অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వాతావరణంలో వస్తున్న మార్పులు - వ్యవసాయ సమగ్ర యాజమాన్యం

వాతావరణంలో వస్తున్న మార్పులు - వ్యవసాయ సమగ్ర యాజమాన్యం

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశంలో దాదాపు 70 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువ.

వాతావరణంలో వచ్చే మార్పులు అయినటువంటి అధిక ఉష్ణోగ్రతలు సరైన సమయంలో వరాలు పడకపోవడం, చీడపీడలు మొదలగునవి పంటలపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పులను మనకు అనుగుణంగా మార్చుకుని వ్యవసాయ పనులను చేపట్టాలి. వాతవరణంలో వస్తున్న మార్పులు, వాటి ప్రభావం నివారణ చర్యలను గూర్చి తెలుసుకుందాం.

అధిక ఉష్ణోగ్రత - నీటి ఎద్దడి

 • అధిక ఉష్ణోగ్రత పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
 • అధిక ఉష్ణోగ్రతలను నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను సాగుచేయాలి.
 • వర్షపునీటిని జాగ్రత్తగా సేకరించి వ్యవసాయ పనులకు, పశువులకు ఉపయోగించాలి.
 • వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను వేయడం ద్వారా భూమిలోని నీటి లభ్యతను మెరుగు పరచుకోవచ్చు.
 • పంటలపై మందుల పిచికారీలను సాయంత్రం వేళలోనే (4 గంటల తర్వాత) చేపట్టాలి.

చీడపీడలకై

 • విత్తనాలు విత్తిన దగ్గర నుండి కోత కోసేవరకు చీడపీడలు ఏదో ఒక దశలో పంటలను ఆశిసూనే ఉంటాయి.
 • కలుపు మొక్కలను జాగ్రత్తగా గమనిసూ తొందరగా నివారణ చర్యలను చేపట్టాలి.
 • చీడపీడలను పంటల్లో గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చేపట్టాలి.
 • పంట మార్పిడి పద్ధతులను పాటిస్తూ, కీటకాలను తినే మిత్ర పురుగులను, పరాన్నభుక్కులను వృద్ధి చేసుకోవాలి.

నేల సంరక్షణకు

 • రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. వాతావరణం కాలుష్యం అవుతుంది.
 • వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎరువులను తగిన మోతాదులలో వాడుకుంటూ నేల కాలుష్యాన్ని వాతావరణాన్ని కాపాడుకోవాలి.
 • వీలైనంతవరకు సేంద్రియ ఎరువులకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి.
 • సేంద్రియ ఎరువులైనటువంటి జనుము, జీలుగ (పచ్చిరొట్ట ఎరువులు) పంటల వ్యర్గాలు వంటి వాటిని భూమిలో వేయడం ద్వారా భూసారాన్ని పెంచితే, నీరు మొక్కకు అందుబాటులోకి వస్తుంది.

సీజనుకు సంబంధించిన మార్పులకై

 • కాలానికి తగినట్టుగా పంటలను, ప్రణాళికలను మార్చుకోవాలి.
 • ఎక్కువ పంటకాలం లభ్యమైనప్పుడు రెండు పంటలు లేదా దీర్ఘకాల పరిమితి కలిగిన వంగడాలను ఎంచుకోవడం మంచిది.

రుతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు రైతులు చేపట్టవలసిన చర్యలు

వరిలో

 • మధ్యకాలిక రకాలు (130-135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు (110-120 రోజులు) ఎంచుకోవాలి.
 • దీర్ఘకాలిక రకాలు (145-150 రోజులు) వేయకూడదు.
 • ముదురు నారును దగ్గరగా ఒక కుదురుకు 4 లేదా 6 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.
 • నత్రజనిని మూడు దఫాలుగా కాక, రెండు దఫాలుగా 2/3 వంతు దమ్మలోను, మిగతా 1/3వ వంతు చిరుపొట్ట దశలోను వేసుకోవాలి.

పత్తిలో

 • ఎరువుల యూజమాన్యంలో వెళకువలు పాటించాలి
 • త్వరగా వచ్చేరకాలను ఎంచుకోవాలి.

వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు నెలకొంటే

 • నేలలో పదును లేకపోతే ఎరువులు వేయటం ఆపాలి. తరచుగా గుంటకతో గానీ లేదా గొర్రుతోగానీ అంతర కృషి చేయాలి.
 • రెండు శాతం యూరియా ద్రావణాన్ని 10-15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.

వివిధ పురుగులు, తెగుళ్ళు వాతావరణ పరిస్థితులను ಬಲ್ಲಿ మారుతూ ఉంటాయి. దాదాపు 80 శాతం దిగుబడులు చీడపీడల వల్లే నష్టపోతున్నాం. కొన్ని పురుగులు బెట్ట పరిస్థితుల్లోనూ, మరికొన్ని వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తాయి. అలాగే కొన్ని తెగుళ్ళు గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు వురికొన్ని చలి ఎక్కువగా ఉన్నవ్పుడు అధికమవుతాయి.

ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ ఏ చీడపీడలు ఆశిస్తాయనేది అవగాహన రైతాంగానికి ఎంతైనా అవసరం.

వివిధ పంటలలో చీడపీడల ఉధృతికి అనుకూల పరిస్థితులు

ముఖ్యమైన పంటలయినటువంటి వరి, పత్తి గూర్చి తెలుసుకుందాం.

వరి

కాండం తొలిచే పురుగు: ప్రధానంగా కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు సువాసన కలిగిన రకాలు సాగుచేసినప్పుడు.

ఆకుమడత : అధిక వరాలు పడిన తర్వాత ಬಿಟ್ಟು పరిస్థితులు నెలకొని, వారం పాటు మబ్బులతో కూడిన వాతావరణం అనుకూలమైనప్పుడు. ఉల్లికోడు: రుతుపవనాలు ఆలస్యమై నాట్లు ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో ఉల్లికోడు సోకటానికి అనుకూలం.

సుడిదోమ :

 • ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో అధిక వర్షపాతం. (వారానికి 30 మి.మీ. కంటే ఎక్కువ) నమోదైనప్పుడు.
 • అధిక తేమతో కూడిన వాతావరణం
 • రాత్రి ఉష్ణోగ్రతలు (21-23 సెల్సియస్ మధ్య ఉంటే ఎక్కువగా ఆశిస్తుంది)

అగ్గితెగులు (లేదా) మెడవిరుపు తెగులు : ప్రధానంగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు వారంపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 18–22 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90 శాతం అనుకూలం.

మానిపండు తెగులు : పూత దశలో లేదా మంచు లేదా మబ్బులతో కూడిన జల్లులు, గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువ.

పత్తి

తెల్లదోమ : 10 రోజులకు మించి బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం అనుకూలం.

పచ్చపురుగు (హెలికొవెర్చా):

 • ఖరీఫ్ లో ముందుగా తక్కువ వర్షాలు.
 • నవంబరు మాసంలో అధిక వర్షాలు.
 • రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుదల.
 • గుడ్లు దశ లేదా చిన్న లార్వా దశలో ఎక్కువ వర్షపాతం.

పొగాకు లద్దెపురుగు:

 • పగటి ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీల సెల్సియస్.
 • రాత్రి ఉష్ణోగ్రతలు 21-23 డిగ్రీల సెల్సియస్.
 • 40 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం.

తుపాను తగ్గిన తర్వాత వరి పొలంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు

 • తుపాను వచ్చి వరి పొలంలో నీరు నిండినప్పుడు చిన్నకాలువలు తీసి నీటిని బయటకు పంపాలి.
 • పడిపోయిన వరిదుబ్బులను తీసి నిలబెట్టి కట్టలుగా కట్టాలి.
 • పంట పడిపోయినప్పుడు ధాన్యం మొలకెత్తకుండా పైరుపై 5 శాతం ఉప్పు ద్రావణం చల్లాలి.
 • తుపాను తర్వాత అధికంగా ఆశించే అగ్గితెగులు, సుడిదోమలకు నివారణ చర్యలు ముందుగానే చేపట్టాలి.

సమగ్ర వ్యవసాయం

తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల హెక్టార్లలో భూమిని వివిధ పరిస్థితుల్లో సాగు చేస్తున్నాం. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు మొదలైనవి చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాక పశువుల పేడను భూమిలో వేయడం ద్వారా భూసారాన్ని కాపాడేవారు కానీ ఇప్పుడు రైతులు వివిధ కారణాల వల్ల పశుసంపద లేని వ్యవసాయాన్ని చేపడుతున్నారు. అందువల్ల వ్యవసాయాన్ని అతి శాస్త్రీయంగా చేపడుతూ, క్షేత్ర వనరులను న వుర్శవంతంగా వినియోగించుకోవడం అత్యావశ్యకం.

వ్యవసాయ సమగ్ర యాజమాన్యం ఆవశ్యకత

 • సమగ్ర వ్యవసాయంలో అధిక దిగుబడి పొందడం జరుగుతుంది.
 • వ్యవసాయ అనుబంధ రంగాలతో కలిపి చేసుకోవడం వల్ల ఒక వ్యవస్థలో එඩ්ටඩී వ్యర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా ఉపయోగపడతాయి.
 • ఒక రైతు తీసుకున్న పొలంలో వివిధ రకాలైన పంటలను సాగు చేసుకుంటూ పొలం గట్లపైన సుబాబుల్, గైరిసీడియం, తుమ్మ మొదలైన బహువార్షికాలను పెంచడం ద్వారా పశువులకు అవసరమైన పచ్చిమేతను పొందవచ్చు.
 • అదే విధంగా మెట్ట ప్రాంతాలలో సీతాఫలం, నేరేడు, రేగు వంటి ఫలాలనిచ్చే మొక్కలు కూడా గట్లపైన వేసుకోవాలి.
 • పశువులకు ఉపయోగపడని పంటల వ్యర్గాలను కంపోస్టుగా లేదా వర్మీ కంపోస్టుగా తయారు చేసుకొని వేసినట్లయితే భూసారాన్ని కాపాడటమే కాకుండా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు.
 • ఈ విధంగా భూసారాన్ని కాపాడుకుంటూ ఆహార, పోషక భద్రతను సాధించి ఆదాయాన్ని క్రమ బద్ధంగా సంవత్సరం పొదడం జరుగుతుంది.
 • బోరు బావుల కింద సాగుచేసినట్లయితే ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు పశువులకు మేత సమృద్ధిగా లభిస్తుంది.
 • పశువుల పేడతో గోబర్ గ్యాస్ ప్లాంట్ నెలకొల్పి గృహ అవసరాలకు కావాల్సిన ఇంధనం తయారు చేసుకోవచ్చు.
 • ఈ విధంగా సమగ్ర వ్యవసాయంలో ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది.
 • వ్యవసాయ వ్యర్గాల సమర్థ వినియగం జరిగి, సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు.
 • రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate