హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా ఉపయోగించే పద్దతులు – లాభాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా ఉపయోగించే పద్దతులు – లాభాలు

లిక్విడ్ జీవ ఎరువు ఫాస్ఫేట్ ను కరిగించే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

phasphateభాస్వరం మొక్క వేరు పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడే అతి ముఖ్యమైన ప్రధాన పోషకం. లిక్విడ్ జీవ ఎరువు ఫాస్ఫేట్ ను కరిగించే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. లిక్విడ్ జీవ ఎరువును నేలలో వేసినప్పుడు, ఈ బ్యాక్టీరియా చాలా విషపూరితంగా పెరుగుతాయి. సేంద్రీయ ఆమ్లాలైనటువంటి గ్లూకోనిక్, కార్బక్సిలిక్ ఆమ్లాలను ఉధృతి చేస్తాయి. అలా భూమిలో ఉన్న కరగని ఫాస్ఫరస్ ను కరిగించి, పంటలకు దానిని అందుబాటులో ఉంచడం, పంట అవసరాలను పాక్షికంగా విర్వర్తిస్తుంది.

ఉపయోగించే పద్ధతులు

నేలలో ఉపయోగించే విధానం

ఒక ఎకరా నేలకు 200 మి.లీ. లిక్విడ్ జీవ ఎరువు 200 లీ. నీటిలో కలపాలి. ఈ ద్రావణాన్ని నేలపై పిచికారి చేయడం లేదా కంపోస్టు / వ్యవసాయ క్షేత్ర ఎరువలతో కలిపి దానిని పొలం అంతటా వెదజల్లాలి.

విత్తనంలో ఉపయోగించడం

15 మి.లీ. లిక్విడ్ జీవ ఎరువు ఒక లీటరు నీటిలో కలిపి, ఒక కిలో విత్తనాలను దానిలో 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత బయటకు తీసి, తగినంత సేపు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తనాలను నాటాలి.

బిందు సేద్యం

3 లీటర్ల లిక్విడ్ జీవ ఎరువును (పి.ఎస్.బి) 500 లీ. నీటిలో కలిపి బిందుసేద్యం ద్వారా ఇవ్వాలి. రసాయన ఎరువులతో కలిపి ఉపయోగించాలి.

జాగ్రత్తలు

 • లిక్విడ్ జీవ ఎరువును చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. సూర్యకాంటి నుండి దూరంగా ఉంచాలి.
 • లిక్విడ్ జీవ ఎరువులను క్రిమి సంహారక, శిలీంధ్ర నాశనకారులతో కలిపి ఉపయోగించరాదు.
 • ప్యాకెట్ పై తెలిపిన జీవ ఎరువు గడువు తేదీ ముందే ఉపయోగించాలి.

లాభాలు

 • జీవ ఎరువులు పూర్తిగా పర్యావరణ స్నేహితం.
 • పంటల ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
 • పంట నాణ్యతను పెంచుతుంది.
 • నేలలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాలను పెంచడంలో సహాయపడుతంది.
 • పెరిగే పంట మొక్క నైట్రోజిన్, ఫాస్ఫరస్ పీల్చుకునే సమర్థతను పెంచుతుంది.
 • హార్మోన్లు, ఇండోల్ ఎసిటిక్ ఆసిడ్ (ఐ.ఎ.ఎ.) లాంటి విటమిన్లు విడుదల చేస్తుంది. సారవంతాన్ని పెంచుతుంది.
 • పంట దిగుబడిని 15 శాతం నుండి 20 శాతం పెంచుతుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.04255319149
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు