పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పండు ఈగల నివారణ

పండు ఈగల నివారణ

తక్కువ ఖర్చుతో ఎరల తయారీ విధానం

 • ఒక ఖాళీ 1లీ, వాటర్ బాటిల్ తీసుకొని దాని మూతికి దిగువ భాగంలో మూడు వైపుల ఒక అంగుళం వెడల్పు తో కిటికీ మాదిరి రంద్రాలు చేయాలి.
 • బాటిల్ మూతకు ఒక చిన్న రంద్రాన్ని చేయాలి.
 • 10 అంగుళాల ఒక సన్నని వైరుని మూత రంద్రం ద్వార చొప్పించి, మూత వెలుపల వైరుని బాటిల్ ని పేలడదీయుటకు అనువుగా ఉచ్పు మాదిరి ముడివేయాలి. పై విధంగానే మూత లోపల ఉన్న వైరుని ఎర (ల్యూర్) ను బాటిల్ లోపల అమర్చడానికి అనువుగా మడిని తయారు చేసుకోవాలి.
 • అర-అంగుళం మందం కలిగిన నూలు (కాటన్) తాడును 2 అంగుళాల పరిమాణం తో కత్తిరించి దాని రెండు చివరలా(కొనలను) ఒక సన్నని తీగతో గట్టిగా కట్టాలి.
 • ఎర (ల్యూర్స్) చేయారీ విధానం

  మిథైల్ యుజినాల్ (ME)

  ఇథైల్ ఆల్కహాల్ 60 మి.లీ + మిథైల్ యుజినాల్ 40 మి.లీ + మెలాథియాన్/ DDVP (22 - డైక్లోరోవినైల్ డైమిథైల్ ఫాస్పేట్) 20 మీ.లీ (6:4:2 నిష్పత్తి) మిశ్రమాన్ని ME ల్యూర్ తయారి లో వినియోగిస్తారు.

  Cue ల్యూర్

  ఇథైల్ ఆల్కహాల్ 60 మి.లీ + Cue ల్యూర్ (పీ- ఎసిటోక్సీ ఫినైల్ ట్యుటనోన్-2) 40 మీ.లీ + మెలాధియెన్/ DDVP (2,2 - డైక్లోరోఫినైల్ డైమెథైల్ ఫాస్పేట్ ) 20 మీ.లీ (6:4:2 నిష్పత్తి) మిశ్రమాన్ని Cue ల్యూర్ తయారీ లో వినియోగిస్తారు,

 • ముందుగా కత్తిరించి ఉంచుకున్న2 అంగుళాల నూలు (కాటన్) తాడుని ME/Cue ల్యూర్ మిశ్రమం లో 24 గంటలపాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తాడుని ఎరలా వినియోగించే వరకు ఒక అల్యుమినియం పేపరుతో చుట్టి ఉంచాలి.
 • ఎరను ఉపయోగించునపుడు నూలుతాడుకు చుట్టి ఉంచిన అల్యుమినియం పేపరును మూడోవంతు తొలగించాలి.ఇలా తొలగించిన భాగంలో మూతకి ఉన్న వైరును కట్టి బాటిల్లో వేలాడతీయాలి
 • ఇలా తయారు చేసిన బాటిల్ ఎర (ట్రాప్) ను తోటలో అక్కడక్కడా నేలకి 3-4 అడుగుల ఎత్తులో వేలాడతీయాలి
 • ఎరలను తయారు చేయు గదులలో గాలి మరియు వెలుతురు బాగా ఉండేట్లు చూసుకోవాలి. తయారుచేయు సమయంలో చేతికి గ్లౌసును ధరించాలి. ఎర తయారీకి ఉపయోగించే వస్తువులను ఎర తయారీకి మాత్రమే వినియోగించాలి. ఒక బాటిల్ ఎర (ట్రాప్) తయారీలో ఉపయోగించే ME మరియు Cue ఎర ఖరీదు సుమారుగా రూ. 35/-. ఎరను వినియోగించు విధానం కొరకు కరపత్రం వెనుక చూడుము.

  మిథైల్ యుజినాల్ ఎరకు ఆకర్షించబడిన పండు ఈగలు

  మామిడినాశించు పండుఈగ  (బేక్టోసిరా డోర్సాలీస్)

  జామనాశించు పండుఈగ (బేక్టోసిరా కరేక్టా)

  పీచ్ ను ఆశించు పండుగ (బేక్టోసిరా జోనాట)

  బేక్టీసిరా కారీయే

  మిథైల్ యుజెనాల్ ఎర (ల్యూర్) వినియోగం పంటలు

  మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ మరియు ఇతర పండ్ల పంటలు

  పర్యవేక్షణ కొరకు

  ప్రాంతాలవారీగా నియంత్రణ కొరకు

  • ఒక చదరపు కిలో మీటర్ కి ఎరల సంఖ్య:1
  • సమయం: ఏడాది పొడవునా
  • భర్తీ: 30-40 రోజులకి ఒకసారి
  • ఒక చదరపు కిలోమీటర్ వినియోగించు ఎరల సంఖ్య: 8 - 12/ ఏడాదికి

  • ఒక ఎకరాకి వినియోగించు ఎరల సంఖ్య : 6- 10
  • సమయం: పండ్ల తయరీ సమయం నుండి కోతకి వచ్చేవరకూ
  • భర్తీ: 30-40 రోజులకి ఒకసారి
  • ఒక ఎకరాకి ఒక సీజన్లో వినియోగించు మొత్తం ఎరల సంఖ్య: 12-20 లేదా 18-30 (పంటను బట్టి)

  Cue ఎర (ల్యూర్) వినియోగం

  పంటలు : దోసకాయ, పుచ్చకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, పొట్లకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ మరియు ఇతర దోస పంటలలో మరియు కొన్ని పండ్ల జాతులు (మామిడి, జామ, సపోట, నిమ్మ etc.)

  పర్యవేక్షణ కొరకు

  ప్రాంతాలవారీగా నియంత్రణ కొరకు

  • ఒక చదరపు కిలో మీటర్ కి ఎరల సంఖ్య: 1
  • సమయం: ఏడాది పొడవునా
  • భర్తీ: 30-40 రోజులకి ఒకసారి
  • ఒక చదరపు కిలోమీటర్ వినియోగించు ఎరల సంఖ్య : 8 - 12 ఏడాదికి
  • ఒక ఎకరాకి వినియోగించు ఎరల సంఖ్య : 6 – 10
  • సమయం: పండ్ల తయారీ సమయం నుండి కోతకి వచ్చేవరకూ
  • భర్తీ: 30-40 రోజులకి ఒకసారి
  • ఒక ఎకరాకి ఒక సీజన్లో వినియోగించు మొత్తం ఎరల సంఖ్య: 12-20 లేదా 18-30 (పంటను బట్టి)

   

  cue ఎర (ల్యూర్) కు ఆకర్షించబడిన పండు ఈగలు

  పుచ్చకాయను ఆశించు పండుఈగ (బేక్ట్రోసిరా కుకుర్బీటే)

  బేక్ట్రోసిరా టవు

  బేక్టీసిరా నిగ్రోఫెమోరాలిస్

  బేక్ట్రోసిరా కాడేటా

  2.96666666667
  మీ సూచనను పోస్ట్ చేయండి

  (ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

  Enter the word
  నావిగేషన్
  పైకి వెళ్ళుటకు