హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం – సూచనలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం – సూచనలు

యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం – సూచనలు.

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది, పప్పుశనగ, వేరుశనగ, కుసుమ వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మాలి దశలో విస్తారంగా కురిసిన వర్షాలు కారణంగా భూమిలో ఉన్నటువంటి కలుపు విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలో పంటకు తీవ్ర నష్టం చేసురుస్తాయి. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి. కావున యాసంగిలో వివిధ కలుపు మొక్కల వలన పైర్లలో కలిగే నష్టం సుమారు 33-45 శాతం వరకు ఉంటుందని ఒక అంచనా. అంతే కాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణ పై ఖర్చును కూడా పెంచుతాయి. కావున ఈ క్రైండా తెలిపినట్టుగా వివిధ యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం చేపట్టినతైతే అధిక దిగుబడి పొందవచ్చు.

వరి

వరిని యాసంగిలో మన రాష్ట్రలో దాదాపు 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఉదా, తుంగ, అగ్ని వేంద్రపాకు, గుంతకలగర, పొన్నగంటి కూర, తెల్ల జీలుగ వంటి కలుపు మొక్కలు వరి పైరులో సాధారణంగా పెరుగుతాయి. వరి పైరు నాటిన మొకటి 45 రోజులు కలుపుకు చాలా కీలకం. నాటిన 3-5 రోజులలోపు ఎకరానికి బ్యూటక్లోర్ 1-1.5 లి. లేదా ప్రతిలకాలా 500-600 మీ.లి. లేదా అక్సాదయార్జిల్ 35-40 గ్రా. లేదా బెన్ స్లస్యూరన్ మిథైల్ 4 కిలోల గుళికలు, లేదా 8-10 రోజుల లోపు పైరాజాసల్పురం రథైల్ 80-100 గ్రా. 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటిన 15-20 రోజులకు ఎకరాకు సైహలోపప్ పీబీయుటైల్ 250-300 మీ.లి. లేదా పినాశిప్రాప్ పి ఈథైల్ 250 మీ.లి. లేదా మేత్తాసల్పురం మిధాల్ + క్లోరిమ్యురం ఇధాల్ 8 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డిజాతి మరియు వెడల్పకు కలుపు నివారణకు బిస్ పైరీబాక్ సోడియం ఎకరాకు 100 మీ.లి. 200 లీటర్ల నీటికి కలిపి 15 నుండి 20 రోజుల మధ్య పిచికారీ చేయాలి.

మొక్కజొన్న

ఈ పంటను రబీలో 1.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంటను విత్తిన 45 రోజుల వరకు కలుపు నివారణకు కీలక దశగా పరిగణిస్తాం. ఈ పంటలో గరిక, తుంగ, నక్షత్ర గడ్డ, వయ్యారిభామ, గలిజేరు వంటి కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. విత్తిన వెంటనే అత్రజోన్ ఎకరానికి 800 గ్రా. (తేలిక నెలలో) నుండి 1000 గ్రా. (బరువు నెలల్లో) లేదా ఆషిప్లోర్ పాన్ ఎకరానికి 250 మీ.లి. తేమగల నెలల్లో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 25-30 రోజులప్పుడు అంతర కృషి చేసినట్లైతే కలుపును సమూలంగా నివారించుకోవచ్చు. పైరు కలుపు మొలకెత్తిన తరువాత 15-20 రోజుల సమయంలో ఎకరానికి తెంబోట్రియన్ 115 మీ.లి. + 400 గ్రా. అట్రాజిన్ మిశ్రమాన్ని లేదా తోప్రామిజోన్ 30 మీ.లి. + 400 గ్రా. అట్రాజిన్ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేసినట్లైతే అన్ని రకాల కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఒక వేళ పొలంలో వెడల్పక కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లైతే 2,4-డి సోడియం సాల్ట్ ఎకరానికి 400 గ్రా. చొప్పున పిచికారీ చేసుకోవాలి.

జొన్న

రబి జొన్న సుమారు 36 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. విత్తిన 15 నుండి 45 రోజుల వరకు సున్నిత దశ కావున కలుపును సకాలంలో నివారించాలి. జొన్నలో సాధారణంగా తుంగ, గరిక, కాకికాలు గడ్డి, నక్షత్ర గడ్డి, జొన్నమల్లె, బ్రహ్మరండి, వయ్యారిభామ వంటి కలుపు మొక్కలు వస్తాయి. కలుపును నివారించేందుకు అట్రాజిన్ 50 శాతం పొడి మందును ఎకరాకు 600 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 వ రోజు లోపు తడినేల పై పిచికారీ చేయాలి. విత్తిన 30 రోజులకు గుంతక లేదా దంతెతో వరుసల మధ్య అంతరకృషి చేయడం వలన పొలంలో కలుపు నివారించబడి తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి.

సజ్జ

రాష్ట్రంలో సజ్జ పంటను యాసంగిలో 9 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పంట విత్తిన 25 నుంచి 45 రోజుల వరకు కలుపు నివారణ చేసుకున్నట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చు. విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపు అట్రాజిన్ 50 శాతం పొడి మందును ఎకరాకు 600 గ్రా. లేదా తోప్రామిజోన్ 33.6 శాతం ఎస్.సి. 40 మీ.లి. + అట్రాజిన్ 50 శాతం డబ్యు. పి. 400 గ్రా. ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. 25-30 రోజుల దశలో గుంటక లేదా దంతెతో అంతర సేద్యం చేయాలి.

పెసర/మినుములు మరియు శనగ

పెసర/మినుము పంటను 22 వేల హెస్టర్లలో మరియు శనగ పంటను 1.2 లక్షల హెక్టార్లలో యాసంగిలో సాగు చేస్తున్నారు. ఈ పంటలలో తుంగ, గరిక, కాకి కలుగడ్డి, ఉద, కుక్క తులసి, తీపి లవంగాలు వంటి కలుపు మొక్కలు సాధారణంగా పెరుగుతాయి. పంటలను నాటిన 30 నుండి 45 రోజుల వరకు కలుపు నివారణకు చాలా కీలకం. విత్తే ముందు ప్లుక్లోరలిం 45 శాతం ఎకరాకు 1 నుండి  1.2 లీటర్లు  నీటిలో కలిపి నేల పై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. మొలకెత్తక ముందు పెండిమిధలైన్ 30 శాతం ఎకరాకు 750 మీ.లి. నుండి 1.0 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తునా వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. మెలికెత్తిన తరువాత పైరు 20 రోజుల వయస్సులో వెడల్పకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితపైర్ 300 మీ.లి. ఎకరాకు పిచికారీ చేయాలి. గడ్డిజాతి కలుపు మొక్కులు ఎక్కువగా ఉన్నచో క్విజాలోఫాప్ - పి - ఇదైల్ 5 శాతం ఇ.సి. 400 మీ.లి. లేదా ప్రొపేక్విజాఫాప్ 10 శాతం ఇ.సి. 250 మీ.లి. లేదా పినాకేసాప్రస్ ఇదైల్ 9.3 శాతం 250 మీ.లి. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.

వేరుశనగ

రబి వేరు శనగ 1.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ పంటలో ఉద, తుంగ, గరిక, కాకికాలుగడ్డి, గిలాగోరింట, ఎర్రి మిరప, కుక్కవమింత మొదలగు కలుపు మొక్కలు పంటను ఆశిస్తాయి. పంట విత్తిన 30 నుంచి 50 రోజుల వరకు కలుపును నివారించుకున్నట్లైతే అధిక దిగుబడులు పొందవచ్చు. కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశీనులైన అలకలా ఎకరాకు లీటరు లేదా పెండిమిధలైన్ 30 శాతం ఇ.సి. ఎకరాకు 750 మీ.లి. నుండి 1.0 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా 2-3 రోజుల లోపు నేల పై పిచికారి చేసుకోవాలి. విత్తిన 25-30 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి మరియు మొక్కల మెదళ్ళకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసి అటుపై ఎలాంటి అంతరాసేద్యం చేయకూడదు లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలుకాని పరిస్ధితుల్లో పైరులో మొలచిన కలుపును (వైదల్పకు మరియు గడ్డిజాతి) 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితపిర్ 10 శాతం ఎకరాకు 300 మీ.లి. లేదా ఇమజమాక్స్ 35 శాతం + ఇమాజితఫర్ 35 శాతం డబ్యు.జి. కలుపు మందును 40 గ్రా. ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చును.

కుసుమ

కుసుమని మన రాష్ట్రంలో 5450 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 40-50 రోజులకు దంతెలు తొలి అంతరకృషి చేసుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరశించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమిధలైన్ 30 శాతం ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.

ఆవాలు

పంట విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిధలైన్ 30 శాతం 600 మీ.లి. ఎకరాకు సరిపోయేలా 200 లీటర్లు నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. మొలకెత్తిన మూడు వారాలలోపు కుదురుకు ఒక్క మొక్క ఉండేలా మెక్కలను పలుచునా చేయాలి. పైరు 30 మరియు 60 రోజుల దశలో వరుసల మధ్య అంతరాసేద్యం చేయాలి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.5
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు