పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

యూరియా రైతులకు వరమా ?.... కదా ?

యూరియా రైతులకు వరమా ?.... కదా ?

కాంప్లెక్స్ ఎరువులకు యూరియా ప్రత్యామ్న్యాయం కాదు ?

రోజు రోజుకు  పెరిగిపోతున్న ఎరువుల ధరలతో కుదేలవుతున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా ఓ ప్రకా యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా అగుపడడం -మరోప్రక్క వెరసి ఆర్థిక మోతాదులో యూరియాను వాడుటకు రైతులు మొగ్గు చూపుతున్నారు ! ఫలితం ... ఆర్థిక ఖర్చు.. చీడపీడల తాకిడి అధికమవడం ... మరల సస్యరక్షణకు ఆర్థిక వ్యయం ... చివరగా రైతు నష్టాలపాలవడం!

అసలు యూరియాతో ఏముంది ? ఎలా పనిచేస్తుంది?

యూరియా .. 46 % నత్రజని కలిగిన అత్యంత శక్తివంతమైన ఎరువు తెల్లని గులకల రూపంలో ఉన్నం ఈ ఎరువు వెదజల్లుటకు అనుకూలంగా ఉంటుంది. తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది.

విచక్షణ రహితంగా యూరియా వాడితే ఏమవుతుంది?

 • యూరియా తేలికగా నీటిలో కరుగుతుంది, గాలిలో కలిసిపోతుంది కనుక గాలి, నీరు, కాలుష్యం.. చివరకు తల్లిపాలు కాలుష్యం !
 • ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడం ,పూత ఆలస్యంగా వచ్చి పంట కలం పొంగించడం తలు గింజలు ఏర్పడటం జరుగుతుంది.
 • బెల్లం దగ్గరకు చేమలు చేరినట్లు అధికంగా యూరియా వదిన చేలా దారికి చీడపీడలు సులభంగా చేరుతాయి!
 • వెరసి ఆర్థిక పెట్టుబడులు ... దిగుబడి తగ్గిపోవడం !

మరి యూరియాతో ఎలా లాభం పొందాలి?

 • పైరుకు నత్రజని అవసరం మొదటి నుండి చివరి వరకు ఉంటుంది కాబట్టి 3 -4  దఫాలుగా యూరియా వేయాలి.
 • యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూడాలి.
 • వారిలో నాట్లు వేసేప్పుడు , పిలక దశలో  చిరుపొట్ట దశలో వేయాలి. అంతే కాదు నీరు తీసివేసి బురద పదును మీద చల్లి 24 -48  గంటల తర్వాత నీరు పెట్టాలి.
 • యూరియా వేపపిండి కలిపి వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు చీడపీడలను అరికడుతుంది. (50  కిలోల యూరియాను 5  కిలోల వేపపిండి కలపాలి. )
 • భూమిలో తగిన తేమ లేనప్పుడు, ఎరువును వేసిన తరువాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు,సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షములు మీద 2 -3  శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
 • మెట్ట పైర్లలో యూరియా వెదజల్లుట కాని మొక్క ప్రక్క గుంతలో వేసి మట్టి కప్పడం వలన యూరియా వృధానీ అరికట్టవచ్చును.

చివరిగా ....

కాంప్లెక్స్ ఎరువులు యూరియాను ప్రత్యాన్మాయం

ఆర్థిక మోతాదులో వేసే యూరియా ...

ఆకర్షిస్తుంది చీడపీడలను ....

అధికం చేస్తుంది పెట్టుబడులను ....

అవసరం మేర యూరియాను వాడండి....

అధిక దిగుబడి సాధించండి...!

ఆధారము : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ

2.76470588235
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు