অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మామిడిలో దిగుబడిని తగ్గించే ప్రధానమైన పురుగులు - వాటి యాజమాన్యం

మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. పండ్లతోటలలో మామిడి పంట చాలా ప్రముఖమైనది. అందుకే దీనిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. మన భారతదేశంలో చాలా రకాల మామిడి వంగడాలు / రకాలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పంటను సాగుచేస్తున్నారు. ప్రపంచంలోనే మామిడిని పండించడంలో మన భారత దేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతోంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

మామిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది చాలా కాలం ఫలాలనిస్తాయి.

ఇతర ఉద్యాన పంటలలో లాగానే, మామిడిని కూడా చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తేనెమంచు పురుగు, టెంక పురుగులు, వండు ఈగ, పిండిపురుగులు. ఈ ప్రధాన పురుగుల వలన కలిగే నష్టం, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.

తేనెమంచు పురుగు

ఇవి రసం పీల్చి నష్టం చేసే పురుగులు. ఇవి భారతదేశం అంతటా మామిడినిpg.jpg ఆశిస్తాయి. ఈ పురుగులు త్రిభుజాకారంలో ఉండే తలను కలిగి ఉంటాయి. తోటలో చెట్ల దగ్గర దగ్గరగా ఉండి, నీరు నిల్వ ఉన్నట్లయితే, తేమ అధికంగా ఉన్నట్లయితే ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆడ పెద్ద పురుగులు లేత ఆకుల, పూ మొగ్గల, పూ కాడలలోనికి చొప్పించి ఒక్కొక్క గుడుని పెడుతుంది. చెట్లు కాండం అయిపోయిన తర్వాత అంటే సీజను అయిపోయిన తర్వాత చెట్ల కాండం మీద బెరడు కింద గడుపుతుంది.

పిల్ల, పెద్ద పరుగులు ఆకుల అడుగు భాగం నుంచి, పువ్వు కాడల నుండి, పూల నుండి, పూ మొగ్గలనుండి రసాన్ని పీల్చివేస్తుంది. అందువలన ఆకులు ముడత పడి, అంటుకొని సరిగా పెరగవు. పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. పూత రాలిపోవడం కూడా గమనించవచ్చు. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి పదార్థం బంకలాగా ఆకుల మీద కారి సూర్మరశ్మి వెలుతురులో మెరుస్తూ ఉంటుంది. ఈ తేనెలాంటి పదార్థం మీద మసిలాంటి శిలీంధ్రం వృద్ధి చెందటం వలన, చెట్టు వివిధ భాగాల మీద ఈ మసి పదార్ధాన్ని గమనించవచ్చు. అలాగే ఈ మసి వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక, దిగుబడి చాలా తగ్గుతుంది. ఈ పురుగుల వలన ముఖ్యంగా పూత నిలవకపోవడం, పూత రాలిపోవడం, కాయలు సరిగ్గా ఏర్పడక పోవడం జరుగుతుంది. అలాగే లేత కాయలు ముందే రాలిపోతాయి.

యాజమాన్యం

 • తోటని శుభ్రంగా, కలుపు మొక్కలు లేకుండా ఉంచుకోవాలి.
 • చెట్ల మధ్య తగినంత దూరం ఉన్నట్లయితే, నీడ ప్రాంతాలు తగ్గి, తేమ పెరగకపోవడం వలన ఈ పురుగును అదుపులో ఉంచవచ్చు.
 • తోటలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి
 • పూత మొదలయ్యే సమయం, తయారయ్యే సమయంలో, పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళపైన, కొమ్మలపైన లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
 • పూలు పూర్తిగా విచ్చుకోక ముందే పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే పుప్పొడి రాలి, పరాగ సంపర్మానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి.
 • మొగ్గ దశలో ఈ పురుగులు గమనిస్తే కార్బరిల్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. + కార్చండిజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. థయోమిథాక్సామ్ 0.2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వలన, పూత, కాపు సమయంలో ఈ తేనే మంచు పరుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును.

టెంక పురుగులు

మన దేశంలో మామిడినిtp.jpg పండించే అన్ని ప్రాంతాలలో ఈ పురుగు విస్తరించి నష్టాన్ని కలిగిస్తుంది. దక్షిణ భారత దేశంలో వీటి నష్టం ఎక్కువ. పెద్ద టెంక పురుగులు ధృడంగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు, తెల్లగా, కాళ్ళు లేకుండా ఉంటాయి. తల్లి టెంక పురుగులు మామిడి కాయలు చిన్నగా ఉన్నప్పుడే కాయల మీద చిన్న చిన్న గుంతలుగా చేసి ఒక్కొక్కటిగా గుడ్లను పెడతాయి.

గుడ్లనుంచి వెలువడిన పిల్ల పురుగులు కాయలలోనికి చొచ్చుకొనిపోయి, మధ్యలోని గుజ్ఞను తింటూ టెంకలోకి చేరతాయి. ఈ చిన్న రంధ్రం కాయ పెరిగిన తర్వాత మూసుకొని పోయి, లోపల పురుగు ఉన్నది మనకు తెలియకుండా పోతుంది. టెంకలోనికి చేరిన తర్వాత, లార్వా    పురుగు లోపల పదార్గాన్ని తింటూ పెరిగి, టెంకలోపలనే కోశస్థ దశను పూర్తి చేసుకొంటుంది. కోశస్థ దశ పూర్తయిన తర్వాత పెద్ద పెంకు పురుగులు వెలువడి టెంక నుండి బయటకు వచ్చి భూమిలోపల తర్వాత సీజను వరకు సుప్తావస్థలో ఉంటుంది. ఈ పురుగుల వలన, ముఖ్యంగా కాయలోని గుజ్ఞ టెంకల నష్టపోతాయి. కాయలు సరిగ్గా పెరగక నష్టం జరుగుతుంది. ఈ పురుగు ఉన్న కాయలను అమెరికా లాంటి దేశాలు దిగుమితి చేసుకొక పోవడం వలన ఎగుమతి చేసే రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే మామిడి రకాలలో ఈ పరుగు ఎక్కువగా నష్టం చేస్తుంది.

యాజమాన్యం

 • కాయలను కోసిన తర్వాత తోటలో దున్నినట్లయితే సుప్రావస్థలో ఉన్న పెద్ద పురుగులను నివారించవచ్చు.
 • రాలిపోయిన, కాయలను ఏరి నాశనం చేయాలి.
 • మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా ఫెనిట్రోథియాన్ 1 మి.లీ. మందును, ఒక లీటరు నీటిలో కలిపి పిందె పుట్టిన తర్వాత ఒకసారి, నెల తరువాత మరోసారి పిచికారీ చేయాలి. అందువలన గుడ్లు, వాటి నుండి వచ్చే పిల్ల పురుగులు చనిపోతాయి. టేకలోనికి పురుగు దూరిన తర్వాత మందును పిచికారి చేసిన కూడా ప్రయోజనం ఉండదు.

పండుఈగ

ఈ పురుగు దేశం అంతటా విస్తరించి నష్టాన్ని కలిగిస్తుంది. ఇది చాలా రకాల మొక్కల్ని ఆశించి, నష్టం కలుగజేస్తుంది. థల్లి ఈగ పండ్ల చర్మం / తోలు కింద గుడ్లను పెడ్తుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తెలుపు రంగులో బియ్యపు గింజ మాదిరిగా ఉం pe.jpg డి, కాళ్ళు లేకుండా ఉంటాయి. కాయలు పక్వానికి రాగానే ఈ పండ ఈగ ఉదృతి ఎక్కువగా ఉంటుంది. పిల్ల పురుగులు కాయలోని మెత్తని కండను తినడం వలన కాయ మెత్తబడి, కుళ్ళి రాలిపోతుంది. పెరిగిన లార్వాలు (పిల్ల పురుగులు) కాయలనుంచి బయటికి వచ్చి భూమిలోపల కోశస్థ దశను చేరుకొంటుంది.

యాజమాన్యం

 • తోటలలో అంతరకృషి చేసి, చెట్టు కింద దున్ని చేయాలి. భూమిలోపల ఉన్న కోశస్థదశను బయటపడేటట్లు చేసి నాశనం చేయాలి.
 • రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి.
 • కార్బరిల్ 10 శాతం పొడిని చెట్టుకి 50-100 గ్రా, చొప్పున భూమిలో చెట్టు మొదళ్ళలో వేసి కలపాలి. ప్లాస్టిక్ పళ్ళెంలో మిధైల్ యూజినాల్ 2 మి.లీ., 3 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికల్ని ఒక లీటరు నీటిలో కలిపి తోటలో అక్కడక్కడా వేలాడగట్టాలి.
 • మలాథియాన్ మందును 2 మి.లీ. ఒక లీటరు పురుగు దూరిన తర్వాత మందును పిచికారీ నీటిలో కలిపి (కాయలు పక్వ దశ ముందు) చేసినా కూడా ప్రయోజనం ఉండదు. తోటలో పిచికారీ చేయాలి.

పిండి పురుగులు / పిండినల్లి

ఇవి రసం పీల్చి నష్టం చేసే పురుగులు. ఈ పరుగులు లేత గులాబి రంగులో ఉండి వాటి మీద తెల్లటి పిండి పదార్థంతో కప్పబడి ఉంటాయి. భూమిలో కాండం మొదలు దగ్గర పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పరుగులు చెట్ల పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పరుగులు చెట్ల చేరి, గుంపులుగా రసాన్ని పీలుస్తాయి.

pp.jpg

యాజమాన్యం

 • తొలకరిలో చెట్టు మొదలు దాకా దగ్గర దగ్గరగా దున్ని భూమిలోపల ఉన్న గుడ్లను నాశనం చేయాలి.
 • చెట్టు చుటూ 2 శాతం మిథైల్ పారాథియాన్ పొడి మందును చల్లి మట్టిలో కలపాలి.
 • పిల్ల పురుగులు చెట్ల కాండం మీదికి పాకి పైకి పోకుండా శీతాకాలంలో చెట్టు మొదలుకు భూమి నుండి అడుగు ఎత్తులో
 • ఒక అడుగు నిడివిగల పాలిథీన్ షీట్ కాండం చుటూ చుట్టి, షీట్ పైన గ్రీజు పూయాలి.

 • లీటరు నీటికి 2 మి.లీ. ఫాస్పామిడాన్ లేదా 1మి.లీ. డైక్లోరోవాస్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పరుగులపై పిచికారీ చేయాలి.

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate