పండ్ల చెట్లు బహువార్షికాలు మరియు ఎక్కువ కాలం దిగుబడినిచ్చే పంటలు, కావున నేలలు, రకాలు, వాతావరణం, నీటి వసతి, మార్కెట్టు సౌకర్యం గురించి తెలుసుకొని తోటలు నాటాలి.
తోటలు పెంపకానికి అనువైన నేలలు మరియు నీరు
- ఎంపిక చేసిన స్థలంలో భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.
- తోటలు పెంపకానికి 3 అడుగుల లోతు, 3 అడుగుల పొడవు, వెడల్పుగల గొయ్యిని తవ్వి ప్రతి అడుగుకు ఒక నమూనా సేకరించాలి.
- నీరు నిలువని, సారవంతమైన నేలలు శ్రేష్ఠం. తక్కువ లోతుగల నేలలు మరియు రాతిపొర లిగిన నేలలు
- పండ్లతోట పెంపకానికి పనికిరావు. _0 పండ్లతోటలకు సాగు నీటిలో క్లోరైడ్ మరియు బైకార్బోనేట్లు తక్కువ ఉండాలి.
సిఫారసు చేయబడిన రకాలు
(మామిడి )
కోత రకాలు: బేనిషాన్ (బంగినపల్లి), దశేరి, తోతాపరి, కేసరి, సువర్ణ రేఖ, హిమాయత్


రసాలు: చిన్నరసం, పెద్దరసం, చెరకురసం, నవనీతం.


పచ్చడి రకాలు: జలాల్, తెల్లగులాబి, ఆమిని.
హైబ్రిడ్ రకాలు: మల్లిక, నిలేషాన్, మంజీర, ఆమ్రపాలి, రత్న
పునాస రకాలు: రాయల్ స్పెషల్, బొబ్బిలి పునాస, బారామసి

తియ్య మామిడి రకాలు: షాజహాన్, నూజివీడు తియ్యమామిడి, యలమందల తియ్యమామిడి
జామ
అలహాబాద్ సఫేదా, లోక్నో-49, సఫేద జమ్
సపోట
కాలిపత్తి, పాల, ద్వారపూడి
సీతాఫలం
బాలానగర్, అటిమోయ X బాలానగర్, అటిమోయ
తోట నాటుటకు ప్రణాళిక (“లేఅవుట్")వేయుట
- నేలను 2-3 సార్లు బాగా దున్ని చదును చేయాలి.
- మొక్కలను చతురస్రం లేదా దీర్ఘచతురస్రంలో నాటుకోవాలి. దీర్ఘచతురస్రం పద్దతిలో నాటేటప్పుడు మొక్కల వరుసలు ఉత్తర-దక్షణ వైపు ఉండేటట్లు చూడాలి.
- పొలం చుట్టూ కంచెను వేయాలి. కంచె లోపల సరుగుడు, నీలగిరి, సిల్వర్ ఓక్, టేకు, వెదరు వంటి మొక్కలను నాటి తోటను ఈదురు గాలి నుండి కాపాడవచ్చు మరియు పూత కాపు రాలకుండా నివారించవచ్చు.
గుంతలనుతీయుట మరియు నింపుట
- గుంతలను మొక్కలను నాటడానికి 3-4 వారాల ముందే త్రవ్వాలి.
- నేల తీరు, పండ్ల రకాన్ని బట్టి సఫార్సు చేసిన ఎడంలో గుంతలను త్రవ్వాలి. పట్టిక 1 (సారవంతమైన నేలలో ఎక్కువ దూరంలో మరియు తేలికపాటి ఎర్రనేలలలో తక్కువ దూరంలో గుంతలు త్రవ్వాలి.)
- గుంతలు తీసేటప్పుడు పై మట్టిని, లోపొరలలోని మట్టిని వేరుగా కుప్పలు పోయాలి. పై పొర మట్టికి, గుంత పరిమాణం బట్టి 20-50 కిలోలు బాగా చివికిన ఎరువు, 1-2 కిలోల సూపర్ ఫాస్పేటు + కార్బోప్యూరాన్ గుళికలు 50 గ్రా. (చెదల నివారణకు) లేదా సెవిన్ పొడి కలిపి నింపాలి.
- మట్టి తిరిగి గుంతలలో నింపిన తరువాత నీరు పెట్టాలి. దీనివలన మట్టి గుంతలలో సర్దుకుంటుంది.

పండ్ల రకాన్నిబట్టి మొక్కల మధ్య సిఫార్సు చేసిన దూరం.
క్రమ సంఖ్య
|
రకం
|
మొక్కల మధ్య
దూరం (మీటర్లు)
|
ఎకరానికి మొక్కల సంఖ్య
|
గుంతల పరిమాణం (మీటర్లు)
|
1
|
మామిడి
|
10 X 10
9 x 9
8X8
7.5 X 7.5
|
42
50
63
72
|
1 X 1 X 1
|
2
|
జామ
|
7 X 7
6 X 6
|
82
111
|
0.60 X0.60
|
3
|
సపోట
|
10 X 10
9 x 9
8X8
|
42
50
63
|
1 X 1 X 1
|
4
|
సీతాఫలం
|
5 X 5
|
160
|
0.60 X 0.60 X 0.60
|
అంటుమొక్కల ఎంపిక
- మొక్కలను నమ్మకమైన నర్సరీ నుండి సేకరించుకోవాలి.
- చీడపీడలు ఆశించని అంటు మొక్కలను సేకరించుకొని నాటుకోవాలి.
- ఒకటి నుండి ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
మొక్కలు నాటే పద్ధతి
- అంటుమొక్కను మట్టిగడ్డతో సహా కవరును చింపి తీసి గుంత మధ్యలో నాటి మట్టిని గట్టిగా నొక్కాలి.
- నాటిన వెంటనే నీరు పోయాలి.
- మొక్కను నాటేటప్పుడు అంటు భాగము భూమి పైకి 10-15 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి.

మొక్క నాటిన తరువాత జాగ్రత్తలు
- మొక్కలు నాటిన మొదటి 2 సంవత్సరాలు నీరు తప్పనిసరిగా పెట్టాలి. డ్రిప్ నీటి పద్ధతిలో నీరు ఇచ్చు వలన నీరు ఆదా అవుతుంది.
- వేరు మూలం (రూట్ స్టాక్) నుండి వచ్చే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి తీసివేయాలి.
- మొక్కలు నాటిన వెంటనే కర్ర పాతి మొక్కదీ ఊతమివ్వాలి.
- నాటిన తరువాత పాదులు తయారు చేసి కలుపును పెరగకుండా చూడాలి.
- ఎండాకాలంలో మొక్క పాదులలో ఎండుటాకులతో మల్చింగ్ చేయుటవలన భూమిలో తేమ ఆరిపోకుండా ఉంటుంది.
- ఆకు తొలుచు పురుగులు మరియు ఆకుమచ్చ నివారణకు డైమిథోయేట్ (2 మి.లీ.) లేదా మోనోక్రోటోఫాస్ (1.6 మి.లీ.) + బావిస్టిన్ (1 గ్రాము) లీటరు నీటికి కలిపి మొక్కలు తడిచేటట్లు పిచికారి చేయాలి.
- మొక్కలు బాగా పెరుగుటకు కొత్తగా వచ్చే చిగురుటాకుల పై 1% పాలిఫీడ్ లేదా డి.ఎ.పి. పిచికారి చేయాలి.
ఆధారము: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ఫల పరిశోధన స్థానము సంగారెడ్డి