অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మామిడి సాగు

మామిడి సాగు

తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 7,64,500 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతూ 24,45,900 టన్నుల మామిడి పండు ఉత్పత్తి అవుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. మన దేశపు ఉత్పత్తిలో సుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే.

నేలలు

అన్ని నేలలు అనుకూలం కానీ లోతైన నేలల్లో వ్యాపించి, చెట్టు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం ఫలిస్తాయి. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నేలలు అనువైనవి కావు. ఉదజని సూచిక 7.5-8.0 ఉన్న నేలలు అనుకూలం. నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని చదును చేసి 1X1X1 మీటర్ల గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతల్లో నాటడానికి ముందు 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదలు రాకుండా 100 గ్రా. ఫాలిడాల్ 2 శాతం పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపి, 7-10 మీటర్ల దూరాన నాటూలి. బాగా సారవంతమైన నేలల్లో 12 మీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు.

మొక్కలు నాటడం

అంటు మొక్కను మట్టి గడ్డతో తీసివేర్లు కదలకుండా గుంత మధ్యలో నాటి, మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్న కొయ్య పాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. తర్వాత 8-10 రోజుల కొకసారి వరాలు లేనప్పుడు నీరు పోసి కనీసం 2 సంవత్సరాల వరకు కాపాడాలి.

మొక్కలు నాటడానికి అనువైన కాలం

మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబరు వరకు నాటవచ్చు. మొక్కలు త్వరగా నాటుకొని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో జూన్-జూలై లోను, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో అక్టోబర్ - నవంబరు మాసాలల్లోను నాటుకోవాలి. వడగాల్పులు, పెనుగాలులు వీచే ప్రాంతాల్లో గాలులను కొంత మేరకు తట్టుకొనేందుకు సరుగుడు, యూకలిప్టస్, ఎర్ర చందనం మొదలైన చెట్లను గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో 2 మీటర్ల ఎడంలో నాటాలి.

మామిడి అంట్ల ఎంపిక

చీడపీడలు ఆశించని వెనీర్ గ్రాప్టింగ్ అంట్లను మాత్రమే నాటుకోవాలి. వేరుమూలం, సయాన్ బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు కొత్త చిగుళ్ళు వేరుమూలంపై ఉండకూడదు. అంటు కట్టిన భాగం భూమిపై నుంచి 20 సెం.మీ. ఉండి అంటుపై భాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. అంట్లు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయస్సు కలిగి ఉండాలి.

రకాలు

కోత రకాలు - బంగినపల్లి (బనేషాన్), తోతాపురి, సువర్ణరేఖ, కేసరి, దశేరి, హిమాయత్. రసభరిత రకాలు - పెద్దరసం, చిన్న రసం, చెరకు రసం. సంకర రకాలు - మంజీరా (రుమాని X నీలమ్), ద షేరిమహమూద్ (దశేరి X మహమూద), నిలేషాన్ (నీలం X బేనిషాన్), అవ్రుపాలి (దశేరి X నీలం), మల్లిక (నీలం × దశేరి), రత్న అర్క పునీత, సింధూ, కె.ఎం.ఎచ్-11 (చెరకు రసం X ఖాండెస్), రాయల్ స్పెషల్. పునాస రకాలు - రాయల్ స్పెషల్ బారమసి, బొబ్బలి పునాస.

ఎరువులు

తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో ఎరువులను, పోషక పదార్థాలను మొదటి సారి వర్వాకాలం మొదట్లోను, రెండవ సారి వరాకాలం చివరిలోను వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వరాకాలం చివర్లో వేసుకోవాలి.

 • తేలిక పాటి భూముల్లో తగినంత చెరువు మట్టిగానీ, కంపోస్టు గానీ వేయాలి. ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా, నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్నిచ్చే ఎరువులను, తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా, నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి (2175 గ్రా. యూరియా, 6250 గ్రా. సింగిల్ సూపర్ఫాస్ఫేట్, 1670 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్)
 • ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చి మొదటి వారంలో పిందె ఏర్పడిన తర్వాత సిఫారసు చేసిన ఎరువుల్లో నాలుగవ భాగం మొక్కకు ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందడమే కాక తర్వాత సంవత్సరపు కాపుకు దోహదపడుతుంది.
 • నత్రజని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇవ్వాలి. మిగిలిన 50 శాతం రసాయన ఎరువుల రూపంలో అందించాలి. కాపుకు రాని తోటల్లో సిఫారసు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి వేయాలి.
 • మామిడి కోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/8 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో (ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో) వేయాలి.

సూక్ష్మధాతు లోపాలు

సాధారణంగా మొక్కల ఎదుగుదల దశలో వివిధ సూక్ష్మ పోషక పదార్ధాల లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. జింక్ సల్ఫేట్ + 2.5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ + 2 గ్రా, బోరాక్స్ + 2 గ్రా. కాపర్ సల్ఫేట్ + 3 గ్రా, మెగ్నిషియం సల్ఫేట్ కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు జూన్ - జూలై, సెప్టెంబర్ - అక్టోబర్, డిసెంబర్ - జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్త చిగుర్లు తొడిగినప్పుడు రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేయాలి.

ఆకుల విశ్లేషణ ద్వారా అక్టోబర్ మాసంలో పోషక విలువలను బట్టి పొటాషియం నైట్రేట్ను 10 గ్రా. చొప్పున ఒక లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

జింకు లోపం

 • కాయలు కోసిన వెంటనే జూన్ జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరు నీటికి 5 గ్రా, జింక్ సల్ఫేట్తో పాటు 10 గ్రా. యూరియాను, 0.1 మి.లీ. స్టికర్ /వెట్టర్ (ఇన్ డోట్రూస్ లేదా టైటాస్) కలిపి పిచికారీ చేయడం వలన జింకు లోపాన్ని నివారించవచ్చు.
 • జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా వస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాంు. పెరుగుదల దశలో జింకులోపమున్న ఎడల ఆకులు చిన్నగా మారి సన్నబడి, పైకి లేదా కిందికి ముడుచుకొని పోతాయి.
 • కణుపుల మధ్యదూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలె గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయల పెరుగుదల, నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది.

బోరాన్ లోపం

 • బోరాన్ లోపంగల చెట్ల ఆకులు కురచబడి, ఆకు కొనలు నొక్కుకు పోంునట్లంు, పెళుసుబారుతాయి. కాయదశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వసాధారణంగా కనబడే లక్షణం.
 • బోరాన్ లోప నివారణలకు ప్రతి మొక్కకు 100 గ్రా, బోరాక్స్ గానీ బోరికామాన్ని గానీ భూమిలో వేయాలి. లేదా 0.1 నుండి 0.2 శాతం బోరాక్స్ లేదా బోరికామాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు ఒకటి లేదా రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఇనుము

 • ఇనుపధాతు లోపం గల చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల పరిమాణం తగ్గిపోయి, తీవ్రమయిన లోపం ఉన్న, ఎడల మొక్కల ఆకులు పైనుండి కిందికి ఎండిపోతాయి.
 • ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనబడుతుంది. దీని నివారణకు 2.5 గ్రా. అన్నభేది + 1 గ్రా. నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి

 • వరాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకుతుంది.
 • వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రటాప్ ఎకరాకు 800 గ్రా. 240 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. తరువాత వచ్చేగడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గై సెల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ. మందును కలిపి దానితో పాటు 20 గ్రా. అమ్మోనియం సల్ఫేట్ గానీ, 10 గ్రా. యూరియా గానీ కలిపి 20-25 రోజుల కలుపుపై పిచికారీ చేయాలి.
 • ఈ మందు వాడేటప్పుడు పంట మొక్కల మీద పడకుండా జాగ్రత్త వహించాలి (చీనీ, నిమ్మ ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం పండ్ల తోటల్లో కూడా ఇదే విధంగా కలుపు నివారించుకోవచ్చు.

అంతర పంటలు

 • లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, ఫాల్సా, బొప్పాయి వంటి పండ్ల చెట్లను మిశ్రమ పంటలుగా వేసుకోవచ్చు.
 • అంటు మొక్కలు ఎదిగే వరకు కాయగూరలు,పెసలు, అలసందలు వంటి అంతర పంటలు వేసుకోవాలి. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు పైర్లను వేసుకోవచ్చు.
 • నేలను త్వరగా నిస్సారం చేసే, మొక్కజొన్న చెరకు పంటలను, పిండిపురుగు ఎక్కువగా ఆశించే కందిని, జింక్, పొటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డిని అంతర పంటలుగా పెంచరాదు.

నీటి యాజమాన్యం

 • చిన్న మొక్కలకు 6 నెలల వరకు 3 రోజులకొకసారి నీరు పెట్టాలి.
 • మామిడి తోటలకు కాయ పెరిగే దశలో కనీసం రెండు సార్లు అంటే పిందె ఏర్పడిన తర్వాత 25-30 రోజులకు ఒకసారి, నెల రోజుల తర్వాత మరోసారి నీరు కట్టి, కాయలు కోయడానికి 25-30 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి.
 • మామిడి కాయలు కోసిన తర్వాత వెంటనే ఒకసారి నీరుకట్టాలి. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే వేరుకుళ్ళ తెగులు ఉధృతి చెంది తోటంతా దెబ్బతింటుంది.
 • డ్రిప్ నీటి పారుదల పద్ధతి కొత్తగా నాటిన తోటలకు, కావు కాసే తోటలకు అనుకూలమైనది. ఈ పద్ధతిలో నీరు వృథా కాదు కావున మామూలు నీటి పారుదల పద్ధతిలో పారించే విస్తీర్ణం కన్నా 3 లేక 4 రెట్ల ఎక్కువ విస్తీర్ణాన్ని పారించవచ్చు. ఈ పద్ధతి వలన నీటి వాడకంలో పొదుపు జరిగి, చెట్లు బాగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. చెట్ల పాదుల్లో ఎండు గడ్డి, ఎండిన ఆకులు, వరిపొట్టు, వేరుశనగ పొట్టు లాంటివి వేస్తే భూమిలోని తేమ ఆవిరై పోకుండా సంరక్షింపబడుతుంది. భూమి వేడిని, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి. వేసిన కొద్ది కాలం తర్వాత కుళ్ళి ఎరువుగా మారతాయి. ప్లాస్టిక్ను కూడా మల్స్గా ఉపయోగించవచ్చు.

ప్రూనింగ్, టైనింగ్ (కత్తిరింపులు)

 • మొక్క కింది నుంచి 50 సెం.మీ. వరకు ఎటువంటి కొమ్మలను రానీయకూడదు. ప్రధాన కాండంపై 2 లేదా 3 బలమైన కొమ్మలను ఎన్నుకొని పెరగనివ్వాలి. మిగతావి తీసివేయాలి. పక్క కొమ్మల పొడవు 60-80 సెం.మీ. లు ఉండేలా కత్తిరించుకోవాలి.
 • ఈ విధంగా నిర్ధారించిన ఆకారం వచ్చే వరకు కోయాలి. పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరం కాయకోత తర్వాత జూన్-జూలై మాసాల్లో అడ్డదిడ్డంగా 18සට්ඨි కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, రెమ్మలను తీసివేయడం వలన సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది.
 • కాయ వదిలేసిన తొడిమలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక్కరెమ్మ చివరి నుండి 3-5 చిగురు వస్తే రెండింటికి నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.

పిందె రాలడం

పిందె రాలకుండా తగ్గించడానికి ఒక గ్రాము నాప్టలీన్ ఎసిటిక్ ఆమాన్ని 10 మి.లీ. మిథనాల్లో కరిగించి తర్వాత 50 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి లేదా 2,4-డి 10 పి.పి.ఎం (1 గ్రా. 2, 4-డి పొడిని 100 లీటర్ల నీటిలోకలిపి) ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

సస్యరక్షణ - పురుగులు తేనేమంచు పరుగు

నివారణ : లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా.ల లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళ పైన కూడా పిచికారీ చేయాలి.

పూలు పూర్తిగా విచ్చుకోక ముందే పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన పుప్పొడి రాలి పరాగ సంపర్మానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గ దశలో కనిపించిన ఎడల కార్బరిల్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ + కార్చండిజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆక్లారా 0.1 మి.లీ.ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వలన పూత, కాపు సమయంలో తేనే మంచు పరుగును సమర్థవంతంగా నివారించవచ్చు.

కాండం తొలిచే పురుగు

నివారణ : ఎక్కువ పాడైన కొమ్మలను తీసివేయాలి. గట్టి ఇనుప తీగెను లోపలికి చొప్పించి పురుగులను బయటికి లాగి చంపివేసి, రంద్రాల్లో మిధైల్ పెరాథియాన్ 50 శాతం ఇ.సి. మందును 1 మి.లీ. లీటరు నీటికి ద్రావణం లేదా పెట్రోలు లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను బంకమట్టితో మూయాలి.

కాయపుచ్చు నివారణ : చెట్ల మీదనున్న ఎండు పుల్లలను, రాలిన ఎండు పుల్లలను ఏరి తగలబెట్టి, సుమారు 80 శాతం పురుగులను నివారించవచ్చు.

నల్లమంగు : ఈ పురుగుల నివారణ మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. గానీ, కార్బరిల్ 3 గ్రా, గానీ లేదా డైమిధోయేట్ 1.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. గానీ లీటరు నీటికి కలిపి నల్లపూత దశలో అనగా పిందెలు ఎదిగే దశలో పిచికారీ చేయాలి.

పిండి పురుగు : లీటరు నీటికి 2 మి.లీ. ఫాస్పామిడాన్ లేదా 1 మి.లీ. డైక్లోరోవాస్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పురుగులపై పిచికారీ చేయాలి.

ఆకుజల్లెడ గూడు పురుగు : క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటితో కలిపి జూలై-ఆగస్టు నెలల్లో పిచికారీ చేయాలి.

టెంక పరుగులు : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా పెనిట్రోథియాను 1 మి.లీ. మందు 1 లీటరు నీటిలో కలిపి పిందె పుట్టిన తర్వాత ఒకసారి, నెల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. ఇందువల్ల గుడ్లు, వాటి నుండి వచ్చే పిల్లలు చనిపోతాయి. టెంకలో పురుగు దూరిన తర్వాత మందు చల్లినా ప్రయోజనం ఉండదు.

పండుఈగ : రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. చెట్టు కింద దున్ని కోశస్థ దశను బయట పదేయాలి. కార్బరిల్ 10 శాతం పొడిని భూమిలో (50-100 గ్రా. /చెట్టుకు) కలుపుట, ప్లాస్టిక్ పళ్ళెంలో మిధైల్ యూజినాల్ (2 మి.లీ.), 3 గ్రా, కార్బోఫ్యూరాన్ 3జిని లీటరు నీటికి కలిపి తోటలో వేలాడగట్టాలి. 2 మి.లీ. మలాథియాన్ను 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సస్యరక్షణ - తెగుళ్ళు

బూడిద తెగులు

నీటిలో కరిగే గంధకం 2 గ్రా. లేదా కెరాథేన్ 1 మి.లీ. లేక మైకోబ్యూటనిల్ 1 గ్రా. లేక బేలటాస్ 1 గ్రా. వీటిలో ఏదైనా ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందును మార్చిపిచికారీ చేయాలి.

మచ్చ తెగులు

ఎండు కొమ్మల్ని తీసివేసి లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. లీటరు నీటికి 1 గ్రా. కార్చండిజమ్ కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఎగుమతి చేసే రకాలకు మచ్చ తెగులు రాకుండా 15 రోజుల ముందు 1 గ్రా. కార్చండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కోయటం, నిల్వచేయడం

 • మామిడి కాయల్ని నవీన పరికరాల (హార్వెస్టర్ల)ను ఉపయోగించి కోస్తే కాయలకు ఏ విధమైన హాని కలగకుండా తొడిమలతో సహా కోయవచ్చు. జీడి లేక సాన కారకుండా ఉండి కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండి మార్కెట్లో ధర కూడా అధికంగా ఉంటుంది.

మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు

 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్ బెంగుళూరు రూపొందించిన ఐ.ఐ.ఎచ్.ఆర్. పరికరం, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ వారు రూపొందించిన ఐ.ఎ.ఆర్.ఐ. పరికరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్చికల్చర్ ఫర్ నార్తన్ ఫైయిన్స్, లక్నో (యు. వీ . ) రూపొందించిన సి.ఐ.ఎచ్.ఎన్.పి. పరికరం, కొంకణ్ కృషి విద్యాపీర్, డాపోలీ వారు రూపొందించిన డాపోలి పరికరం.
 • ఈ దాపోలి పరికరం సహాయంతో కాయల తొడిమను ఈ పరికరం కత్తెరల మధ్య ఉంచి లాగినప్పుడు ప్ర్పింగుల వల్ల కత్తెరలు దగ్గరగా వచ్చి తొడిమను కత్తిరిస్తాయి. కాయలు చట్రానికి (ఫేమ్) అమర్చిన వలలో పడతాయి.
 • పాటుకాయ రాలే దింపడానికి సిద్ధంగా ఉన్నదని అనుకోవాలి. కాయ తొడిమకు ఇరువైపులా పాలిపోయిన / లేత పసుపుపచ్చ రంగురావడం, కాయ ఉపరితల భాగాన నూనెగ్రంథులు ఏర్పడడం అనేది కోతకు సరైన దశ,
 • బంగినపల్లిలో టి.ఎస్.ఎస్. (టోటల్ సాల్యుబుల్ సాల్ట్) 9.0 దశేరిలో 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. సంచులు తగిలించిన గడలో కాయల్ని తెంపి, కిందికి చేరవేయాలి. జీడి సాన అంటినప్పుడు పండు పైన చార ఏర్పడుతుంది.
 • జీడి వీలైనంత వరకు అంటకుండా కాయను కొంత సేపటి వరకు బోర్లించి కారనియ్యాలి. కాయలను వరుసలుగా గడ్డిలో పేర్చి మండె వేస్తారు. పూర్తిగా పండే వరకు మండెలను కదల్చరాదు. కాయలు కోసేటప్పుడు కాయకు ఒక తొడిమ ఉండేటటు డాపోలి హార్వెస్టరును ఉపయోగించి కోసుకోవాలి.
 • కాయలను 6 శాతం మైనపు ద్రావణంలో మంచి తీయడం వల్ల 2-4 రోజులు ఆలస్యంగా పండుతున్నప్పుడు బరువును ఎక్కువగా నష్టపోవు. రోగాలను కూడా అరికడుతుంది. నవనీతం లాంటి కొన్ని రకాలు పూర్తిగా పండినా రంగురాదు. ఆకుపచ్చదనం కొంత మిగిలి ఉంటుంది..
 • ఈ కాయలను 500 పి.పి.ఎం (50 మి.గ్రా, లీటరు నీటికి) ఏడ్రెల్ లేదా ఏథెక్స్లో మంచి మాటేస్తే రంగు బాగా వస్తుంది. ఈ పండ్లను ఆరువారాల వరకు 42-45 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత, 85-90 శాతం గాలిలో తేమ ఉండే శీతల గదిలో ఉంచాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate