాన్ని ఎక్కువగా పొడిగించాలనుకున్నప్పుడు మాత్రమే చివర్లు పించింగ్ చేయాలి.

సస్యరక్షణ

మొగ్గతొలుచు పురుగు : పురుగు యెక్క లార్వా పువ్వు మొగ్గల్లోనికి చొచ్చుకొని పోయి లోపలి భాగాలను తినివేస్తూ, తీవ్ర దశలో మొగ్గలన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ముడుచుకు పోయేటట్లు చేస్తుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా కార్బరీల్ 2.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎరువుసాంబక్ మల్లె తీగమల్లె / జాబిమల్లె
కంపోస్టు 15-20 కిలోలు 15-20 కిలోలు
అమ్మెనియం సల్పేట్ 100-125 గ్రా 100-125 గ్రా
సింగిల్ సూపర్ ఫాస్పెట్ 500 గ్రా 500 గ్రా
మ్యురేట్ అఫ్ పోటాష్ 200-300 గ్రా 400-450 గ్రా

నల్లి : ఈ పురుగు ఉధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. పురుగులు ఆకు అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మరి రాలిపోతాయి. నివారణకు గంధకం 3.0 గ్రా. లేదా క్లొర్ ఫేన్ ఫిర్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకు ఎండు తెగులు : తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారుతాయి. ఆకు పైభాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తీవ్ర దశలో 50 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. నివారణకు మ్యంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బండజిమ్ 1.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎండు తెగులు : తెగులు తొలిదశలో మొక్క క్రైందా భాగం ఆకులు ఎండిపోతాయి. అటు పిమ్మట పైభాగాన ఉన్న ఆకులు కూడా ఎండి రాలిపోతాయి. తీవ్ర దశలో మొక్కంతా ఎండి చనిపోతుంది. నివారణకు మొక్కల చుట్టూ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రా. లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.

దిగుబడి : పులా దిగుబడి పెంచుటకు లీటరు నీటికి 2.5 గ్రా. జింకు సల్పేట్, 5 గ్రా. మెగ్నీషియం సల్పేట్, సుష్మధాతువులను కలిపి రెండు, మూడు ధపాలుగా పిచికారీ చేయాలి. ఎకరానికి సుమారు 3-4 టన్నులు దిగుబడి పొందవచ్చును.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate