హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / ప్రత్తిలో గులాబీ రంగు కాయ తొలుచూపురుగు నివారణకు ముందస్తు చర్యలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రత్తిలో గులాబీ రంగు కాయ తొలుచూపురుగు నివారణకు ముందస్తు చర్యలు

ప్రత్తిలో గత సంవత్సరం పంట తొలి పూత దశలో గుడ్డిపూలను చాలా చోట్ల గమనించడం జరిగుంది. ప్రతి మేళ్ళను తీయకుండా ఉన్న చుట్ట ప్రక్కల ప్రత్తి చేలల్లో మరియు జిన్నింగ్ మిల్లుల దగ్గర ఉన్న ప్రత్తి చేలల్లో ఈ గుడ్డిపూలను అధిక మేతదులో గమనించడం జరిగింది. తర్వాత ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాలకు మరియు సెప్టెంబర్ మాసం తర్వాత నెలకొన్న వర్షాభావ (బెట్టి) పరిస్ధితుల వలన గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉదృతి చాలా వరకు తగ్గి, నవంబర్ మాసంలో నెలకొన్న చలి ప్రభావం వలన మళ్ళీ ప్రత్తి పంటను ఆశించడం జరిగినది. అయితే 2017 వ సంవత్సరంతో పోలి సై గత సంవత్సరం గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ఉదృతి చాలా  తక్కువగా ఉన్నాడని చెప్పవచ్చును. రాబోయే ఖరీఫ్ 2019 సంవత్సరంలో కూడా ఈ పురుగు ప్రత్తి పంటను ఆశించే అవకాశం ఉంది కవన ప్రత్తి రైతులందరూ ఈ ముందస్తు జాగ్రత్త చర్యలను తప్పకుండా ఆచరించాలి.

  • ప్రత్తి మేళ్ళను పొలంలో ఉంచకుండా వెంటనే ట్రాక్టర్ రోటవేటర్తో లేదా శ్రద్దార్ తో కలియదున్నాలి.
  • ఎండాకాలం లోతు దుక్కులు చేసుకోవాలి. దీని ద్వారా భూమి పై ఫారంలో ఉన్న పురుగు యెక్క కోశస్ధ దశలను నాశనం చేయవచ్చును.
  • త్వరగా పూత, కథకు వచ్చే రకాలను ఎంపిక చేసుకొనుట ద్వారా డిసెంబర్ చివరి కల్లా ప్రత్తి పంటను తీసివేసి నీరు పెట్టె అవకాశమున్న చోట వేరే పంటకు వెళ్ళుట ద్వారా గులాబీ రంగు కాయ తొలుచు పురుగు జీవిత చక్రాన్ని అదుపు చేసే అవకాశమున్నది.
  • ప్రత్తి పంట విత్తుటకు జూన్ మొదటి వారం - జులై 15 వరకు అనువైన కాలం. వీలైనంత వరకు గ్రామంలో ఉన్న రైతులందరూ సమాహికంగా విత్తుకున్నట్లయితే ఒకేసారి ప్రత్తి పంట పూత, కథకు వచ్చి గులాబీ రంగు కాయ తొలుచు పురుగు అదుపులో వుండే అవకాశం మరియు నివారణ కూడా సులువవుతుంది.
  • ప్రత్తి పంట విత్తిన 40-45 రోజులప్పుడు పురుగు పై నిఘా ఉంచటానికి ప్రతి రైతు ఎకరానికి 4 లేదా 8 లింగాకర్షక బుట్టలను పెట్టుకొని ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.
  • రైతులు ఇంకా ఇళ్ళు వద్ద ఉన్న ప్రత్తిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా త్వరగా మార్కెట్ కు తరలించి అమ్మి వేయాలి. లేనిచో ఈ ప్రత్తి నిల్వలో ఉన్న కోశస్ధ దశలో రెక్కల పురుగుగా మరి రాబోయే ప్రత్తి పంటను ఎక్కువగా ఆశించే అవకాశమున్నది.
  • ప్రత్తి పంట తొలి పూత దశలో ఆశించి గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేసినట్లయితే ఈ పురుగు ఉదృతి మరియు నష్టం చాలా వరకు తగ్గుతుంది.
  • పై  చర్యలతో పాటు పురుగు నివారణకు అవసరమైన సస్యరక్షణ చర్యలను కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.15789473684
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు